అందాల లోకం చెంత వాలుతుందా
చిన్నారి ఆశ చిందుల్లేయ్యమందా
కుదుటేపడని కేరటంలా కొత్త సంతోషం
ఎదనే తడిమి ఎగసిందా నేడు నీ కోసం
అందాల లోకం చెంత వాలుతుందా
చిన్నారి ఆశ చిందుల్లేస్తోందా
ఒకరికోకరైన ఒడిలోన వరమై ఎదిగే పసికూన
చిలిపి సరదాలు ఆగేనా వయసే పిలిచే సమయాన
ఓ ఓ వెయ్యేళ్ళకి వేరైపోదే వేంటాడిన ఈ పాశం
ఒక్కో క్షణం నాదంటుందే ఉప్పొంగిన ఉల్లాసం
ఇప్పుడే ఎదలో విరిసిందా నింగి హరివిల్లు
మమతే విడిపోనంటుందా నిండు నూరేళ్ళు
అందాల లోకం చెంత వాలుతుందా
ఓ ఓ చిన్నారి ఆశ చిందుల్లేయ్యమందా
ఎవరి ఎదలోన కలతున్న తనదే అనదా ఆ గాయం
చివరి కన్నీటి తడి తుడిచే చెలిమే అవదా చిరుసాయం
ఓ ఓ ఆకాశమే అమ్మైయిందా అన్నీ తనే అందిస్తూ
సావసమే నాన్నయిందా గమ్యన్నిలా చూపిస్తూ
అలలై పొంగే అనురాగం అల్లుకుంటుందా
నిజమై నిలిచే ప్రతి స్వప్నం నేస్తమవుతుందా
అందాల లోకం చెంత వాలుతుందా
చిన్నారి ఆశ చిందుల్లేస్తోందా
కుదుటే పడని కేరటంలా కొత్త సంతోషం
ఎదనే తడిమి ఎగసిందా నేడు నీ కోసం
నన్నా న నాన నన్న నాన నాన
నన్నా న నాన ఓ హో హో
No comments:
Post a Comment