20 April 2010

రాక రాక వచ్చావు చందమామ

రాక రాక వచ్చావు చందమామ
లేక లేక నవ్వింది కలువభామ
మబ్బులన్ని పోయినవి మధుమాసం వచ్చినది
మరులుకొన్న విరికన్నె విరియబూసి మురిసింది
లేక లేక నవ్వింది కలువభామ ||రాక||

రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది
ఆకసాన నినుజూచి ఆనందం పొంగినది
లేక లేక నవ్వింది కలువభామ ||రాక||

తీరని కోరికలే తీయని తేనియలై
వెన్నెల కన్నులలో వెల్లివిరిసి మెరిసినవి
దొంగలాగ దూరాన తొంగి చూతువేల
రావోయి రాగమంత నీదోయి, ఈ రేయి
రాకరాక వచ్చావు చందమామ
లేక లేక నవ్వింది కలువభామ||

No comments: