ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచా
ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా ఎదనే పరిచా
ఏ పొద్దుల్లోనూ ముద్దుల్లోనూ నీతో నేనుంటా
ఆ సిగ్గుల్లోనూ ముగ్గుల్లోనూ నీవే నేనంటా
ఏనాడైనా ఏ వేళైనా నాలోనా
ఏదేమైనా ఎవరేమైనా నీవేనే
ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచా !
ఈ వేళ ఎక్కడ ఉన్నావో ఏమేమి చేస్తూ ఉన్నావో
నాకేమో మదిలో నీ ధ్యాసే నీవేమో ఎపుడూ నా శ్వాసే
కాసంత కుదురే లేదాయే రేయంత నిదురే రాదాయే
నువు లేక కనులలో నీరేలే నువు రాక నిమిషం యుగమేలే
ఏ మాట విన్నా నీ పిలుపే యే చోట ఉన్నా నీ తలపే
విడలేను లే విడిపోనులే కడదాక నాతో నీవేలే
ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచా !!
నా కలల వెన్నెల నీవేనే నీ కనుల చీకటి కనలేనే
నా మనసు మాటే వినదేమో ఈ వలపు మాయే విడదేమో
నేనేమొ చేపగ మారానే నీవేమొ నీరై పోయావే
ఓ క్షణము విడి వడి పోయామా ప్రాణాలు విలవిల లాడేనే
నీ పేరు మరువను క్షణమైనా నీ ప్రేమ విడువను కలనైనా
కను మూసినా కను తెరచినా నగుమోమే పిలుచును ఏ వేళా
ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచా
ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా ఎదనే పరిచా !!!
No comments:
Post a Comment