చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..
చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..
జన్మించా మరోసారి జీవించా నిన్నే కోరి ..
దిగిదిగి వచ్చా నీదారి నందా ..
సంధించా నీపై గురి .. సాధించా సరాసరి
సరసకు వచ్చా అలకల నందా ..
అలకేదో పిలుపిచ్చిందా ?
అది నీకే తెలిసోచ్చిందా ?
చెడి ప్రయాల పూమాల తెగ నచ్చిందా ?
చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..
చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..
ఝుం ఝుమ్మని ఝుం ఝుమ్మని మంత్రంలా
నీ ఆలోచనలే రా రమ్మని రగిలిస్తే వస్తున్నా ..
రిం జిమ్మని రిం జిమ్మని వర్షంలా
నీ ఆశల జల్లే నా కొమ్మను కదిలిస్తే లేస్తున్నా
మనసును మాత్రం చదివే ప్రాణక్షరాల
ప్రేమల గీతం రాస్తున్నా
రాసిందే జరిగుంటుందా ?
రాయందే ఎదురయ్యిందా ?
ఒక రాయంటి ఎద నేడు రవళించిందా ?
చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..
ఘుం ఘుమ్మని ఘుం ఘుమ్మని గుండెల్లో ..
గువ్వలుగా ఎగసే ఘుమ్మేత్తిన గమ్మతులు తెస్తున్నా
ఎంతేంతని ఎంతేంతని చెప్పాలో
ఏం తోచక నేనే గొంతేత్తని గిలిగింతై చూస్తున్నా
మాటలకద్దం పట్టే మౌనంరుతల
ముద్దుల పట్టా ఇస్తున్నా
ఇచ్చిందే సరిపోతుందా ?
ఇవ్వల్సిందింకా వుందా ?
ఇక నాలోన నాదంటూ వేరేముందా ?
చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..
జన్మించా మరోసారి జీవించా నిన్నే కోరి ..
దిగి దిగి వచ్చా నీ దారి నంద ..
సంధించా నీపై గురి .. సాధించా సరాసరి
సరసకు వచ్చా అలకల నందా ..
No comments:
Post a Comment