Showing posts with label Movie - Bhale Alludu. Show all posts

01 October 2011

ప్రేమిస్తే పెళ్లవుతుంది పెళ్ళైతే ఇల్లవుతుంది

ప్రేమకు ఒక ఊపొస్తుందీ హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది ఆహా పెళ్ళికి ఒక రూపొస్తుంది

మనసుంటే ప్రేమ తానె పుట్టుకొస్తుందీ
వయసొస్తే వద్దన్నా నెట్టుకొస్తుందీ
పగ్గాలు తెంచుకొని పరుగులెత్తుతుంది
పసుపు తాడు పడగానే అదుపులోకి వస్తుంది

ప్రేమిస్తే పెళ్లవుతుంది పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది ఆహా పెళ్ళికి ఒక రూపొస్తుంది

ప్రేమంటే వెన్నెల్లా చల్లనైనది
ప్రేమంటే తేనెలా తీయనైనది
ప్రేమంటే అదో రకం పిచ్చి వంటిది
పెళ్ళే ఆ పిచ్చికి మందు వంటిదీ

ప్రేమిస్తే పెళ్లవుతుంది పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది ఆహా పెళ్ళికి ఒక రూపొస్తుంది

నిన్న మొన్న దాక నిన్ను నువ్వెవ్వరు అన్నది
వలపు మొలిచినంతనే నువ్వే నేనంటుంది
నువ్వు లేక నేలేనని పువ్వు తావి మనమని
గుండెలోన దాగుతుంది కోరికలు రేపుతుంది