01 November 2011

ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట

ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట
ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట
పగిలిన నాగుండెలలో పగిలిన నాగుండెలలో
రగులుతున్న రాగం ఈ పాటా ఆ ఆ ఆ ఆ
ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట ఆ ఆ ఆ

పువ్వులకే నవ్వులు నేర్పిన ప్రేమతోట ఇది ఒక నాడు
చిగురించన మోడులకు నిదురించని గుండెలలో
చితిపేర్చిన వల్లకాడు ఈ నాడు ఊ

కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం
కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం
ఇక్కడే ఏ ఏ ఏ ఏ ఏ ఏ కదులుతూంది వ్యధతో ఒక ప్రాణం

శీలానికి కాలం మూడి కాలానికి ఖర్మం కాలీ
న్యాయానికి గాయం తగిలీ గాయంలో గేయం రగిలి
నెత్తురిలో దీపం వెలిగే వెలుతురుకే శాపం తగిలే

ఇది మాతృహృదయమే మృత్య నిలయమయి ఎగసిన విలయ తరంగం ఊ
మది రుద్రవీణ నిర్విద్రగానమున పలికే మరణమృదంగం

అందుకే ఏ ఏ ఏ ఏ
పలుకుతుంది శ్లోకం నా శోకం మూ ఊ ఊ
ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట ఆ ఆ ఆ

చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి

ఊ ఊ ఊ ఊ ఊ ఊహూ
లాల లార రరా రా రా రా రా ఊహూ

చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి
చెరిసగమయినామందుకో ఓ ఓ ఓ తెలిసి తెలిసి తెలిసి
కలవని తీరాల నడుమ కలకల సాగక యమునా
వెనుకకు తిరిగి పోయిందా మనవు గంగతో మానిందా ఆ
ఊ ఊహూ ఊహూ
చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి
చెరిసగమయినామందుకే ఏ ఏ ఏ తెలిసి తెలిసి తెలిసి

జరిగిన కథలో బ్రతుకు తెరువులో దారికి అడ్డం తగిలావూ ఊ ఊ
ముగిసిన కథలో మూగ బ్రతుకులో ఓ నా దారివి నీవయి మిగిలావూ ఊ

పూచి పూయని పున్నమలో ఎద దోచి తోడువై పిలిచావు
గుండెలు రగిలే ఎండలలో నా నీడవు నీవై నిలిచావు ఆ ఆ ఆఅ ఆఅ ఆఅ
చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి
చెరిసగమయినామందుకే ఏ ఏ ఏ తెలిసి తెలిసి తెలిసి

తూరుపు కొండల తొలి తొలి సంధ్యల వేకువ పువ్వు వికసిస్తుందీ ఈ ఈ ఈ
విరిసిన పువ్వూ ఊ ఊ కురిసిన తావి
విరిసిన పువ్వూ కురిసిన తావి
మన హృదయాలను వెలిగిస్తుంది ఈ ఈ ఈ
చీకటి తెరలు తొలిగిస్తుంది
ఊహు ఊహూ అహ అహా ఆహ ఆహా ఆ ఆ

గోవిందా గోవిందా జారిందా జారిందా

గోవిందా గోవిందా జారిందా జారిందా
కాలు జారిందా నేల జారిందా
హారి కన్నెపిల్ల పైట జారిందా
పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా


గోవిందా గోవిందా జారిందా జారిందా
కాలు జారిందా నేల జారిందా
హారి కన్నెపిల్ల పైట జారిందా
పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా
పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా
గోవిందా గోవిందా

కోక తడిసిపోయిందా కొత్త మెరుపు తీరిందా
బుర్రు బుర్రు మంటుందా కొరుక్కు తిందామని వుందా
అహ అహ అహ
కోక తడిసిపోయిందా కొత్త మెరుపు తీరిందా
బుర్రు బుర్రు మంటుందా కొరుక్కు తిందామని వుందా

కొంగునట్టా గుంజుకోకూ కుర్రవాణ్ణి నంజుకోకు
కొంగునట్టా గుంజుకోకూ కుర్రవాణ్ణి నంజుకోకు

గోవిందా గోవిందా జారిందా జారిందా
కాలు జారిందా నేల జారిందా
హారి కన్నెపిల్ల పైట జారిందా
పైటతోటి పడుచువాడి గుండె జారిందా
పైటతోటి పడుచువాడి గుండె జారిందా
గోవిందా గోవిందా


కొంగు గాలి తగిలిందా కోర్కె కాస్త తీరిందా
తీట నీకు వచ్చిందా లోటుపాటు తెలిసిందా
అహ అహ అహ
కొంగు గాలి తగిలిందా కోర్కె కాస్త తీరిందా
తీట నీకు వచ్చిందా లోటుపాటు తెలిసిందా

ఆశలింకా పెంచుకోకు అలసిపోయి సోలిపోకు
హాయ్ హాయ్ హాయ్ ఆశలింకా పెంచుకోకూ అలసిపోయి సోలిపోకు

గోవిందా గోవిందా జారిందా జారిందా
కాలు జారిందా నేల జారిందా
హారి కన్నెపిల్ల పైట జారిందా
పైటతోటి పడుచువాడి గుండె జారిందా

పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా
పైటతోటి పడుచువాడి గుండె జారిందా
గోవిందా గోవిందా

క్షేమమా ప్రియతమా సౌఖ్యమా నా ప్రాణమా

ఏహే ఏహే లాలలాలలా
ఆహా ఆహా లాలలాలలా

క్షేమమా ప్రియతమా సౌఖ్యమా నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా (2)

నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక పదిలమా

నీలోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు క్షేమమా (నీలి కురుల)

చలి గాలి గిలిగింత సౌఖ్యమా చెలి మీద వలపంతా సౌఖ్యమా
నీ క్షేమమే నా లాభము నీ లాభమే నా మోక్షము ||క్షేమమా||

కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు పదిలమా

నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా (కాలమల్లె)

తహతహలు తాపాలు సౌఖ్యమా బిడియాలు బింకాలు సౌఖ్యమా
నీ సౌఖ్యమే నా సర్వమూ ఆ సర్వమూ నా సొంతమూ ||క్షేమమా||

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను
ఏనాడో నేను నీదాన్నీ నీ హృదయానికి అనువాదాన్ని హూ హూ హూ
కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

ఇంత మంచి తరుణం ఇంకెందుకూ కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత మంచి తరుణం ఇంకెందుకూ కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత పొంగు పరువం నీకెందుకు ఇంత పొంగు పరువం నీకెందుకు
కౌగిలింతలో కమ్మేసేటందుకు ఊ ఊ

ఆరడుగుల వాడివే ఆరిపోని వేడివే
మంచులా మౌనిలా మాటాడకున్నావేం
మంచులా మౌనిలా మాటాడకున్నావేం

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తలపు రేకు విప్పింది ఇప్పుడే తలపు రేకు విప్పింది ఇప్పుడే
మరి వలపు పంట పండాలా అప్పుడే ఊ ఊ

ఆకు మాటు పిందెవే అరుగు దిగని పాపవే
చింతలు వంతలు నీకేమి తెలుసునులే
చింతలు వంతలు నీకేమి తెలుసునులే

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను
కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను
ఏనాడో నేను నీవాణ్ణి నీ హృదయానికి అనువాదాన్ని హూ హూ

కోరుకున్నాను హ హ హ
నిన్నే చేరుకున్నాను హ హ హ
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను ఆ రోజు రానీ అని ఊరుకున్నాను

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారని వాళ్లను మీ తరమైనా మార్చాలి

మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మెప్పుల కోసం చెప్పేవాళ్లను మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి

అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు
అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు
అందరి దేవుడు ఒకడే ఐతే
అందరి దేవుడు ఒకడే ఐతే ఎందుకు కోటి రూపాలు

అందరి రక్తం ఒకటే కాదా ఎందుకు కులమత భేదాలు
అందరి రక్తం ఒకటే అయితే
అందరి రక్తం ఒకటే అయితే ఎందుకు రంగుల తేడాలు
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

తెలిసి తెలిసి బురద నీటిలో ఎవరైనా దిగుతారా
ఆ బురదలోనే అందాల కమలము పుడుతుందని మరిచేరా

కమలం కోసం బురదలోనే కాపురముండేదెవరు
మనసులోని బురద కడుగుకొని మనుషుల్లా బతికేవారు
సమధర్మం చాటేవారు సమధర్మం చాటేవారు
వారిదే ఈనాటి తరం వారిదే రానున్న యుగం
వారిదే ఈనాటి తరం వారిదే రానున్న యుగం
కాదనే వారు ఇంకా కళ్లు తెరవనివారు
మేలుకోక తప్పదులే మేలుకోక తప్పదులే
మారిపోక తప్పదులే తప్పదులే

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారనివాళ్లను మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో

విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో
శృతిని మించి రాగమేదో పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో ఓ
విరహ వీణ నిదుర రాక వేగే వేళలో
ఆ ఆ వేగే వేళలో

జడలో విరులే జాలిగ రాలి జావళి పాడేనురా
సా పదసరిగ గా దపదసరి గాదపాగ
గాపరీగ సరిగరి సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా ఆ

జడలో విరులే జాలిగ రాలి జావళి పాడేనురా
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా
లేలేత వలపు సన్నాయి పిలుపు రావాలి సందిళ్ళ దాకా
మన పెళ్ళిపందిళ్ళ దాకా ఆ ఆ
విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో ఆ వేగే వేళలో

ఎదలో కదిలే ఏవో కథలు ఏమని తెలిపేదిరా
చీకటిపగలు వెన్నెల సెగలు నీ నీడ కోరేనురా
ఈ నాటకాలు మన జాతకానా రాశాయిలే ప్రేమలేఖా
ఈ దూరమెన్నాళ్ళ దాకా ఆ ఆ

విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో
శృతిని మించి రాగమేదో పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో ఓ
విరహ వీణ నిదుర రాక వేగే వేళలో వేగే వేళలో

కలిసే కళ్ళలోనా కురిసే పూలవానా

కలిసే కళ్ళలోనా కురిసే పూలవానా
విరిసెను ప్రేమలు హృదయానా

పెరిగీ తరిగేను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజూ ||2||
ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే

ఎదురుగా చెలికాణ్ణి చూశాను ఎంతో పులకించి పోయాను ||2||
ఈపొందు కలకాలం నే కోరేను

కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ ||2||
మనలోని పరువాలు పెనవేయాలనీ |కలిసే ||
లాల లాలా లల లాలా

చిన్న మాట ఒక చిన్న మాట

చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట
సందె గాలి వీచి సన్నజాజి పూసీ
సందె గాలి వీచి సన్నజాజి పూసీ
జలధరించే చల్లని వేళ
చిన్న మాట ఒక చిన్న మాట
ఆ చిన్న మాట ఒక చిన్న మాట

రాక రాక నీవు రాగ వలపు యేరువాక
నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
రాక రాక నీవు రాగ వలపు యేరువాక
నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా

నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్విలిస్తే పూజ చేస్తా
వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట
చిన్న మాట ఒక చిన్న మాట
ఆ చిన్న మాట ఒక చిన్న మాట

కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె
నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే
అందమంతా ఆరబోసి మల్లె పూల పానుపేసి
వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట

ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది

ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది

సఖియా ఆ ఆ నీవెంతటి వంచన చేసావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం

ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది

తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే ఏ
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే

ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది ఓ ప్రియా

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు
తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు

ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో

పొదలో ప్రతిపూవ్వూ పొంచి పొంచి చూసినదీ
గూటిలో ప్రతిగువ్వా గుసగుసలాడినదీ
కలసిన కౌగిలిలో కాలమే ఆగినదీ
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు

చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా
ఆహా చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా

ఆ కొంటెగా నిన్నేదో కోరాలనివుంది
ఆ తనువే నీదైతే దాచేదేముంది
మనసులవీణియపై బ్రతుకే మ్రోగిందీ

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు
తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను
మదినిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

ఎన్నడు అందని పున్నమి జాబిలి
ఎన్నడూ అందని పున్నమి జాబిలీ
కన్నుల ముందే కవ్విస్తుంటే

కలగా తోచి వలపులు పూచీ
కలగా తోచి వలపులు పూచీ
తనువే మరచి తడబడుతుంటే

గుడిలో వెలసిన దేవుడు ఎదురై
గుడిలో వెలసిన దేవుడు ఎదురై
కోరని వరాలే అందిస్తుంటే

ఆ భావనలో ఆరాధనలో
ఆ భావనలో ఆరాధనలో
అంతట నీవే అగపడుతుంటే

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి
ఎన్నో వరాల మాలలు గుచ్చి
నా మెడ నిండా వేశావు
నన్నో మనిషిని చేశావు
ఎలాగా తీరాలి నీ ఋణమెలాగ తీరాలి

తీరాలంటే దారులు లేవా
కడలి కూడా తీరం లేదా
అడిగినవన్నీ ఇవ్వాలీ
అడిగినప్పుడే ఇవ్వాలీ
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలి

అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశంలో దేవతలు
అడగముందే అన్నీ ఇచ్చే నిన్నే పేరున పిలవాలీ
నిన్నే తీరున కొలవాలీ

అసలు పేరుతో నను పిలవద్దు
అసలు కన్నా వడ్డీ ముద్దు
ముద్దు ముద్దుగా ముచ్చట తీర
పిలవాలీ నను కొలవాలీ
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలీ

కన్నులకెన్నడూ కనగరానిది
కానుకగా నేనడిగేదీ
అరుదైనది నీవడిగేది
అది నిరుపేదకెలా దొరికేది
ఈ నిరుపేదకెలా దొరికేది
నీలో ఉన్నది నీకే తెలియదు
నీ మనసే నే కోరుకున్నది
అది నీకెపుడో ఇచ్చేశానే
నీ మదిలో అది చేరుకున్నదీ ఇంకేం
ఇలాగ తీరిందీ మన ఋణమిలాగ తీరింది
ఇలాగ తీరిందీ మన ఋణమిలాగ తీరింది

ఎలా ఎలా దాచావు

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

పిలిచి పిలిచినా పలుకరించినా పులకించదు కదా నీ ఎదా
ఉసురొసుమనినా గుసగుసమనినా ఊగదేమది నీ మది
నిదుర రాని నిశిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో
నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా
తెరిచి ఉందనీ వాకిటి తలుపు చొరబడతారా ఎవరైనా
దొరవో మరి దొంగవో దొరవో మరి దొంగవో
దొరికావు ఈనాటికీ
దొంగను కానూ దొరనూ కానూ
దొంగను కానూ దొరనూ కానూ నంగనాచినసలే కానూ
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ

చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ
చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి
చెప్పనా చెప్పనా చెప్పనా

అడగనా నోరు తెరిచి అడగరానివి ఈ
అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ ఈ
అడగనా అడగనా అడగనా
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి

చెప్పమనీ చెప్పకుంటే ఒప్పననీ
చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి చెప్పనా
అడగమనీ అడగకుంటే జగడమనీ
అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి అడగనా
అడుగు మరి చెప్పు మరి
అడుగు మరి చెప్పు మరి

చెప్పితే అల్లరి అడిగితే తుంటరి
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి

నిన్న రాత్రి వచ్చి సన్న దీప మార్పి
పక్క చేరి నిదురపోవు సోయగాన్ని
వీపుతట్టి రెచ్చగొట్టి కలలాగ వెళ్లిపోతే
పిల్ల గతి కన్నెపిల్ల గతి ఏమిటో చెప్పనా

పగటి వేళ వచ్చి పరాచకలాడి
ఊరుకొన్న పడుచువాణ్ణి ఉసిగొలిపి
పెదవి చాపి పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే
ఇవ్వమనీ ఇచ్చి చూడమని ముద్దులే అడగనా
వద్దని హద్దు దాట వద్దనీ
అన్న కొద్ది ముద్దు చేసి కొసరి తీసుకున్నవి చెప్పనా

నేననీ వేరనేది లేదనీ అనీ అనీ ఆగమని
ఆపుతున్నదెందుకని అడగనా
అడుగు మరి చెప్పు మరి
అడుగు మరి చెప్పు మరి
చెప్పితే అల్లరి అడిగితే తుంటరి
అడగనా అడగనా అడగనా
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది

పదునారు కళలందు ఏ చిత్ర కళవో
ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివో
పదునారు కళలందు ఏ చిత్ర కళవో
ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివో
ఏ జన్మ పుణ్యాన నను చేరినావో

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది

నా గుండె గుడిలోన నీ రూపు వెలసే
నిను చెరగా గొంతు రాగాలు పలికే
నా గుండె గుడిలోన నీ రూపు వెలసే
నిను చెరగా గొంతు రాగాలు పలికే
వేచేను వెయ్యేళ్లు నీ తోడు కొరకే

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
లా లా ల లా లా లా ల
లా లా లా ల లా లా లా ల లా

వగలరాణివి నీవె సొగసు కాడను నేనె

ఓహోహో ఓ ఓ ఓహోహో ఓ ఓ
ఓహోహోహో ఓ ఓ

వగలరాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవే

పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం

వగల రాణివి నీవె ఓహోహో ఓ
ఒహోహో ఓ ఒహోహో ఓ ఓ

ఓహోహొ ఓఓఓ ఓహోహొ ఓఓఓ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన
వగల రాణివి నీవె

కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె
వగలరాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను తోడుగా రావే
వగల రాణివి నీవె ఓహోహో ఓ
ఓహోహో ఓ ఓహోహో ఓఓఓ

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప

ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకు
ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకు
నీ మనుగడలో నిండాలమ్మా
నీ మనుగడలో నిండాలమ్మా నా కలలన్ని పండాలమ్మా

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప

మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
తోడై నీడై లాలించునులే
తోడై నీడై లాలించునులే మనకే లోటు రానీయదులే

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
ల ల లాలి ల ల లాలి ల ల లాలి ల ల లాలి

నందామయా గురుడ నందామయా

ఊ ఉహు ఉ ఆ అహ హా
లల లలలా లలల లా లల లా
నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా

మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు
మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు

ఆ కుళ్ళు లేని చోటు ఇక్కడే
కుళ్ళు లేని చోటు ఇక్కడే అనుభవించు రాజా ఇప్పుడే
ఆనంద సారం ఇంతేనయా ఆనంద సారం ఇంతేనయా
ఆనంద సారం ఇంతేనయా ఆనంద సారం ఇంతేనయా

నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా

పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు
పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు
నడుమ బట్ట కడితే నగుబాటు
నడుమ బట్ట కడితే నగుబాటు నాగరీకం ముదిరితే పొరబాటు
వేదాంత సారం ఇంతేనయా వేదాంత సారం ఇంతేనయా
వేదాంత సారం ఇంతేనయా వేదాంత సారం ఇంతేనయా

నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
తెలుసుకుందామయా తెలుసుకుందామయా
తెలుసుకుందామయా తెలుసుకుందామయా

మొగ్గా పిందాల నాడే బుగ్గా గిల్లేసినాడే

మొగ్గా పిందాల నాడే బుగ్గా గిల్లేసినాడే
హాయ్ మొగ్గా పిందాల నాడే హాయ్ బుగ్గా గిల్లేసినాడే
కోనేటి గట్టుకాడ కొంగు పట్టి ముద్దు పెట్టి
చెంపలోని కెంపులన్నీ దోచినాడే

హోయ్ మొగ్గా పిందాల నాడే బుగ్గా గిల్లేసినాదే
అహ మొగ్గా పిందాల నాడె హాయ్ బుగ్గా గిల్లేసినాదే
గుండెల్లో వాలిపోయి గూడు కట్టి జోడుకట్టి
పాలుగారు అందమంత పంచినాదే

అబ్బోసి వాడి వగలు ఊ లగ్గోసి పట్టపగలు ఊ
గుమ్మెక్కి గుబులుగుంటది అబ్బ దిమ్మెక్కి దిగులుగుంటది
వల్లంకి పిట్టవంటు వళ్లంత నిమిరి నిమిరి వాటేస్తే అంతేనమ్మో
హాయ్ వయసొస్తే ఇంతేనమ్మో

అయ్యారే తేనే చిలుకు హోయ్ వయ్యారి జాణ కులుకు
ఎన్నెల్లో పగలుగుంటది అబ్బా
మల్లెల్లో రగులుగుంటుంది
వరసైనవాడవంటు సరసాలే చిలికి చిలికి
మాటిస్తే మనసేనమ్మో హా మనసిస్తే మనువేనమ్మో ఓ ఓ

మొగ్గా పిందాల నాడే హోయ్ బుగ్గా గిల్లేసినాడే
హాయ్ హోయ్ హోయ్ మొగ్గా పిందాల నాడే హోయ్ బుగ్గా గిల్లేసినాదే

వాటారే పొద్దుకాడా హోయ్ దాటాలా దాని గడప
లేకుంటే తెల్లవారదు హబ్బ నా కంట నిద్దరుండదు
కొత్తిమేర చేనుకాడ పొలిమేర మరచిపోతే
వాడంత గగ్గోలమ్మో హోయ్ ఊరంతా అగ్గేనమ్మో

తెల్లారే పొద్దుకాడా హోయ్ పిల్లాడు ముద్దులాడి
పోకుంటే సోకు నిలవదు వాడు రాకుంటే వయసు బతకదు
చెక్కిళ్ళ నునుపు మీద చెయ్యేస్తే ఎరుపు మిగిలి
పక్కిళ్లు నవ్వేనమ్మో ఈ నొక్కుళ్లు ఏం చేసేనమ్మో

హోయ్ మొగ్గా పిందాల నాడే అహ బుగ్గా గిల్లేసినాదే లాలాలలా ల లా ల

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసు
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు

పసిడి పసుపు మేని రంగు సందె ఎరుపు బుగ్గ రంగు
నీలి రంగుల కంటి పాపల కొసలలో నారింజ సొగసులు
ఆకు పచ్చని పదారేళ్ళకు ఆశలెన్నో రంగులు
ఆ ఆశలన్ని ఆకాశానికి
ఎగసి వెలెసెను ఇంద్రధనుసై ఇంద్రధనుసై ఇంద్రధనుసై

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు

ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు
ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు

వాడి కోసం వాన చినుకై నిలిచి ఉంటా నింగిలోనా
వాడి వెలుగే ఏడురంగుల ఇంద్రధనుసై నాలో
ఇంద్రధనుసై నాలో
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు

విన్నానులే పొంచి విన్నానులే ఏమని

విన్నానులే ఊహుహు
పొంచి విన్నానులే ఏమని
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ
విన్నానులే పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ
ఉహూహూ హూ హూ అహాహా ఆ ఆ ఆ ఆ

సుకుమారివి నువ్వు పువ్వులాంటి నువ్వు
పండులాంటి పాపాయిని ఇవ్వు
ఊ ఊ ఆ ఆ
అలసిపోనివ్వను పనులు చేయనివ్వను
అడుగుతీసి అడుగు వేయనివ్వను
ఓహో ఇంటి పనులు వంట పనులు తమరే చేస్తే
అయ్యగారి ఉద్యోగం ఊహుహుహుహు
హహహహ విన్నానులే పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

పాపాయే గారాల తోట
మన చిన్నారే నా ముద్దుల మూటా ఆ ఆ
పాపాయే గారాల తోట
మన చిన్నారే నా ముద్దుల మూటా
అయ్యగారివైపు పడదు నీ చూపు
ఇక ముద్దులన్ని పాపకేన రేపు

అరే అంతలోనే వచ్చిందా తమకు అసూయా
అబ్బాయి తమ పోలిక ఆ ముద్దులు మీకే

విన్నానులే పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

తొలి చూలి భాగ్యం ఎంతో ఆనందం
విడిపోని అనురాగబంధం ఆ ఆ ఆ ఆ
నిజమైన స్వప్నం దిగి వచ్చిన స్వర్గం
పాపాయే మన ఆరోప్రాణం
నవ్వులతో వెలుగులతో నిండును ఇల్లు
పాపాయి మురిపాలే తొలకరి జల్లు

విన్నావులే ఊహుహు
పొంచి విన్నావులే ఏమని
ఈ అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

నీ అందం నీ పరువం నాలో దాచుకో

నీ అందం నీ పరువం నాలో దాచుకో
కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో ఓ
ఈ అందం ఈ పరువం నీకే అంకితం
రేయి పగలు వెన్నెలా కాదా నీతో జీవితం

వీచే గాలి పూచే పూలు గుసగుసలాడాయి
కోరికలన్నీ తీరేదెపుడని రెపరెపలాడాయి ||వీచే గాలి||
ఆ తొందర చూసి ఎగిరే గువ్వలు కిలకిల నవ్వాయి ||నీ అందం||

వలచిన నింగి ప్రేయసి కోసం వానై కురిసిందీ
ఆ వానకు తడిసిన భూమి గుండెలో ఆవిరి ఎగిసిందీ ||వలచిన||
ఆ కలియికలోనే నింగి నేల జతగా మురిసేదీ ||నీ అందం||

ఈనాటి విడరాని బంధం

ఈనాటి విడరాని బంధం మ్మ్ మ్మ్
మనకేనాడో వేశాడు దైవం
ఈనాటి విడరాని బంధం
నేను ఏనాడో చేసిన పుణ్యం మ్మ్ మ్మ్
అ హ హ అహ ఆ ఆ ఆ హా ఆహ ఆహ ఆ

నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే ఏ ఏ
నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే
నాలోని ప్రేమ నీ పాద సీమా విరిసింది సిరిమల్లెగా
ఈనాటి విడరాని బంధం
నేను ఏనాడో చేసిన పుణ్యం

సొగసెంతొ కలిగి సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే ఏ
సొగసెంతొ కలిగి సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే
మదిలోన దాచి మనసార వలిచి పతి నీడ దొరికిందిలే ఏ

ఈనాటి విడరాని బంధం నేను ఏనాడో చేసిన పుణ్యం

ఈ రోజు మంచి రోజు

ఆ ఆ ఆ ఆ ఆ ఈ రోజు మంచి రోజు
మరపురానిది మధురమైనది
మంచితనం ఉదయించినరోజు

ఆ ఆ ఆ ఆ ఈ రోజు మంచి రోజు
మరపురానిది మధురమైనది
ప్రేమ సుమం వికసించినరోజు

తొలిసారి ధృవతార దీపించెను
ఆ కిరణాలే లోకాన వ్యాపించెను
ఆ ఆ ఆ ఆ తొలి ప్రేమ హృదయాన పులకించెను
అది ఆనంద దీపాలు వెలిగించెను

చెలికాంతులలో సుఖశాంతులతో
జీవనమే పావనమీనాడు
ఈ రోజు మంచి రోజు
మధురమైనది మరపురానిది
ప్రేమ సుమం వికసించినరోజు

రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము
రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము

మనసు మనసు లొకరికొకరు తెలిపే రోజు
తీరని కోరికలన్నీ తీరే రోజు
అనురాగాలు అభినందనలు
అందించే శుభసమయం నేడు

ఈ రోజు మంచి రోజు
మధురమైనది మరపురానిది
మంచితనం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనమం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు

జో లాలి ఓ లాలి

జో లాలి ఓ లాలి
నైనా ఒకటాయె రెండాయె ఉయ్యాల
రెండు మూడు మాసాలాయె ఉయ్యాల
జో లాలి ఓ లాలి
నైనా మూడో మాసములోన ఉయ్యాల
ముడికట్ట్లు బిగువాయె ఉయ్యాల


జో లాలి ఓ లాలి
నైనా మూడాయె నాలుగాయె ఉయ్యాల
నాలుగు అయిదు మాసములాయె ఉయ్యాల
జో లాలి ఓ లాలి
నైనా అయిదాయె ఆరాయె ఉయ్యాల
ఆరు ఏడు మాసాములాయె ఉయ్యాల
జో లాలి ఓ లాలి
ఏడో మాసములోన ఉయ్యాల
నైనా వేగుళ్ళు బయలెళ్ళె ఉయ్యాల

జో లాలి ఓ లాలి
నైనా ఏడాయె ఎనిమిదాయె ఉయ్యాల
ఎనిమిది తొమ్మిది మాసములాయె ఉయ్యాల
జో లాలి ఓ లాలి
నైనా తొమ్మిది మాసములోన ఉయ్యాల
నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల
నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా

హే హే రపరపపర రపరపపర పా
హే హే రపరపపర రపరపపర పా
రపరపా రపరపా రప్పప్పా
రపరపా రపరపా రప్పప్పా

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట నా పేరే రాజు
ఎన్ పేర్దా రాజు మేరా నాం రాజు మై నేం ఈజ్ రాజూ
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా

భాయియో ఔర్ బెహ్నో
ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి కన్ను కుట్టిన శత్రు రాజు ధూమ కేతు
తన సైన్యంతో దండెత్తి వచ్చాడు హా
అప్పుడు మన రాజసింహుడు తెలివిగా
ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో
శత్రుసైన్యం మీదికి మెరుపు దాడి చేశాడు

విజయుడై వచ్చినాడురా తన ప్రజలంతా మెచ్చినారురా
దుర్గమునే ఏలినాడురా ఆ స్వర్గమునే దించినాడురా
అక్షితలే చల్లినారు రమణులంతా
అహ హారతులే భక్తిమీర పట్టినారురా
సింహాసమెక్కి తాను విష్ణుమూర్తిలా
అహ సిరులెన్నో చెలువు మీద చెలికినాడురా

ఏ రాజు ఎవరైనా మా రాజువింక నువ్వంటా
నీ మనసే మా కోట మీ మాట మాకు పూబాటా
రాజాది రాజా మార్తాండ తేజ
నా పేరే రాజు మై నేం ఈజ్ రాజూ

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట నా పేరే రాజు
ఎన్ పేర్దా రాజు మేరా నాం రాజు
మై నేం ఈజ్ రాజూ

అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు
పెద్ద రాణి నాట్యంలో మయూరి
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట
పద పద సాస సరి గరి సాపద
పద పద సాస సగరిగ సరి గస పద
దరి రిగ గస సప గరిస దప గారిస

కళలే పోషించినాడురా తను కావ్యాలే రాసినాడురా
శిలలే తెప్పించినాడురా ఘన శిల్పాలే మలచినాడురా
చెరువులెన్నో తవ్వించి కరువుమాపి
అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా
కులమతాల రక్కసిని రూపుమాపి
అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా
నీలాంటి రాజుంటే ఆ దేవుడింక ఎందుకంట
చల్లనైన నీ చూపే మాకున్న పండు ఎన్నెలంట
రాజాధి రాజా మార్తాండ తేజా
నా పేరే రాజు మేరా నాం రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట మమ నామ రాజు
ఎన్ పేర్దా రాజు ఎండ వేరే రాజు
నన్న హెసరే రాజు నా పేరే రాజు

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా ఢమక్కురో

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా ఢమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో

కసక్కు లయలు హొయలు చూశా
కసెక్కి వలపు వలలే వేశా
గుబుక్కు ఎదలో కథలే దాచా
గుటుక్కు మనక గుబులే దోచా
మజా చేస్తే మరోటంట మరోటిస్తే మగాణ్ణంట
సరే అంటే అతుక్కుంటా సరాగంలో ఇరుక్కుంటా
చుంబురుణ్ణై నారదుణ్ణై
చుంబ మీద పంబ రేపి పాడుతుంటే మీరు గోవిందే
గోవిందా గోవింద come on come on పాడండయ్యా
పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పప్పా
పబం పం పాబం పపం పం పాబం పబం పం పాబా పాబా బాబాబం

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో

వయస్సు ఒడిలో చొడినే చూశా
వరించి సుడిలో పడవే వేశా
నటించే నరుడా ఘనుడా మెచ్చా
నమస్తే నడుమే నటిగా ఇచ్చా
ఉడాయిస్తే ఉడుక్కుంటా లడాయొస్తే హోయ్ ఉతుక్కుంటా
సఖి అంటే సరే అంటా చెలి అంటే గురు అంటా
బ్రేకు డ్యాన్సు షేకు డ్యాన్సు
mix చేసి steps వేసి tricks చేస్తే మీరు గోవింద
come on come on dance I say ఆడండ్రా
ధినక్కుతా ధినక్కుతా ధినక్కుతా ధినక్కుతా
ధినక్కు తార ధినక్కు తార ధినక్కు తారా తారా తారారా

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురోయ్

జై చిరంజీవా జగదేక వీరా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జై చిరంజీవా జగదేక వీరా
జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా
జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా
దీవించ రావయ్య వాయు సంచారా
రక్షించవేలయ్య శ్రీరామ దూత జై చిరంజీవా

వీరాంజనేయా శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా
జై చిరంజీవా ఆరోగ్యదాతా అభయ ప్రదాతా ఆ
ఆరోగ్యదాతా అభయ ప్రదాతా ఉన్మాద భయ జాడ్య పీడా నివారా
సంజీవి గిరివాహా సానీరిసాహ
సంజీవి గిరివాహ సానీరిసాహొ జై చిరంజీవా జగదేక వీరా

జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా

మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు

మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
అందుకుంటే జుట్టుపట్టి అందకుంటే కాళ్లుకట్టు కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు దిగి రాముందు
మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
అందుకుంటే జుట్టుపట్టి అందకుంటే కాళ్లుకట్టు కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు దిగి రాముందు

బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ బుచ్చబ్బాయ్ పని కావాలోయ్
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్

ఆడపిల్ల మాటమీద ఉద్యోగాలు ఊడగొట్టు ఆకతాయి కామందు
మీసకట్టు తీసివేసి కాశపోసికోకచుట్టి గాజులేసికొమ్మందు ॥2॥
డొక్కచీరివేస్తాము డోలుకట్టి తెస్తాము డోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం
డొక్కచీరివేస్తాము డోలుకట్టి తెస్తాము డోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం


బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ బుచ్చబ్బాయ్ పని కావాలోయ్
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్

రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా
రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా

రేపటి వేళకు నీ పని మీదని దారికి రాకుంటే
మాపటి వేళకు మీ పని నేపడతానోయ్ బుచ్చబ్బాయ్
మిన్ను విరిగి మీదపడ్డ మన్ను మిన్ను ఏకమైనా
నిన్ను గెలిచే వరకు మేము ఆడితీరుతామ్
మిన్ను విరిగి మీదపడ్డ మన్ను మిన్ను ఏకమైనా
నిన్ను గెలిచే వరకు మేము ఆడితీరుతామ్ పోరాడితీరుతామ్

మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
అందుకుంటే జుట్టుపట్టి అందకుంటే కాళ్లుకట్టు కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు దిగి రాముందు
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ బుచ్చబ్బాయ్ పని కావాలోయ్
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ బుచ్చబ్బాయ్ పని కావాలోయ్

అందాలన్ని అందాలన్ని నీలోనే దాగున్నాయి

అందాలన్ని అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా అదిగో పొదా ప్రియసుధ ప్రియసుధ జయసుధా హా

అందాలన్ని అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా ఇదిగో సుధా ప్రియసుధ ప్రియసుధ జయసుధా ఆ

నా కళ్ళు ఇన్నాళ్ళు నీ చుట్టే తిరిగేవి
నా కళ్ళు ఇన్నాళ్ళు నీ చుట్టే తిరిగేవి
మదిలోన కోరికల జడి వాన కురిసేది జడివాన కురిసేది
చేప్పాలంటే పెదవులు ఆగేవి తడబడి
ఎప్పుడు చూడూ నాలో ఉప్పెనలాంటి అలజడి
పద పదా అదిగో పొదా ప్రియసుధ ప్రియసుధ జయసుధా హా

అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి

ఎదురెదురు నువ్వుంటే ఏ మెరుపో మెరిసేది
ఎదురెదురు నువ్వుంటే ఏ మెరుపో మెరిసేది
చిరు సిగ్గు తెరలోన అది కాస్త అణిగేది అది కాస్త అణిగేది
ఎవరేమన్నా మనది ఎదురులేని పరవడి
ఇద్దరి జంటా వలచే పడుచు వాళ్ళకు ఒరవడి
పద పదా ఇదిగో సుధా ప్రియసుధ ప్రియసుధ జయసుధా ఆ

అందాలన్ని అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా అదిగో పొదా ప్రియసుధ ప్రియసుధ జయసుధా హా

అందాలన్ని అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా ఇదిగో సుధా ప్రియసుధ ప్రియసుధ జయసుధా ఆ

మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా

మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా
ఆ సిగ్గుపడే ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా ఓహో
మనసైన ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా
ఆ సిగ్గుపడే ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా

ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా

నా గుండెలోన అందమైన గూడు ఉన్నది ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది ఆహ
నా గుండెలోన అందమైన గూడు ఉన్నది ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది
ఆ చోట ఉంటావా ఆ నా మాట వింటావా ఊహూ ఆ చోట ఉంటావా ఆ
నా మాట వింటావా ఆ ఆ నా మాట వింటావా గుణపాఠం తీర్చుకుంటావా

మనసైన ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా
ఆ సిగ్గుపడే ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా
ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా


మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది
మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది
ఆ పానుపు అడిగింది ఊఁ
నీ రాణి ఎవరంది ఓహో
ఆ పానుపు అడిగింది నీ రాణి ఎవరంది
మన కోసం చూస్తూ ఉంది

మనసైన ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా
ఆ సిగ్గుపడే ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా
ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా

నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి ఊ
నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి
కొంచెం చూడనిస్తావా నో నో పోని తాకనిస్తావా ఆహ
కొంచెం చూడనిస్తావా ఆ ఆ పోని తాకనిస్తావా
నను నీతో చేర్చుకుంటావా ఆ

మనసైన ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా
ఆ సిగ్గుపడే ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా

చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే

చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే
ఎవరో ఓ తెలుసా గారాల బావ తెలుసా
చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే


ఆ ఆ ఆ ఆ ఆ అత్తకొడుకని విన్నానే అయిన వాడనుకున్నానే
ఓహో ఓహో ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ
వల్లమాలిన సిగ్గేసి తలుపు చాటున చూసానే
ఏమి అందం ఏమి చందం
ఏమి అందం ఏమి చందం గుండెల్లో రేగెను గుబగుబలేవో గుసగుసలేవో

చక్కాని చిన్నవాడే హహహా చుక్కల్లో చందురూడే హహహా
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే
ఎవరో ఓ తెలుసా గారాల బావ తెలుసా

హ హ హ హ ఊఁహుహూహు
ఆ ఆ ఆ ఆ ఆహహా ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఆహాహాహా ఆహాహాహా ఆహాహాహా ఆ హా ఆ హా
లల్లాలలా లల్లాలలా లల్లాలలా లాలలా
మెల్లగా హాయ్ మెల మెల్లగా హాయ్ హాయ్ హాయ్ హాయ్
మెల్లగా నను చూసాడే కళ్ళతో నవ్వేసాడే
మెత్తగా నను తాకాడే కొత్త కోరికలు లేపాడే
ఏమి వింత ఈ గిలిగింత
ఏమి వింత ఈ గిలిగింత రెపరెపలాడే నా ఒళ్ళంతా ఏదో పులకింత

చక్కాని చిన్నవాడే హహహా చుక్కల్లో చందురూడే హహహా
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే
ఎవరో ఓ తెలుసా గారాల బావ తెలుసా

గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే

గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా
హాయ్ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి
నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి ఆహా
తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి
నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి
అదను చూసి నా చేయి పట్టుకుంటివి
ఆనాటి నుంచి నా మదిలో అల్లరి పెడుతుంటివి

గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా
ఆ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

నీ కందీరగ నడుమేమో కదులుతున్నది
దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది
నీ కందీరగ నడుమేమో కదులుతున్నది
దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది
నీ ఉంగారాల జుట్టేమో ఊగుతున్నది
దాన్ని ఒక్కసారి నిమరాలని ఉబలాటం ఉన్నది

హోయ్ గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా
హా చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

పైర గాలి నా చెవిలో ఊగుతూ ఉన్నది
పైర గాలి నా చెవిలో ఊగుతున్నది
నీ పడుచుదనం రుచి ఎంతో చూడమన్నది
లగ్గమాడే రోజు దగ్గెరున్నది
మనం లగ్గమాడే రోజు దగ్గెరున్నదీ ఈ ఈ ఈ
అందాకా ఈ తొందర ఎందుకులే అన్నది

హాయ్ గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా
హా చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా హా

అందానికి అందానివై ఏనాటికి నా దానవై

అందానికి అందానివై ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా ఆ నా దానా
అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా ఆ నా రాజా

వలపించావు వల వేశావు నను నీలోనే దాచేసావు
వలపించావు వల వేశావు నను నీలోనే దాచేసావు
మనసు సొగసు దోచావు
మనసు సొగసు దోచావు మదిలో నన్నే నిలిపావు నిలిపావు

అందానికి అందానివై ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా ఆ నా దానా
అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా ఆ నా రాజా

నీలాకాశం నీడలలోన నిర్మల ప్రేమ వెలగాలి
నీలాకాశం నీడలలోన నిర్మల ప్రేమ వెలగాలి
వలపే విజయం పొందాలి
వలపే విజయం పొందాలి మమతల మధువే కురవాలి కురవాలి

అందానికి అందానివై ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా ఆ నా దానా
అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా ఆ నా రాజా

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే లయలే చూసి లాలించుకో

వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో ఓ

వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో వద్దు లేదు నా బాషలో
మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరి తాకితే - ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే హోయ్ సోకితే - కోరికన్నదే రేగదా?
వడగట్టేసి బిడియాలనే ఒడి చేరాను వాటేసుకో

అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా చీరకట్టు తానాగునా
పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా జారుపైట తానాగునా
క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తలదాచుకో

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది ఎట్టాగమ్మ
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట ఆ ఆ


ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో వచ్చి వాటేసుకో
కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో మంచు ముద్దు ఇచ్చుకో
పల్లె అందంలో పైటే జారితే పడుచు గంధంలో పాటే పుట్టదా
వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో ముద్దు మురిపం ముచ్చటగా పంచుకో
పాశం యమపాశం చలిమాసం చెలి కోసం
ఇది అదో ఇదో ఎదో ఎదో వేదాంతం

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట

ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో నీడగా ఉండవా
పండు చిలకమ్మ పసి గట్టే వేళలో పైటగా ఉండవా
బ్యుటి తోడూంటే ఊటి దండగ స్వీటి కౌగిట్లో పూటా పండగ
నీ కల్లలో చెస్తాలే కాపురం కటేస్తాలే నా ప్రేమ గొపురం
పాశం యమపాశం చలిమాసం చెలి కోసం
ఇది కింద మీద ఉందా లేదా యవ్వారం

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది ఎట్టాగమ్మ
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట ఆ ఆహ

అందం హిందోళం అధరం తాంబూలం

సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వయసే వెచ్చని వెన్నెల వంతెన వేసిన వేళా
అందనిదీ అందాలనేది అందగనే సందేళకది
నా మది కోరెను నీ జత చేరెనులే హో

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం

చలిలో దుప్పటి కప్పిన ముద్దుల పంటలలో
చలిగా ముచ్చటలాడిన చక్కిలిగింతలలో
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మెళ్ళెకాయగా
పల్లమ్మె మానుకుంది పరువాలే కాయగా
ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా
ఓడివలపై మొగమెరుపై జతకలిపే హా
చేయనది సడిచేయనది
నాకన్నే కైపెక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హోయ్

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అ ఆహ
అధరం తాంబూలం అ ఆహ
అసలే చలికాలం త త్తర
తగిలే సుమ బాణం త త్తర
కువవకువవా కువవకువవా
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్


వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ హై
ఇచ్చినదీ తను నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అ ఆహ
అధరం తాంబూలం అ ఆహ
అసలే చలికాలం ఎ ఎహే
తగిలే సుమ బాణం అ ఆహా

సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వయసే వెచ్చని వెన్నెల వంతెన వేసిన వేళా
అందనిదీ అందాలనేది అందగనే సందేళకది
నా మది కోరెను నీ జత చేరెనులే హో

29 October 2011

మా daddy pockets ఎపుడూ plenty plenty రా

Hey Hyderabad
you guys ready to rock and roll
I can't hear you
lets do this

మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా
మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా

Campus canteen లో నన్ను చూసింది ఓ పిల్ల
ఎంతో sudden గా మారాను తన వల్లా
sun glasses ఏ తానే కొనింది నీ కొసమే ఈ gift అనింది
ఆ next one month తిరగని చోటే లేదురా
అ next one week నాలో నే లేనురా
అ next Friday disco లో తన birthday party కదా
అ next moment ఆ billకే చిల్లరే మిగిలింది

మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా
మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా

Tring tring tring tring అంటూ మోగింది నా i phone
గడపాలి అంటూ sudden గా రమ్మంది చంపేసి ring ఒడి కట్టు అంది
త్వరగానే ఓ surprise అనింది
అ next one month తేలా నే గాలి లో
అ next one week ఉన్నా tension లో
అ next Friday life time thrill నే తగిలే నాకు మరీ
అ next movement వాడెవడికో ring నే తొడిగింది
So the bottom line of the story is
మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా
మా daddy pockets ఎపుడూ plenty plenty రా
నా రెండూ pockets ఎపుడూ empty empty రా

వేగం వేగం వేగం

let me say hey o life is journey lets go
వేగం వేగం వేగం
ఈ వాయు వేగమే
వేగం వేగం వేగం
మాలో ఉందే వేగం వేగం వేగం
మెరుపుల ప్రవాహమే మేమే

అంతులతో లెక్కేసే అలలేని అనుభూతులెన్నో మావేనా
ఏ కారణం లేని సంతోషం ఎంతుందో లోనే మా లోనే
రేపనే రూపమే లేదు తెలుసుకో సాగిపో
ఈ గాలిలో నీ రాత లాంటిది క్షణం
lets go lets go
వేగం వేగం వేగం
మా ఈ ప్రపంచమే
వేగం వేగం వేగం
అదుపన్నది లేదులే
వేగం వేగం వేగం
మెరుపుల ప్రవాహమే మేమే

తేలేటి ఈ హాయి తన తీరం ఏదంటూ రాని మా తోనే
వెల్లేటి ఈ దారిలో ముందు ఏముందో అడిగే కాలాన్నీ
లోకమే కొత్తగా మారిపోదు తెలుసుకో
సరికొత్తగా నీ కన్నులే చూడనీ ఓ ఓ ఓ

వేగం వేగం వేగం
ఈ వాయు వేగమే
వేగం వేగం వేగం
మాలో ఉందే
వేగం వేగం వేగం
మెరుపుల ప్రవాహమే మేమే

let me say hey o life is journey
lets go say hey o life is party lets go
అమ్మో this journey is life taking me places here
gara gara get move on baby life is calling we must be crazy
i m sure with my destiny just chill with the girl of my dreams
get me a rock on get me a drink on
you know what i’m saying .. ... .. ... ..
say hey say o.. .. ... ...

వేగం వేగం వేగం .. .. ..
వేగం వేగం వేగం .. .. ..
వేగం వేగం వేగం .. ...
forever forever
let me say hey o life is journey
lets go say hey o life is party lets go

నేను తానని అనుకుంటారా

ఓహోహో హోహోహో హోహో
ఓహోహో హోహోహో హోహో
నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోనా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా
స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకు పోతారా

ఓహోహో హోహోహో హోహో
ఒకే చోటే ఉంటూ ఒకటే కల కంటూ
విడివిడిగా కలిసే ఉండే కలలది ఏ బంధం
కలకాలం వెంటే నడవాలనుకుంటే
కాళ్ళకి ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం
చుట్టరికం ఉందా చెట్టుతో పిట్టకేదో
ఏమి లేకపొతే గూడు కడితే నేరమా
ఏ చెలిమి లేదా గట్టుతో ఏటికేదో
వివరించమంటే సాధ్యమా

నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోనా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా
స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకు పోతారా

కనులకు కనిపించే రూపం లేకుంటే
ప్రాణం తాను ఉన్నానన్నా నమ్మం అంటారా
చెవులకు వినిపించే సవ్వడి చేయందే
గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా
మదిలో భావం మాటలో చెప్పకుంటే
అటువంటి మౌనం తగనిదంటూ అర్ధమా
తీరాన్ని నిత్యం అల అలా తాకుతుంటే
నిలిపే నిషేధం న్యాయమా

నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోనా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా
స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకు పోతారా

అలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే

అలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే
నువ్వంటూ నాకు కనపడకుంటే ఏమయ్యేదో
నిన్నటి దాకా నేనే
నువ్వు నా పక్కన లేందే
ఉన్నానంటే నమ్మాలో లేదో
ఏనాడు ఇలా ఈ మాటా నీతో అనగలనో లేదో
హో అంటున్నది నీ మౌనం
వింటున్నది నా ప్రాణం
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే
కోరదు ఏ సాక్ష్యం
హే ఒంటరిగా ఒక్క క్షణం
నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీ కోసం

ప్రాయం ఉన్నా పయనం ఉన్నా
పాదం మాత్రం ఎటో పడదు
దారి నేనే దరిని నేనే
నడిపిస్తాగా ప్రతి అడుగు
బెదురుగా హా తడబడే మనసిది
కుదురుగా హా నిలపవా జతపడి
హో అంటున్నది నీ మౌనం
వింటున్నది నా ప్రాణం
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే
కోరదు ఏ సాక్ష్యం
హే ఒంటరిగా ఒక్క క్షణం
నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీ కోసం

నీ కన్నులతోచూసేదాక
స్వప్నాలంటే తెలియదెప్పుడు
నా కల ఎదో గుర్తించాగా
నీ రూపంలో ఇలా ఇపుడు
చలనమే హా కలగని చెలియలో
హా సమయమే హా కరగని చెలిమిలో

అలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే
నువ్వంటూ నాకు కనపడకుంటే ఏమయ్యేదో
నిన్నటి దాకా నేనే
నువ్వు నా పక్కన లేందే
ఉన్నానంటే నమ్మాలో లేదో
ఏనాడు ఇలా ఈ మాటా నీతో అనగలనో లేదో
హో అంటున్నది నీ మౌనం
వింటున్నది నా ప్రాణం
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే
కోరదు ఏ సాక్ష్యం
హే ఒంటరిగా ఒక్క క్షణం
నిన్నొదలను ఏ మాత్రం
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీ కోసం

శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లా

శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లా
శ్రీ చైతన్యా junior college M.P.C లీ పక్క bench పిల్లా
అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను
చలో చలో killer ఎటువైపుకి
రే ఫాల్తూస్ ఎటు వైపుకి
ఎగిరే గాలి పటం postal address తో తిరుగుతుందా
తెగితే అదే కతం ఎక్కడో పడిపోతుంది రా
google లా వెతుకుతాను గల్లి గల్లీని నేను
గల్లీలో లొల్లి చేస్తే గల్ల పట్టి కొడతారు రా
చ అది అప్పుడే బాగుంటే బాగుండేది

శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లా
అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను

అం Bi.P.C క్రిష్ణ ఫణిధర్ తనవెంటే పడేవడు
యషోదాలో వాడు doctor lets go now gets the matter
email address cellnumber landline votercard license
passport rationcard pancard hallticket
ఏదైనా తనదొకటుందా no way
కాని తను delhi లో ఉంటుంది అని విన్నా
రే అది already మాకు తెల్సు రా

శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లా
అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను

నిన్నే చూసా orkut facebook అక్కడ కూడా లేనే లేదు
notebook ఒక్కటే తెలిసిన పిల్లా facebook లో ఉంటుందా ఏ రా
saturday కదా గుడికెల్లిందో చూసొద్దాం అకడేముందో
pub ఐతే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేం ఉంది
ఒసే తను దేవత

M.P.C లో పక్క bench పిల్లా
ఇప్పుడైతే మర్చిపోలేను

అచ్చా ఏ కరే
paper లో ఒక add ఏ ఇద్దాం
జెమినిలో ఒక slot ఏ కొందాం
where is she అని program చేద్దాం
దొరికే వరకూ ధర్నాలే చేద్దాం
ఇది కావాలి sensation
ఎందరికో insparation
తను దొరికిందంటే tension
పోతుంది need not mention
శ్రీ చైతన్యా junior college M.P.C లీ పక్క bench పిల్లా
అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను

ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నే

ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నే
ఓ ఓ my friend కొడితే కొట్టే అంతే
ఓ ఓ my friend I am so sorry సిరి
బుంగ మూతే పెట్టకలా

ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నే
ఓ ఓ my friend కొడితే కొట్టే అంతే
ఓ ఓ my friend I am so sorry సిరి
బుంగ మూతే పెట్టకలా

నీ అలకల్లోన మన పలుకుల్లోన
తెలియని సంగీతమేదో ఉందే
సావాసంలోన విన్నాను అన్నా
సహేలి తోడా తో సంజోనా

చిరుగాలైతే ఎదో తీయని melody నా
వడగాలైతే ఎదో భాధని తెలిపేనా
చిటపట చినుకే నీకు తాళం నేర్పేనా
సారే కన్నీరే గేయంలానే వాలేనా
పలికే వేదాంతం ఐనా గీతా సారాంసం ఐనా
దాంతో పద్యం అంటూ ఉన్నాయే నీ ఒక్కో రూపానా
కలిగే ఆనందం ఐనా
రగిలే ఆవేశం ఐనా
సంగీతం కాదా

ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నే
ఓ ఓ my friend కొడితే కొట్టే అంతే
ఓ ఓ my friend I am so sorry సిరి
బుంగ మూతే పెట్టకలా

నీ అలకల్లోన మన పలుకుల్లోన
తెలియని సంగీతమేదో ఉందే
సావాసంలోన విన్నాను అన్నా
సహేలి తోడా తో సంజోనా

sunday monday అంటూ రోజులు ఏడున్నా
రేయి పగలు మారవు ఎందుకు ఏమైనా
అది అంతం రెండు తెలియవు అనుకున్నా
గమనం నువ్వై ముందుకు సాగాలంటున్నా
చెరితై వెలగాలనుకుంటే అడుగై సాగాలి అంతే
గెలుపు ఓటమి అన్నవి గమ్యం కాదని తెలియాలి అంతే
కనులకి కలలుండాలి లే
కదకో మలుపుండాలిలే
ఏదేమైనా friend

27 October 2011

కావాలి కావాలి నేనే నీలోకం కావాలి

కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి ఐతే చాలదు
మొగుడువి కూడా కావాలి
మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ మగువకు హాయిని ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి

కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి

పప పపా మమ మగరి మగరి గమ మమమమగరిస
స సరి సారిస స సరి సారిగ
పప పపా మమ మగరి మగరి గమ మమమమ రిగరిస
స సరి స నిస స స
ఇంట్లో ఉంటే కొంగు వదలవని
ఇంట్లో ఉంటే కొంగు వదలవని తిట్టే విరసం గావాలి
గడప దాటితే ఇంకా రావని పట్టే విరహం కావాలి
నిద్దట్లో నువు కలవరించినా అది నాపేరే కావాలి
ఔనో కాదో అనుమానంతో నే మేలుకునే ఉండాలి
నేనే లేని ఒక్క క్షణం బ్రతకలేవు అనుకోవాలి
అందుకనే వంద యేళ్ళు నీ ప్రాణం నాకు ఇవ్వాలి

కావాలీ ఈ ఈ కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి

చీకటినైనా చూడనివ్వనని
చీకటినైనా చూడనివ్వనని చీరై నను చుట్టేయాలి
చెప్పకూడని ఊసులు చెప్పే రెప్పల సడి వినగనగాలి
నాలో దిగువును పెంచేలా నువ్వు కొంచెం లోకువ కావాలి
నేను రెచ్చిపోతుంటే ఎంతో అణుకువగా ఒదిగుండాలి
నువ్వంటూ ఏం లేనట్టూ నాలో కరిగిపోవాలి
చెప్పని తనమే చెడ్డి బొమ్మవై కొత్త కొత్త కథ రావాలి

కావాలీ ఈ ఈ కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి ఐతే చాలదు
మొగుడువి కూడా కావాలి
మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ మగువకు హాయిని ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి

ఏ మొగుడు మొగుడు ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు

నాదేరు రానన నా హా హా రే రే హే
నా దే రు నా రే మావయ్యో మా యోయో రే రే
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు మ మ మ మొగుడు
త ధిమిత తక ధిమిత త ధిమిత తక ధిమిత త ధిమిత తక ధిమిత త ధిమిత తక ధిమిత ఆ ఆ ఆ ఆ హ హ హ

మాటల్తోనే మత్తెకించే మాయ మొగుడో
చూపుల్తోనే కొంగేపచ్చి మోటు మొగుడో
అరె కొంగు వాసనొస్తే జాలుకుంటే మొగుడో
నేను తానమడుతుంటే చూసే దొంగ మొగుడో ఆహా ఆహా
బందర్ లడ్డు చింపనంటు నవిలే మొగుడో
ఆహ ఓహో అంటూ లొంగ దీసే మొగుడో ఓహో హోయ్ ఓహో
పొద్దునుండి రాత్రిదాక పొంగే మొగుడో
రాత్రి పక్క వేయగానే రంకు మొగుడో
నారేరు నారేరున్నా న న న నారేరు నారేరున్న
నారేరు నారేరున్నా న న న నారేరు నారేరున్న
లగ లగ లగ లగ్గామే పసుపు రాసుకున్నా పగ్గామే
పెళ్ళ పెళ్ళ పెళ్ళ పెళ్ళామే మొగుడు చేతిలోన పగ్గామే హాయ్ అ అ అ అ అ అ అ అ అ హాయ్

కాలిలోన వేళ్ళల్లోన నిమిరే కొరకె
మెట్టే లాగా ఉండే సగం వెండి మొగుడు
గుండెల నడుమ గిలి గిలి చేయడానికే
తాళిబొట్టు లాగ ఉండే బంగరు మొగుడు ఆహా ఆహా
పక్కలోన కాళ్ళు నావి తగిలినందుకే తన బిడ్డతోని కడుపులో తన్నించే మొగుడో ఓహో హై ఓహో
స్త్రీని పూర్తి చేయలేదు బ్రహ్మ దేవుడు పూర్తి స్త్రీగా మార్చేసే భర్తే దేవుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న

చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా

చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా
చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని
ఇన్నాళ్ళు నాకే తెలియని
నన్ను నేనే నీలో
చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా

పచ్చని మాగని చెలు పట్టు చీరగా కట్టి
బంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగ చుట్టి
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది
పున్నమి పదహారు కళలు సిగలో పువ్వులుగా పెట్టి
దేవేరిగా పాదం పెడతానంటూ
నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ
నవనిధులు వదువై వస్తుంటే
సాక్షత్తు శ్రీమనారయణుడే నేనైనట్టు

నువ్వు సేవిస్తుంటే నేను సార్వభోముడిని అయిపోతాను
నువ్వే తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను
నీ సౌందర్యముతో ఇంద్రపదవిని ఎదిరిస్తాను
నీ సాన్నిధ్యంలో స్వర్గమంటే ఎమిటి అంటాను
ఎళ్ళే వచ్చి వయసును మళ్ళిస్తుంటే
నేనే నీ వళ్ళో పాపగా చిగురిస్తుంటే

ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు

ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు
నన్ను ఇప్పటికీ వదలదు ఆ మైమరపు
మాయవో మహిమవో
రేపుమాపు తెలియకుంది
ఊపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది
బాసలేవొ రేపుతుంది

ఒక్క క్షణం పరిమళం పంచుతున్నది
మరుక్షణం కలవరం పెంచుతున్నది
ప్రతి క్షణం అనుభవం వింతగున్నది
ఈ ఆరాటమేదో ఏనాడు తెలియనిది
ఎదురుగానే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటా
తెరవగానే కరిగిపోయే స్వప్నమలే చూసుకుంటా

మాయవో మహిమవో

ఒక్క దినం నడవడం కష్టమన్నది
ఇక మనం కలవడం తప్పదన్నది
అది ఎలా అడగడం తెలియకున్నది
మౌనాన్నెలాగో నువ్వే వినాలంది
తలపు నిన్నే తరుముతోందా
తనను తానే వెతుకుతోందా
మనసు నిన్నే కలుసుకుందా
మనవి ఎదో తెలుపుకుందా

మన దారి హై వేరా సర సర దూసుకుపోరా

మన దారి హై వేరా సర సర దూసుకుపోరా
మన తీరే ఆవారా బేవార్సగా తిరిగేయరా
ఈ సాహసం ఈ సంబరం పెళ్ళయేవరకేలేరా
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్

ఏ బేబికైనా బీటేయి ట్రై చేస్తే క్రైం కాదోయి
ఓ బివీ వచ్చిందంటే ఏ మాత్రం వీలుండదుగా
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్

షాది అవుతుంది షెహజాది వస్తుంది
she will take your hand
she will take your heart
she will take everything that you have got
యేయి మామ జర జాగ్రత్త
so better be better be a bachelor boy

ఫుల్ బాటిలా ఉన్నావే ja ja johnny walker
వైఫ్ వస్తే హాఫ్ అవుతావే
సొచో ఫ్యూచర్
మ్యారేజుతో నీ గ్లామర్
మాజి యూత్ ఏగా మిస్టర్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్

26 October 2011

అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా

అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా
ఎటు చూసినా నువ్విలా
ఏం చేసినా నువ్విలా
వెంటాడుతూ నువ్విలా
వేదిస్తూ నువ్విలా

అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా
ఎటు చూసినా నువ్విలా
ఏం చేసినా నువ్విలా
వెంటాడుతూ నువ్విలా
వేదిస్తూ నువ్విలా

పొగ మంచు లాగ నన్ను ఏలా
కమ్మేసుకుంటే ఎప్పుడేల
జీవితాంతం నేను ఇలా ఉండిపోవాలా

చేతిలో చేయిలా కలపవే కోయిలా
ఈ క్షణం ఎందుకో ముద్దొస్తుంది పసిపాప నవ్వులా

నువ్వంటే నాకు ఇష్టం
ఇప్పుడిప్పుడే కలుగుతోందే
చెప్పలేను నీకు నేను
అయ్యొయ్యొయ్యొయూ

అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా
ఎటు చూసినా నువ్విలా
ఏం చేసినా నువ్విలా
వెంటాడుతూ నువ్విలా
వేదిస్తూ నువ్విలా

పూల తీగలాగ మనసిలా
అల్లేసుకుంటే నువ్వు ఇలా
వెల్లిపోనా వెల్లకుండా ఆగిపోవాలా
తోడుగా నువ్విలా ఎంత బాగుందిలా
ఇప్పుడే కొత్తగా వినిపిస్తుంది సెలెయేటి గల గలా
ఇన్నాల్లు లేని ప్రేమ
పుట్టిందే దీని పైనా
చెప్పేయనా తప్పుకోనా
అయ్యొయ్యొయ్యొయూ

అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా
ఎటు చూసినా నువ్విలా
ఏం చేసినా నువ్విలా
వెంటాడుతూ నువ్విలా
వేదిస్తూ నువ్విలా

అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా
నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా