01 October 2007

కొండా కోనల్లో

కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో
కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మ ఈ కోయిలమ్మ
కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో

నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగా
నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగా
ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊగంగా
ఉంగా ఉంగా రారంరంగా ఉల్లాసాలే ఊగంగా
ఊపిరి ఊయలలూగంగా రేపటి ఆశలు తీరంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా
తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా

ఝుమ్మని తుమ్మెద తీయంగా కమ్మని రాగం తీయంగా
జాజిమల్లి సంపెంగ జానపదాలే నింపంగా
కమ్మని రాగం తీయంగా జానపదాలే నింపంగా
చెట్టు పుట్ట నెయ్యంగా చెట్టాపట్టాలెయ్యంగా
చెట్టు పుట్ట నెయ్యంగా చెట్టాపట్టాలెయ్యంగా
చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా
స్వరాలన్ని దీవించంగ సావాసంగ

అందెల రవమిది

ఓం నమో నమో నమశ్శివాయ
మంగళప్రదాయగోతు రంగతే నమః శివాయ
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ
ఓం నమో నమో నమశ్శివాయ
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ

అందెల రవమిది పదములదా
అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా
అమితానందపు ఎద సడిదా
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా

మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయు వేగమై
అంగ భంగిమలు గంగ పొంగులై
హావభావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రస ఝరులు జాలువారేలా
జంగమమై జడ పాడగా
జలపాత గీతముల తోడుగా
పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా

నయన తేజమే నకారమై
మనో నిశ్చయం మకారమై
శ్వాస చలనమే శికారమై
వాంచితార్ధమే వకారమై
యోచన సకలము యకారమై
నాదం నకారం మంత్రం మకారం
స్తోత్రం శికారం వేదం వకారం యఙం యకారం
ఓం నమశ్శివాయ

భావమె భవునకు భావ్యము కాగ
భరతమె నిరతము భాగ్యము కాగ
తుహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ
ప్రాణ పంచకమె పంచాక్షరిగా పరమపధము ప్రకటించగా
ఖగోళాలు పద కింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగ

నువ్వంటే నాకిష్టమని

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగ
నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ

నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నలుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించద
వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగ
సుదూరాల తారక సమీపాన వాలగ
లేనేలేదు ఇంకే కోరిక

ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగ సన సన్నగ చేజారిపోనీయక
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగ
నీవు నాకు తోడుగ నేను నీకు నీడగ
ప్రతి రేయి తీయగ పిలుస్తోంది హాయిగ
ఇలా ఉండిపోతే చాలుగ

నే తొలిసారిగ

నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా

రెక్కలు తొడిగిన తలపు నువే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువే సహవాసమా
హద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిల అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా
నీ ఓడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవులపై చిరునవ్వుల దగ
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధమా

తరలి రాద తనే వసంతం

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా

వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద

బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికిగల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద

నమ్మకు నమ్మకు

సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోని
రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనక

నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను

వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని

ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు

శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు రాకంత గీతాలూ పలుకును కద
గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినిని
సగసని సని దనిదమదమ దనిదమపగ

దేవుడు కరుణిస్తాడని

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటె వినీ
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైనా కడ దాక సాగనా

నువ్వు ఉంటేనె ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతె బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగ నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే మాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవరేమి అనుకున్నా

ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు
ఎటెళ్ళేదొ జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదా నువ్వే రాకపోతే
నువ్వు నీ నవ్వూ నాతో లేకుంటే నేనంటు ఉంటానా

భరత వేదముగ

శంభో శంకర హర హర మహాదేవ

తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర
గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర

భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
నీలకంధరా జాలిపొందరా కరుణతొ ననుగనరా
నేలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా
నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా

హర హర మహాదేవ

అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా
రసతరంగిణీలీల యతిని నృత్యరతులు చేయగలిగే ఈ వేళ

జంగమ సావర గంగాచ్యుత శిర భృతమణి పుటకర పురహరా
భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వరహరా
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర
ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా
హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన

నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా

హర హర మహాదేవ

వెళ్ళిపోతే ఎలా

వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా
అయినా ఎందుకిలా తడబాటు అంతలా
తెగ హుషారుగా ఎగిరిపోకే తగని ఊహ వెంట
సరైన దారి తెలియందే ఈ ఉరుకులెందుకంట

ఆమె వలలో చిక్కుకుందా సమయం
ప్రేమ లయలో దూకుతుందా హృదయం
నేను ఇపుడు ఎక్కడ ఉన్నానంటే
నాక్కూడ అంతు చిక్కకుంటే
గమ్మత్తుగానే ఉన్నదంటే
నాకేదో మత్తు కమ్మినట్టే

రమ్మంది గాని నన్ను చేరి మెరుపు సైగ చేసి
చెప్పింది నింగి చెలిదారి చినుకు వంతెనేసి
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా

తాను కూడ రాకపోతే నాతో
నేను కూడ ఆగిపోనా తనతో
నా ప్రాణం ఉంది తన వెంటే
నా ఊపిరుంది తాననంటే
కళ్ళార చూసానంటు వుంటే
ఎట్టా నమ్మేది స్వప్నమంటే

వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని
మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని
వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా

ఘల్ ఘల్

ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందిచే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంత తానే పలకగ దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే

నిలువద్దము నిను ఎపుడైనా

నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమె గమనిస్తున్న్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతె కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నా మాట విన్నంటు నే ఆపలేనంతగా
భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మర్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు

ఇది వరకు ఎద లయకు ఏమాత్రమూ లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నను అడుగు చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా
నా దారినే మళ్ళించగా నీకెందుకు అంత పంతం
మంచేతిలో ఉంటే కదా ప్రేమించడం ఆగడం

వేయి కన్నులతో

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవ నేస్తమా

నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా

ఊరుకో హృదయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయట పడిపోకుమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల
నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా

చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా

దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చెయ్యనీ అభిమానం
నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా

కొంత కాలం కిందట

కొంత కాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా
నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి

బొమ్మా బొరుసు లేని నాణానికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గల గల మని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై సాగాలి నీ స్నేహం

వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువు నాలాగ నే నీలాగ కనిపించడమే సత్యం
నువు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదురించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి ఈ స్నేహం

చెప్పమ్మా చెప్పమ్మా

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలనీ

వెంట తరుముతున్నావే ఏంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావే ఏంటి ఎటు చూసినా
చెంపగిల్లి పోతావే ఏంటి గాలివేలితోనా
అంత గొడవ పెడతావే ఏంటి నిద్దరోతు ఉన్నా
అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా
ఒంటిగా ఉండనీవే ఏంటి ఒక్క నిమిషమైనా
ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరనూ
నువ్వేంచేసినా బాగుంటుందనే నిజం నీకెలాచెప్పనూ

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేశెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది ఓ మోమాటం

నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచ్చటైనా
ఏడిపించబుద్ధౌతుంది ఎట్టాగైనా
ముద్దుగానే ఉంటవేమో మూతిముడుచుకున్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతు ఉన్నా
లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా
ఇదేం చూడక మహా పోసుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్నా అయ్యో రామా

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేశెయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మా తప్పమ్మా తప్పమ్మా ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలనీ

అలనాటి

అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
తెనుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి

చందామామ చందామామ కిందికి చూడమ్మా
ఈ నేల మీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెలబోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళకళ జంటని పదిమంది చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షతలేయండి

సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకుని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడుగక బంధువులంతా కదలండి

నా మనసునే

నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపితనమా
చిరునవ్వులొని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
నా మనసునే మీటకే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా

నాకెందుకిలా ఔతోంది చెప్పవా ఒక్క సారి
నీ వెంటపడే ఆశలకే చూపవా పూల దారి
చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగా
తడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగా
లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా

నీ కనులలో వెలగనీ ప్రియతమా
నీ పెదవికే తెలుపనీ మధురిమా

నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను
నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను
అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా
కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా
నన్ను నేను మరిచేంతల మురిపించకే ప్రేమా

నీ కనులలో వెలగనీ ప్రియతమా
నీ పెదవికే తెలుపనీ మధురిమా
సరదాల చిలిపితనమా
చిరునవ్వులొని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా

చెలియా చెలియా

చెలియా చెలియా చేజారి వెళ్ళకే
సఖియా సఖియా వంటరిని చేయకే
నడి రేయి పగలు చూడక
సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా
పడి లేచే ఎరటం తీరుగా
దిశలన్నీ దాటే హోరుగా
నిను తాకే దాకా ఆగదు నా కేక

కదలికే తెలియని శిలని కదిలిం ఓ ప్రేమా
కలయికే కల అని మాయమైపోకుమా
గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా
చెరిపినా చెరగని గాయమైపోకుమా
మౌనమా అభిమానమా పలకవా అనురాగమా
ఒడిపోకే ప్రాణమా వీడిపోకుమా
అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా

నిలిచిపో సమయమా తరమకే చెలిమి ఇకనైనా
చెలిమితో సమరమా ఇంతగా పంతమా
నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా
నమ్మవేం ప్రణయమా అంత సందేహమా
వేరుచేసే కాలమా చేరువైతే నేరమా
దాడి చేసే దూరమా దారి చూపుమా
విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా

గుండెల్లో ఏముందో

గుండెల్లో ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది
గుండెల్లో ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది
నిన్నిలా చూసి పైనించి వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది

ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాకా నడిపించే పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది
గుండెల్లో ఏముందో...

మనసు మాట వినదు

నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతి నడుగు
వేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనదు
నేను నిజం నా ప్రేమ నిజం ఇది పిచ్చిదనం అనకు
అన్నా మనసు మాట వినదు విన్నా అవును కాదు అనదు
నీలో నా సంతకం చెరిపే వీల్లేదుగా
నాలో నీ ఙాపకం కరిగే కల కాదుగా
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

ఎవ్వరికీ వినిపించవుగా మన ఇద్దరి సంగతులు
వింటే కొంటె అష్టపదులు వెంటే పడవ అష్టదిశలు
ఎవ్వరికీ కనిపించవుగా మన ముద్దుల ముచ్చటలు
చూస్తే జంటలేని ఎదలు మనకే తగులుతుంది ఉసురు
చెబితే వినవే ఎలా ఎగసే నిట్టూర్పులు
చలితో అణిచేదెలా రగిలే చిరుగాలులు
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

ఎప్పటికీ నను తప్పుకునేవీ ఇవ్వని కౌగిలులు
చుట్టూ చిలిపి చెలిమి చెరలు కట్టా చూడు వలపు వలలు
దుప్పటిలా నను కప్పినవేనల నల్లని నీ కురులు
ఇట్టా మాయదారి కలలు చూస్తూ మేలుకోవు కనులు
మనసే దోస్తే ఎలా తనకే ఈ సంకెలా
ఒడిలో పడితే ఎలా అడుగే కదిలేదెలా
నువ్వూ నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమై ఇలాగా
ప్రేమే ఐనా ఇక పైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా

ఎవ్వరినెప్పుడు

ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థంకాని పుస్తకమే ఐనాగని ఈ ప్రేమ
జీవిత పరమార్థంతానే అనిపిస్తుందీ ఈ ప్రేమ

ఎన్నెన్నెనో రంగులతో కనిపిస్తుందీ ఈ ప్రేమ
రంగులకలలే కాంతి అనీ నమ్మిస్తుందీ ఈ ప్రేమ
వర్ణాలన్నీ కలిసుండే రవికిరణం కాదీప్రేమ
తెల్లని సత్యం కల్ల అనీ ప్రకటిస్తుందీ ఈ ప్రేమ

లైలామజ్ను గాథలని చదివిస్తుందీ ఈ ప్రేమ
తాజ్ మహల్ తన కోట అనీ చూపిస్తుందీ ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనిపిస్తుందీ ఈ ప్రేమ
కలిసిన వెంటనె ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ

అమృత కలశం తానంటూ ఊరిస్తుందీ ఈ ప్రేమ
జరిగే మథనం ఎంతటిదో ముందుగ తెలపదు ఈ ప్రేమ
ఔనంటూ కాదంటూనే మదిని మథించే ఈ ప్రేమ
హాలాహలమే గెలవండీ చూద్దామంటుందీప్రేమ

ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఓక జంటతో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ
సీతారాములనేమార్చే మాయలేడి కద ఈ ప్రేమ
ఓటమినే గెలుపనిపించే మాయాజూదం ఈ ప్రేమ

కిట కిట తలుపులు

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ

నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక
కమ్మని కలలో అయినా నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా
రెప్పపాటైనా లేక చూడాలనుందే
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా
కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా ప్రేమ ప్రేమ

కంట తడి నాడూ నేడూ చెంప తడి నిండే చూడు
చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి
అమృతం అయిపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ ఙాపకం నడిపింది నన్ను జంటగా
ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా ప్రేమ ప్రేమ

చెప్పవే ప్రేమా

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
ఎపుడో ఒక నాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని
ఇపుడూ నిను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని
నేస్తమా నీకు తెలిపేదెలా

ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని
ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే నీకు చెప్పాలని
నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగినా
నిను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా
స్నేహమా నీకు తెలిపేదెలా

తూనీగా తూనీగా

తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక
దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగ
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాక

దోసిట్లో ఒక్కో చుక్కా పోగేసి ఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా
సూర్యుడినే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడు

ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓసారటువైపెళుతుంది
మళ్ళి ఇటువైపొస్తుంది
ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాదెలా
కూ కూ బండి మా ఊరుంది
ఉండిపోవె మాతో పాటు

ఓంకారనాదంతో

ఓంకారనాదంతో అంకురించిన వేదధాత్రికి సంకేతం ఈ ఖడ్గం
హ్రీంకారనాదంలో సంచరించే ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం
యుగయుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం
తరతరాలుగా తరలి వచ్చిన చరిత ఈ ఖడ్గం

తన కళ్ళ ముందే సామ్రాజ్య శిఖరాలు మన్నుపాలైనా
క్షణమైనా తన గాథ గతములో విడిచి ధ్రుతి ఒడి చేరనిదీ ఖడ్గం
ఊటతో పడమరను దాటి పూర్వార్ధిపై నిత్య ప్రభాతమై వెలుగుతున్నదీ భరత ఖడ్గం

కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం
మూడువన్నెల కేతముగ మింటికి ఎగసి కాలానికెదురేగు యశోరాశి ఈ ఖడ్గం

హరిని ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం
నరునిలో దైవాంశనే దర్శించి కొలిచిన ముక్తిమార్గం
ఆర్తరక్షణకై ధరించిన ధీరగుణమీ ఖడ్గం
ధూర్తశిక్షణకై వహించిన కరకుతనమీ ఖడ్గం
హూంకరించి అహంకరించి అధిక్రమించిన ఆకతాయిల అంతు చూసిన క్షాత్రసత్వం
అస్తమించని అర్థఖడ్గం
శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన అన్ని జాతుల పొదువుకున్న ఉదారతత్వం
జగతి మరువని ధర్మఖడ్గం

నిద్దుర మత్తును వదిలించే గెంజాయల జిలుగీ ఖడ్గం
చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం
మట్టిని చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురీ ఖడ్గం
గెంజాయల జిలుగీ ఖడ్గం
తెలతెల్లని వెలుగీ ఖడ్గం
సిరిపచ్చని చిగురీ ఖడ్గం

ముసుగు వెయ్యొద్దు

ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో
ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా

సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని
తిరిగిపడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా
అందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా
ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెన్నక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు

కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా
నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడిచాం
సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం

ప్రియా ప్రియా

ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది
దహించు ఏకాంతమే సహించలేనన్నది
యుగాల ఈ దూరమే భరించలేనన్నది
విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది

కన్నీళ్ళలో ఎలా ఈదను
నువే చెప్పు ఎదురవని నా తీరమా
నిట్టూర్పుతో ఎలా వేగను
నిజం కాని నా స్వప్నమా హా
ఎలా దాటాలి ఈ ఎడారిని
ఎలా చేరాలి నా ఉగాదిని
క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా

ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది
-------

ఒకే ఒక క్షణం చాలుగా
ప్రతి కల నిజం చేయగా
యుగాలు కలకాలమా ఇలాగే నూఆగుమా
దయుంచి ఆ దూరమా ఇవాళ ఇటు రాకుమా
ఇదే క్షణం శిలాక్షరం అయ్యేట్టు దీవించుమా

ఏ రోజైతే చూసానో నిన్ను

ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నాను
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో
నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా
నీ కష్టంలో నేను ఉన్నాను
కరిగే నీ కన్నీరవుతా నేను
చెంపల్లో కారి నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతంలో ఓదార్పౌతాను

కాలం ఏదో గాయం చేసింది
నిన్నే మాయం చేసానంటోంది
లోకం నమ్మి అయ్యో అంటోంది
శోకం కమ్మి జోకొడతానంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఈ జీవం నీవని సాక్షం ఇస్తున్నా
నీతో గడిపిన ఆ నిమిషాలన్ని
నాలో మోగే గుండెల సవ్వడులే
అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగా
నువ్వే లేకుంటే నేనంటూ ఉండనుగా

నీ కష్టంలో నేనూ ఉన్నాను
కరిగే నీ కన్నీరవుతా నేను
చెంపల్లో కారి నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతంలో ఓదార్పౌతాను
ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నాను

ఈ వేళలో

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చేజారి పోయింది
నీ నీడగా మారి నావైపు రానంది
దూరాన ఉంటూనే ఏంమాయ చేశావో

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేదీ కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

చిట్టి నడుము

చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసతో ఛస్తున్నా
కంటపడదు ఇక ఎదురేమున్నా
చుట్టుపకలేమౌతున్నా గుర్తుపట్టనేలేకున్నా
చెవినపడదు ఎవరేమంటున్నా
నడుమే ఉడుమై నను పట్టుకుంటె జాణ
అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా
ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పుచేసైనా

నంగనాచిలా నడుమూపి
నల్ల తాచులా జడ చూపి
తాకి చూస్తె కాటేస్తానంది
చీమలాగ తెగ కుడుతుంది
పాములాగ పగ పడుతుంది
కళ్ళుమూసినా ఎదరే ఉంది
తీరా చూస్తే నలకంత నల్లపూస
ఆరా తీస్తే నను నమిలేసే ఆశ
కన్నెర్రగా కందిందిలా నడుమొంపుల్లో నలిగి
ఈ తికమక తీరేదెలా ఆ సొంపుల్లో మునిగి

ఎన్ని తిట్టినా వింటానే
కాలదన్నినా పడతానే
నడుము తడమనీ నన్నొకసారి
ఉరిమి చూసినా ఓకేనే
ఉరే వేసినా కాదననే
తొడిమి చిదిమి చెబుతానే సారీ
హైరే హైరే ఏ ప్రాణహాని రానీ
హైరె హైరె ఇక ఏమైనా కానీ
నిను నిమరకా నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి
ఆ కోరిక కడతేరగా మరుజన్మ ఎందుకే రాణి

అలుపన్నది వుందా ఎగిరే అలకు

అలుపన్నది వుందా
ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది వుందా
కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికె మది తలపులకు
లల లల లలలలా
అలుపన్నది వుందా
ఎగిరే అలకు ఎద లోని లయకు
అదుపన్నది వుందా
కలిగే కలకు కరిగే వరకు


నాకోసమే చినుకై కరిగి
ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి
దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు
బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
లల లల లలలలా

అలుపన్నది వుందా
ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది వుందా
కలిగే కలకు కరిగే వరకు


నీ చూపులే తడిపే వరకు
ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు
ఎటు వున్నదో మెరిసే సొగసు
ఏడేడు లొకాల ద్వారాలు
తలుపులు తెరిచె తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
లల లల లలలలా

అలుపన్నది వుందా
ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది వుందా
కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికె మది తలపులకు
లల లల లలలలా
ఉం ఉం ఉహు ఉహు ఉహు ఉం ఉం ఉహు ఉహు ఉహు ఉం

అనగనగనగా ఒక రాజు

అనగనగనగా ఒక రాజు గగనమునేలే మహరాజు కనబడలేదా యువరాణి ఈ రోజు
నీ చిన్ని వేలు అందించు చాలు కదలి వస్తాడు కథలు చెబుతాడు
పండుగల్లె తానొచ్చి పండువెన్నెలే తెచ్చి నీకందిస్తాడు ధినక్ తక్ ధిం
ఏడి వెన్నెల రేడు ఒంటరిగా ఏమూలనున్నాడు
జాడైన చూడనీడు ఎందుకో నడిరేయి సూరీడు
పదహారు కళలూ ఎదలోనె ఎపుడూ దాచేసుకుంటాడా
తన పైడి సిరులూ మన కంటికెన్నడూ చూపించనంటాడా

అమ్మ ఒడిలో చిన్నపుడు నమ్మకంలో ఉన్నపుడు
బొమ్మలా నీ అరచేతుల్లో లేడా చందురుడు
మావయ్యంటారు వరసై పసివాళ్ళు మచ్చను చూస్తారు వయసెదిగిన వాళ్ళు
వెన్నముద్దనే చూసి మన్నుముద్దలతోచి ఎపుడొదిలేసారు
తెలివి తెర వేసి తెలిసి వెలి వేసి తరిమి కొడితే సరే అని అలా అంతెత్తున నిలిచాడు

కన్నె చూపుల లోగిలికి కొంటె ఊహల వాకిలికి
పల్లకిలో పచ్చని ఆశలు పట్టుకు వస్తాడు
సిగలో సిరిమల్లై సిగ్గులు పూస్తాడు మదిలో విరిముల్లై సందడి చేస్తాడు
వెచ్చగా కవ్వించి చల్లగా నవ్వించి ఆటాడిస్తాడు
వలపు విలుకాడు చిలిపి చెలికాడు కనులు వెతికే కలే తనై నిజంలా ఎపుడెదురౌతాడు

తెలిసింది కదా నేడు

తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు
తెలివుంది కదా తోడు తలవంచకు ఏనాడు
తన పడుచుదనం పదునుగుణం తెలిసినవాడు
ఇక తనను తనే ఎదురుకునే పొగరౌతాడు

థదిగిణతోం అని చిలిపి చిటిక వేద్దాం
కథకళితో మన పదము కదిపి చూద్దాం
తికమకతో బడి చదువు బరువు మోద్దాం
పగపగతో శృతి కలిపి సులువు చేద్దాం
దారే గోదారైతే దాన్నే ఈదాలంతే
ఉరుము సడే ఉలికిపడే చినుకు స్వరాలం
పీడకలే వేడుకలా మార్చుకోగలం

పరిగెడితే ఎటు అనదు పడుచు ప్రాయం
పనిపడితే మన మనసె మనకు సాయం
పడగొడితే కనబడని పిరికి సమయం
వెలుగవదా తను చేసిన ప్రతి గాయం
కయ్యం కోరిందంటే కాలం ఓడాలంతే
ప్రతి విజయం వదలి మరో ముందడుగేద్దాం
వెనకతరం చదువుకునే కథ మనమౌదాం

మది లయలో

మది లయలో కథకళివో, మధనపడే నాలో అలజడివో
తొలకరి మెరుపే తగిలినదేమో, తలవని తలపై వెంటాడే తొలి వలపేమో

పరుగులు ఆపే పరవశమా, పలుకులు నేర్పే సుమశరమా!
ఈ మైకం తమవలనేమో - ఏమో ఏమో ఏమో
నీ సంగతి నీకే ఎరుక - నేనేం చెబుతా చిలకా
నాకేమీ తెలియదు గనుక అడగకే జాలిగా
జరిగినదిదియని ఎవరికి తెలుసునట?
తొలకరి మెరుపే తగిలినదేమో, తలవని తలపై వెంటాడే తొలి వలపేమో!

లీలగ సాగే వేడుకలో, వీలుగ లాగే వెల్లువలో పడిపోయా తలమునకలుగా
లోలోగల కలవరమింకా నీలో మొదలవలేదే
లైలావల మెలివేసాక నిలకడే ఉండదే
తదుపరి మలుపులు ఎటు మరి మన కథలో!

తెలుసా మనసా

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగున నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా

darling, every breath you take, every move you make
I will be there, what would I do without you?,
I want to love you forever... and ever... and ...ever
ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగ

గుండె చాటుగా

గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ - నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ

నీలిమబ్బులో నిలచిపోకలా నింగి రాగమాల
మేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేల
కొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగ
ఇలకు రమ్మని చినుకుచెమ్మని చెలిమి కోరుకోనీ - నిన్ను కలుసుకోనీ

రేయిదాటని రాణివాసమా అందరాని తార
నన్నుచేరగ దారిచూపనా రెండు చేతులార
చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగ
తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ - నిన్ను కలుసుకోనీ

మౌనమెందుకు

మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరిచేరవెందుకు
ఎదమారుమూల దాగివున్నమాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపుదాటి చేరవెందుకు

అంత బిగువా మెట్టుదిగవా ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా
ఇంత తెగువా మాటవినవా కొంత కష్టమైనా కాస్త ఆగవా
మది నాకు చెప్పకుండ నీ వెంట పడ్డది
మన చేతిలోన ఉంద ఈ ప్రేమ పద్ధతి
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు

నందకిషోరా నవనీతచోరా నవమన్మదాధారా రారా నన్నేలుకోవేరా
చెయ్యందుకోరా శృంగారశూరా చేరంగరావేరా కృష్ణా చెట్టెక్కిదిగవేరా

రెచ్చగొట్టినా నవ్వుతున్నదే మత్తు కమ్మేసిందా కన్నెమనసుని
ఎంత కుట్టినా కెవ్వుమనదే పువ్వు పొమ్మంటుందా తేనెటీగని
నిను చూడకుంటె ప్రాణం ఇక నిలువనన్నది
పదునైన పూలబాణం నను తాకుతున్నది
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు

భూగోళంతో బంతాట

భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం
పూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయం
పడిలేస్తూ మనవెనకాలే తడబడిపోతుంటే కాలం
ఆనందోబ్రహ్మ అంది మన వేగం

కథలోకింక అద్భుతం ఎదురయేదాక వెతుకుదాం
పదమందీ నవయవ్వనంలో పసితనం
దొరుకుతుందా అది అడగదే మన నమ్మకం
కలనైనా తరిమేగుణం మన లక్షణం
నిజమైనా కలలాంటిదే మనకీక్షణం

అదుపులోలేని పరుగులం రసతరంగాన ఉరుములం
మనకింకా తెలియదు కద భయమన్నది
పిల్లగాలై ఎదురేగుదాం గగనానికి
ఎగరేద్దాం చిరునవ్వుని నలువైపులా
స్వాగతిస్తాం స్వర్గాలనే మనవైపిలా

సంతోషం సగం బలం

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ
ఆ సంగీతం నీతోడై సాగవె గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవ చెయ్యకు
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకద
ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయద
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ
నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంటూ
లేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

ఒకే ఒక మాట

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఓపిరే నువ్వనీ
నీకు చెప్పాలని

నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటాననీ
తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని

నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ
నీకు చెప్పాలనీ

రంగేళి హోళి

కృష్ణ కృష్ణ కృష్ణ హే రామ రామ రామ
చిన్నా పెద్దా అంతా పండుగ చేయాలంట
తీపి చేదు అంతా పంచి పెట్టాలంట

రంగేళి హోళి హంగామా కేళి
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలి
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా

తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది
గడపలు అన్నీ జరిపి ఆ గణపతి పండుగ జరిపి
నిమ్మజనంగా జనం జరిపే పయనం నిత్య భాద్రపదమౌతుంది
లోకుల చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగ జేసే జాగరణే శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చే రోజొకటుండాలా
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగా లేదా

తల్లుల జోలపదాలై గొల్లల జానపదాలై
నరుడికి గీత పథమై నడవడమంటే అర్ధం కృష్ణ జయంతి
అందరి ఎండకు మనమే పందిరయ్యే లక్షణమే
మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామ నవమయింది
మనలో మనమే కలహించి మనలో మహిషిని తలపించి
విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగి మంటయింది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి

ఒకటి రెండంటూ విడిగా లెక్కెడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే
లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే

జగమంత కుటుంబం

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లని

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి

నమ్మక తప్పని

నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా
ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన
కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవేఐనా
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా

ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండ రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమి అల వెను తిరిగిన చెలిమి అలా తడి కనులతొ నిను వెతికేది ఎలా

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా చేజారిన ఆశల తొలి వరమా

అపుడో ఇపుడో

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కథలా మెదిలే నా కలల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనస౦దే నువ్వే నేననీ...
తీపి కన్నా ఇ౦కా తీయనైన వేరే ఎది అ౦టే వె౦టనే నీ పేరని అ౦టానే
హాయి కన్నా ఎ౦తో హాయిదైన చోటే ఎమిట౦టే నువ్వు వెళ్ళే దారని అ౦టానే
నీలాల ఆకాశ౦ ఆ నీల౦ ఏద౦టే నీ వాలు కళ్ళళ్ళో ఉ౦దని అ౦టానే
నన్ను నేనే చాలా తిట్టుకు౦టా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతు౦టే
నన్ను నేనే బాగా మెచ్చుకు౦టా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావ౦టే
నా తోడే నేను౦టా నీ తోడే నాకు౦టే
ఏదేదో ఐపోదా నీ జతలేకు౦టే

ఓ మనసా

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా

ఎగసి పడే అల కోసం దిగివస్తుందా ఆకాశం
తపన పడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
మిగిలే స్మృతులే వరమనుకో మనసా

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

తన ఒడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్ళకని ఏ బంధాన్ని కోరదుగా
కడలిలోనే ఆగుతుందా కదలనంటు ఏ పయనం
వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం
కరిగే కలలే తరిమే ఓ మనసా

ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు

కనులు తెరచినా

కనులు తెరచినా కనులు మూసినా కలలు ఆగవేల
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల
ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూసా సరిగా
ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోన
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా

పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోంది
ఐతేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదనీ ఈ లోకం అనుకుంటుంది
కానీ ఆ దూరమె నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ ఙాపకాలె నా ఊపిరైనవని

ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని ఖంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టూ నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రసవీయమంది

ఎవరైనా ఎపుడైనా

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిశేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనే ఎక్కది నుంచో చైత్రం కదిలొస్తుంది
పొగ మంచుని పోపొమ్మంటూ తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది
తన రూపం తానే చూసి పులకిస్తుంది
ౠతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిశేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో


ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా నడి రాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ
గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా ఈ వింతల మంథన ఇంకా ఎక్కడి దాకా
చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా అక్షరమూ అర్థం కానీ ఈ విధి రాతా
కన్నులకే కనపడనీ ఈ మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా నడి రాతిరి తొలి వేకువ రేఖ
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖ

నరనరం

నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా
ఒక్క క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా
ఏం చేద్దాం - జత పడదాం
ఈ దూరం - పని పడదాం
ఆనందం కనిపెడదాం - నువు సరేనంటె సరిహద్దే తెంచుకుందాం

లేత పెదవి తడి తగిలి మేను కరిగిపోవాలి
వేడి చూపు సెగ తగిలి ఈడు కందిపోవాలి
ఎమన్నదో నీ ఊపిరి - ఏం విన్నదో నీ తిమ్మిరి
ఎందుకట అరచేతుల్లో ఈ చెమట - కొత్త కదా సరసం కోరే నీ సరదా
మొదలయేదిక్కు ముదిరితే ముప్పు కాదా

కైపు కళ్ళ గమ్మత్తు రేపుతోంది ఓ మత్తు
చీకటల్లె నీ జుట్టు కలలు నింపె నా చుట్టూ
ఆపేదెలా నీ అల్లరి - ఆర్పేదెలా ఈ ఆవిరి
ఒడికొస్తే తికమకలన్ని వదిలిస్తా - చనువిస్తే ఇక నీ వెనుకే పడి ఛస్తా
అడగాలా చెప్పు మొహమాటం తప్పు కాదా

అల్లంత దూరాల

అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగ
అరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగ
గుండెల్లో కొలువుండగ

భూమి కనలేదు ఇన్నాళ్ళుగ
ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగ
గుండెల్లో కొలువుండగ

కన్యాదానంగ ఈ సంపద
చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడ
పొందాలనుకున్నా పొందేవీలుందా
అందరికి అందనిది సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత
పచ్చగ పెంచిన పూలత
నిత్యం విరిసే నందనమవదా

అందానికే అందమనిపించగ
దిగివచ్చెనో ఏమొ దివి కానుక
అరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగ
గుండెల్లో కొలువుండగా
తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందో ఎందరిని నిలబడనీక
ఎన్నో వంపులతో పొంగే ఈనది
తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక
తొలిపరిచయమొక తీయని కలగ
నిలిపిన హృదయమె సాక్షిగా
ప్రతి ఙాపకం దీవించగ
చెలి జీవితం వెలిగించగ

మనసా మన్నించమ్మా

మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా
నీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావా
స్వప్నం చెదిరిందమ్మా సత్యం ఎదరుందమ్మా
పొద్దేలేని నిద్దర్లోనే నిత్యం ఉంటావా
ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా
ప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా

దేవాలయంలా ఉంటే నీ తలపు ప్రేమ దైవంలా కొలువుంటుందమ్మా
దావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమని నీనుంచి వెలివేస్తుందమ్మా
అంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మా
చెంతకొస్తే మంటేనే అందడని నీతో చెప్పమ్మా
మన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామా
తన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో కలవరపడకమ్మా
ప్రేమా ప్రేమా నీ స్నేహమే తీరని శాపం మన్నిస్తావా

ఒక చినుకునైనా దాచదు తనకోసం నేలకు నీరిచ్చి మురిసే ఆకాశం
నదులన్నితానే తాగే ఆరాటం కడలికి తీర్చేనా దాహం ఏమాత్రం
పంజరంలో బంధించి ఆపకే నేస్తాన్నేనాడు
పల్లకివై పంపించి చల్లగా దీవించవె నేడు
ఙాపకంలో తీయదనం చేదుగా మార్చవ కన్నీళ్ళు
జీవితంలో నీ పయనం ఇక్కడే ఆపదు నూరేళ్ళు
ప్రేమా ప్రేమా మదిలో భారం కరిగించేలా ఓదార్చవా