31 October 2010

చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా

చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా
ఓ ప్రేమా కన్నులో వలే రోజు ఎంతో బాగుందని కలా
కొన్నాల్లే అందంగా ఊరిస్తుంది ఆపై చెరుపుతుందిలా
కడ దాక ప్రేమించే దారేదో పోల్చేదెలా

చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా

నిన్నే ఇలా చేరగా మాటే మార్చి మాయే చేయాలా
నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా
ఊపిరీ ఆగేదాకా ఏదో ఒక తోడుందలా
నన్నింతగా ఊరించేస్తు అల్లేస్తుందే నీసంకెలా
కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం
కొంచం స్వర్గము కొంచం స్వార్ధము గొంతులో చాలు గరలం
కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం
కొంచం మౌనము కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం

ఇన్నాల్లుగా సాగిన ప్రేమనుంచి వేరై పోతున్నా
మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెలుతున్నా
ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా
ఒకో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెలా ఎలా ఎలా

చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా
ఓ ప్రేమా కన్నులో వలే రోజు ఎంతో బాగుందని కలా
కొన్నాల్లే అందంగా ఊరిస్తుంది ఆపై చెరుపుతుందిలా
కడ దాక ప్రేమించే దారేదో పోల్చేదెలా

కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం
కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం
కొంచం మధురము కొంచం విరహము
కొంచం పరువము కొంచం ప్రళయము

నేను నువ్వంటు వేరై ఉన్న

నేను నువ్వంటు వేరై ఉన్న
నాకీ వేళ నీలో నేనున్నట్టుగ
అనిపిస్తు ఉందే వింతగా
నా కోసం నేనే వెతికేంతగ
ఓ girl నువ్వే లేకుంటే ( listen girl )
ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నాను గా
కాదంటే నా మీదొట్టు గా
ఏమైనా చేస్తా నమ్మేట్టు గా
ఒక సారిచూసి నే వలచనా
నను వీడి పోదు ఏ మఘువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమ లోతులో మునిగాక
నువ్వు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ ఓ ఓ

నేను నువ్వంటు వేరై ఉన్న
నాకీ వేళ నీలో నేనున్నట్టుగ
అనిపిస్తు ఉందే వింతగా
నా కోసం నేనే వెతికేంతగ ఓ

నిజాయితి ఉన్నోడిని నిజాలనే అన్నోడిని
అబద్ధమే రుచించని అబ్బాయిని
ఒకే ఒక మంచోడిని
Romance లో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో సరే నని

ముసుకేసుకోదు ఏ నాడు నా మనసే ఓ భామ
నను నన్ను గానే చూపిస్తే కాదన్నా పోరాడేదే నా ప్రేమ ఓ ఓ
నేను నువ్వంటు వేరై ఉన్న
నాకీ వేళ నీలో నేనున్నట్టుగ
అనిపిస్తు ఉందే వింతగా
నా కోసం నేనే వెతికేంతగ

తిలోత్తమా తిలోత్తమా
ప్రతిక్షణం విరోదమా
ఇవ్వాల నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ గ్రహాలకే వలేసినా
దివే అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే చుడలేవు అమ్మా
ఒకనాటి తాజ్ మహలైనా
నా ముందుపూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడే
లోకంలో నిలిచే పేరే నాదేలే ఓ ఓ

నేను నువ్వంటు వేరై ఉన్న
నాకీ వేళ నీలో నేనున్నట్టుగ
అనిపిస్తు ఉందే వింతగా
నా కోసం నేనే వెతికేంతగ

నువ్వే లేకుంటే
ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నాను గా
కాదంటే నా మీదొట్టు గా
ఏమైనా చేస్తా నమ్మేట్టు గా
ఒక సారిచూసి నే వలచనా
నను వీడి పోదు ఏ మఘువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమ లోతులో మునిగాక
నువ్వు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ ఓ ఓ

Hello రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ

Hello రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
Hello రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది

Hello రమ్మంటే
Hello రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా

24 carrot lovely ప్రేమ
24 x7 నీ పై కురిపిస్తున్నా
ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా
every second నీకై పడి చస్తున్నా
7 రంగులుగ సులువుగ
7 రంగులుగ సులువు గ విడి మరి పోని
తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కలలుగ విరిసిన పువ్వుల రుతువై నీ కొరకే చూస్తున్నది
నువ్వంటే ఇష్టం అంటోంది
సరేలే అని బదులు ఇస్తే తప్పేముంది

Hello రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా

అందమైన కలలు చూస్తు ఉన్నా
అందులోన నేను నీతో ఉన్నా
అందుకోసమే నీ ఆనందాన
ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
ఇది మనసుకు మత్రమే తెలిసే feeling
కావాలంటే చదువుకో మనసుతో
గంగలాంటి న ప్రేమ ఇది జీవ నధి నాధం
చేతులారా గుండెలో నింపుకో
సరే నువ్వెంత వద్దన్నా ప్రేమగ పెరిగిపోతున్నా ప్రేమ గా ఓ ఓ ఓ

HelloHello
Hello రమ్మంటే వచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ
పొ పొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
నా మనసిది ఓ ప్రేమనది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది
Hello రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే
Hello రమ్మంటే వచ్చేసిందా పొ పొ పొమ్మంటు నువ్వంటే

రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే

బు అ బు అ బు అబు అబు బు అ బు అ బు అబు అబు
రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హై రబ్బా
తౌబ తౌబ హే తౌబ తౌబ తూ హై మేరీ మెహబూబ
అయ్యయ్యయ్యో ఏ మాయో నా వెంట తరుముతోంది
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తుందే
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉందే
రూబ రూబ రూ

రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హై రబ్బా
తౌబ తౌబ హే తౌబ తౌబ తూ హై మేరీ మెహబూబ

పిచ్చి నువ్వనే అంటున్నా ఎలా ఉండగలువంటుందినిన్ను తాకమని తొందర చేసే నా మదే
కొంటె చేతలే చేస్తున్నా తనేం చేసినా కాదనలే ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే
ఓ ఈ ఆనందంలో సదా ఉండాలనుందే ఆ మైకంలోనే మదే ఊరేగుతుందే
నీతో సాగే ఈ పయణం ఆగే నా ఇక ఏ నిమిషం

రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హై రబ్బా
తౌబ తౌబ హే తౌబ తౌబ తూ హై మేరీ మెహబూబ

బు అ బు అ బు అబు అబు బు అ బు అ బు అబు అబు
రెక్కలొచ్చినట్టుంటుంది మదే తేలిపోతుంటుంది రేయి పగలు మట్లాడేస్తున్నా చాలిదే
నవ్వు నాకు తెగ నచ్చింది నడుస్తున్న కల నచ్చింది నిన్ను వీడి ఏ వైపు అడుగు సాగదే
ఓ నువ్వేమంటున్నా వినలనిపిస్తూ ఉండే రోజు నీ ఊసే కలల్నే పంచుతుందే
నీతో ఉంటే సంతోషం కాద నిత్యం నా సొంతం

రూబ రూబ హే రూబ రూబ రూపం చూస్తే హై రబ్బా
తౌబ తౌబ హే తౌబ తౌబ తూ హై మేరీ మెహబూబ
అయ్యయ్యయ్యో ఏ మాయో నా వెంట తరుముతోంది
ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తుందే
సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టు ఉందే
రూబ రూబ రూ

ఓ range love ఇది ఓ baby

ఓ range love ఇది ఓ baby
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై ఏ కభీ
hey heart జోరుడి అబిబి ప్రేమను తాగే honey bee
thats why మేరా దిల్ చహ్తే హై సభీ

mount ఎవరెస్టై (lets go) ఎదిగే love నీ
చేరాలంటే కావలిగ daring
macanas gold లా (lets go) తాగే love నీ
వుండాలంటే చేయాలిగ combing
కమ్మని కవితల కబురుల్లో
కనపడదమ్మో లవ్వు
నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు

ఓ range love ఇది ఓ baby
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై ఏ కభీ
hey heart జోరుడి అబిబి ప్రేమను తాగే honey bee
thats why మేరా దిల్ చహ్తే హై సభీ

Lets go Lets go

నే వేయి సార్లు ప్రేమిస్తా
నా గుండేలోన feel ఉంది
నే కొత్త చరిత నే రాస్తా
నా love లో life ఉంది
నే కన్న కలను సాధిస్తా
నా లోన పచ్చి నిజం ఉంది
ఎద లోకి తొంగి చూసావా నువు వనికే తెగువుంది
ఓ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకే ప్రేమ
నువు దామ దామ దామ దామ దామ దారికే దామ
పగలే కలలను చూపించే వయసుకు పడిపోకమ్మా
నిజముగా నిన్నే ప్రేమించే హృదయాన్ని పోనివ్వకమ్మా

ఓ range love ఇది ఓ baby
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై ఏ కభీ
hey heart జోరుడి అబిబి ప్రేమను తాగే honey bee
thats why మేరా దిల్ చహ్తే హై సభీ

Love మంచు పూలు కురిపిస్తే
నువు మంటరేపి చంపొద్దు
Love చేయి కలుపుతానంటే
నువు చెలిమిని పెంచొద్దు
Love అమృతాన్ని తాగిస్తే
నువు చేదు విషం చిమ్మద్దు
Love పల్లవించు పాటైతే
తన గొంతును కోయద్దు
హే సైర సైర సైర సైర సైర ప్రేమకే సైర
నువు వేయిర వేయిర వేయివేయివేయిర పందమే వేయిర
ప్రేమికులంతా ఒకటైనా నిలవరు నాతో పోటీ
ఒకరికి ఒకరను ప్రేమలో ఏముంది లేరా gurantee
ఓ range love ఓ range love

ఓ range love ఇది ఓ baby
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై ఏ కభీ
hey heart జోరుడి అబిబి ప్రేమను తాగే honey bee
thats why మేరా దిల్ చహ్తే హై సభీ

mount ఎవరెస్టై (lets go) ఎదిగే love నీ
చేరాలంటే కావలిగ daring
macanas gold లా (lets go) తాగే love నీ
వుండాలంటే చేయాలిగ combing
కమ్మని కవితల కబురుల్లో
కనపడదమ్మో లవ్వు
నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు

ఓల ఓలాల అలా చూస్తూనే చాల

ఓల ఓలాల అలా చూస్తూనే చాల
ఇల నా కళ్ళు నిన్నే చుస్తుండాల
చాల lovely గా ఇలా రేపావు గోల
మదే sea లోనె surfing చేస్తుందిలా

Sydney నగరం చేసే నేరం
ఇన్నాల్లు నిన్ను దాచుంటుంది
సిగ్గే పడుతు తప్పే తెలిసి
ఈ రోజైన చూపించింది
This is the time to fall in love
fall in love o my move
welcome to my heart I am in love
I am in love you are my love

Sydney నగరం చేసే నేరం
ఇన్నాల్లు నిన్ను దాచుంటుంది
సిగ్గే పడుతు తప్పే తెలిసి
ఈ రోజైన చూపించింది
This is the time to fall in love
fall in love o my move
welcome to my heart I am in love
I am in love you are my love

ఓల ఓలాల అలా చూస్తూనే చాల
ఇల నా కళ్ళు నిన్నే చుస్తుండాల
చాల lovely గా ఇలా రేపావు గోల
మదే sea లోనె surfing చేస్తుందిలా

సాగర తీరాన ఉదయంలా
ఏదో తాజా ఉల్లాసమే
ఎంతో బాగుంది ఈ నిమిషం
tsunaami లా సంతోషమే
తెలుసుకున్నది కొంచమే
ఆ కొంచం లోనే ఎంతో నచ్చావే
కలుసుకోమని ఆత్రమే
ఓ లావ లాగ లో లో పొంగిందే
ఇవ్వాలే రాలే పాత బాదే నిన్ను చూడ నిన్ను చూడ

ఆ లేత అల్లర్లే లాగాయిలా
నేల వీడి పాదం అడిందిలా
ఆ ఏడు రంగుల్ని మార్చానిలా
నాలో తాజా ప్రేమే orange లా
అప్పుడే పుట్టిన పాప లా
నువు కొంత కాలం విచ్చినావుగా
ఇప్పుడే వచ్చిన శ్వాస లో
నువు చల్ల గాలి చల్లినావు గా
ఇవ్వాలే వాలే కొత్త హాయె నిన్ను చుడ

ఓల ఓలాల అలా చూస్తూనే చాల
ఇల నా కళ్ళు నిన్నే చుస్తుండాల
చాల lovely గా ఇలా రేపావు గోల
మదే sea లోనె surfing చేస్తుందిలా
Sydney నగరం చేసే నేరం
ఇన్నాల్లు నిన్ను దాచుంటుంది
సిగ్గే పడుతు తప్పే తెలిసి
ఈ రోజైన చూపించింది
This is the time to fall in love
fall in love o my move
welcome to my heart I am in love
I am in love you are my love

30 October 2010

మల్లె పూల వాన..

|ఆమె| మల్లె పూల వాన..
||ప|| |ఆమె|
మల్లె పూల వాన మల్లె పూల వాన
జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా…
|అతడు|
భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
|ఆమె|
మల్లె పూల వాన..
|అతడు|
జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
|ఆమె|
మల్లె పూల వాన.. వాన వాన వాన
|అతడు|
భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
దొరకును దొరకూనా ఎదురెవరుర మనకీ వేళలోన
|ఆమె| ||మల్లె పూల వాన ||
.
||చ|| |ఆమె|
ఓయమ్మా ఈ రోజున వద్దనకమ్మా ఏం చేసినా
నా పాదాలే పరుగులు తీసే గోదారి అలలవుతుంటే ఆగేనా ఎవ్వరాపినా
|ఖోరస్|
అష్ట సిరులు నిను ఇష్టపడెనురా కష్టపడితే జత కట్టవచ్చురా
|అతడు|
గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక
మహారాజులాగా వేశానుర కోటలో పాగా
పాచిక వేశాక పారక పోదురా నూరారు అయినా
|ఆమె| || మల్లె పూల వాన ||
.
||చ|| |ఆమె|
మబ్బుల్లో ఆ జాబిలి.. నా జత కోసం రావాలని
ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడే నా జళ్లో చేరాలని
|ఖోరస్|
ప్రేమ యాత్రలో పక్క దారులు ఎంత మాత్రము తప్పు కాదురా
|అతడు|
రథం నడుపుతారా మా మామను కూర్చోపెట్టి
ఎటెళ్లాలో చెబుతా కళ్లాలను చేత్తో పట్టి
అల్లుడినైపోగా చల్లగ నా కాళ్లు కడిగించుకోనా
|ఆమె| || మల్లె పూల వాన ||

కమ్మగ సాగే స్వరమో

||ప|| |అతడు1|
కమ్మగ సాగే స్వరమో || 2 ||
అల్లుడూ…
||ప|| |అతడు|
కమ్మగ సాగే స్వరమో || 2 ||
రమ్మని లాగే చెలిమో
అది ఎవరిదనీ మది అడిగినది
పద వెతకమని అటు తరిమినది
కథ ముదురు మదన మహిమో..
|అతడు1| అద్గదీ
|ఆమె| || కమ్మగ సాగే ||
|అతడు1| అద్గదీ
|ఇద్దరు|
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
.
||చ|| |అతడు|
తీయని వలపుల సాయం అడిగిన వయసు విన్నపమో
|ఆమె|
దాగని వలపుల రాగము పలికిన సొగసు సంబరమో
|అతడు1|
కంగారు కలల కలవరమో శృంగార కళల తొలివరమో
|ఆమె| ఏమో….ఓ ఓ ఓ…
|అతడు| ||కమ్మగ సాగే ||
|అతడు1| ..శభాష్!
|ఇద్దరు|
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
.
||చ|| |ఆమె|
తొందరపడమని ముందుకు నడిపిన చిలిపి స్వాగతమో
|అతడు|
కందిన పెదవుల విందుకు పిలిచిన చెలియ స్నేహితమో
|ఆమె|
పిల్లగాలి చేస్తున్న రాయబారమో పూల దారి వేస్తున్న ప్రేమ గానమో
|అతడు| ఏమో.. ఓ ఓ ఓ…
|ఆమె| కమ్మగ సాగే స్వరమో |అతడు| రమ్మని లాగే చెలిమో
|ఆమె| అది ఎవరిదనీ |అతడు| మది అడిగినది
|ఆమె| పద వెతకమని |అతడు| అటు తరిమినది
|ఇద్దరు| కథ ముదురు మదన మహిమో..
|అతడు1| బ్రహ్మాండం!
|ఇద్దరు|
కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
.

జింగిలాలో ఏం గింగిరాలో

||ప|| |అతడు|
జింగిలాలో ఏం గింగిరాలో
|ఆమె|
బొంగరాలో ఈ భాంగ్రాలో
|అతడు|
లెఫ్టు రైటు లేదులో పడుచు బాటలో
ఎర్ర లైటు వద్దురో కుర్ర జోరులో
|గ్రూప్|
చిన్నారి ఈ చకోరి చూపింది చిలిపి దారి
ఓరోరి బ్రహ్మచారి.. వదిలేస్తే వెరీ సారీ
|ఆమె|
పారాహుషారు పాటలందుకో
ఈ పరుగులో బ్రేకులెందుకో
|| జింగిలాలో ||
.
||చ|| |అతడు|
పాసుపోర్టు లేదు వీసాల గొడవ లేదు
వయసు దూసుకెళితే దేశాల హద్దులేదు
|గ్రూప్|
చాల్లేరా నెల్లూరే వెళ్లాలన్నా బస్ చార్జీ నిల్లేరా
ఇల్లాగే ఫారిన్ టూరు వెళ్లేది ఎలారా
|అతడు|
యు.ఎస్ ని ప్యారిస్ ని ఊహల్లో చూడరా
టెక్నికలర్ కలలు కనే టెక్నిక్ మనకుందిరా
|ఆమె|
ఆ నింగికి సైతం నిచ్చెన వేద్దాం మన ఆశకున్న హార్సు పవర్ చూపిద్దాం
ఏ ఎల్లలైన చెల్లవంటు చాటిద్దాం
|అతడు|
శాటిలైటు లాటిదిరా సాటిలేని యవ్వనం
పూట పూట వినోదాలు చూపించే సాధనం
|ఆమె|
జింగిలాలో ఏం గింగిరాలో
|అతడు|
బొంగరాలో ఈ భాంగ్రాలో
.
||చ|| |అతడు|
ఫిల్మ్ స్టారులంతా మనకేసి చూస్తున్నారు
మనం చూడకుంటే మరి ఎలా బతుకుతారు
|గ్రూప్|
చల్ చల్ రే… పాకెట్లో పైసాలతో పిక్చర్కే పోయొద్దాం
పోస్టర్లో పాపకి ఓ డ్రస్సు కొనిద్దాం
|అతడు|
తాపీగా కూర్చుంటే తోచదురా సోదరా
హ్యాపీగా ఎగరడమే మనమెరిగిన విద్యరా
|ఆమె|
ఆ గువ్వలమవుదాం.. రివ్వున పోదాం
మేఘాల మీద సంతకాలు చేసేద్దాం
ఓ వానవిల్లు కట్టి తిరిగి దిగి వద్దాం
|అతడు|
తుళ్లిపడే అల్లరితో గొల్లుమనే సంబరం
ఆకలనీ దాహమని ఆగదురా ఏ క్షణం
|| జింగిలాలో ||

హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల

||ప|| |అతడు|
హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల
|ఆమె|
పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల
|అతడు|
లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల
శుభలేఖలు రాసిన వేళ!
|| హాయ్ లైలా||
.
||చ|| |ఆమె|
ఎటు చూస్తున్నా శుభ శకునాలే కనపడుతున్నవి కదా
|అతడు|
ఎవరేమన్నా పెళ్లి మంత్రాలై వినపడుతున్నవి కదా
|ఆమె|
ప్రేమా గీమా చాలించేసి పెళ్లాడేసే వేళయ్యింది
|అతడు|
ప్రేయసి కాస్తా పెళ్లామయ్యే ఆ సుముహూర్తం వచ్చేసింది
|ఆమె|
కళ్యాణ వైభోగంతో కన్యాదానం కానీయబ్బాయి
|అతడు|
ఆ పైన నా ఓళ్లోనే కాలక్షేపం చెయ్యాలమ్మాయి… చిలకలా
|| హాయ్ లైలా||
.
||చ|| |అతడు|
వరుడిని నేనై పరిణయమాడే పిల్లకి పల్లకి తేనా
|ఆమె|
ఇదివరకెపుడు పరిచయమవని సిగ్గుకి దగ్గర కానా
|అతడు|
పిల్లామూక పరివారంతో చుట్టాలంతా వస్తారంట
|ఆమె|
చిన్నా పెద్దా సకుటుబంగా చుట్టూ చేరి చూస్తారంట
|అతడు|
ఓ గాలి డివ్వి డివ్వి డివ్విట్టంతో డోలూ సన్నాయి
|ఆమె|
మొగుడి వేషంలో నిన్నే చూసి నవ్వేస్తానోయి… కిల కిలా
|| హాయ్ లైలా||

విన్నపాలు వినమనీ వచ్చెనయ్య అన్నమయ్య

||ప|| |ఆమె|
విన్నపాలు వినమనీ వచ్చెనయ్య అన్నమయ్య
పన్నగపు తెరతీయ వెన్నునితో చెప్పవయ్య
|అతడు|
ఏం.. అన్నమయ్య ఆయన పాటల్లో ఆడుకోలేడా
చెప్పటానికి నేనెవరిని
|ఆమె|
ఆ పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
ఆ మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా
|ఖోరస్| || ఆ పాటల్లో ||
|ఆమె| హరినే |ఖోరస్| ఆహా
|ఆమె| కొలిచా |ఖోరస్| ఆహా
|ఆమె|
నిను పిలిచే వేళల్లో
|ఆమె| సిరినే |ఖోరస్| ఆహా
|ఆమె| చూశా |ఖోరస్| ఆహా
|ఆమె|
నీ నవ్వుల వెలుగుల్లో నీవే
|ఖోరస్| సత్యం శివం సుందరం
|ఆమె| || ఆ పాటల్లో ||
.
||చ|| |ఆమె|
సూరిడువీ నీవే మము మేలుకొలుపు వేళ
|ఖోరస్|
సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|ఆమె|
సందమామ నీవే మా జోల పాడు వేళ
|ఖోరస్|
సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|ఖోరస్| || సూరిడువీ ||
|ఆమె|
అన్నా అనాలా మాకు నువ్వే అన్నీ అనాలా
|ఆమె|
పసిపాప పలుకులా పరమాత్మ ఉనికిలా
చలువ చెలిమి చిలికినావు నీవే
సత్యం శివం సుందరం
|ఖోరస్ & ఆమె |
మా పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
మా మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా
.
||చ|| |ఆమె|
అమ్మతనము నీది మా ఆకలి తీర్చేవేళ
|ఖోరస్|
సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|అతడు|
నాన్న గుణము నీది మా అల్లరి ఆపేవేళా
|ఖోరస్|
సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|అతడు|
అమ్మతనము నాదా మీ ఆకలి తీర్చేవేళా
నాన్న గుణము నాదా మీ అల్లరి ఆపేవేళా
|ఆమె|
ఏ చుట్టరికం లేదే.. చుట్టుపక్కలా
ఏ మంత్రం వేసి మమ్ము చుట్టేశావిలా
|అతడు|
అమ్మమ్మమ్మ చాలమ్మా అమ్మమ్మమ్మ ఆపమ్మా
అన్నెమెరుగను పున్నెమెరుగను అమ్మా చూడు ఈ బూ..గోల
అయ్యయ్యయ్యో అయ్యో..
|అతడు|
ఏదేదో అంటున్నారు..కాదని చెప్పవేలా
అలా ఇలా ఎలా అన్నా కర్తవు నువ్వేగా..నా వెనకాల
|ఆమె|
చాల్లే ఊరుకోరా.. మధ్యలో నేనెవరిని
|అతడు|
నా పాటల్లో రాగాలన్నీ నువ్వేనమ్మా
నా మాటల్లో భావాలన్నీ నువ్వేనమ్మ
|అతడు| హరినే |ఖోరస్| ఆహా
|అతడు| కొలిచా |ఖోరస్| ఆహా
|అతడు| నిను పిలిచే వేళల్లో
|అతడు| సిరినే |ఖోరస్| ఆహా
|అతడు| చూశా |ఖోరస్| ఆహా
|అతడు| నీ నవ్వుల వెలుగుల్లో నీవే
|అందరు|
సత్యం శివం సుందరం
మా పాటల్లో రాగాలన్నీ నువ్వేనమ్మా
మా మాటల్లో భావాలన్నీ నువ్వేనమ్మా

వసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని మాట

||ప|| |ఆమె|
వసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని మాట
తేటినెలా స్వాగతించెనంట మదిలోన మధువు నింపుకున్న తోట
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ…
|అతడు| ఇదేనా నే నేర్పింది
|అతడు| తెలుసుకో |ఆమె| తెలుసుకో
|అతడు| తెలుసుకో |ఆమె| తెలుసుకో
|అతడు| ఓ వనమాలి…
|ఆమె|
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ ||2||
ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే రాయబారమేదో చేయ రావే ఓ చిరుగాలి
|ఇద్దరు|
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ ||2|| ఓ వనమాలీ
.
||చ|| |ఆమె|
మంగ మనసు లోగిలికి నీలి కళ్లే వాకిలి… ఆ… ||2||
|అతడు|
దాగని తలపులతో అవి తెలుపవ స్నేహాంజలి… ||2||
|ఆమె|
ఎరుపెక్కిన చెక్కిలిపై అదురుతున్న పెదవులపై
భాష లేని ప్రేమలేఖ రాసుకున్న వేళ
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ ||2|| ఓ వనమాలీ
.
||చ|| |ఆమె1|
కొత్త టైపు మ్యూసిక్కుల్లో మత్తు రేపే మాజిక్కుంది హొయ్యా…హా..ఆ.
కుర్రకాలం కవ్విస్తుంది… కొంటెమేళం కావాలంది..సయ్యా..హా..ఆ
ఆడే న్యూ స్వింగ్తో… పాడే పాప్ సాంగ్తో… భూగోళం ఊగాలి..హొయ్యా… ||కొత్త ||
నాది జనమంతా మెచ్చే నాట్యం
|అతడు|
కాదే అది నడుముని విరిచే పైత్యం
|ఆమె1|
నాలా మెరుపల్లే నువ్వు బ్రేక్ చెయ్
|అతడు|
హే బాలా నీ తికమక పరుగుకు బ్రేక్ వెయ్
|ఆమె1| నీ చురుకెంత? |అతడు| ఆ మెరుపెంత
|ఆమె1| ఏది వెయ్ చూస్తా? |అతడు| చిటికెయ్ చెప్తా
||నీ చురుకెంత||
|అతడు|
తక్కిట తక…
శృతిలయలకు సరిపడ గల జతులివి
తెలుసుకో.. తెలుసుకో.. ఓ వనమాలీ ||2|| ఓ వనమాలీ
|అతడు|
ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే రాయబారమేదో చేయ రావే ఓ చిరుగాలి
|ఇద్దరు|
తెలుసుకో.. తెలుసుకో.. ఓ వనమాలీ ||2|| ఓ వనమాలీ

నవ్వులో పుట్టాను… నవ్వులో పెరిగాను

||ప|| |అతడు|
నవ్వులో పుట్టాను… నవ్వులో పెరిగాను
నవ్వులో పుట్టాను… నవ్వులో పెరిగాను
నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు || నవ్వులో ||
నవ్వులాటకైనా వాడనీకు నవ్వు
నవ్వు తోడు నీకుంటే ఓడిపోవు నువ్వు
నవ్వులాంటి మందేది లేనే లేదంటూ
నాతో మళ్లి మళ్లి చెప్పింది నవ్వే నువ్వు పువ్వే
నువ్వై నవ్వే పువ్వై నువ్వు నవ్వు || నవ్వులో ||
నవ్వులో పుట్టాను…నవ్వులో పెరిగాను
నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు
.
||చ|| |అతడు|
కుకుకుకుకు… కోకిల నువ్వు… |ఖోరస్| కుకుకుకుకు
|అతడు|
గలగలగలగల తరగల నవ్వు
చిగురాకులు నవ్వు.. చిరుగాలులు నవ్వు.. || 2 ||
నవ్వుతూ నువ్వుంటే ఆ చుక్కలు
ఈ దిక్కులు ఎంచక్కా నీతో నవ్వు నువ్వు నవ్వు || నవ్వులో ||
|అతడు| నవ్వులో |ఆమె| పుట్టాను…
|అతడు| నవ్వులో |ఆమె| పెరిగాను
|అతడు| నవ్వుతూ |ఆమె| ఉన్నాను
|అతడు| నువ్వు |ఆమె| నవ్వు
.
||చ|| |అతడు|
ఇది ఓటరు ముందు చేతులు కట్టే నేతల వంకర నవ్వు… హి..హీ.. నమస్కారం
ఇది పదవి దక్కితే పరాకు ఫోజుల పాలిటిక్స్ నవ్వు అ అ..ఆ.. ఎవరూ..
ఇది స్టారు తిరిగి స్టారైపోయిన ఎక్స్ట్రా గారి నవ్వు హాఇ..హహహా.. యా
ఇది ఏజి ముదిరినా రాజీపడని పాతపార నవ్వు ఉండండి అబ్బా..
ఇది బాసు గారు జోకేస్తే బాసు గారి నవ్వు… హయ్యో..అబ్బో..
ఇది ఊసుపోకపోతే ఉత్తి సోడా గ్యాసు నవ్వు అహ్హ…
ఇది చక్కిలిగింతలే సరిగమలయ్యే సంగీతం నవ్వు.
హ…హ…హ……

అంతా రండోయ్ రండి తందనాలకి

అంతా రండోయ్ రండి తందనాలకి
సంతోషాలే తెండి ముందు నాళ్లకి
|| అంతా ||

గుండె లయలో గంగ అలలే చెంగుమను వేళా
కొత్త శృతిలో అష్ట దిశలు గొంతు కలిపేలా
తకిట తక తకిట తకిట తక తాళమే వేయగా.. శివ తాండవం చేయగా

తాళమే వేయగా.. శివ తాండవం చేయగా
|| అంతా ||


కవ్వించిన కాలం కలిసొచ్చిన వైనం
కోలాటం వేస్తూ చేశే కోలాహలాన

కేరింతల మేళం.. ఎలుగెత్తిన గానం
ఊరంతా హోరెత్తించే ఈ రోజునా

కోదండ రామయ్య కళ్యాణమో

గోపాల కృష్ణయ్య జన్మాష్టమో
అన్ని పండుగలలో |ఖోరస్| కళలు కలిపి
వెయ్యి వేణువులలో |ఖోరస్| స్వరములొలికి

సుందర స్వప్నము కన్నుల ముందర నిలిచి పిలిచెనిదిగో
|| అంతా ||


ఎన్నో తిరనాళ్లు తిరిగొచ్చినవాళ్లు
ఏనాడు చూసి ఉండరు ఈ సంబరాలు

వెన్నెల కెరటాలు ఎగసే సంద్రాలు
ఆ నింగీ నేలా కలిపే ఈ నవ్వులూ..

శ్రీవాణి కొలువైన ఈ కోవెల

సింగారమయ్యింది ఇదిగో ఇలా
మదిని మేలుకొలిపే |ఖోరస్| తెలుగు కొరకు
మనిషి మేలు తెలిపే |ఖోరస్| తెలివి కొరకు

చదువుల తల్లికి సేవలు చెయ్యగ తగిన తరుణమిదిగో
||అంతా||

అడగకండి ఎవరూ

అడగకండి ఎవరూ
అడగకండి ఎవరూ, ఎవరూ ఎవరూ నువ్వెవరనీ ||2 ||
అడగకండి ఎవరూ
పుట్టుక లేని ఆ దేవుణ్ణి
పుట్టుక తెలియని ఈ జీవుణ్ణి
||అడగకండి||


చెంతనున్నదేదో చెయి జారిందని ఒకరు
కోరిక ఏదో తీరక కుమిలి కుమిలి ఒకరు
తోడు దూరమయ్యిందని గోడుమంటు ఒకరు
చావు వచ్చి ఒకరు పోతె బావురంటు ఇంకొకరు
రకరకాల శోకం చూస్తున్నా గాని
ఒకసారైనా నయనం చెమ్మగిల్లదేమి

కంటి నీటిలో ఉప్పదనం తెలియాలంటే ముందు ||2 ||
కమ్మని అమృతమంటి ప్రేమనూ చవి చూడటమే మందు

గాలికి తిరిగి ధూళికి పెరిగిన ఒంటరి వాడిని
ఒంటరి వాడిని నే ఒంటరి వాడిని
ప్రేమను పొంది ప్రేమించేందుకు ఎవరున్నారనీ
ఎవరున్నారనీ నాకెవరున్నారనీ

ఎందుకు అనుకుంటావయ్యా నీ కెవరూ లేరనీ
అందాకా అనుకోవయ్యా నీకన్నీ నేననీ
ఎందుకు అనుకుంటావయ్యా నీ కెవరూ లేరనీ
అందాకా అనుకోవయ్యా నీకన్నీ నేననీ


నీ వేలి కొనలు నేను అలా తాకుతుంటే
నా గుండె లో వీణలు మ్రోగినట్టు ఉంది

అదే సుమా ప్రేమ

నీ నీలి కనులలోకి తొంగి చూస్తూ ఉంటే
ఆకాశం నా కోసం దిగి వస్తూ ఉంది

అదే సుమా ప్రేమ

కదిలీ కదలని పెదవుల మౌనం వింటుంటే
కధలెన్నో నువు నాకు చెబుతున్నట్టు ఉంది

అదే సుమా ప్రేమ

నువ్వు పెంచిన మల్లెకొమ్మ మంచు బొట్టుగా ఏడ్చేనమ్మా
వెళ్లి పోకమ్మా నన్ను వదిలి పోకమ్మా
నువ్వు నడిచిన లోగిలమ్మా అణు వణువూ తడిసెనమ్మా
వెళ్లి పోకమ్మా నన్ను వదిలి పోకమ్మా
లోకమంతా వాన ముంతే
లోకమంతా వాన ముంతే చూపినాదమ్మా
నా చూపులో చెమ్మా చూపు లో చెమ్మా
||అడగకండి||

యవ్వనవీణా! పువ్వులవానా!

యవ్వనవీణా! పువ్వులవానా!
నువ్వెవరే నా మదిలొ చేరిన మైనా
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లనా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా! ||2||
||యవ్వన||


నువ్వంటు పుట్టినట్టు నాకొరకు ఆచూకి అందలేదు ఇంతవరకు
వచ్చింది కాని ఈడు ఒంటి వరకు వేధించలేదు నన్ను జంట కొరకు
చూశాక ఒక్కసారి ఇంతవెలుగు నావంక రాను అంది కంటికునుకు
ఈ అల్లరీ ఈ గారడీ నీ లీల అనుకోనా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా!
||యవ్వన||


ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా నీ లేత నడుమే అనుకున్నా!
ఏ గువ్వ కిలకిల వినపడినా నీ నవ్వులేనని వెళుతున్నా!
మేఘాల మెరుపులు కనపడినా ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో ఆ పొంగులో నీ రూపె చూస్తున్నా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా!
||యవ్వన||

24 October 2010

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యమురాయగా

అడవిలోపల పక్షినైతే అతివసీతను కాచనా
అందువలన రామచంద్రుని అమితకరుణను నోచనా
కడలి గట్టున ఉడతనైతే ఉడత సాయము చేయనా
కాలమెల్లా రామభద్రుని వేలిగురుతులు మోయనా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యమురాయగా

కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ
గడ్డిపోచను శరముచేసె ఘనత రాముడు చూపగా
మహిని అల్ప జీవులే ఈ మహిమ లన్నీ నోచగా
మనిషినై జన్మించినానే మచ్చరమ్ములు రేపగా
మద మచ్చరమ్ములు రేపగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యకావ్యమురాయగా

20 October 2010

ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే

ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడేప్రియాఊ
ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే

వలదన్న వినదీ మనసుకలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసుకలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలేఅది నీకు మునుపే తెలుసు
ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే

నను కోరి చేరిన బేలా దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా
ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే

దివి మల్లెపందిరి వేసేభువి పెళ్లిపీటలు వేసే
నెరవెన్నెల కురిపించుచూనెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే

10 October 2010

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అక్కడ చూడు తాడి చెట్టుంది
ఆకులు ఊపి టాటా చెబుతుంది
జాబిలి ఎందుకు వెంటే వస్తుంది
నీ పైన మనసై ఉంటుంది
పైకి కిందికి ఊగే నేల ఏమంది
నువ్వు ఊ అంటేనే ఊయలవుతానంది
మీదెకి వచ్చే గాలె మనుకుంటుంది
నీ ఉసులు మోయాలంటుందీ

అమ్మాయి గుమ్మం దెగ్గర నుంచుంది
గుమ్మంలోంచెం కనబడుతుంది
గంటక్కి ఎనభై మైళ్ళ వేగంతోటి
ఏవేవో ఆలోచిస్తుంది

ఊహించని మజిలీ వచ్చింది
నాలో ఊహల్ని మలుపులు తిప్పింది
ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని
ఇట్టేనా ముందర ఉంచింది
చల్లని చీకటి చుట్టు కమ్ముకు వస్తుందీ
వెచ్చని చలిమంటకి ఆ చీకటి కరిగిందీ
నిదురలోనె కవ్వించె కల కన్నా
నిజమెంతో అందంగా ఉందీ

అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటకి తొంబై మైళ్ళ వేగంతోటి
కునుకొచ్చి వాలిపోయింది

04 October 2010

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామ స్వర్ణోత్సవాలు చేద్దామా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామ స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామ దానికి సలాము చేద్దామా
శాంతికపోతపు కొత్తుక తెంచి తెచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మ ఓ పవిత్ర భారతమా

కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి తగువుకి లేస్తారె
జనాలు తలలర్పిస్తారె
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకు తనం లో
ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరె తెలిసి భుజం కలిపి రారె
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుర సింధూరం జవాబు చెప్పే భాద్యత మరచిన
జనాల భారతమ ఓ అనాధ భారతమ

అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూరమ్రుగంల దాక్కుని ఉండాల
వెలుగుని తప్పుకు తిరగాల
శత్రువుతో పోరడే సైన్యం
శాంతి ని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణిచే విధిలో
సవాలూ చెయ్యాల అన్నల చేతిలో చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ
సంఘం శిలల నిలుచుంటే నడిచే శవంలా సిగలో
తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్య సింధూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మ
గతి తోచని భారతమ

తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే
వదులుకొని తనలో భీతిని తన అవినీతిని
తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాశిస్తుందట అధికారం
క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం
చూస్తూ ఇంక నిదురిస్తావ విశాల భారతమ ఓ విషాధ భారతమ

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చి పెట్టించి పేచీ
అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చి పెట్టించి పేచీ
బావరో బావొచ్చి తినిపించవా మిర్చి
వాయనాలు తెచ్చి వడ్డించు వార్చి
ముప్పుట ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి
మేళాలు తెప్పించి ఈ ఊరంతా తిప్పించి
కోల దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ
కోరుకున్ననమ్మ కోయంటే పలికాడమ్మ
కోలు కోలోయమ్మ కోలు కోలోయమ్మ
డోలు డోలోయమ్మ ఢండోలుయమ్మ

పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మనా
కోలు కోలోయమ్మ కోలు కోల్యమ్మ
మల్లెపూలు చూస్తుంటే మండి పడుతున్నా
డోలు డోలోయమ్మ ఢండోలోయమ్మ
పిల్ల గాలి వీస్తుంటే చాలు పొమ్మన్నా
మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా
ఏ రోజుకు ఆ రోజు నా మోజులెన్నో మరుగుతున్నాయిలే
ఈ రోజు నా రాజులో సెగలు ఎన్నొ రగులుతున్నాయిలే

ఒక్క చిక్కి నడుమేదో బావురుమంటుంటే
కోలు కోలోయమ్మ కోలు కోలోయమ్మ
అందమంతా అచ్చొచ్చి చిచ్చే పెడుతుంటే
డోలు డోలోయమ్మ ఢండోలోయమ్మ
ఒక్క చిక్కి నడుమేదో బావురుమంటుంటే
అందమంతా అచ్చొచ్చి చిచ్చే పెడూంటే
ఏ పూటకాపూట నీ పాట నాదై పలకరించాలిలే
ఈ పూట నీ పైట ఆ చోట మాదే వినను అన్నాదిలే

అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ

అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమే ఫలిస్తున్నదీ
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నదీ
ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది

ప్రతి జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ
అనే నమ్మి నీ పేరే జపించానులేమ్మా
అదే పాట నా దాక ఏలా చేరనమ్మా
ప్రతీ బాట నా వైపే నిన్నే పంపెనమ్మా
నిరంతరం నీ వూసేదో నను రమ్మన్నదీ
ప్రతి క్షణం నీ ధ్యాసేగా కలవరించి వరించి రప్పించుకున్నది

అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా
తుఫానంటి ఈ వేగం నువ్విచింది కాదా
వెలేవేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం
ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం
రహస్య రాజ్యం చేరే జత కధే ఇది
సుఖల తీరం కోరే మన ప్రయాణమివాళ ఫలించు క్షణమిది

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరి
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరి
శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధ గాత్రి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
చతుర్బాహు సమ్రక్షిత శిక్షిత చతుర్బశాంతర భువన పాలిని
కుంకుమ రాగ శోభిని కుసుమ బాణ సన్శోభిని
మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవీ

శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీపీట సంవర్ధిని ఢోలాసుర మర్ధిని
శ్రీపీట సంవర్ధిని ఢోలాసుర మర్ధిని
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి
సకలభోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ

ఇందువదనే కుందరదనే వీణాపుస్తక ధారినే
ఇందువదనే కుందరదనే వీణాపుస్తక ధారినే
శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే
శుకశౌనకాది వ్యాసవాల్మీకి మునిజన పూజిత శుభచరణే
సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే
సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే
వరదే అక్షర రూపిణే శారదే దేవీ

వింధ్యాచవీ వాసినే యోగసంధ్యా సముద్భాసినే
సిమ్హాస నస్తాయినే దుష్టపరరమ్హక్రియా శాలినే
విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే
హే బ్రహ్మచారిణె దుష్కర్మవారిణె
హే విలంబిత కేశ పాశినే
మహిష మర్దన శీల మహిత గర్జన లోల
భయత నర్తన కేళికే కాళికే
దుర్గమాగమదుర్గ వాసినే దుర్గే దేవీ

ఇది నాదని అది నీదని

ఇది నాదని అది నీదని
ఇది నాదని అది నీదని
చెప్పలేనిది ఒక్కట్టి ఈ ఒక్కట్టి
ఏమది ?
అది ఇది అని చెప్పలేనిది
ఆ చెప్పలేనిది ఏమది ?
అది మనసున పుట్టి మమతల పెరిగి
మనువై పూచేది
అది ఇది అని చెప్పలేనిది
అది ఇది అని చెప్పలేనిది

వెన్నెలమ్మ రాతిరిగా
వేకువమ్మ పొద్దుటిగా
కోకిలమ్మ ఆమనిగా
ఏ పూవ్వు పులకరింత
ఈ పడక పలకరింత
ఈ పూవ్వు పులకరింత
ఈ పడక పలకరింత
ఈ జన్మకు చాలనంత
పరవశమంతా మనదే మన ఇద్దరిదే
పదే పదే వినిపించే ప్రియ దేవుడి అష్టపదే
అది ఇది అని చెప్పలేనిది
అది ఇది అని చెప్పలేనిది

ముగ్గిట వలపుల ముంగిటా
వయసు ముగ్గు వేయనా
నిగ్గులు పొంగిన చెక్కిటా
సిగ్గుల యెరుపులు తాకనా
వయ్యారంగా పార్వతి శౄంగారంగా శ్రీయపతి
ఓంకారంగా కలిసి ఏకాక్షరమై మురిసే
పరవశమంతా మనదే మన ఒక్కరిదే
ఎదా ఎదా కలిపేసే ఇహపరాల ఇష్టపదే
అది ఇది అని చెప్పలేనిది

03 October 2010

కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి

కుకు కుకు కుకు కుకు
కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి
చిగురాకులు తోరణలు చిరుగాలి సన్నాయి
డుడు డుడు డుడు డుడు
వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడి
పూలన్ని తలంబ్రాలు పున్నమి తొలిరేయి

తుళ్ళి తుళ్ళి నిన్న మొన్న తునీగల్లె ఎగిరిన
పిల్లగాలి కొచ్చింది కళా పేళ్ళి కళా
తలపులన్ని వలపులైన సోకులు విరిచూపులైన
పెళ్ళికొడుకు నవ్వితే తళా తళ తళా
పూలగాలితో రేగిన పుత్తడి పారాణి గా
చిలక పాటా నెమలి ఆటా కలిసి మేజువాణిగా
పూలగాలితో రేగిన పుత్తడి పారాణి గా
చిలక పాటా నెమలి ఆటా కలిసి మేజువాణిగా
అందమైన పెళ్ళికి అందరు పేరంటాలే
అడవి లోని వాగులన్ని ఆనందపు కెరటాలై

కన్ను కన్ను కలుపుకున్న కన్నె మనసు తెలుసుకున్న
కనుల నీలి నీడలే కద ప్రేమ కదా
బుగ్గలల్లో నిగ్గు తీసి సిగ్గులల్లో చిలకరించు
మూగ వలపు విచ్చితే కద పెళ్ళి కదా
చిరు మనసుల ఒకటనువై
ఇరుతనువులకు ఒకమనువై
మనసులోని వలపుల్లని మల్లెలా విరిపానుపులై
చిరు మనసుల ఒకటనువై
ఇరుతనువులకు ఒకమనువై
మనసులోని వలపుల్లని మల్లెలా విరిపానుపులై
కలిసివున్న నూరేళ్ళు కలలు కన్న వెయ్యేల్లు
మూడు ముళ్ళు పడిననాడు ఎదలొ పూల పొదరిల్లు

నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది

నీలో ఏముందో ఏమో
మనసు నిన్నే వలచింది
సొగసులన్నీ కోరింది
నీలో ఏముందో ఏమో
మనసు నిన్నే వలచింది
సొగసులన్నీ ఇమ్మంది

నీ కాటుక కన్నులలో
చీకటి గుసగుసలు
నీ కమ్మని నవ్వులలో
వెన్నెల మిసమిసలు
నీ ఎదలో పూల పొదలే పూచి
మధువులు చిందాయి
నా మమతలు పెంచాయి

నీ అల్లరి చూపులకే
వళ్ళంతా గిలిగింత
నీ తుంటరి చేష్టలకే
మదిలో పులకింత
నీ వంపులలోనా సొంపులలోనా
వలకును వయ్యారం
అది వలపుల జలపాతం

నీ పరువం చూడనిచో
పొద్దే పోదుకదా
నీ పలుకులు వినకుంటే
నిదురే రాదుకదా
నీ సరసన లేని నిముషం కూడ
ఏదో వెలితిసుమా ఇక నీవే నేను సుమా

నీ దయ రాదా రామా నీ దయ రాదా

నీ దయ రాదా రామా నీ దయ రాదా
నీ దయ రాదా నీ దయ రాదా రా మా

కాదనే వారెవరు
కాదనే వారెవరు కళ్యాణ రామా
కాదనే వారెవరు కళ్యాణ రామా
నీ దయ రాదా నీ ద య రాదా నీ దయ రాదా రా మా

నన్ను బ్రోచెవాడవని నాడే తెలియ ఇనవంశతిలకా ఆఅ ఆ
ఇనవన్శతిలకా ఇంత తామసమా
నీ దయ రాదా రా మా

రామ రామ రామ రామ త్యాగరాజ హృత్సదన
నామది తల్లడిల్లగా న్యాయమా రామా వేగమే
నీ దయ రాదా నీ దయ రాదా
నీ దయ రాదా నీ ద య రాదా రా మా

ఒకసారి ఆగుమా ఓ చందమామ

ఒకసారి ఆగుమా
ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా

నీలి మబ్బుల తెర చాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
నీలి మబ్బుల తెర చాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
యెందుకో కనలేవు సూటిగ
యెందుకో కనలేవు సూటిగ
యెదలోన నీవైన సోధించుకొమ్మా

పరుల సొమ్మును హరియించు వాడే
పగటి పోతను ఇల వీడలేదొయ్
పరుల సొమ్మును హరియించు వాడే
పగటి పోతను ఇల వీడలేదొయ్
మంచి గా మనవోయి జాబిలి
మంచి గా మనవోయి జాబిలి
మలినమ్ము లికనైన తొలగించుకొమ్మా

ఎవరి కోసం ఎందుకోసం ఎవరి కోసం ఎందుకోసం

ఎవరి కోసం ఎందుకోసం ఎవరి కోసం ఎందుకోసం
ఈ వేదన రోదనలూ ఈ నిరాశ నిస్పృహలూ కన్నీటి జీవితాలూ
ఎంతకాలం ఇంకెంత కాలం
చెమటను ధారలు కట్టీ చేలు చెలుక తడిపినాము
పాదుపాదులోన మనం ప్రాణాలను నాటినాము
కంటికి రెప్పేయకుండ పంటను కాపాడినాము
కంటికి రెప్పేయకుండ పంటను కాపాడినాము
బురద నుండి బువ్వ తీసి ఆకలితో చచ్చినామూ
ఎవరి కోసం ఎందుకోసం ఎవరి కోసం ఎందుకోసం

ఎన్నాళ్ళు ఈ బాధలు ఏడుపింక మనకొద్దూ
గడ్డిపోచలన్ని కలిసి గజమును బంధించినట్టూ
చీమలన్ని ఏకమై పెను పామును చంపినట్టూ
వాన చినుకలన్ని కలిసి వాగులై పొంగినట్టు
వాన చినుకలన్ని కలిసి వాగులై పొంగినట్టు
కూలినాలి పేక కడితె కూలవా దోపిడి దొంగలు కట్టిన కోటలూ
కూలినాలి పేక కడితె కూలవా దోపిడి దొంగలు కట్టిన కోటలూ

భూమి కోసం విముక్తి కోసం భూమి కోసం విముక్తి కోసం
ఈ రణ నినాదం సాగించే ఈ సమరం పారించే ఈ రుధిరం
భూమి కోసం విముక్తి కోసం

కను గుడ్లను పీకినా కాలు చేయి నరికినా
దొంగ కేసు బనాయించి జైల్లలొ పడదోసినా
ఉరికొయ్యల పాల్జేసినా ఎన్‌కౌంటరులో చంపినా
ఉరికొయ్యల పాల్జేసినా ఎన్‌కౌంటరులో చంపినా
ఎత్తిన జెండను ఎన్నడు దించమూ పోరుబాట ఏనాడూ వదలమూ
ఎత్తిన జెండను ఎన్నడు దించమూ పోరుబాట ఏనాడూ వదలమూ

భూమి కోసం విముక్తి కోసం భూమి కోసం విముక్తి కోసం
ఈ రణ నినాదం సాగించే ఈ సమరం పారించే ఈ రుధిరం
భూమి కోసం విముక్తి కోసం భూమి కోసం విముక్తి కోసం

ఓరిబాబోయ్ చూడచక్కని మోడలొచ్చింది

ఓరిబాబోయ్ చూడచక్కని మోడలొచ్చింది
ఊరువాడ హోలుమొత్తం ఫీవరొచ్చింది
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
ఓరిబాబోయ్ చూడచక్కని మోడలొచ్చింది
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
కిర్రెక్కించ్చింది యమ వెర్రెక్కిచ్చింది
ఏపుషేపు చూపి మతిపోగొట్టేసింది
థర్టీసిక్స్ ట్వెంటిఫోరు థర్టీసిక్స్ ఫర్ఫెక్టురయ్యో
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
ఓరిబాబోయ్ చూడచక్కని మోడలొచ్చింది
ఊరువాడ హోలుమొత్తం ఫీవరొచ్చింది

బావమరిది అట్టాచూస్తే తప్పురా
నా చెలి నీ చెల్లి కాదా చెప్పరా
లింకులు పెట్టకు చంపేస్తాను రేయ్
లైనేసేందుకు లైసెన్సేందిరోయ్
అబ్బాయిలు పాపకోసమని బీటులట్టుకొని ఫైటుచెయ్యకండోయ్
ఈ దంతపు బొమ్మ నా ఒక్కడి సొత్తే అవుతుందండోయ్
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో

ఓరిబాబోయ్ చూడచక్కని మోడలొచ్చింది
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో

గ్రేటుగా చూస్తుంటే థ్రిల్లేముందిరా
టేస్టుకి కిస్ ఒకటిస్తుందేమోరా
స్ట్రైటుగా అడిగితే తంతుందేమోరా
సేఫుగా బీటుకొట్టి లొట్టలేద్దాంరా
అడిగేటందుకే హడలేవాడికి ప్రేమలెందుకురా బేటా
జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా అని వినలేదా ఆ పాట
చెంప పగలనీ కొంప మునగనీ అటో ఇటో నే తెగించి చూస్తా
నో అంటే డాం అని చస్తా..
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో

ఓరిబాబోయ్ చూడచక్కని మోడలొచ్చింది
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
ఊరువాడ హోలుమొత్తం ఫీవరొచ్చింది
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
కిర్రెక్కించ్చింది యమ వెర్రెక్కిచ్చింది
ఏపుషేపు చూపి మతిపోగొట్టేసింది
థర్టీసిక్స్ ట్వెంటిఫోరు థర్టీసిక్స్ ఫర్ఫెక్టురయ్యో
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో

సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా

సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారిగ మారి మదిది నాటు విరిశరమా
సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారిగ మారి మదిది నాటు విరిశరమా
సొగసు చూడ తరమా

కులుకే సుప్రభాతాలై కునుకే స్వప్నగీతాలై
ఉషా కిరణమూనిశా తరుణమూ
కలిసె కలికి మేనిగారతికాంతుని కొలువుగా
వెలిసే చెలి చిన్నెలలో
సొగసు చూడ తరమా

పలుకా చ్హైత్రరాగాలే అలకా గ్రీష్మతాపాలే
మదే కరిగితే అదే మధుఝరీ
చురుకు వరద గౌతమీ చెలిమి శరత్ పౌర్ణమీ
అతివే అన్ని ఋతువులయ్యే

సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా
మరుని నారి నారిగ మారి మదిది నాటు విరిశరమా
సొగసు చూడ తరమానీ సొగసు చూడ తరమా
మరుని నారి నారిగ మారి మదిది నాటు విరిశరమా
సొగసు చూడ తరమా

పన్లు కట్టిపెట్టు పెళ్ళామా

పన్లు కట్టిపెట్టు పెళ్ళామా
పతిని కాస్త చూసి వెళ్ళుమా
హ్యాపీగా లైఫే ఎంజాయ్ చెయ్
డే అండ్ నైట్ తేడా చెరిపేసెయ్
What a thrill wondeful
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునులేరన్నో చిన్నన్నా
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునులేరన్నో చిన్నన్నా
పన్లు కట్టిపెట్టు పెళ్ళామా
పతిని కాస్త చూసి వెళ్ళుమా

వేర్ ఆర్ యు మై డియర్
బాత్రూంలో ప్రెజెంట్ సార్
నేను వస్తా తీసెయ్ డోరు
వస్తే తంతా మూసెయ్ నోరు
సరసంగా సరిగంగా స్నానాలు చేద్దాంలే
సాయంత్రం ఆ సంగతేదో చూద్దాంలే
కుక్కరేమో కూతవేసే పోయిదాని ప్రెషరు దించవా

పన్లు కట్టిపెట్టు పెళ్ళామా
పతిని కాస్త చూసి వెళ్ళుమా

కావాలే కిస్సులు
టైం లేదోయ్ మిస్టరు
వచ్చేసిందే అయ్యొ అయ్యొ అయ్యొ బెడ్రూం మూడు
ఆఫీస్ లేదా అబ్బాయిగారు
నువ్వుంటే ఆఫీసుగీఫీసు జాంతానై నై నై
బాసంటే భయమైనా లేదా బుజ్జబ్బాయ్
ముచ్చటైన భార్యకంటె బాసుగీసు ఇంక ఎవ్వరు

పన్లు కట్టిపెట్టు పెళ్ళామా
పతిని కాస్త చూసి వెళ్ళుమా
హ్యాపీగా లైఫే ఎంజాయ్ చెయ్
డే అండ్ నైట్ తేడా చెరిపేసెయ్
What a thrill wondeful
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునులేరన్నో చిన్నన్నా
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునులేరన్నో చిన్నన్నా

సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా

సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
పొత్తిళ్ళలో చిట్టి పుత్తడిబొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మ బ్రహ్మ
సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా

కుహుకుహూ కూసే కోయిలా ఏదీ పలకవే ఈ చిన్నారిలా
మిలమిలా మెరిసే వెన్నెలా ఏదీ నవ్వవే ఈ బుజ్జాయిలా
అందాల పూదోటకన్నా చిందాడు పసివాడే మిన్న
బుడత అడుగులే నడిచేటి వేళలో
పుడమితల్లికెన్ని పులకలో

సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా

గలగలా వీచే గాలిలా సాగే పసితనం తియ్యని ఒక వరం
ఎదిగిన ఎదలో ఎప్పుడూ నిధిలా దాచుకో ఈ చిరు జ్ఞాపకం
చిరునవ్వుతో చెయ్యి నేస్తం చీమంత అయిపోదా కష్టం
పరుగు ఆపునా పడిపోయి లేచినా
అలుపుసొలుపు లేని ఏ అలా

సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
పొత్తిళ్ళలో చిట్టి పుత్తడిబొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మ బ్రహ్మ
సీతాకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా