Showing posts with label Movie - Pelli Choopulu. Show all posts

03 June 2010

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని

ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ, నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

కిట్టయ్యంటే నువ్వేనని పిల్లనగ్రోవి నేనేనని
పెదవుల పైనే వుండాలని పదములు ఎన్నో పాడాలని
కిట్టయ్యంటే నువ్వేనని పిల్లనగ్రోవి
పైనే వుండాలని పదములు ఎన్నో పాడాలని
బృందావనం తగదనీ అందరితో తగువనీ
బృందావనం తగదనీ అందరితో తగువనీ
యమున దాటి వెళ్ళాలని వేచివున్న వెర్రిదాన్ని

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ, నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

సీతమ్మంటే నువ్వేనని రాముడు నేనై వుండాలని
రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని

పగలు పగలు అనుకుని రాత్రి రాత్రి కలగని
పగలు పగలు అనుకుని రాత్రి రాత్రి కలగని
కలే నిజం అవుతుందని కాచుకున్న పిచ్చివాణ్ణీ

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ, నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

ఆహాహాహా హాహాహహా
ఆహాహాహా హాహాహహా

13 February 2010

దాసోహం దాసోహం దాసోహం

దాసోహం దాసోహం దాసోహం (2)
మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు .. చలువలోని చెలిమికి .. దాసోహం (2)

దాసోహం దాసోహం దాసోహం (2)
వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు .. దుడుకులోని ప్రేమకు .. దాసోహం (2)

దాసోహం దాసోహం దాసోహం (2)

నేల పరిచింది పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వగతాలు నీ రాకకు
నేల పరిచింది పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వగతాలు నీ రాకకు

ఎదురు వచ్చింది నీ చూపు నా తోడుకు (2)
కలిసి నడిచింది .. కబురులాడింది .. కడకు చేర్చింది నీ నీడకు

మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు .. చలువలోని చెలిమికి .. దాసోహం (2)
వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు .. దుడుకులోని ప్రేమకు .. దాసోహం (2)
దాసోహం దాసోహం దాసోహం (2)

నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి
నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి

తలుపు తెరిచింది నీ రూపే నా మనసుకి (2)

అడుగు పెట్టింది .. దీపమెట్టింది .. దేవతయ్యింది నా ఇంటికి