Showing posts with label Movie - Alludochadu. Show all posts
Showing posts with label Movie - Alludochadu. Show all posts

01 October 2011

లేత కొబ్బరి నీళ్లల్లే పూత మామిడి పిందల్లే

లేత కొబ్బరి నీళ్లల్లే పూత మామిడి పిందల్లే
లేత కొబ్బరి నీళ్లల్లే పూత మామిడి పిందల్లే
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు మనసు

పోంగువస్తుంది నీ బాల అంగాలకు ఏహే
రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు
కోక కడతావు మొలకెత్తు అందాలకు ఏహే
కొంగు చాటేసి గుట్టు అంతా దాచేందుకు
దాగలేనివి ఆగలేనివి దారులేవో వెతుకుతుంటవి

లేత కొబ్బరి నీళ్లల్లే పూత మామిడి పిందల్లే
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు మనసు

కోటి అర్ధాలు చూసేవు నా మాటలో ఓ
కోర్కెలేవేవో రేగేను నీ గుండెలో
నేర్చుకుంటాయి నీ కళ్ళు దొంగాటలు
ఆడుకుంటాయి నాతోటి దోబూచులు
చూసుకోమ్మని దోచుకోమ్మని చూసుకోమ్మని దోచుకోమ్మని
దాచుకున్నవి పిలుస్తుంటవి

లేత కొబ్బరి నీళ్లల్లే పూత మామిడి పిందల్లే
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు మనసు

ఓ వయసు తెస్తుంది ఎన్నెన్నో పేచిలను ఏహే
మనసు తానోల్లనంటుంది రాజీలను
ఆహా పగలు సెగపెట్టి పెడుతుంది లోలోపల
రాత్రి ఎగదోస్తు ఉంటుంది తెల్లారులు
రేపు ఉందని తీపి ఉందని ఆశలన్ని మేలుకుంటవి

లేత కొబ్బరి నీళ్లల్లే పూత మామిడి పిందల్లే
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు మనసు