30 May 2011

చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి

చెప్పాలని ఉంది చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి
మనుషులలో కలసిన కధ చెప్పాలని ఉంది

పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్టి
మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కధ చెప్పాలని ఉంది

కోరనిదే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చి
కోరనిదే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చి
మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కధ చెప్పాలని ఉంది

అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో
అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో
ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలా తీరునో

నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే
నీ చల్లని మదిలో అ దేవికింత చోటిస్తే
ఆ లోకమె మరచి పోవు నీ లోనే నిలిచిపోవు ఆ ఆ ఆ ఆ ఆ

చుక్కలన్ని చూస్తున్నాయీ

చుక్కలన్ని చూస్తున్నాయీ
చుక్కలన్ని చూచేనూ ఫక్కున నవ్వేనూ
ఎక్కడైన దాగుందామా చక్కనైన చినవాడా

చందమామ వస్తున్నాడు చందమామ వచ్చేనూ
నిన్ను నన్ను చూసేనూ
ఎక్కడైన దాగుందామా అందమైన చినదానా

మల్లె తీగమాటున కళ్ళు కలుపుకుందామా
కళ్ళలోని కోరికతో మనసు నింపుకుందామా

మల్లె తీగమాటున మల్లెలన్ని చూచేనూ
కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే
కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే

కొలనులోని నీళ్ళలో కొంతసేపు వుందామా
కలలుగనే హృదయంలో వలపు నిలుపుకుందామా

కొలనులోన దాగుంటే అలలు మనను చూచేనూ
వలపులోని తీయదనం అలలే కాజేయులే
వలపులోని తీయదనం అలలే కాజేయులే

నా కన్నుల చాటుగా నిన్ను దాచుకుంటానే
నీకౌగిలి మాటుగా నేను నిదురపోతాలే
నేను నీకు తోడునే నేను నీకు నీడనే
నీవు నేను ఒకటైటే జీవితం స్వర్గమే
నీవు నేను ఒకటైటే జీవితం స్వర్గమే

చిలిపి చిలక వలకు పడిందోయ్

కింగిని మింగిని కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మియామావ్
కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మియా ఆ ఆవ్
కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్

హేయ్ చిలిపి చిలక వలకు పడిందోయ్
వలపు చిటిక చెలికి మహా నచ్చిందోయ్
ఉడుకు దుడుకు వయసుగనక
కునుకు విడని కలల వెనక
నదురు బెదురు అనక ఎగిరి పోతోందోయ్

ఫ్రీగా వదిలేసే నీ సోకు సైగ చూశా
డైలీ లైనేసి నిను పట్టేశా
పాపం తెగ చూసే నీ సంగతేదో చూశా
చాలా జాలేసి మనసిచ్చేశా
ఓటేసే వయసేలేదే మరి
లవ్ చేస్తే మతిచెడుతుందే
ప్రేమ పిచ్చి పుట్టుకొచ్చి తరుముకొచ్చెనోయ్
కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్

ముందే చెబుతున్నా చెడిపోకు పిచ్చికన్నా
దిగితే అయిపోతావ్ నువు దీవానా
నిండా మునిగాక దిగులేమీ ఉండదింక
నువ్వే అవునంటావే దిగి చూశాక
ఏమైనా ఎవరేమన్నా ఎదురేమున్నా ఇది ఆగేనా
ప్రేమ పిచ్చి పుట్టుకొచ్చి తరుముకొచ్చెనోయ్
కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్

గుండెలోన ఒక మాటుంది గొంతు దాటి రానంటుంది

గుండెలోన ఒక మాటుంది గొంతు దాటి రానంటుంది||2||
ఉండలేకా వెలికి రాకా ఉబ్బితబ్బిబ్బవుతోంది

గుండెలోన ఒక మాటుంది గొంతు దాటి రానంటుంది||2||
ఉండలేకా వెలికి రాకా ఉబ్బితబ్బిబ్బవుతోంది

నిదురలో ఒక కల వచ్చింది తెల్లవారే నిజమయ్యింది
నిదురలో ఒక కల ఒచ్చింది అది తెల్లవారే నిజమయ్యింది
ఆఆ ఆఆఆ ఆ నిజం నీతో చెప్పవస్తే నిండు మనసు మూగబోయింది

మూగబోయిన మనసులోనా రాగమేదో ఉంటుంది
ఆ నిజం మనకు తెలిసేలోగా నిదుర మళ్ళీ వస్తుంది

గుండెలోన ఒక మాటుంది గొంతు దాటి రానంటుంది
ఉండలేకా వెలికి రాకా ఉబ్బితబ్బిబ్బవుతోంది

ఆడ పిల్లకు పూలు బొట్టూ ఆది నుంచీ అందాలు
మనసు ఇచ్చే మనిషి వస్తే మారుతాయి అర్ధాలు

మనసు ఇచ్చిన మనిషితోటి మనుగడే ఆనందం
నొసట రాత రాసేవాడికే తెలుసు దాని అర్ధం

గుండెలోన ఒక మాటుంది గొంతు దాటి రానంటుంది||2||
ఉండలేకా వెలికి రాకా ఉబ్బితబ్బిబ్బవుతోంది

గుండెలోన ఒక మాటుంది గొంతు దాటి రానంటుంది
ఉండలేకా వెలికి రాకా ఉబ్బితబ్బిబ్బవుతోంది

కళ్యాణిని కళ్యాణిని కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని

కళ్యాణిని కళ్యాణిని
కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని
మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని

నీ ఆశల కుంచెలతో అనురాగాల రంగులతో
ఊహించుకో నను చిత్రించుకో ఎదలోన పదిలంగా నను దాచుకో కళ్యాణిని

చందమామ మోము ఆఆ
చారడేసి కళ్ళు ఆఆ
దొండపండు పెదవి పండు నిమ్మ పసిమి ఆఆ
కడలి అలల కురులు కానరాని నడుము
కన్నె సొగసులని కవులన్నారు అవి అన్నో కొన్నో ఉన్నదానను కళ్యాణిని

చందమామ మోము చారడేసి కళ్ళు ఉహూ దొండపండు పెదవి పండు నిమ్మ పసిమి

చల్లదనం పేరే ఆ ఆ చందమామ కాదా
చారడేసి కళ్ళే ఆ ఆ శాంతి ఝల్లు కాదా
పిలుపులోని వలపే పెదవి ఎరుపు కాదా
కనుగొన్నాను శిలగాని శిల్పాన్ని కవులైన కనరాని కళ్యాణిని కళ్యాణిని

ఇది తీయని వెన్నెల రేయి

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలు ॥తీయని॥

ఆ హా హా హా ఆహా ఆహాహా సుజా
నడిరాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపు
నడిరాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపు
నును చేతులతో నను పెనవేసి నా ఒడిలో వాలును నీవలపు

నా మనసే కోవెల చేసితిని ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు కనువిందులు చేసే శిల్పాలు

నీ పెదవులు చిలికే మధురిమలు అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు అనురాగము పలికే సరిగమలు
మన తనువులు కలిపే రాగాలు కలకాలం నిలిచే కావ్యాలు

అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని

అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
అందరిలో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా

నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవెల్లే నా నవ్వులో జారినా రంగులేరుకోదా
నీటి పొంగులో తుళ్లుతున్న చిట్టి చేప పిల్లై నా వేగమే ఇమ్మనీ నన్ను కోరుకోదా
రేగే నా ఊహల్ని ఊరేగనీ సాగే ఆ గువ్వల్ని ఓడించగా
నా సైగకు తలవంచి ఆ మేఘమే చినుకల్లే నా ముందే వాలిందిగా
ఒదిగున్న చిన్ని మనసే తొలి నడక నేచుకున్నదా
ఇక ఉన్న చోటనే ఉంటుందా

నిన్న లేని ఆ స్నేహమేదో నీడలాగ మారి నా తోడుగా చేరుతూ నన్ను వీడనందా
ఉన్నపాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి ప్రతి మలుపులో వింతలే నాకు చూపుతుందా
ఈ కలలే తీరేనా ఇన్నాళ్లకి సాయంగా మారిందా ఆ స్నేహమే
గుండెల్లో దాగున్న నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే
ఈ ఆశ జారిపోని తీరాన్ని చేరుకోనీ నూరేళ్ల జీవితం నాదవనీ

చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ

చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు
చిట్టి అమ్మలూ చిన్ని నాన్నలూ
మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు

ఎవరికెవరు వేశారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము
ఎవరికెవరు వేశారు బంధము
ఒకొరికొకరమైనాము ప్రాణము
నీకు నేను అమ్మనూ నాన్ననూ నీకు నేను అమ్మనూ నాన్ననూ
నాకు నీవే లోకాన సర్వమూ నాకు నీవే లోకాన సర్వమూ

హృదయాలను మూయవీ తలుపులు
విడదీశారమ్మా మన తనువులు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు
ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు తుడిచివేయవమ్మా నీ కన్నీళ్ళు

అన్న ఒడి వెచ్చదనం కోసం
కన్ను మూయకున్నావు పాపం
ఎదను చీల్చి పాడుతున్న జోలలు
ఎదను చీల్చి పాడుతున్న జోలలు నిదురపుచ్చులే నిన్ను అమ్మలు
నిదురపుచ్చులే నిన్ను అమ్మలు

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

పల్లవి :
కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు
ఇన్‌ఫ్యాట్యుయేషన్
॥కళ్లు॥

అనుపల్లవి :
ఎడమభుజము కుడిభుజము కలిసి
ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణిత సూత్రమిది
ఎంతో సహజం
సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం
॥కళ్లు॥
ఇన్‌ఫ్యాట్యుయేషన్... ఇన్‌ఫ్యాట్యుయేషన్...

చరణం : 1
దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంట
కోరికలకి కొలమానం ఈ జంట
సెంటీగ్రేడ్ సరిపోదంట
ఫారెన్ హీట్ పనిచేయదంట
వయసు వేడి కొలవాలంటే తంటా
లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ
అర్థం కాదు ఏ సైన్స్‌కైనా... ఓ...
పైకి విసిరినది కింద పడును
అని తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందులౌతది
ఇన్‌ఫ్యాట్యుయేషన్
॥కళ్లు॥

చరణం : 2
సౌత్ పోల్ అబ్బాయంట
నార్త్ పోల్ అమ్మాయంట
రెండు జంట కట్టే తీరాలంట
ధనావేశం అబ్బాయంట
ఋణావేశ ం అమ్మాయంట
కలిస్తే కరెంటే పుట్టేనంట
ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబట
ప్రాయానికే పరీక్షలంట... ఓ...
పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట
అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట
॥కళ్లు॥

29 May 2011

చిరంజీవ చిరంజీవ చిరంజీవ

చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..

చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..

జన్మించా మరోసారి జీవించా నిన్నే కోరి ..
దిగిదిగి వచ్చా నీదారి నందా ..

సంధించా నీపై గురి .. సాధించా సరాసరి
సరసకు వచ్చా అలకల నందా ..

అలకేదో పిలుపిచ్చిందా ?
అది నీకే తెలిసోచ్చిందా ?
చెడి ప్రయాల పూమాల తెగ నచ్చిందా ?


చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..

చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..

ఝుం ఝుమ్మని ఝుం ఝుమ్మని మంత్రంలా
నీ ఆలోచనలే రా రమ్మని రగిలిస్తే వస్తున్నా ..

రిం జిమ్మని రిం జిమ్మని వర్షంలా
నీ ఆశల జల్లే నా కొమ్మను కదిలిస్తే లేస్తున్నా

మనసును మాత్రం చదివే ప్రాణక్షరాల
ప్రేమల గీతం రాస్తున్నా

రాసిందే జరిగుంటుందా ?
రాయందే ఎదురయ్యిందా ?
ఒక రాయంటి ఎద నేడు రవళించిందా ?

చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..

ఘుం ఘుమ్మని ఘుం ఘుమ్మని గుండెల్లో ..
గువ్వలుగా ఎగసే ఘుమ్మేత్తిన గమ్మతులు తెస్తున్నా

ఎంతేంతని ఎంతేంతని చెప్పాలో
ఏం తోచక నేనే గొంతేత్తని గిలిగింతై చూస్తున్నా

మాటలకద్దం పట్టే మౌనంరుతల
ముద్దుల పట్టా ఇస్తున్నా

ఇచ్చిందే సరిపోతుందా ?
ఇవ్వల్సిందింకా వుందా ?
ఇక నాలోన నాదంటూ వేరేముందా ?

చిరంజీవ చిరంజీవ చిరంజీవ ..
సుఖీభవ సుఖీభవ సుఖీభవ ..

జన్మించా మరోసారి జీవించా నిన్నే కోరి ..
దిగి దిగి వచ్చా నీ దారి నంద ..

సంధించా నీపై గురి .. సాధించా సరాసరి
సరసకు వచ్చా అలకల నందా ..

వసుధార వసుధార

వసుధార వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార

ఆధార నా ప్రేమకధారం అవుతుంటే ..ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే ..
వాన జల్లుతో వంతేనేయగా .. వెండి పూలతో దండ లేయగ ..
వయసే నదిలా, వరదై నదిలా ..

వసుధార వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార

నింగి వీలల రాగం వినగానే .. మేళ వేణువు మౌనం కరిగే ..
నీలో నాలో అభిమనమై .. నీకు నాకు అభిషేకమై ..
మన మానస వీధుల్లో కురిసేనే ..

వసుధార వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార

నీటి లేఖల భావం చదివానే .. నీటి రాతలు కావి చెలిమే ..
అంతే లేని చిగురింతలై .. సంతోషాల చెమరింతలై ..
తడి ఆశల అక్షతలై మెరిసేనే ..

వసుధార వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార .. వైభవంగా వస్తుంది వసుధార

అంబదరి జగదాంబదరి

అంబదరి జగదాంబదరి .. నా వెన్న అదిరి .. కుడి కన్ను అదిరి
లంబదరి బ్రమరంబదరి .. నా చెంప అదిరి .. అర చేయి అదిరి

నువ్వా ఆ దరి .. నేనా ఈ దరి .. నీ నా ఆశలు ముదిరి
రే ఆఖరి పగలు ఈ దరి .. రెండిక నిదరే చెదిరి

అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి .. నిన్ను నన్ను కలిపెను బదరి
స స రి రి గ గ బదరి .. స స రి రి గ గ బదరి

నువ్వు పలికే మాటేదైనా అది నాకు పాట కచేరి ..
నువ్వు నడిపే బాటేదైనా అది నాకు పల్లకి స్వారీ ..

నువ్వు నిలిచే చోటేదైనా అది నాకు మధుర నగరి ..
నీ చేసే పని ఏదైనా అది నాకు మన్మధ లహరి ..
ప్రేమ ఆ దరి .. విరహ ఈ దరి .. చివరికి విరహం చెదిరి
నిన్న ఆ దరి .. నేడు ఈ దరి .. రేపటి తపం ముదిరి

అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి .. నిన్ను నన్ను కలిపెను బదరి
స స రి రి గ గ బదరి .. స స రి రి గ గ బదరి

క్షణమైనా విడలేనంటూ కడుతున్నా కౌగిలి ప్రహరి
కౌగిళ్ళే సరిపోవంటూ మ్రోగించ ముద్దుల భేరి
ఉక్కసలె చాలదు అంటూ తెస్తున్న తేనె ఎడారి
తేనెలతో తీరదు అంటూ తనువిచ సరస విహారి
సరసం ఆ దరి .. సిగ్గే ఈ దరి .. మధ్యే మార్గం కుదిరి
స్వర్గం ఆ దరి .. భూమే ఈ దరి .. మధ్యన మనకే ముదిరి

అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి .. నిన్ను కలిపెను బదరి
స స రి రి గ గ బదరి .. స స రి రి గ గ బదరి

అంబదరి జగదాంబధరి .. నా వెన్న అదిరి .. కుడి కన్ను అదిరి
లంబదరి బ్రమరంబధరి .. నా చెంప అదిరి .. అర చేయి అదిరి

నువ్వా ఆ దరి .. నేనా ఈ దరి .. నీ నా ఆశలు ముదిరి
రే ఆఖరి పగలు ఈ దరి .. రెండిక నిదరే చెదిరి …

అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి .. నిన్ను నన్ను కలిపెను బదరి
స స రి రి గ గ బదరి .. స స రి రి గ గ బదరి

కన్ను మూస్తే బద్రీనాథ్

కన్ను మూస్తే బద్రీనాథ్ .. కన్ను తెరిస్తే బద్రీనాథ్
కోడి కూస్తే బద్రీనాథ్ .. లేడి లేస్తే బద్రీనాథ్
కళ్ళు గిర గిర గిర మంటూ తిరిగే తలపే బద్రీనాథ్
నాథ్ నాథ్ .. నాథ్ నాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రీనాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీకు జిందాబాద్

కన్ను మూస్తే బద్రీనాథ్ .. కన్ను తెరిస్తే బద్రీనాథ్
కత్తి దూస్తే బద్రీనాథ్ .. అంతు చూస్తే బద్రీనాథ్
మదిలో మెర మెర మేరమంటూ మెరిసే మెరుపే బద్రీనాథ్
హే నాథ్ నాథ్ .. హే నాథ్ నాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీకో బద్రీనాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీలో బద్రీనాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీకో బద్రీనాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్ పల్ తేరి యాద్

నీ చూపులన్నీ నిప్పులుగా పోగేస్తా .. ఆ ఉడుకులోనే ఎప్పటికి గడిపేస్తా

ధూమ్ దమక దొల్ బజారు ధూమ్ తక నక ధూల్ మచ

నీ పైట కొంగే నిచ్చేనగా పైకొస్తా .. నీ నుదుట జారే ముచ్చేమటై దిగి వస్తా

మిత్రునివైన నువ్వే .. నా ప్రియ శత్రువు ఐన నువ్వే
ప్రేమికుడైన నువ్వే .. సోకుల శ్రమికుడైన నువ్వే నువ్వే
నాథ్ నాథ్ .. నాథ్ నాథ్ ..
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రీనాథ్

నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రీనాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్ పల్ తేరి యాద్

నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంట ..మురిపాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా

నీ గుండెలోని గదిలోనే దిగి ఉంటా .. ఇంటిద్దేగా నా అందాలే అందిస్తా

ఇష్టం ఐన నువ్వే .. కమ్మని కష్టం ఐన నువ్వే
స్వర్గం ఐన నువ్వే .. నచ్చిన నరకం ఐన నువ్వే నువ్వే
నాథ్ నాథ్ .. నా నా నా నాథ్ నాథ్

నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీకు జిందాబాద్
కన్ను మూస్తే బద్రీనాథ్ .. కన్ను తెరిస్తే బద్రీనాథ్
కోడి కూస్తే బద్రీనాథ్ .. లేడి లేస్తే బద్రీనాథ్
కళ్ళు గిర గిర గిర మంటూ తిరిగే తలపే బద్రీనాథ్
నాథ్ నాథ్ .. నాథ్ నాథ్ ..
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్

నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రీనాథ్

నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రీనాథ్

నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్ పల్ తేరి యాద్

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి

హరి ఓం .. హరి ఓం … హరి ఓం …
హరి ఓం .. హరి ఓం … హరి ఓం …
హరి ఓం .. హరి ఓం … హరి ఓం …
హరి ఓం .. హరి ఓం … హరి ఓం …
హరి ఓం .. హరి ఓం … హరి ఓం …

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి ..
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ..

ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది ..
వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది ..

అలక నంద జల సంగీతం శ్రీహరి నామం ..
ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం ..
జ్ఞానం , మోక్షం మొసగే వైకుంఠం ..

హరి ఓం .. హరి ఓం … హరి ఓం …
ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి ..
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ..

హరి ఓం .. హరి ఓం … హరి ఓం … యా ..యా ..యా
జై బోలో బద్రీనాథ్ ..జై బోలో ..బోల్ ..బోల్ ..బోల్ ..
జై బోలో బద్రీనాథ్ ..జై బోలో ..బోల్ ..బోల్ ..బోల్ ..

ఆ …యా …యా .. దినక్ దిన్ …

హరి పాదం అడుగున గంగ .. కలి పాపం తను కడగంగా ..
హరి పాదం అడుగున గంగ .. కలి పాపం తను కడగంగా ..

కనులే కనలేని విరజానది ఇలా దిగి రాగ ..
కలలా కనిపించే జల దార సరస్వతి పొంగ ..

సుడులు తిరిగి వాడిగా వురుకులేత్తగా
చాదులు కడిగి పుణ్య ఫలమునివ్వగా
శ్రుతులు గ్రుతులు జాతులు గతులు చెలరేగా యా …ఆ ..యా ..యా …

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి ..
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ..

రి ప సి దాస ప స రి ప రి ప సి ప స రి స
వుయ్యి య .. వుయ్యి ..య .. కువ్వ ..కువ్వ ..కువ్వ ..వుయ్యా ….

కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం ..
కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం ..

వ్యాసం , ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచిన్చంగా
కాంతం గణపతిడై కురు చరితము విరచిన్చంగా
యజ్జుసామురుక్ అదర్వ శాకలుగా ఆ ఆ .యా …యా …

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి ..
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ..

ఈ కొండపై మాకండగా ఆ విష్ణు పాదమే వెలసింది
వేదాలనే విరచించిన శ్రీ వ్యాస పీటమై నిలిచింది

అలక నంద జల సంగీతం శ్రీహరి నామం
ఉష్ణ కుండ జల దారాలలో హరి భక్తుల స్నానం
జ్ఞానం , మోక్షం మొసగే వైకుంఠం

ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదిరి ..
వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ..

హరి ఓం .. హరి ఓం … హరి ఓం … యా ..యా ..యా
జై బోలో బద్రీనాథ్ ..జై బోలో ..బోల్ ..బోల్ ..బోల్ ..
జై బోలో బద్రీనాథ్ ..జై బోలో ..బోల్ ..బోల్ ..బోల్ ..

నేనే నేనే నీదాన్ని నీలో దాన్నీ

నేనే నేనే నీదాన్ని నీలో దాన్నీ..నా ప్రాణం నీదే..
నేనే నీవై నీడల్లే నీతోడుంటా..ఈ జీవితమంతా..
ఓ నదియే నన్నే మార్చి ఎండి పోగా..ఓ వానల్లే నను చేర మళ్ళీ వచ్చావ్..
నా దాహాన్ని తీర్చకనే కడలి లో కలిసినావ్

||నేనే నేనే||

కన్నా ఓ కన్నా నే నిన్నే కనలేక..
గగనం ఈ భువనం ఎంతో తలచానే
అబ్బీ ఓ రబ్బీ నా మనసును తెలిపాకే..
ఆత్మే నా ఆత్మే నా చెంతకు చేరిందే..
వేసవి యే వచ్చాక నీరే తేనవదా..
విరహం తో మరిగాక స్నేహం రుచి అవదా
నడిపించాఒక దూరం నా బ్రతుకే నీకోసం
ప్రేమిస్తా పదనేస్తం నిన్నింకా జన్మాంతం..

నేనే నేనే నీ వాణ్ణే నీలో వాణ్ణే..నా ప్రాణం నీదే..
రావే రావే నా నీడల్లే.. నీతోడుంటా నా జీవితమంతా..

దొంగా హే దొంగా నువ్ కాదని పొమ్మంటే..
కళ్ళూ నా ఒళ్ళూ నా మాటే వినలేదే..
ఎదలో ప్రేమే ఉంటే అది వాడే పోలేదే..
గుండే ఏనాడూ నిను మరిచే పోలేదే..
ఆకాశాం గతిమార్చి పోతే పోనివ్వూ..
అయినా నువ్ నన్నె మరిచీ పోనే వద్దంటా..
నువ్వొచ్చే తారకలా నే ఉన్నా నీకు అలా..
దివి మన్నై పోతున్నా మన ప్రేమలు మారవు లే..

నేనే నేనే నీదాన్ని నీలో దాన్నీ..నా ప్రాణం నీదే..
అమ్మీ అమ్మీ నే నీ వాడ్ని నే నీతోడుంటా నా జీవితమంతా..
ఓ నదియే ననేమార్చి ఎండి పోగా..ఓ వానల్లే నను చేర మళ్ళీ వచ్చావ్..
నీ దాహాన్ని తీర్చేటి ప్రేమనై వచ్చినా..

కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే

కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నా లోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించేయ్ యల్లోరా ప్రతిమా..
పసి చిలకా పసి చిలకా నీ కలనే కన్నానే
పరవశమే బల పడగా నేనీవనుకున్నానే చేరాలే..

||కళ్ళు మూసి||

కడలై పొంగిన మాటలు అన్నీ ముత్యపు చినుకులై రాలే
మౌనం మింగిన మాటలు మాత్రం మది విడవే..
దారే తెలియని కాళ్ళ కు అడుగులు నేర్పింఛావు గ నేస్తం
దూరం భారం కాలం అన్నీ దిగదుడుపే..
ఎదలోకి ప్రేమొస్తే కమ్మేను కలవరమే..
మిన్నేటి మెరుపల్లే విహరిస్తాను క్షణమే..

||కళ్ళు మూసి||

ఆశే చిన్న తామరముల్లై విచ్చని గుండెని పొడిచే
మౌనం కొంచెం బలపడి మళ్ళీ ఉసిగొలిపే..
అయ్యో భూమీ నన్నే విడిచీ చుట్టూ తనకై వెతికే..
అయినా దాగే ఎదలో ఏదో ఒక మైకం..
ప్రేమ తొలి మరుపా..ఘనమైన చెలి తలపా
ఒక మోహం ఒక పాశం కుదిపేసే కధ మధురం..

||కళ్ళు మూసి||

ఓ వెన్నెల... తెలిసేదెలా నే...

పల్లవి :
ఓ వెన్నెల... తెలిసేదెలా నే...
ఓ నేస్తమా... నిలిచేదెలా నే...
కళ్లు కళ్లు కలిశాయంటా
వలపే పూవై పూచిందంటా
నమ్మినవారే పువ్వుని కోస్తే
నీ ఎదలో బాధ తీరేదెట్లా ॥కళ్లు॥
ఓ వెన్నెల కలిపేదెలా...

చరణం : 1
జడివాన నింగినీ తడి చేయునా?
గంధాలు పూవుని విడిపోవునా?
న న్నడిగి ప్రేమా ఎదచేరెనా
వలదన్న ఎదనూ విడిపోవునా
మరిచాను అన్న మరిచేదెలా
మరిచాక నేను బ్రతికేదెలా
ఓ వెన్నెల కలిపేదెలా నే...

చరణం : 2
వలపించు హృదయం ఒకటే కదా
ఎడమైతే బ్రతకూ బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే
కలనైన కూడా నీ ధ్యానమే
మదిలోని ప్రేమా చనిపోదులే
ఏనాటికైనా నిను చేరులే
॥వెన్నెల॥

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై

పల్లవి :
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై
వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై


చరణం : 1
సరదా సరదాలెన్నో అందించావే
సమయం గురుతే రాని సావాసంతో
విరహం చెరలో నన్నే బంధించావే
ఎపుడూ మరుపేరాని నీ అందంతో
ఆహ్వానం పంపించానే ఆనందం రప్పించావే
రెప్పల్లోన తుళ్లే చూపుల్తో
ఆరాటం ఊరించావే మోమాటం వారించావే
చేరువలోన చేసే దూరంతో చెలియా... ఆ...


చరణం : 2
అసలే వయసే నన్ను తరిమేస్తుంటే
అపుడే ఎదురౌతావు ఏం చెయ్యాలే
అసలీ తడబాటేంటని అడిగేస్తుంటే
సరిగా నమ్మించే బదులేం చెప్పాలే
తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు
ఎన్నాళ్లింక కాలం గడపాలే
నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు
ఎవ్వరితోనా కబురంపించాలే చెలియా... ఆ...

23 May 2011

అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ

వేలగాని వేలలో
ఊరు విడిచి దూరంగా
కారెక్కి ఒంటిగా
గాలి మేయ వచ్చిన బూచి నంగనాచీ ఈ ఈ
అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ
బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట
అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ
బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలచిందిలే
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలచిందిలే
అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ
బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట

చల్లనీ వెన్నెల కాస్తుంటే
చల్లగా ఇంట్లో నేనుంటే
తలుపు మూసి చెప్పకనే ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ
దౌడేసిన రాకాసి ఓ రాకాసి
అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ
బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట
హేయ్ అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ
బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట

హే బస్తీ కిలాడి
నా పేరే పల్లెటూరి వస్తాదు రఔడీ
నీ తెలివంతా చూపి నను గెలిచావా ఆ లేడి
చిక్కావు చేతిలో కేది షోకైన లేడీ
అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ
బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట
హేయ్ అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ
బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలచిందిలే
అనుకున్నదొక్కటీ అయినది ఒక్కటీ
బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట

22 May 2011

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక అందించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో
నవ మల్లిక చినవోయెను
నవ మల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ
వనరాణియె అలివేణికి సిగపూలు తురిమెనూ
రేరాణియె నా రాణికి
రేరాణియె నా రాణికి పారాణి పూసెను
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారక
ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారక
నా గుండెలొ వెలిగించెను
నా గుండెలొ వెలిగించెనుసింగార దీపిక

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక
ఒక రాధిక అందించెను నవరాగ మాలిక
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే

ఓఓఓఓఓ ఆఆఆఆ లలలలాలలల
మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే

నన్నే నీవు అమ్మ అన్ననాడు
మీ నాన్నమనసు గంతులువేసి ఆడూ
నన్నే నీవు అమ్మ అన్ననాడు
మీ నాన్నమనసు గంతులువేసి ఆడూ
మంచికాలం మరలా రాదా
ముళ్ళబాటే పూలతోటా
ఆనందంతోఅనురాగంతోనామది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే

గూటిలోని పావురాలు మూడూ
అవి గొంతుకలిపి తీయని పాట పాడూ
గూటిలోని పావురాలు మూడూ
అవి గొంతుకలిపి తీయని పాట పాడూ
మంచుతెరలూతొలగీపోయీ
పండువెన్నెలా కాయునులే
ఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతోఅనురాగంతో నా మది ఆడునులే
ఆఆఆఆ లలల లాలలల

09 May 2011

చీరలోని గొప్పతనం తెలుసుకో

చీరలోని గొప్పతనం తెలుసుకో
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర
ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర ॥చీరలోని॥

మడికట్టుతో నువ్వు పూజచేస్తే
గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే
సిరిలకిని కురిపించును పంటలు
జారుకట్టుతో పడకటింట చేరితే
గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే
దండాలే పెడతారు అందరూ
అన్నం తిన్న తదుపరి
నీ మూతిని తుడిచేది
కన్నీరై ఉన్నప్పుడు
నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది ॥చీరలోని॥

పసిపాపలా నిదురపోయినప్పుడు
అమ్మ చీరేనే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు
ఈ చీరేగా అందాలకు అడ్డుతెర
గాలి ఆడకా ఉక్కపోసినప్పుడు
ఆ పెటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు
ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది
భారతీయ సంస్కృతిని
సగర్వంగా చాటేది
మన జాతీయ జెండాకు
సమానంగా నిలిచేది ॥చీరలోని॥

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చేసింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు
అకలిని నిదురను మరిచి అలుపెరుగక
వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా

అది మోనాలీసా చెల్లెలోమరి మోహం పెంచే వెన్నెలో
అది బంగారానికి బందువో నా దాహం తీర్చే బిందువో
ఏవరిది అసలెవరిదిఇంతలా నను నిలివునా తడిపిన తొలకరి చినుకులా
వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా

ఏ పనిలేదు ఏమిటోనా పై తనకి ఈ హక్కేమిటో
నన్నే నాకు వేరుగా నెట్టేసే ఈ ప్లాను ఏమిటోహాయిదీ తొలి దిగులిది
వింతగా యెద తొలిచిన గెలిచిన సొగసరి చిలకను
వెతికా వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు
అకలిని నిదురను మరిచి అలుపెరుగక
వెతికా వెతికా వెతికా

మళ్ళీ మళ్ళీ మెరుపులా నా కళ్ళను తాకిందో కల
అది చంపేస్తోంది రోజు ఇలా రగిలే సెగలా
గుండెల్లోన కొడవలా అది చిచ్చే పెట్టిందేంటిల
తెగ మార్చే సింది నన్నిలా నడిచే కలలా

08 May 2011

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా

Eh Eh Eh Eh Eh Eh Eh Oh Girl
వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
ఇల్లాగ ఎదురురాగ పలకరించ కలవరించా
అందాల రాజహంస నడకచూసి పరవశించా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
నీ ప్రేమలోన పడితినమ్మో

మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహ్ లా
మతిచెడి పలువిధాల వలపు రేగే ముజ్కో పెహ్ లా
మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహ్ లా
మతిచెడి పలువిధాల వలపు రేగే ముజ్కో పెహ్ లా
కులాసా కులుకు తార అలుకమాని పలుకవేలా
బడాయి తగదు బేల వగలుమాని వినవదేలా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
నీ ప్రేమలోన పడితినమ్మో

Around beside you is where I belong longer
when your heart, when your soul
May be I will share your world
You too can feel what I feel inside girl
I don't wanna let you go
So come on girl say ya ya ya yaa
I can feel it turn around
Surely we make a bond
God I know the swedish band
Come on Come on I'm gonna get you in it

నడకలు హొయలు మీర ఇలకు జారె జగన తార
కదిలెను సుగుణశీల అలవికాని అభినయాల
నడకలు హొయలు మీర ఇలకు జారె జగన తార
కదిలెను సుగుణశీల అలవికాని అభినయాల
కల్లోలమయ్యి మునిగి ఉల్లమెల్ల మోహనాలా
సమ్మోహనాలు కలిగి తనివితీర తంభీ డోలా చమ చమ చమ చమకుతార
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
Damn it నీ ప్రేమలోన పడితినమ్మో

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
ఇల్లాగ ఎదురురాగ పలకరించ కలవరించా
అందాల రాజహంస నడకచూసి పరవశించా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
నీ ప్రేమలోన పడితినమ్మో