పల్లవి :
ఈ వనిలో కోయిలనై
కోయిలపాడే గానమునై
గానము కోరే చెవినై
నా చెవిలో నేనే ధ్వనిస్తా
గానము కోరే చెవినైనా
చెవిలో నేనే ధ్వనిస్తా
చరణం : 1
మింట తనే మేఘమునై
మేఘములోని చంచలనై
చంచలకోరే గురినై
నా గురిలో నేనే నటిస్తా
చంచలకోరే గురినైనా
గురిలో నేనే నటిస్తా
చరణం : 2
నా హృదిలో మోహమునై
మోహము చూపే ప్రేమమునై
ప్రేమనుకోరే ప్రియునై
నా ప్రియుని నేనే వరిస్తా
ప్రేమనుకోరే ప్రియునైనా
ప్రియుని నేనే వరిస్తా
No comments:
Post a Comment