31 December 2010

ల ల లాహిరే ల ల లాహిరే

ల ల లాహిరే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే దిల్ తక తకమంటూ
దరువేస్తుంటే ల ల లాహిరే
ల ల లాహిరే ల ల లాహిరే ఛల్ ధగ
ధగ మెరిసే ఒళ్ళే చూస్తే ల ల లాహిరే
సరదాగా ఒకసారే గుడికొస్తే మంజూరే
గిలిగిస్తే సెన్సోరే విజిలేస్తే వన్స్‌మోరే అయ్యయ్యయ్యో
లిప్పు చూస్తే లాలి పాప్ హిప్పు చూస్తే బాబ్రే
బాప్ షాక్‌లిచ్చే చూస్తే గుండెలే షేకప్ ||ల ల లాహిరే ||

సన్నాయంటి అమ్మాయి అయిపోకే అంత
అడ్వాన్స్ అందాలన్ని ఆరేస్తూ చేయించకులే క్యూడాన్స్
దిల్ కా చోర్ వెర్లీగాలి ఎంచక్కా కుమార చూపిస్తే
ఓరు నేతయారు దరికే రారా త్వరగా రణధీర
ఫ్రంటు చూస్తే టెమిటేషన్ బ్యాక్ చూస్తే సెన్సేషన్
సోకు అన్నా మాటకే ఇది కొత్త ఈక్వేషన్

హే రుకు రుకు రుకు రుకు రుక్సాన్సా హే
కసి కసి కన్నుల కొరమీనా
నిన్నియ్యాలా అల్లేయ్యాలా మెత్తగా మురిపాలా
ఒళ్ళోకొచ్చి వయ్యారాల వలలే విసిరెయ్యనా
ఓ దిల్‌తార్ బేక్‌రా సంధిచెయ్యి నీ ఫీల్డ్ నీ
సంఘాలే లేనే లేవ్ ముచ్చటగా రానే దరికి మనసారా
ముమియాలి టాల్‌మి ఆన్ డైమిక్రేజ్ ఆనందం
బాయ్ ఆవాన బి అన్ ఇజ్‌కేబి ఆనందం

ఇందురూడు చందురూడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడు

ఇందురూడు చందురూడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడు
అందగాడు అందగాడు మాటతోనే మత్తుమందు చల్లుతాడు ||2||కారంగా
నువ్వే నవ్వి చురకేసే పిల్లగాడు కమ్మగా చిటకా చేసి చుట్టూ తిప్పుకున్నాడు
మెల్లంగా మీసం దువ్వి మెలికేసే తుంటరోడు చల్లంగా మస్కా కొట్టి మనస్సే
గుంజుతున్నాడు వాలు చూసి వీలుచూసి ముగ్గులోకి దించినాడు కొలికేస్తే
వేలికేసె మాయదారి సచ్చినోడె

ఓ అమ్మో ఓరయ్యో లేలేత గుమ్మడిపండే నా సొగసు వెన్నెల్లే
కరిగించి పులుసల్లే మరిగించాడే ఈ వయస్సు
ఇంతందం ఎదురొచ్చి జివ్వంటూ లాగేస్తే ఆగేదెలా మొహమాటం
వదిలించి మోజంతా కాజేస్తా ఈవేళ
అబ్బ ఏమి చెప్పనమ్మ సుప్పనాతి సూపులోడె పట్టు చెంగు ఒంటి
నిండా కప్పుకుంటే ఊరుకోడె కందిరిగ నడుముకాడ తేనెకాటు వేసినాడె పట్టుపగలు
పిట్టసోకు కొల్లగొట్టి పోకిరోడె ||ఇందురూడు||

ఓయమ్మో చిలకమ్మో చెయ్యి అయినా వేయ్యకముందే గిలిగింతా
నీదుడుకే చూస్తుంటే సిగ్గేదో కమ్మిందమ్మా ఒళ్ళంతా
ఇన్నాళ్ళు ఊరించి ఈనాడే సిగ్గంటే రేగెదెలా ముద్దుల్లో ముంచెత్తి
నీదోద కుచ్చిల్లే లాగాలా
అయ్యోరామ ఇంతలోన ఎంతపని చేసినాడె అందులోని ఇందులోని
అంతులేని పెద్దరోడే కొంతకాలం ఆగమన్నా ఆగలేని కోడెగాడే కోడికూత వేళ లోపే
కొంప ఇట్టా ముంచినాడే ||ఇందురూడు||

మాస్ మమ మాస్ వెయ్ మళ్ళా అన్న నడిచొస్తే మాస్

మాస్ మమ మాస్ వెయ్ మళ్ళా
అన్న నడిచొస్తే మాస్ అన్న నుంచుంటే మాస్
అన్న లుక్కిస్తే మాస్ మ మ మాస్ వెయ్యరా మావ
అన్న ఫాంటేస్తే మాస్ అన్న షర్టేస్తే మాస్
అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అద్ది లెక్క
అన్న కళ్ళేర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమి గుగ్గవుతదిరా మాస్
అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తారురా మాస్
మంచిగా ఉంటే మంచిని పంచే మనిషే తానంటా
మరిమాయలు చేసే ఎవడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా
అన్నా ఒక్కసారి పాడన్నా
హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగు పెడితే విజులు విజులురో
హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో ||అన్న నడిచొస్తే||

చిందే చిరునవ్వుతో ఇలా పెంచుకునే స్నేహాలతో
నీసాటి వారి కందరికి ప్రేమ పంచరా
ఆప్రేమ కింకా ప్రాణమైనా ఫనముపెట్టరా
ఫస్టెక్కో మిత్రుడిలా ఇస్తూ వస్తా
నీకిలా దోస్తికట్టేస్తా పెద్ద మాస్ చేస్తే
మాకష్టమిలా పోస్తూ పోతుంటే ఇక శాస్తి చేసేస్తదిరా మాస్
మంచిగా ఉంటే మంచిని పంచే మనస్సే మాసంటా
అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా
హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో
హోయ్ వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలు పెడితే పిడత పగులురో ||అన్న నడిచోస్తే||

సరుకురో ఛలో మలకపేట మలుపుదాకా దుమ్ముదులపరో
మట్టా చేపట్టుకొని పనినే చూపెట్టమని లొల్లేపెట్టేయ్యదురా మాస్ మాస్ మాస్
అతడు పొట్టే చేపట్టుకొని ఏదో పని పట్టుకొని కాలం నెట్టేస్తుందిరా మాస్
మంచిగా ఉంటే మంచిని పంచే మనసే మాసంటా
అరె మాయలు చేస్తే ఎవ్వడికైనా మద్దెల చప్పుడు తప్పదు పొమ్మంటా
హే వగలు ఫిగులు సెబులు ఆపులు మనం అడుగుపెడితే విజులు విజులురో హోయ్
వగలు ఫిగులు సెబులు ఆపులు మనం మొదలుపెడితే పిడత పగులురో ||అన్న నడిచోస్తే||

ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే

ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే
వేరే ఆశ ఉందదు ధ్యాస ఉండదు నువ్వు తోడుంటే
మల్లెలుండవు వెన్నెలుండదు నీ నవ్వే లేకుంటే
మనసు ఉండదు మమత ఉండదు నీ మనిషిని కాకుంటే
వయసులో యీ పోరు ఉండదు నీ వలపే లేకుంటే
వలపు ఇంత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే ||ఆకలుండదు||

పొద్దు గడచేపోతుంది నీ నడక చూస్తుంటే
ఆ నడక తడబడిపోతుంది నీ చూపు పడుతుంటే
ఆకుమడుపులు అందిస్తూ నువ్వు వగలు పోతుంటే
ఎంత ఎరుపో అంత వలపని నే నాశపడుతుంటే ||ఆకలుండదు||

తేనె కన్న తీపికలదని నీ పెదవే తెలిపింది
దాని కన్నా తియ్యనైనది నీ ఎదలో దాగుంది
మొదటి రేయికి తుదే లేదని నీ ముద్దే కొసరింది
పొద్దు చాలని ముద్దులన్ని నీ వద్దే దాచింది
ఆ ముద్రే మిగిలింది ||ఆకలుండదు||

చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా

చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా
ముందు వెనుకా యేముందో యెక్కడుందో
యెవరికెవరి కెంతుందో చూచి చెబుతా
కోట్లు కోట్లుగా గడించి కూడబెట్టకు ||చూస్తా||

వజ్రాలుగా బంగారుగా మార్పి దాచకు
రాజ్యాంగమందు నేడు రాహువున్నాడు
రాత్రిరాత్రి కొచ్చి మొత్తం మింగిపోతాడు
ఏఎన్ఆర్ ఎన్‌టిఆర్ ఏలుతారన్నారు
వాణిశ్రీ సావిత్రికి వారసని చెప్పాను
జగ్గయ్య జయలలిత శోభన్‌బాబు కృష్ణకి
పద్మనాభం రామాప్రభ రాజబాబుకి
దసరా బుల్లోడికి ప్రేమనగర్ నాయుడికి
ఆత్రేయ ఆదుర్తి మహదేవన్ అందరికి
ఆనాడు చెప్పింది ఈనాడు జరుగుతూంది
ఈనాడు చెప్పేది రేపు జరుగబోతుంది ||చూస్తా||

వేలవేల యెకరాలకు గోలుమాలు
తాతల యెస్టేటుకైన చెప్పాలి టాటాలు
దిగమింగే నాయకులకు దినగండాలు
పన్నెగవేసే పెద్దలకు వెలక్కాయలు
తాతయ్య పేరులో మనవళ్ళు పెరిగారు
మనవళ్ళు దోచింది మునిమనవళ్ళడిగారు
అడుగునున్న వాళ్ళింక అణిగిమణిగి వుండరు
ఆడోళ్ళే ఇక మీదట అందలాన ఉంటారు
మగవాళ్ళ ఆటకట్టి మరమ్మత్తు చేస్తారు
అందుకే చిట్టి నిర్మల చేతిలో సేటు రాత రాశాడు
ఓ పండిట్ జీమేరా హాథ్ భీ దేఖియేనా దేకుతా దేకుతా
ఈనాడు చెప్పేది రేపు జరగబోతుంది
ఏమోలే అనుకుంటే మీ ఖర్మలే పొండి ||చూస్తా||

పెట్టిపుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే

పెట్టిపుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు
ఎందరో నీలాంటి పాపలు పుట్టివుంటారు అందులో ఎందరమ్మ
పండుగలకు నోచుకుంటారు వుండి చూచుకుంటారు ||పెట్టిపుట్టిన||

కన్నవాళ్ళు చేసుకున్న పూజాఫలమో నువ్వేజన్మలోనో
దాచుకున్న పూర్వపుణ్యమో నూరు పండుగ లీలాగే చేసుకుంటావు
కొందరేమో పండుగల్లే వచ్చిపోతారు నూరేళ్ళూ నిండిపోతారు ||పెట్టిపుట్టిన||

ఉన్నవాళ్ళు లేనివాళ్ళను భేదాలు మనకెగాని మట్టిలోన
లేవమ్మా ఆ మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు
కన్నీటి బొట్టు కానుకిస్తే చాలమ్మా చాలమ్మా ||పెట్టి పుట్టిన||

మాపటికొస్తావా మరి రేపటికొస్తావా

మాపటికొస్తావా మరి రేపటికొస్తావా
మాపటికొస్తే యిస్తానోయ్ యిస్తానోయ్
మల్లెపూల చెండు లిస్తానోయ్
రేపటికొస్తే మొక్కజొన్న కండెలిస్తానోయ్
ఇది పూలతోటకే వెలుగిస్తుంది
అది మెట్టచినుకే సిరులిస్తాది
ఇది వాసన చూస్తేనే మత్తెక్కిస్తాది
అది చెప్పలేని రుచులిస్తాది కొత్తరుచులిస్తాది
హైరా మామా మనసైనా మామా
తమాషాగా రమ్మంటే తళుక్కుమంటావేమో
ఎగతాళికి నేనంటే ఎంట పడతావేమో
నా చుట్టు రక్కెన ముళ్ళున్నాయ్
కోడెతాచు కోరలున్నాయ్
వాటిని తెలుసుకొని వైనం చూసుకొని
చివరికి నను చేరుకుంటే
జాజులు మోజులు నీకేనోయ్
నా నవ్వులు పువ్వులు నీకేనోయ్

చెలి నా యెదనే నే నిన్ను చూచుకోని క్షణం

చెలి నా యెదనే నే నిన్ను చూచుకోని క్షణం
అణువు అణువు పులకించే నువ్వు నన్ను చూచుమరుక్షణం
నీ కనుల్లో వెలిగే కర్పూరమల్లే ప్రియాని కరిగే ||2||
నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి న పువ్వులుగా
సందెవేళవీచే నీ చల్లగాలిని నేనేగ
ప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకానా ||చెలి నా యెదనే||

నీ నున్నని బుగ్గలపలకపై నా పెదవితో రాసే విధమెలా
నీ నుదుటను బొట్టే జాబిలై సిరివెన్నెల కాచెను పగలెలా
నీ పడుచుగుండెలో చొరబడిగిలిగా ఒక ఒడి వరిగేదెన్నడు
నీలేత నడుమునే తడిమి చూడన అలజడి కలిగే దెప్పుడు
నువ్వు ఆమే అనకవా నా కానుకవా రెండూ నీవై వెలిశానే
నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి నా పువ్వులుగా
సందేళవీచే నీ చల్లగాలిని నేనేగా
ప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకనా ||చెలి నా యెదనే||

నీ యెంగిలి ఉద్దేశం మతం అది ఏక్షణమైన సమ్మతం
నీ చిలిపి కౌగిలి సమ్మతం అది నను బలికొన్న సమ్మతం
నీ చెవుల పక్కగా ఎగిరేజుట్టును నిమరగ ఎంతో సమ్మతం
నీ చీరకడితే ఓ చినుకల్లే ఇలపైపడినా సమ్మతం
ఇక నా జీవితం నీ కల్పనం నువ్వేకదా నా ప్రాణం
నిన్ను నడిపించే నా శృతివి నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి నా పువ్వులుగా
సందేళవీచే నీ చల్లగాలిని నేనేగా
ప్రతి నిత్యం నీ మౌనగీతమై జతకానా

యో బేబి నువ్వు దివ్యామృతం బేబి నువ్వు పంచామృతం

యో బేబి నువ్వు దివ్యామృతం బేబి నువ్వు పంచామృతం
బేబి నువ్వు పూలనందనం యో బేబి నువ్వు దీపావళి బేబి నువ్వు
అనార్కలి బేబి నువ్వు వెన్నెల జాబిలి
అమ్మమ్మో ఆ పాదం చిక్కితే కుమ్మే బంగారం
అబ్బబ్బో చెలి చెయ్యేపడితే నీరే సారాయే
అయ్యోయ్యో తనుతాకితే ఎటూకాదూ నాదేహం ||యో బేబి||

ఈ చిలక పలికే పలుకే రామ చిలక నేర్చే కులుకు
తనకాలి ముద్దు కొరకే విలచేపలన్నీ ఉరుకు
అరె కంచిపట్టు చీరే అది కుచ్చీళ్ళనే కోరు
నాగమల్లి పువ్వే ఆమె బాసలకే తుళ్ళు
పిల్లే పతంగిలా పైటని ఎగరేయింగా
చచ్చినోళ్ళంతా మళ్ళా బతికి వచ్చారుగా
ప్రేమను పూజారిలా కలలు పూజలు చేయంగా
రెండునే ఉయ్యాల ఊగితల తిరిగింది ||అమ్మమ్మో||

నా ఆలమంత వెలుగా తన కంటి తళుకు చాలు
నా ఆశలన్నీ తీర ఒహా కాలి మెరుగు చాలు
ఎహే తాళికట్టు వేళ నిను సిగ్గుపడితే చాలు
నే మత్తు పిల్ల నడగ నను నసగకుంటే చాలు
మిర్చి బజ్జీలా మనసంతా ఊరించేలా
పిచ్చినాకు పట్టించేసి రెచ్చగొట్టేరా
కంటికి కనపడని గాలెల్లో కలిసేరా
కలలో శ్రీదేవిలా కలలు చెప్పేరా ||అమ్మమ్మో||

అయ్యాసామి శివుని కుమార నాచిన్న కోర్కె నెరవేర్చు

అయ్యాసామి శివుని కుమార నాచిన్న కోర్కె నెరవేర్చు
చక్కని చుక్కతో కావాలి పెళ్ళి నాకొక పిల్లను జతజేర్చు
పావడి పరిణిదొరికాక కావడీ తెస్తాము
నెమలికి బదులు నీకొక ప్లైటు బహుమతి ఇస్తాము
వల్లివి నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా ||అయ్యాసామి||

నాన్నగారి తిట్లు తిన్నాములేరా పరీక్షల్లో
సున్నా తెచ్చుకున్నావేరా చదువుచించేశాం చించీ చదివేశాం
బస్సులో వెల్తే టాక్టుల మోత బైకులో వెళ్తే గ్యాప్‌ల మోత
నడిచిన పిల్లవస్తే నడిచే పోతామురా
ఆడపిల్ల మనసే ముదురు దానికుండాదులేరా కుదురు
గాలం చేస్తారు బ్రదరూ పడితే నీపని అదురు
బూకంపం అయినా అణిగెను గురువా అమ్మాయి మనసు అణగదులే
వల్లిని నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా ||అయ్యాసామి||

కొత్తసినిమాకు ముందేవుంటాం ప్రెండ్స్‌కు ఎప్పుడు వెనకే వుంటాం
పోటీ వచ్చిందో మధ్యలో మేముంటాం
టీ కొట్టు ప్రక్కన మీటింగులు పెడతాం ఫిగరులుచ్వస్తే పువ్వులు పెడతాం
పిల్లేనవ్విందా పార్తీలు మేమిస్తాం
అరె బరిలోకి వచ్చే భయ్యా నువు పంతం వెయ్యరా మియ్యా
సయ్యంటేను సయ్యా హూసుకుపోరా అయ్యా
ఫిగర్స్ వల్లో పడ్డా కూడ బ్రదర్స్ తోటి వెగరేమి
వల్లిని నువ్వు హరోంహరా హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా ||అయ్యాసామి||

దేవత నీవే నా దేవత నీవే

దేవత నీవే నా దేవత నీవే
కనుపాపగ కాస్త నినునే రిబ్బనై
నా జత నీవే ఇక నా కత నీవే ఎడ బాయక ఉంటా తోడు నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే ఇది మన మనసుకు కలయిక ||దేవత నీవే||

చినుకై వచ్చే నీకోసం పుడమై పోతాను
నదిలా వచ్చే నీకోసం కడవై పోతాను
కలలా వచ్చే నీకోసం కన్నై పోతాను
పులిలా నన్ను తాకా ఓ సింహానవుతాను
నీ ఊపిరితో ఋమెదురైనా వేణువుకాగా
నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెలరాగా
సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూనే తిరగనా
నీవేనేనై బతకనా తలపుల తలపులు తెరిచినా ||దేవత నీవే||

జోరున కురిసే వానలు ఎండే నువ్వంట
దిక్కులు చెరిగే ఎండలు వానే నువ్వంట
ఏకాంతాన్ని వెలివేసేతోడే నువ్వంట
శోకాలన్నీ తరిమేసే జాడే నువ్వంట
నీ నవ్వుల్లో పూచేటి పువ్వైపోనా
నీ నడకల్లో మోగేటి మువ్వైపోనా
గుడిలో వెలసిన రూపము గుండెన వెలిగే దీపము
పంచే తీయని పాపము వలపుల పిలుపులు తెలిపెను ||దేవత నీవే||

హే వస్తావస్తానమ్మా తోడుగా

హే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
అరే వస్తా వస్తానమ్మా వేడిగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
ఈరే అక్కుం బక్కుం జాజిమల్లే అల్లుకుందామ్రా పిల్లా
హే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
గడ గడ గడ వేశస్తా వయ్యారం గడియ
గుమ గుమ గుమ కమాన్ బేబి పోదాం తనయ ||2||

ఆ మేఘం వచ్చింది ఆకాశం మూసింది అదురు తెలిపినది
అత్తర్లు పూచాను అందాలు దాచాను ఎగిచే ఎద అలలో ||2||
పడుచు మనసుకు వెండి తెర వేస్తావా
తళుకు వలపుల తొలి కస నీవమ్మా
మారని ఇదీ ఇదీ కోరికలే వరింది తీరుబడి కలిసాం మరి తెలుసుకో ||హే వస్తా||

నా ప్రేమ గుప్పెట్లో నీగుండె చప్పుల్ని నా ఈడు పోటుందిరా
ప్రేమించే కళ్ళుంటే ఆడెండి ఈడేండి వాడిక వాటాలకూ ||2||
ఎగిసే వలపులు అల్లరికే బెదరవు రవ్వంత మెరుపుకు నా మనసు బెదరదు
మనస మనస మనసకి నీ నస తెలియని వరసె పాయసమే మనసై మతి చితికెనె ||హే వస్తా||

మైడియర్ ఫీల్ ద ఫన్ ఆనందమే మన పోలసీ

మైడియర్ ఫీల్ ద ఫన్ ఆనందమే మన పోలసీ
ఆల్ ది టైమ్ ఆల్‌దిరన్ మన అడుగుకి లేదిక ఎలోసి
ఏకమాన్ ఫీల్ దఫన్ ప్రతి నిమిషం మనకో ఫాంటసీ
రౌండ్ క్లాక్ ఆన్‌ది రన్ మన కలలకు తోచిందే ఖుషి
మిని మిని మూమెంట్స్ దాచుకో నీ మనసుకు మెడిసన్
చేసుకో మిని మిని మెమొరీస్ పెంచుకో నీ వయసుకు
వ్యాక్సిన్ వేసుకో గడియారం ముళ్ళై పరుగు తీద్దాం లెఫ్ట్ అండ్
రైట్ కష్టాలన్ని చూద్దాం సాల్ట్ అండ్ స్వీట్ రెండు టేస్టు చేద్దాం
లైఫంటే చూద్దాం శాట్‌లైట్‌తో పోటి పెట్టుకుందాం డేనైటికి
తేడా మరచిపోదాం రైట్ అండ్ రాంగ్ గేం తెలుసుకుందాం ||మైడియర్||

నిలబడి Bisleri త్రాగడం మన జోరుకు సరిపడదే హొ హొ
పరుగిడి Fanta పొందడం మన Fair కి తెలిసిందే అలుపు
అనే మాటకు అర్ధమే మన డిక్షనరీలో లేదె Busy Busy
మెరుపులే మన Youth కి Power అంటే అనుకుంది
చెయ్యడం ఒక వరం ఆ Nature మన సొంతం సరికొత్త
నడకలో రిధమ్ మన Signature అందాం

గలగల మెలొడి నవ్వుతో గడియారం ముళై పరుగు
చిరుగాలిని ఊపేద్దాం అడుగుల సడితో భూమికి జల్సాలే Hip
hip Hurry నేర్పిద్దాం లో మన లవ్‌డబ్ కలిపేద్దాం జరజర
జల్సాట్రెండ్‌లో జెందగినే నవ్విద్దాం UKG మొనలు మన
మందరు పారా ఆ నందోబ్రహ్మ టీనేజ్‌లోని ప్రతిక్షణం Come
enjoy చెయ్ మామ ||గడియారం ముళ్ళై ||

శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి ఈడుదుప్పట్లో దొంగె

శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి ఈడుదుప్పట్లో దొంగె
దూరినట్టుంది కన్నెకుంపట్లో ఉప్పే వేసినట్టుంది
సరెసరె రా మరి హుటాహుటి ఇంతలో ఇదేమిటి ఆగలే
నంటు పైటె గోలపెట్టింద ఆదుకొమ్మంటు నాకే కన్నుకొట్టింది
ఆపసోపాలు పడలేను కాని కాస్త కరుణించు నారాయణ
రాహుకాలాన్ని రావద్దు అంటు రాత్రి తెల్లార్లు పారాయణ
వస్తాడు నువ్వేలారా ఎవ్వరేమన్నాడు
ముస్తాబు వచ్చేసింది ఏ సుగుణ ||శ్రీహరి సరాసరి||
ఆవురవురు అంటునే ఆశ పడుతున్న
ఆ సంగతి ఈ రోజె ఆలకిస్తున్నా
వయసు మాగాణి నికిచ్చుకుంటూ రైతువై పంట పండించుకో
పదును చూడందె నేవదులుతానా అప్పగించేసి నువ్వురుకో
వయ్యారితో ఇవ్వాళిలా
కయ్యానికే కాలు దువ్వాలటా ||శ్రీహరి సరాసరి||
ముట్ట గట్టిన బంగారం ముందరెడుతున్నా
నీ వంపుల(Temple) టెంపుల్‌ లో పూజకొస్తున్నా
కూత పెడుతోంది పరువుల కోడి మూతపెట్టేసి ముద్దాడుకో
రెచ్చగొట్టాక నేనాగుతాన పుంజునవుతాను పూలకించిపో
ఏకాకీ ముఖాముఖి షికారుకే సిద్ధమవ్వలట ||శ్రీహరి సరాసరి||

రింగా రింగా రోజ్‌ రింగ్‌ రింగా రోజ్‌ తెచ్చానె

రింగా రింగా రోజ్‌ రింగ్‌ రింగా రోజ్‌ తెచ్చానె ఇచ్చానె ప్రేమించెయ్‌నన్నే
దొంగ దొంగ ఫోజ్‌ కొట్టట్టె దొంగ ఫోజ్‌ ఏనాడొ దోచావు మొత్తంగ నన్నే
Yes అంటున్నావ, Jhony Jhony పాప నే చేస్తా నీతో
Jolly Jolly జల్సా
Fresh అంటున్నావ బాబా Black sheep బాబ
సాయంత్రాలు చేస్తా నీతో Styly Styly సల్సా
ఉలలలా ఉలలలలా ఊరించిందే Ice Cream అల్లె మనసిలా
ఉలలలా ఉలలలలా ఊపింది ఉయ్యాలలే వయ్యసిలా రింగా రింగా రోజ్‌

పగలంత ప్రతిగంట నాకల్లోకొచ్చి పరువంతో
మొదలెట్టేయ్‌ నీ పైలపచ్చీ
పులకింతై గిలిగింతై ఊహల్లోకొచ్చీ హృదయంతో తలెఎత్తె నీగిల్లికజ్జా
సరసంలో మనమాడాలంటా సబ్జాయిండర్‌ సరదగా మరి ఓడించాలి నన్నే నీ జోరే
షలలల షలలలలా సయ్యాటె ఆడిందమ్మ సొగిసల రింగా రింగా రోజ్‌

ఎవరైన లేకుంటె తోచెదెకాదు ఎదురంగ ఎవరున్న తోసెస్తున్నాను
సంగీతం వినకుండ నేనుంటె ఒట్టు ఇపుడెమో వినిపిసై కట్టెస్తున్నాను
తొలిప్రేమ మన నెక్కించింది టైటానిక్కే మన మధ్య ఇక రోజు రోజు లవ్‌ Topic కె
అలలల హలలలల హమయ్యా అంటుందమ్మ బ్రతుకిలా రింగా రింగా రోజ్‌

పిట్టనడుం ఎత్తు మడం తస్సాదియ్యా

పిట్టనడుం ఎత్తు మడం తస్సాదియ్యా
పొట్టి మెడ పొడుగు జడ తస్సాదియ్యా
కొంటె తనం పెంకితనం తస్సదియ్యా
మొండితనం మొరటుతనం తస్సాదియ్యా
ఒకటి ఒకటొకటి తెగ నచ్చాయెనీలో శిలగ శిగతరగ నువ్వు నడిచొస్తుంటే
అడుగు అడుగడుగును నీకేమేం కావాలో సరదాపడిపోనా నువు పొగిడేస్తుంటే
బాదంపిస్తా నీఒల్లోకొస్తా చదలాంవాదేవి రావేదేవి కాలే దువ్వే
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఒరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఓరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా ||పిట్టనడుం ఎత్తు మడం||

నానానాన నా చెడి పోతుందే మతి చెడిపోతుందే ముందు వెనక చూస్తుంటే
శిల్కు చీర మరి గొడవెడుతుందె చూపే తనఖిచేస్తుంటే
పుట్టుమచ్చ అందాలే రెచ్చగొట్టి రమ్మంటె తట్టుకోలేకుండ ఉన్నానే స్వయానా
మీసకట్టు తిప్పేస్తు మీద కొస్తుంటే చిటికెడు మెట్టెలతో గానాభజానా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఓరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఒరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా
కలి చూపులలో కసి కొడవలి ఉందే ఇంచి ఇంచి కొస్తుందే
నీ వంపులలో అరె తిరగలి ఉందే తిరగ మరగ చేస్తుందే
కట్టుబాటు లేదంటు కట్టుదాటి వస్తున్నా పెళపెళలాడించే తమాషా ఉంచాల
పుట్టుతేనె ఉందంటూ పట్టుబట్టిరమ్మంటె చెడుగుడులడిస్తా చూడేగజాల
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఓరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ ఒరిబ్బా
హరే రాం హరేరాం కృష్ణహరే రామ్‌ వావా ||పిట్టనడుం ఎత్తు మడం||

అబ్బబ్బా వినవే అబ్బాయి పోలిసే

అబ్బబ్బా వినవే అబ్బాయి పోలిసే
అతను నడిచే ఎ టి ఎం పోతే చిక్కడులే ||2||
నీదే లేటంతే నువ్వే ఉ అంటే ఆ కన్యాదానం చేసేస్తానంతే
మొగుడే పొలీసైతే ఇక ఆల్వేస్ హ్యాప్పీసేలే
మాలీష్ నుంచీ అన్నీ ఫ్రీయే
డ్యూటీ మీదే ఉంటే ఈ సిటీ అంతా తనదే
లాఠీకున్న పవరే పవర్
ఆలోచించు కొంచెం నీక్కొచ్చిందీ అవకాశం
ఎందరికీ వచ్చును ఈ అదృష్టం
డ్రీమ్‌లోకి వెళ్ళితే నే చెప్పింది రైటే అంటావు నువ్వే వెళ్ళూ ఒకసారీ
కోటిన్నరకీ తక్కువ కాని కారే తెస్తావుగా అరె కాలే బయట పెట్టాలనిపిస్తే
ఓ పోటి చేసో లూటి చేసో కోరిక తీరుస్తానుగా మరి అంతగా నీకే తిరగాలనిపిస్తే
హైటెక్ సిటీకి దగ్గరలో ప్లాట్ ఉంటే ఆలొచించక కొనితెచ్చేసి వ్రాసి ఇచ్చేస్తావా

ఏ స్కామో చేసేసి ఆ సొమ్మే తెచ్చేసి
యమ అర్జంటుగా కానుక చేసి నీకిచ్చెస్తానుగా
పడుకుంటే కలగంటే
అది నిజమేనే చేస్తాగా
అబ్బబ్బా విను తల్లే
రోజు నీకు వండీ వార్చే ప్రోగ్రాం అంటే కష్టమే
ఓ ఫైవ్‌స్టార్ హొటల్ కుక్‌ని తెస్తావా
తాజా చేతులు కందాయంటే పోదా చూసి ప్రాణమే
ఆ కుక్‌ని నీకే కుక్కని చేస్తాగా
బాబే పుట్టాకా కాన్వెంటే చదువులకీ ఫారన్ పంపించాలంటే
నువ్వేం అంటావు

ఇంగ్లీష్ చదువేగా చదివిద్దాం బేషుగ్గా
అయినా వాడికి పెట్టిందంతా తిరిగొచ్చేవేగా
సరే కానీ మనమొక్కటై
ఇక ఆలూ, మగలవుదాం ఓమ్
అబ్బబ్బా సరిలే చెప్పింది చాల్లే అబ్బాయి వస్తే చూస్తా
ఒకసారి నచ్చాడో మనకే ఇస్తాలే మసే, ఆపైన పెళ్ళి ఖాయం
చెయ్యొచ్చే పరవాలేదనిపిస్తే నే జెండా ఊపేస్తాలే
ఆ ఏర్పాట్లేవో చేసేయ్ నువ్వే నువ్వు చెప్పావనీ ఓకే నేనంటున్నాలే
అంతే ఆపైన ఇంక భారం నీదే తేడా వచ్చిందంటే మన సంగతి
తెలుదుకదా నీకే నాన్నని కూడా చూడను నే నే అబ్బబ్బా

నిప్పుంటే గురూ ముట్టిస్తావా

నిప్పుంటే గురూ ముట్టిస్తావా
నిప్పుని నిప్పుతో ఆర్పుకోవడంలో తప్పేలేదురా
తప్పున్నా సరే ఒప్పిస్తావా
తప్పుని ఒప్పుగా మార్చే దిట్టకి చెప్పేదేంటిరా
కజురాహో రంభా సొగసులు నిగనిగ చూడనా
కావాజి క్రేజ్ స్ట్తెల్‌లో అదరగొట్టేయనా
మిసిమిసి మిసి పసిడి పంపుల్నీ తడవనిస్తాలే సరదాగా పురుషా
జత కలిపేయ్ అతివ అందాలు శృతి చేయ్
మధన జెండాని ఏగరేయ్


నిప నిప దప దప లేచిపొతే చిట్టీ చిట్టీ నివ్వంటే
టెంపర్ వాలో కోలో మర్చికీ పదమంటిరా
మిడ్‌నైట్ చూపింగ్ మార్చికి నువ్వే రాదురా
అరచేతిలో ఓహో మ్యజిక్ సూపరంటాలే
యమ పాపిక్ స్నేక్ డాన్సే నేర్పుకుంటాలే
సలసల రగుల సెగలన్నీ ఆర్పుకుంటాలే

డు ఇట్ లవ్ సజనా అని అనరా, ఎగిరెళ్ళి ఒళ్ళో పడరా
చిట్టి చిట్టి సిగ్గులే మరి చెడరా
లవ్ వండర్ సోకు నీదేలే చెంతకొస్తాలే సరిహద్దుని రద్దుచేసి
రుద్దుకుంటాలే స్విమ్మింగ్ సూట్‌కి మోడల్ నువ్వట
తపనల తడికి వణికి పొతుంటే ఒడుపు చూస్తాలే
నిప్పుంటే చిట్టీ మిసి మిసి పసిడి వంపుల్లీ చిట్టీ

సో హ్యాపీ సో హ్యాపీ సోసో హ్యాపీ రోయ్

సో హ్యాపీ సో హ్యాపీ సోసో హ్యాపీ రోయ్
బాడీజ్, టీనేజ్ నో క్యాన్సిల్ రోయ్ సో హ్యాప్పీ ||2||
కొట్టావే జాక్‌పాట్ లాటరీలో నాట్‌లెట్‌లో దూకేసేయ్
కో అంటే నీ ముందుకొచ్చే కోతి చేయాలీ డిస్కోనే
అల్లావుద్దీన్ ఈ పల్లెటూరికేరా మాదంటూ ఇంతటి ఆనందం
కుబేరుడే మన ఇంటికి వచ్చెరా కాదనక ఇంట్లో పందిట్లో
సో హ్యాపీ సో హ్యాపీ

ఇల్లంతా సెంట్రల్ ఎ సి చేసి ఓ సీ గా వాడేద్దాం
పొద్దున్నే ఫ్ల్తెట్ ఎక్కి ఫారన్ వెళ్ళి మిడ్‌నైట్ తిరిగొద్దాం
ఊహల్లోనా పైపైన తేలు ఊరికినే ఎక్కిఊగాక అలా పడ్డావంటే
పైనుంచి జారి అప్పుడు నీ కళ తీరకలా
హద్దులోనే మన ఆశలుంటే అంతకు మించి ధనముందా సో హ్యాపీ

డబ్బులుతో దర్జానే కొన్నావంటే ఎన్నాళ్ళో ఉండవులే
మేడల్లో ఉన్నోళ్ళు మనుషులైతే ఇన్నాళ్ళూ నువ్వేవరే
జాన్ సే జాజా ఏం తెలుసు నీకై పైసల్లోని కరెంటే, లేనోడిలా
ఉంటానంటే నీ కర్మే అనుకుంటాలే ఈ రోజుతో తీరేది కాదుగా
ఎందుకీ నీకీ గొడవ అసలే సో హ్యాపీ

నైజాం బాంబులు నాటుబాంబులు

నైజాం బాంబులు నాటుబాంబులు
అతిదులు మీరండీ ఆర్డరు వేయండీ
చక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీ
కోర్కెలు చూపండీ
వదువు మా ఫ్రెండ్‌ ఆడీడవరుడు మావడండీ
సేవలను పొందండి చేసుకోండి ||నైజాం||

జర్ధాలూ పాన్‌ మసాలులు పట్టుకురండీ
జల్దీగా కోల్డ్‌ప్లాపులు కొనుక్కుతెండీ
పానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీ
పొగతాగితే మగతనమే ఉష్‌కాకంటుందీ
పేలని బాంబులు పిచ్చి ముద్ధులు
బుద్దులు మీరండీ పద్దతి మార్చండీ

ఉడకని పప్పులు నోటిగొప్పలు కోతలు
మానండీ మౌతులు మూయండీ
తొందరగా నల్లకొంగను తీసుకురండీ
తక్షణమే కొండమీది కోతిని తెండీ
మసి పూస్తే మీరేమో కొంగవు తారండీ
ఆ మీ ఫ్రేండు ఉండంగా కోతెందుకులెండి
తింగరి బాబులు వెర్రికుంకలు గొర్రెలు
మీరాండీ బుర్రలు పెంచండీ
తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ
తోకలు ముడవండీ
మీరు ఆడాలండీ మాది మగజాతండీ తాలికట్టే
వేళా తలోంచాలి తప్పదు

నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా

నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదాతీరగా ఊయంటనుగా
మనల్నే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డేలేదుగా

ఇద్దరికీ వద్దిక కుదరక
ఇష్టసఖీ వద్దని వదలక
సిద్దపడీ పద్దతి తెలియక తలొంచి
తపించి తతంగ మడగగా ||నాలోఉన్న||

రెప్పలలో నిప్పులే నిగనిగ
నిద్దురనే పొమ్మని తరమగ
ఇప్పటితోప్పుడు దిరకక వయ్యారి వయస్సు
తయారయిందిగా ||నాలోఉన్న||

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా
మన ఇంట్లో అడుగుపెట్టరా
బుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగా
నడుం కట్టెరో ||బొంబాయి||

సామియానా పరిచేస్తా పూలమైనా పిలిపిస్తా
పిండివంటలు గుమాగుమా చేయిస్తా
వేల టపాసుల ఢమాఢమా పేలుస్తా
ఇల్లేపీకి పందిరి వేస్తా ఉడతా భక్తీ సాయం చేస్తా
బజ్జుంటే పనులు జరగవోయ్ నీ సిగతరగా
బాజాలకు కబురుపెట్టవోయ్
ఇంతకు నువ్వు ఎవరితాలూకోయ్ నీసిగతరగా
మాపైనే జులుం ఏమిటోయ్

స్టైలు చెంపకు చుక్కెడతా నగలూ నట్రా తగిలిస్తాం
దగ్గరుండీ తలంబ్రాలే పోస్తాం
లగ్గంలోని తతంగమే చేస్తాం
అడుగులు ఏడు నడిపించేస్తాం పెళ్ళే నాదని భావించేస్తా
చాకంటీ చురుకు నీదిరోయ్ నీసిగతరగా
నీకెంతా చొరవ ఉందిరోయ్
ఈ పెళ్ళికి పెద్దనువ్వురోయ్ నీ సిగతరగా
నీపెళ్ళాం లక్కీ పిల్లరోయ్

వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా

వయసా చూసుకో చెబుతా రాసుకో ఈడుకి తొలిపాటా
సొగసా చేరుకో వరసే అందుకో నికిది తొలి వేగం
ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా
ఓ ఊహకందని భాషా నేర్చుకోమనసా
ఓ సామిరారా ప్రేమంటే ఇదేరా
నాసితారా ప్రేమంటే ఇదే రా ||వయసా||

రేయిభారం రెట్టింపయిందీ లేవయారం నిట్టూరుస్తుందీ
రాయబారం ఇట్టేచెప్పిందీ హాయ్ భేరం గిట్టేలా ఉందీ
మోయలేని ప్రేమంటే ఇదేరా
సాయమడిగే ప్రేమంటే ఇదేరా ||వయసా||

తేనె మేఘం కాదా నీదేహం కూనేరాగం కోరే నాదాహం
గాలివేగం చూపే నీ మోహం తాకగానే పోదా సందేహం
పాడమంది ప్రేమంటే ఇదేరా
రాయమందీ ప్రేమంటే ఇదే ||వయసా||

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానీ నీకేంకాదని, నిన్నిటిరాతని మార్చేస్తాననీ

తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చేనిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ
గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నాననీ
నేనున్నాననీ నీకేంకాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ

ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీ
అందరువున్నా ఆప్తుడనువ్వై చేరువయ్యావనీ
జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ
శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నాననీ
నేనున్నానీ నీకేంకాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేంకాదనీ నిన్నటిరాతని మార్చేస్తాననీ

నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్ట్

నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్ట్
మారిపోవునా సురిరాం సురిరాం సురిరాం సురిరాం
ఆరుబైట కూడినా పడకటింట కూడినా
ఆరునొకటి ఏడుకాక పోవునా
ప్యారు చేసినా లవ్వు చేసినా ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినా
ప్రేమల్లో పిచ్చి మారునా కుర్రవయసుల్లో కచ్చతీరునా ||2||

ఎడమకన్ను కొట్టినా సురిరాం సురిరాం కుడికన్ను
కొట్టినా సురిరాం సురిరాం కళ్లలోని కోరికే మారునా
విస్తరేసి పెట్టినా పళ్లెమేసి పెట్టినా వంటలోని ఘాటు మారిపోవునా
వూరే మారినా పూవు మారునా వస్త్రం మారిన వరస మారునా
సెల్లుమారు ఇల్లుమారు పిల్లదాని ఒళ్లుమారు గజ్జెల్లో ఘల్లుమారునా
నాజంటప్రేమల్లో జిల్లు మారునా
గజ్జెల్లో ఘల్లు మారునాజంటప్రేమల్లో జిల్లు మారునా
పాపపా పాపపా పాపపా పాపపా

తేనెతోటి తుడిచినా నేతితోటి తుడిచినా కోకపిల్ల ఆకలే తీరునా
కీచులాటలాడినా కిస్సులాటలాడినా రాతిరేళ యాతనే తీరునా
అందం యిచ్చినా ఆశతీరునా భాగం పంచినా బాధతీరునా
లక్కుతీరు కిక్కుతీరు పెక్కుమార్లు తిక్కతీరు
ఆటల్లో అలుపుతీరినా గోటిగాయాల్లో నలుపుతీరునా

వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం

వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
ఓం ధిరి ఓం ధిరి ఓం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ సొగసు ఎవరికోసం ||ఓంధిరి||
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం నీకోసం నీ కోసం
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసే సందడిలోన ఆకు వక్కా సున్నం నీ కోసం

గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా
ఉన్న పాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాట లేదుగా
కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా
తీగచాటుగా, మూగపాటగా ఆగిపోకే రాగమాలికా
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనైరానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా
అమ్మమ్మో అబ్బబ్బో ఆముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం నీకోసం

సిగ్గుకోరికా నెగ్గలేవుగా ఏడుమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయక మొయలేవుగా లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దురకానా చిగురంటి పెదవులపైనా
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్ధతిలోనే ముద్దులనెన్నో తెచ్చా నీ కోసం

ఒక దేవత వెలిసింది నీ కోసమే

ఒక దేవత వెలిసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ||ఒక||
సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా
సౌందర్యాలే చిందే ఆమినిలా
ఎన్నో జన్మల్లోన పున్నమిలా
శ్రీరస్తంటూ నీతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని ||ఒక||

విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోనా
నీ నీడే చూసాడమ్మ
ఎనిమిది దిక్కుల్లోనా నింగిలి చుక్కల్లోనా
నీ జాడే వెదికాడమ్మ
నీ నవ్వే తన మదిలో అమృతవర్షం
నీలోనే వుందమ్మ అందని స్వర్గం
రవళించే హృదయంతో రాగం తీసి
నీ కుంకుమ తిలకంతో కవితే రాసి
అంటుందమ్మా తన మనసే నిన్నే ప్రేమిస్తానని ||ఒక||

కళ్ళకు కలలే రెండు కాటుక సుగ్గులు చిందు
కాబోయే కళ్యాణంలో
తనలో సగమే వీది నీలో సర్వం తనది
అనురాగం మి ఇద్దరిది
ఆ తారా తోరణమే మల్లెల హారం
చేరాలి మురిపాల సాగర తీరం
అలరించే మీ జంట వలపుల పంట
శుభమంటూ దీవించే గుడిలోగంట
చెప్పాలి తనతో నీవే నిన్నే ప్రేమిస్తానని ||ఒక||

ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు

ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకి చ్చినావు
ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది ||ప్రేమా||

పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకు
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటి చెరిగేలా ఆ కంటి చూపు
వేకువ జామున వాకిట వెలిసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమున సిగ్గులు జల్లే నా చెలి మందారం
ఎంత చేరువై వుంటే అంత సంబరం ||ప్రేమా||

ఏటిలో తరగల్లే ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతోంది
కంటికి కునుకంటూ రాను పొమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటూంది
ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం
అందాకా మరి ఆగామంటే వింటుందా హృదయం
వేచివున్న ప్రతి నిముషం వింత అనుభవ ||ప్రేమా||

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది ||గుడి||
ఆ దేవుని పూజకు నువ్వొస్తే
ఆ దేవిని చూడగ నేనొస్తే
అది ప్రేమకు శ్రీకారం ||గుడి||
శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట
ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట

నా చిరునవ్వయి నువ్వే ఉండాలి ఉండాలి
నా కనుపాపకు రెప్పయి వుండాలి ఉండాలి
చెలి గుండెలపై నిద్దుర పోవాలి పోవాలి
ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి ఎదగాలి
నా చెలి అందెల సవ్వడి నేనై
నా చెలి చూపుల వెన్నెల నేనై
చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి
నుదుటి బొట్టయి నాలో నువ్వు ఏకమవ్వాలి ||గుడి||

వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి పోయాలి
నెచ్చెలి పమిటికి చెంగును కావాలి కావాలి
కమ్మని కలలకు రంగులు పూయాలి పూయాలి
నా చిరునామా నువ్వే కావాలి కావాలి
తుమ్మెద నంటని తేనెవు నువ్వయి
కమ్మని కోకిల పాటవు నువ్వయి
చీకటిలో చిరుదివ్వెవు నువ్వయి
వెలుగులు పంచాలి
వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి ||గుడి||

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని
ఎదురు చూసి పలికెను హృదయం
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||

కనులకు తెలియని ఇదివరకెరుగని
చలినే చూడాలని
ఊహల దారుల ఆశలు వెదికెను
ఆమెను చేరాలని
ఎదసడి నాతోనే చెప్పకపోదా
ప్రియసఖి పేరేమిటో
కదిలే కాలాలు తెలుపక పోవా
చిరునామా ఏమిటో
చెలి కోసం పిలిచే ప్రాణం పలికే
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||

కవితలు చాలని సరిగమ లెరుగని
ప్రేమే నా పాటని
రెక్కలు తొడిగిన చిగురాశలతో
కబురే పంపాలని
కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా
మదిలో భావాలని
ఎగసే కెరటాన్ని అడిగిచూడనా
ప్రేమకు లోతెంతని
చిరుగాలుల్లో ప్రియరాగం పలికే
ప్రేమకు స్వాగతం ||2|| ||ప్రేమ||

30 December 2010

నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే

నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే
నీవే నేనై నిలచిన నాడే జీవనరాగం తెలిసెనులే
నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే

అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో
అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో
నీలో సాగే అనురాగాలే నీలో సాగే అనురాగాలే
వేణువులూదెను నాలో లోలో

నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే
నీవే నేనై నిలచిన నాడే జీవనరాగం తెలిసెనులే

నీలో విరిసే దరహాసాలే పాలవెల్లులై పొంగెను నాలో
నీలో విరిసే దరహాసాలే పాలవెల్లులై పొంగెను నాలో
జగమును దాటి గగనము మీటి
జగమును దాటి గగనము మీటి
ఎగిసెను ఊహలు నాలో లోలో

నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే

నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా

నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర
నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర

నెలరాజులోని సొగసు
దినరాజులోని వెలుగు
నెలరాజులోని సొగసు
దినరాజులోని వెలుగు
నీయందు నిండి నా కలలు పండి
యువరాజువవుదులేరా
రారా సుకుమార ఒహో వీర

హరిచేత సిరులు పొంది
హరుచేత వరములొంది
హరిచేత సిరులు పొంది
హరుచేత వరములొంది
లోకాలనేలి భోగాల తేలి
చిరకీర్తినందుకోర
రారా సుకుమార ఒహో వీర

ఇంటింట శాంతి నిలిపి
జగమంత కాంతి నింపి
ఇంటింట శాంతి నిలిపి
జగమంత కాంతి నింపి
సురవరుల నరుల జేజేలనంది
వర్ధిల్లు భరతవీర
రారా సుకుమార ఒహో వీర

నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర
రారా ఓ వీర

సరసన నీవుంటే జాబిలి నాకేల అహ

సరసన నీవుంటే జాబిలి నాకేల అహ
సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల

నీకన్నులలో నిగనిగ చూసి
నివ్వెరపోయెను తారకలు ఆ ఉం
నీకన్నులలో నిగనిగ చూసి
నివ్వెరపోయెను తారకలు
తారలలోని తరుణిమ నీవై
తారలలోని తరుణిమ నీవై
నన్నే మురిపింతువే అదే హాయ్

సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల

చక్కని నీ ముఖ చంద్రుని చూడగ
జాబిలి అదిగో ఆగెనులే
చక్కని నీ ముఖ చంద్రుని చూడగ
జాబిలి అదిగో ఆగెనులే
కౌగిలిలోన ఊగిన వేళ
కౌగిలిలోన ఊగిన వేళ
కాలమే ఆగిందిలే అదే హాయ్

సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల

మధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమ

మధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమ
ఏవేవో భావాలు పూవులవోలె పూచే సీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ

తేటికి పాట నెమలికి ఆట
తెలిపే అందాలు,ఉసిగొలిపే చందాలు
తేటికి పాట నెమలికి ఆట
తెలిపే అందాలు,ఉసిగొలిపే చందాలు
హంసకు నడకు లేడికి పరుగు నేర్పే పరువాలు
హాయ్ హాయ్ నీ నిగనిగ చెలువాలు
హంసకు నడకు లేడికి పరుగు నేర్పే పరువాలు
నీ నిగనిగ చెలువాలు
కన్నియ చిరునవ్వు, కమ్మని నునుసిగ్గు
ఎన్నటికైనా వాడని సీమ ఆ ఆ
హొయ్ హొయ్ హొయ్

మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ

చల్లని మాసం పెళ్ళిముహూర్తం
మల్లిక వధువు సుమా
ఎలమావే వరుడు సుమా
చల్లని మాసం పెళ్ళిముహూర్తం
మల్లిక వధువు సుమా
ఎలమావే వరుడు సుమా
మంజులగానం మంగళగీతం మన్మధ వేదాలు
హాయ్ హాయ్ తొలివలపుల మంత్రాలు
మంజులగానం మంగళగీతం మన్మధ వేదాలు
తొలివలపుల మంత్రాలు
పువ్వుల కళ్యాణం నవ్వుల వైభోగం
ముచ్చటలన్ని తీరే సీమ ఆ ఆ
హొయ్ హొయ్ హొయ్

మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
ఏవేవో భావాలు పూవులవోలె పూచే సీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు
హొయ్ పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం
నిలవాలి ఇది కలకాలం
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు

నీవు నడిచే బాటలోన లేవు బాధలే ధనకధిం
నేను నడిచే బాట మీకు పూలపానుపులే ధనకధిం
ఒకటంట ఇక మనమంతా లేదంట చీకు చింత
సాధించాం ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మనకోసం
వీసమైన లేదులే బేధభావమే
నీకు నాకు ఎన్నడు నీతి ప్రాణమే
తాంతధిద్దిం ధింతధిద్దాం ఆడిపాడుతాం

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు
పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం
నిలవాలి ఇది కలకాలం

పాలుతేనెల్లాగ మంచిని పంచు సోదరా ధనకధిం
ఆదరించే దైవముంది కళ్ళముందర ధనకధిం
పువ్వలతో నువు పూజించు కర్పూరాన్ని వెలిగించు
మమకారాన్ని పండించు అందరికి అది అందించు
వాడలోని వేడుకే తుళ్ళి ఆడెను
అంతులేని శోభలే చిందులేసెను
తాంతధిద్దిం ధింతధిద్దాం ఆడిపాడుతాం

సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు
పలికెను రాగం సరికొత్త గానం
ఈ ఆనందం మా సొంతం
మా సొంతం ఈ ఆనందం
నిలవాలి ఇది కలకాలం
సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు
చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు

నా నవ్వే దీపావళి హొయ్

నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి
నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం నా వయసే
అతి మధురం నా మనసే
నా నవ్వే నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి

కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై వున్నదిరా
కనని వినని అనుభవమే ఇదిరా
చెలి రేయి పగలు నీకై వున్నదిరా
అందాలన్ని పూసెను నేడే
ఆశల కోట వెలిసెను నేడే
దేహం నాది దాహం నీది
కొసరే రేయి నాదే నీది
ఆడి పాడి నువ్వే రా

నా నవ్వే నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం నా వయసే
అతి మధురం నా మనసే
నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి

కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కధలు పలికెను గీతికలే
కడలి అలలు నీ చెలి కోరికలే
నా కలల కధలు పలికెను గీతికలే
వన్నెలు చిందే వెచ్చని ప్రాయం
పలికించేను అల్లరి పాఠం
పరువం నాలో రేగే వేళ
వయసే బంధం వేసే వేళ
ఆడి పాడి నువ్వే రా

నా నవ్వే నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి
అరవిందం నా వయసే
అతి మధురం నా మనసే
నా నవ్వే దీపావళి హొయ్
నా పలుకే గీతాంజలి

చలాకి చిన్నది వుంది మజాలకు రమ్మంటుంది

హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్య
హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్య
చలాకి చిన్నది వుంది మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది వుంది మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి ఇమ్మంటుంది
హొయ్యా హొయ్ అది ఏందది హొయ్
మసకేల చూడు నీకుంది తోడు
రాచిలక అందం రాతిరికే సొంతం
చలాకి చిన్నది వుంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి ఇమ్మంటుంది
హొయ్యా హొయ్ అది ఏందది హొయ్

చూపులలోన చుక్కలు చూడాలి తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి తజుం తజుం తజుం
చూపులలోన చుక్కలు చూడాలి తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి తజుం తజుం తజుం
మోజులమాటున కసికసిగా ముద్దుల దొంతరివ్వాలి
వెచ్చని వన్నెల చాటున నే ముచ్చటలాడుకోవాలి
నువ్వు ఆడాలి నే పాడాలి పడవూగాలి హొయ్

చలాకి చిన్నది వుంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి ఇమ్మంటుంది
హొయ్యా హొయ్ అది ఏందది హొయ్
అరె హొయ్యా హొయ్ అది ఏందది హొయ్

కోకా రైకా గుసగుసలాడేనే తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెలె కాసేనే తజుం తజుం తజుం
కోకా రైకా గుసగుసలాడేనే తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెలె కాసేనే తజుం తజుం తజుం
నీలో ఒదిగి నిలువెల్లా అల్లుకుపోతా చిలకమ్మ
గూటికి చేరే గువ్వల్లే ఒడిలో వాలవె చిట్టెమ్మ
నువ్వు ఆడాలి నే పాడాలి పడవూగాలి హొయ్

చలాకి చిన్నది వుంది
మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది వుంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి ఇమ్మంటుంది
హొయ్యా హొయ్ అది ఏందది హొయ్
మసకేల చూడు నీకుంది తోడు
రాచిలక అందం రాతిరికే సొంతం
చలాకి చిన్నది వుంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటి ఇమ్మంటుంది
హొయ్యా హొయ్ అది ఏందది హొయ్
హొయ్యా హొయ్ అది ఏందది హొయ్
హొయ్యా హొయ్ అది ఏందది హొయ్

అ చేరి యశోదకు శిశువితడు

ఆ ఆ అ అ చేరి యశోదకు శిశువితడు
చేరి యశోదకు శిశువితడు
దారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు
దారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు ఆ అ

సొలసి చూచినను సూర్య చంద్రులను
నలినగ చల్లెడు లక్ష్మణుడు
సొలసి చూచినను సూర్య చంద్రులను
నలినగ చల్లెడు లక్ష్మణుడు
నిలిచిన నిలువున నిఖిల దేవతల
నిలిచిన నిలువున నిఖిల దేవతల
నిలిచిన నిలువున నిఖిల దేవతల
కలిగించు సురల గనివో ఇతడు
కలిగించు సురల గనివో ఇతడు
చేరి యశోదకు శిశువితడు
దారుని బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు ఆ ఆ ఆ ఆ

కజకిస్థాన్ కాలేష బాబాక ఇనాం కాసర్లపూడి పైడితల్లి

కజకిస్థాన్ కాలేష బాబాక ఇనాం కాసర్లపూడి పైడితల్లి
పెద్దమ్మపుణ్యం ఇష్టపడ్డ పిట్టను బుట్టలో పెట్టుకున్నావ బాయా
అట్టాకాదని ఏడబ్బగా డెదిరొచ్చినఆ డబ్బగాడొచ్చిన
నీ దెబ్బకు అప్పుడమప్పడమై పోతారు
చుప్పనాతి బుల్లిరొ సూది గుచ్చుతొందిరో సుర్రుమంది వేడి
కత్తిలాంటి పిల్లరో కాకరే పుతోందిరో కోరుకుంది దాడి
పేకనాది కోకనీది కూతనాది కోతనీది ఏకమైతే తప్పేముంది
లయోలయో లజ్జనక లగ్గాలె పెట్టాలె
వెయ్యాలయ్యొ ముద్దల ముళ్ళే
లబొ దిబొ బాచీకి పప్పన్నం పెట్టాలె మళ్ళి మళ్ళి పుల్లంటే
చిప్పన్నం పెట్టాలె ఎడా పెడా అప్పడ మేలే

అ ఆ లో అందాలు ఇ ఈ లొ ఇల్లరికాలు ఇస్తా ఇందా
ఆహా ఓహో మత్తే చల్లాలే ఆడో ఈడో నన్నే గిచ్చావే
ఇదిగొ ఇవ్వాలె విధిగా నవ్వాలే అది కూడా నీవల్లే
చెరుకే పిండాలే, సరుకే దించాలే సరిగా తేల్చలగాలే ||లయొ లయొ ||

ఆ చంప ఈ చంప ఆరా రా గిల్లుకుపొన కూన జాన
లేలొ లేలొ లేలొ ఏమైన అన్నీ నీకై దాచానంటున్న
చొరవ చూశాలే బరిలో దూకానె ఎరనం దూనలగాలే
గడియే తీశాతే తలుపే మూసాలే గడియైన ఆగనులే ||లయొ లయొ || ||చుప్పనాతి||

శీను గాడేన సినిమా హీరోన వాడె వీడేమో

శీను గాడేన సినిమా హీరోన వాడె వీడేమో ఏమొ ఏమొ ఏమొ ఏ
రోజులా లేడే తేడాగున్నాడే చాలా మారాడే
బాబోయ్ బాబోయ్ బాబోయ్ రే
శీను శీను శీను మన కందుంత శీను లవ్‌లీగ లవ్‌లో పడిపోతున్నావే
పోను పోను పోను నీ లయనే క్లియరై పోను
అరె లక్కీబేబికి ఫ్రెండ్ పోయవే
నిన్న మొన్న నువ్విట్టా వున్నావ ఉస్సూరంటూ తిరిగావే
ఇవ్వాలేమొ బ్రేకుల్లేని బండిలాగ మబ్బుల్లొంచి దిగిరానంటావే
కాలం చేసే జాదు మనకేవ్వరి కర్ధం కాదు ఏడేయైన ప్లేటే మారిందే
అదృష్టం సరిహద్దు ఇంకెంతో దూరంలేదు
ఓ జానెడు దూరం జరిగావొ నీదే ||శీను శీను||

లవ్వుతొ ఇదేగ పరిచయం నవ్వుతూ
ఖుషీగ హల్లో అంటూ ద్రిల్లెపొయావా
అందుకో వరాల స్వాగతం అందమే
స్వయాన రమ్మంటున్న నువ్వే రాలేవా
ఎంత మాత్రము నీమీద ఎలాంటి ముచ్చట లేకుండా
ఆ బంగారు జింక సిగ్గనుకొక చెంగున దూకిందా
నట్టి రాకరు నీ మీద కాదంటు చెప్పడం తప్పేగ
తను కోరిన సాయం అంతో చేసెయ్యాలి కదా ||శీను శీను||

ఊరికే ఎలార ఉండటం కోరికే
ఇదంటు చెప్పేసై టైం ఎప్పుడు వస్తుందో
ఆపినా ఆగేన కలవరం అందుకే
ఇవాలే చెప్పాలంటూ తొందర పెడుతుందొ
కోటిమందిలో నువ్వున్న తన కంటిపాప ఏంచూసిందో
నువ్వడిగే ముందే అందే పదమై సరసన చేరింది
ముందు ముందుగ రాసుంది తెలిసేందుకే ఇలా జరిగింది
ఈ మలుపులు చూసి మనసే మాత్రం ఆగను అంటోంది ||శీను శీను||

కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేత చేరుకుని

కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేత చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా
డోలు డోలు మేళ మెట్టుకుని ఉంగరాలు వేలు పెట్టుకుని
కలగా పులగం చేసుకోర పిల్లగ
సకల కల్ల మహరాణి అమిత సాగ సాంబ్రణి
పురుష మెళి పడనీ చూపుల్లో
కొస వరకు ఉసిపోని రసికరత రుచులన్నీ
కసిగ తలబడనీ కౌగిల్లో ||కోల్ కోల్||

సుందరి సైరంధరీ ముద్దిచుకోవె ఓసారి
నడవదిక సోసారి విడువు నన్ను ఈసారి
ఓపరి నీలాహిరి నాలైఫ్ చాలే వయ్యారి
ముడిపడక బ్రహ్మచారి వద్దంట ఈనారీ
ఓ చిమ చిమ వయసుల కిలికిరి చిరుసెగలెగిసెనె మరిమరి
నిలువు నతడపవే సొగసరి నీలుకురుల జల్లుల్లో
గడసరి పిడుగుల మగసిరి ఎగబడు చొరవల తెగువరి
తెరలిక తెరవని తొలకరి సిరులు దాచకు వెళ్ళయ్యో ||కోల్ కోల్||

పిల్లడ ఇంతల్లుడా ఇల్లందు వేసెర చెలికాడ
ఎదురగానె నిను చూడ నిలువదిక నానీడ
పోరడ ఎడాపెడా లాగేయ మాకు వాలుజడ
కులికిపో తొడివాడ సలపని రగడ
ఓ మదనుడి వరసకు మనవడ మరువపు దవనపు తలగడ
మణిగిన అడుగులు జతపడ మావ కొడుకువి నా ఒళ్ళో
పెదవికి అదిఒక అలజడ నడమది నిగనిగ చలివిడ
అదిమితె నిను ఇటు సరిపడ అత్తకొడుకుని పొత్తిల్లో ||కోల్ కోల్||

దివాళి హొలీ కలిసిమెరిసే ఖుషీ మాది ఓ

దివాళి హొలీ కలిసిమెరిసే ఖుషీ మాది ఓ
పువ్వుల దారి రమ్మని పిలిచే తొలి ఉగాది
ఏదో వైపుగా సాగే జీవితం మళ్ళీఇ హాయిగా నవ్విందీ క్షణం
దూరం కాని ఆనాటి స్నేహం కదా
చేయందించి మాతోడు నడిచిందిలా
గుండెలలో ఈ సరదా పండుగలా ఉంది కదా ||దివాలి||

తియ్యని కలత్తె నాచిరుచేదు తియ్యని స్వరమైన దీనాడు
వేసవి వడగాలి దరిరాదు వెన్నెల కలిసింది మాతోడు
ఇప్పుడు మొదలైన సంతోషాలు ఇకపైన ఉంటేచాలు
నిన్నలు కలగన్న ఆనందాలు రేపటిలో మానేస్తాలు ||దివాలి||

ఎందరువున్న ఎవరు లేని ఒంటరి తనమింక కనరాని
కోరిన తీరం ఎదురు పడని అడుగు తడబాటు ఇకలేదు
కొమ్మకు చిగురైన కొత్త ఉగాది సందడిగా రాబోతుంటే
రెప్పలు బరువైన నిమిషాలన్ని వేడుకగ మారాలంతే ||దివాలి||

అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే

అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే
మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

నా చెంపలు నిమిరెయ్యనా చెవి రింగువై నా గుండెలుతడి
వెయ్యవా ఓ గొలుసువై నా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వే
నీ చీకటి కరిగించనా కొవొత్తినై
నీ భయమును తొలిగించనా తాయతునై
నీ గదిలో వ్యాపించనా అగరత్తు నేనై
వేలే పట్టెయ్ ఉంగరమయ్య నాతో తిరిగెయే బొంగరమయ్యి
ఒళ్ళే మోసెయ్ పల్లకివై నన్నే దాచెయ్ బంగరమయ్యి
ఊకొడుతూ చేరనా ఊడిగమే చెయ్యనా ఊపిరిగా
మారనా ఊయలనే ఊపనా ఈ మాత్రం చాలునా ఇంకా
కొంచెం పెంచనా - 3 ||అదరకొట్టు||

నా వెనకే వచ్చెయ్యవా అపరంజివై
నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై
నా నోటికి రుచిలియ్యవానారింజ నీవై
నీవాకిట కురిసెయ్యనా చిరుజల్లునై
ఈ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై
నీ ఆశలు తగ్గించనా వలదిళ్ళునేనై
ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపెంగివై
సంగీతానికి సారంగివై రావే రావే అర్ధాంగివై
ఉత్సాహం నింపగా ఉల్లాసం పెంచనా
ఉమ్మా అందించనా ఉంగా తినిపించనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా -3 ||అదరగొట్టు||

నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ

నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ
తిప్పుకుంటుతిరిగావే నీ ఒంపులు ఊడిపడా
దొంగ చూపు చెబుతుంటే నీ రంగు పెదవి చెబుతుందే
తిక్క నడక చెబుతుందే తై తక్కనడుము చెబుతుందే
నా పైన నీ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మండ ||నీ సోకు||

ఎపుడెప్పుడో ఇంకెప్పుడే నీకు నాకు లింకెపుడే
ఎపుడెప్పుడే లవ్వెపుడే నీలో ఒంటికి జివ్వెపుడే
వయసై పోతే ఉడికే ఐసైపోతే
మోజే పోతే కోరిక క్లోజైపోతే
తెలుపవుతుంది తల్లోని జుట్టు వదులవుతుంది ఒంట్లోని
పట్టు అనవసరంగా చెయ్యద్దు బెట్టు అందాలన్ని నా చేత
పెట్టు అతి చెయ్యకుండా ||నీ సోకు||

అంతేలే అంతేలే ఆడోళ్ళంతా అంతేలే
పైపైనే పంతాలే లోలో తకధిం దింతాలే
వదిలెయ్ అంటే అర్ధం ఇంకా వాటెయ్
నోర్ముయ్ అంటే అర్ధం పెదవే కలిపెయ్
గసిరామంటే కవ్వించినట్టు నసిగా మంటే ఉసిగొలిపినట్టు
తిట్టామంటే తెర తీసినట్టు కొట్టామంటే కను నింపినట్టు
తెలిసిందే జాన ||నీ సొకు||

తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా

తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్
తరత్తా మంతరమేస్తా తరత్తా మత్తెకిస్తా తరత్తా పిచ్చెకిస్తా
గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్
ఓ బేబి ఓ బేబి సత్తా చూపిస్తా బేబి
ఓ బేబి ఓబేబి శభాష్ అనిపిస్తా బేబి
నా కోరికనంతా ఓ కొడవలి చేస్తా నీకులుకులు మొత్తం
నే కోసుకుపోతా
రారా కృష్ణా రాధాకృష్ణా బరిలేని ఫన్నీ కృష్ణా
ఛీ పో కృష్ణా సిల్లి కృష్ణా పరువాన్ని కొల్లే కృష్ణా ||తరత్తా||

ఎండ లోన ముద్దిస్తా మై వానలోన వాటేస్తా
ఇక ఎండ వాన కలిపొస్తే ఆ పండు చేతికిస్తా
ఉత్తరాన ఊపేస్తా ఇక దక్షిణాన దులిపేస్తా
ఇక వాస్తు చూసుకోకుండా నీ ఆస్తి కరగదీస్తా
నీ దూకుడు తగ్గిస్తా నా చెడుగుడు సాగిస్తా
పిల్లగోనే తిప్పులు పెడతా పిల్లగో సరి హద్దులు పెడతా
పిల్లగో నిన్ను అల్లాడిస్తా ఆడిస్తా
పిల్లోనే తొందర పెడతా పిల్లో నే పంతంపడతా
పిల్లో నేపైపై కొస్తా పీడిస్తా
రారా కృష్ణా రాధాకృష్ణా రెచ్చావు రౌడి కృష్ణా
గోపికృష్ణా అగ్ని కృష్ణా నాతీపికోరే కృష్ణా ||తరత్తా||

ఊరుకుంటె ఒకటిస్తా నువ్వు కోరుకుంటె రెండిస్తా
ఆ మూడు ముళ్ళు నువ్వేస్తే నా ఏడు జన్మలిస్తాం
అడుగుతుంటే ఇంతిస్తా నువ్వు అడుగకుంటే కొంతిస్తా
నా అడుగులోనా అడుగేస్తా బ్రతుకంతా ధారపోస్తా
నా గడపన దాటొస్తా రా రా రారాటు పిల్లోదాటేస్తా
పిల్లగో నీవేలే పడతా పిల్లగో మురిపాలే పడతా పిల్లగో
సగుపాలై పోతా లాలిస్తా
పిల్లో నీ బరువైనస్తా పిల్లో యెద పరుపే వేస్తా
పిల్లో పిల్లోడిని ఇస్తా కవ్విస్తా
రా రా కృష్ణా రాధాకృష్ణా నచ్చావు నాజికృష్ణా
పెళ్ళి కృష్ణాక్రేజి కృష్ణా నీ ప్రేమ నాదే కృష్ణా ||తరత్తా||

మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే

మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే
నీలోనా మురిపించేమైనా నా మైనా మైనా మతిపారేసావే నీ పైనా
నువు చూస్తేనే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నా
నీతోనే నడిచొస్తానా హేయ్యనా చెయ్యి వేస్తే నే చిలికవు
తున్నా రాస్తేనే పరికవుతున్నా చేస్తే నీ చెలి మవుతున్నా సరేనా
తు లకజా తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా ||మురిపించే||

నచ్చావే నువ్వే నాకు చాన పాప ఇచ్చెయేనా నేనే నీకు రాజ్యాలైనా
నీ రాజ్యం కన్నా సామ్రాజ్యం కన్నా యమధర్జాగున్నా రవితేజం మిన్నా
పోనా పోనా వరదల్లె పొంగిపోనా
కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా
తు లకజు తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా ||మురిపించే||

తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన
మురిపిస్తా నీపై నేను తారల వాన
ఆ మెరుపుల కన్నా ఈ తారల కన్నా నీ మగసిరి మిన్నా
నా ముద్దుల కన్నా
జాన జాన కాజెయ్య నా ఖజానా
ఖాన ఖాన కౌగిళ్ళ బంధిఖాన
తు లకజా తు లకజా లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా లకజా జానే జానా ||మురిపించే||

తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా

తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా ||2||
తుమేరి తుంటరి తనమా తుమేరి ఊపిరి గుణమా
తుమేరి తియ్యని జ్వరమా తుమేరి జీవన స్వరమా
తుహిమేరా సర్వస్వమా
మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా
మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా
మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా
మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా ||తుమేరా ||

నాబడి నువ్వే నా గుడి నువ్వే నా ఒడి నువ్వేగా ఈ అమ్మవొడి నువ్వేగా
నననా గుస నువ్వే నాదశ నువ్వే పదనిస నవ్వేగా పడుచు నస నువ్వేగా
కీచులాట నువ్వే కిస్సులాట నువ్వే
నువ్వే దక్కే దూరమా నువ్వే తేలిక భారమా తుహిమేరా ఆ భారమా
మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా
మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా
మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా
మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా ||తుమేరా ||

నాసిగ నువ్వే నాసెగ నువ్వే నా పొగనువ్వేగా చిలిపి పగనువ్వేగా
నాసిరి నువ్వే నా తరి నువ్వే నా సరి నువ్వేగా అసలు గురి నువ్వేగా
మామ్మమ్మా మమ్మమ్మా తొలిప్రేమా
మామ్మమ్మా మమ్మమ్మా చిరునామా
మామ్మమ్మా మమ్మమ్మా యమధీమా
మామ్మమ్మా మమ్మమ్మా హరేరామా ||తుమేరా ||

దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ దిల్‌మాంగె మోర్‌ మోర్

దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ దిల్‌మాంగె మోర్‌ మోర్‌
ఇన్నాళ్ళు బోర్‌ బోర్‌ ఇవ్వాళ జోర్‌ జోర్‌
పట్టాపట్టా నీ ఫోన్‌ నెంబర్‌ పట్టా పట్టా నీ డోర్‌ నెంబర్‌
పట్టన వేళ గుండెకు అయ్యే ఫంచర్‌
చిట్ట నవ్వే సెంటిమీటర్‌ పొట్టి నడుమే మిల్లిమీటర్‌
ఇట్టానన్ను పెట్టేసావే తార్చర్ ||దిల్‌ ||

వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే
ఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలే
నన్ను ముంచేశావే నీలో నా గుండె దడ
ఇక పెంచేశావే నాలోనా గుండె దడ
నీ మూడే చూశాలే నీ స్పీడే చూశాలే
నే తోడా తోడా సర్దేస్తే నువు తేడా తేడాహే ||దిల్‌ ||

నన్నే మరి నన్నే మిక్సీలో రుబ్బేశావే
మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే
ఓ జెంటిల్‌ మేన్‌లా ఉన్నా నే నిన్నటికి
నన్ను మెంటల్‌ మేన్‌లా మార్చావే ఆఖరికి
నువ్వంటే మంటహే నీతోటి తంటాహే
నా వెంటే ఇట్టా పడుతుంటే టెమిటైపోతాలే ||దిల్‌ ||

నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవుకదా

నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవుకదా
పొగిడావంటే పడిపోతానే తప్పని గొడవకదా
పద పద అంటోందే హయ్ పదే పదే నీ అందం
అహా మహా బాగుందే హాయ్ మతే చెడి ఆనందం
ఉరకలెత్తే యవ్వనం తరుముతుంటే కాదనం
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

తీగ నడుము కదా తూగి తడబడదా
రేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదా
ఆడ మనసుకద బైట పడగలదా
అంతసులువుగ అంతు దొరకదు వింత పొడుపు కథ
కబురు పంపిన పయ్యెదా ఇపుడు వెయ్యకు వాయిదా
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

లేడి కన్నులతో వగలాడి వన్నెలతో
కంటపడి మహకొంటెగా కవ్వించు తుంటరివో
వాడి తపనలతో మగవాడి తహ తహతో
జంట పడమని వెంటపడి వేధించు తొందరవో
పెదవి అంచున ఆగినా అసలు సంగతి దాగునా
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

ఆ ఆట ఆ ఆట జెండాపై కపిరాజుంటే

ఆ ఆట ఆ ఆట జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంట
గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట

అల్లావుద్ధిన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
అల్లదిగో ఆశలద్వీపం కళ్ళెదుటే ఉందంట
ఎల్లలనే తెంచేవేగం మేఘాలు తాకాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట

ముందుగా తెలుసుకో మునిగే లోతెంత
సరదాగా సాగదు బేతా నట్టేట ఎదురీత
తెలివిగా మలుచుకో నడిచే దారంత
పులిమీద స్వారీ కూడ అలవాటు అయిపోదా
సాదించే సత్తా వుంటే సమరం ఒక సయ్యాట
తల వంచకు రావలసిందే ప్రతి విజయం నీవెంట ||అల్లా||

చెలిమితో గెలుచుకో చెలితో వలపాట
అతిలోక సుందరి రాదా జతకోరి నీవెంట
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాట
జగదేక వీరుడు కూడ మనలాంటి మనిషంట
ఇటునుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా
దివినుంచే దిగిరాలేదు మనతారాగణమంతా
మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా
పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా ||ఆట ఆట||