05 September 2010

చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలొ నీవయ్య

ఆమె : చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలొ నీవయ్య...
నిన్ను చూసి మురిసేను.. నేను మేను మరిచేను...
ఎత్తుకొని ముద్దాడీ.. ఉయ్యాలలూపేను...
జోలపాట పాడేనూ.. లాలి పాట పాడేను...
చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలొ నీవయ్య...
నిన్ను చూసి మురిసేను.. నేను మేను మరిచేను...

అతడు: నీ ఒడిలొ నిదురించి.. తీయనీ కల గాంచి...
పొంగి పొంగి పొయాను.. పుణ్యమెంతో చేసాను...
ఆమె : నీ ఒడిలొ నిదురించీ.. తీయనీ కల గాంచీ...
అతడు: పొంగి పొంగి పొయాను.. పుణ్యమెంతో చేసాను...
ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా...
ఈనాటి ఈ బంధం ఏనాడు విడదమ్మా...
ఆమె : అమ్మ వలె రమ్మనగ.. పాప వలె చేరేవు...
నా చెంత నీవుంటే.. స్వర్గమే నాదౌను...
అతడు: గాయత్రి మంత్రమును జపించే భక్తుడనే...
కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలనులే...


ఆమె : స్నానమాడె శుభవేళ.. కురులలో పువ్వులతో...
అతడు : దేవి వలె..నీవొస్తే.. నా మనసు నిలువదులే...
ఆమె : స్నానమాడె శుభవేళ.. కురులలో పువ్వులతో...
అతడు : దేవి వలె..నీవొస్తే.. నా మనసు నిలువదులే...
ఆమె : అందాల కన్నులకు కాటుకను దిద్దేను...
చెడు చూపు పడకుండా అగరు చుక్క పెట్టేను...
చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలొ నీవయ్యా...
అతడు : నిన్ను చూసి మురిసేను.. నేను మేను మరచేను...
ఆమె : ఎత్తుకొని ముద్దాడీ.. ఉయ్యాల లూపేను...
అతడు : జోలపాట పాదేను.. లాలి పాట పాడేను...
ఆమె : జో..లాలి....
అతడు : జో..లాలి....

No comments: