అచ్చ తెలుగు భాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత పలకంపై అనుభంధంలా
తొలి అక్షర ముత్యం రా అమ్మంటే ||అచ్చ||
ఆకసాన సృష్టి కర్త బ్రహ్మరా
అవనిమీద సృష్టి కర్త అమ్మరా ||ఆకసాన||
గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం
నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం
అమ్మంటే స్వచ్చమైన శ్వాసరా
అమ్మంటే స్పష్టమైన యాసరా ||అచ్చ||
అమ్మమాట మానవాళి జాతీయగీతం
అమ్మమాట ఆవుపాల జలపాతం ||అమ్మ పాట||
పాలతోటి మురిపాలు
ఇదే అమ్మ స్థన్యం
ప్రేమ కరుణ జాలి దయ
ఇవే అమ్మ సైన్యం
అమ్మంటే జనజీవన వేదమురా
అమ్మంటే మరో ప్రణవనాదమురా ||అచ్చ||
No comments:
Post a Comment