హే ముత్యమల్లే మెరిసిపొయే మల్లెమొగ్గా
అరె ముట్టుకుంటే ముడుచుకుంటావ్ ఇంతసిగ్గా ఆ ఆ
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
కురిసే సన్నని వాన
చలిచలిగా వున్నది లోన
కురిసే సన్నని వాన
చలిచలిగా వున్నది లోన
గుబులౌతూంటే గుండెల్లోన
జరగనా కొంచెం నేనడగనా లంచం
చలికితలను వంచం
నే వళ్ళే పూలమంచం
వెచ్చగా వుందాము మనము
హే పైటలాగ నన్ను నీవు కప్పుకోవే
గుండెలోన గువ్వలాగ ఉండిపోవే ఆ
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
పండే పచ్చని నేల
అది బీడైపొతే మేలా
పండే పచ్చని నేల
అది బీడైపొతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేల అది తొలకరించు వేళ
తెలుసుకో పిల్ల ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిది మనది
హే కాపుకాస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా ఆ
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
నవ్వని పువ్వే నువ్వు
నుని వెచ్చని తేనెలు ఇవ్వు
దాగదు మనసే ఆగదు వయసే
ఎరగదే పొద్దు అది దాటితుంది హద్దు
ఇయ్యవా ముద్దు ఇక ఆగనే వద్దు
ఇద్దరం ఒకటవనీ కానీ
హే బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకోనీ
రాతిరంతా జాగరమే చేసుకోనీ
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే
మంచి చోటే మనకు కుదిరిందిలే
No comments:
Post a Comment