అదిగదిగో గగనసీమ, అందమైన చందమామ ఆడెనోయి
ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి
ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి పాడెనోయి
హాయి హాయి ఈ లోకం తీయనైనదీ లోకం
నీ ఇల్లే పూల వనం నీ సర్వం ప్రేమ ధనం
మరువకోయి ఈ సత్యం
నీ కోసమే జగమంతా నిండెనోయి వెన్నెలలు
తేలెనోయి గాలి పైన తీయనైన కోరికలు
చెరుపుకోకు నీ సౌఖ్యం చేతులార ఆనందం
యేనాడును పొరపడకోయ్
యేనాడును పొరపడకోయ్ యేమైన తొరపడకోయ్
మరల రాదు రమ్మన్నా మాయమైన ప్రేమధనం
చివురింపదు తిరిగీ వాడి చెడిన పూలవనం
మరువకోయి ఈ సత్యం
No comments:
Post a Comment