మనసా కవ్వించకే నన్నిలా
ఎదురీదలేక కుమిలేను నేనూ
సుడిగాలిలో చిక్కినా నావను
మనసా కవ్వించకే నన్నిలా
ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా
ఈనాడు చీకటి లాగా మిగిలాను చీకటిలోనా
నేనోడిపోయి గెలుపొందినాను
నేనోడిపోయి గెలిపొందినాను
గెలిచానని నవ్వనా ఏడ్వనా ఆ ఆ
మనసా కవ్వించకే నన్నిలా
మోముపై ముంగురులేమో వసివాడి మల్లియలాయే
గుండెలో కోరికలన్నీ కన్నీటి చారికలాయే
ఏ తీవెకైనా కావాలి తోడూ
ఏ తీవెకైనా కావాలి తోడు
నా జీవితం శాపమా పాపమా ఆ ఆ
మనసా కవ్వించకే నన్నిలా
ఎగిరింది కడలి కెరటం ఆ నింగి స్నేహం కోసం
ఎగిరింది కడలి కెరటం ఆ నింగి స్నేహం కోసం
ఏనాటికైనా అవి చేరువౌన
కెరటానికి నింగికి స్నేహమా
No comments:
Post a Comment