మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ
కోపమెక్కువ కానీ మనసు మక్కువ
స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా
ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడ
||మీసమున్న||
ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కధలు
మర్రిచెట్టు చెబుతుంది పంచుకొని తిన్నచద్ది రుచులు
చెఱకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు
టెంటు హాలు చెబుతుంది ఎన్.టి.ఆర్. స్టంటు బొమ్మ కధలు
పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ
ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి
వయసంత మరచి కేరింతలాడె ఆ తీపి జ్ణాపకాలు
కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి
మనలాగే అవికూడా విడిపోలేనంటాయి
||మీసమున్న||
ఒక్కతల్లి సంతానమైన మనలాగ వుండగలరా
ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా
నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్నతండ్రినైనా
ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలనా
ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను
నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా
నీకు సేవ చేసేందుకైనా మరుజన్మ కోరుకోనా
స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా
ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడా
||మీసమున్న||
No comments:
Post a Comment