మొగ్గా పిందాల నాడే బుగ్గా గిల్లేసినాడే
హాయ్ మొగ్గా పిందాల నాడే హాయ్ బుగ్గా గిల్లేసినాడే
కోనేటి గట్టుకాడ కొంగు పట్టి ముద్దు పెట్టి
చెంపలోని కెంపులన్నీ దోచినాడే
హోయ్ మొగ్గా పిందాల నాడే బుగ్గా గిల్లేసినాదే
అహ మొగ్గా పిందాల నాడె హాయ్ బుగ్గా గిల్లేసినాదే
గుండెల్లో వాలిపోయి గూడు కట్టి జోడుకట్టి
పాలుగారు అందమంత పంచినాదే
అబ్బోసి వాడి వగలు ఊ లగ్గోసి పట్టపగలు ఊ
గుమ్మెక్కి గుబులుగుంటది అబ్బ దిమ్మెక్కి దిగులుగుంటది
వల్లంకి పిట్టవంటు వళ్లంత నిమిరి నిమిరి వాటేస్తే అంతేనమ్మో
హాయ్ వయసొస్తే ఇంతేనమ్మో
అయ్యారే తేనే చిలుకు హోయ్ వయ్యారి జాణ కులుకు
ఎన్నెల్లో పగలుగుంటది అబ్బా
మల్లెల్లో రగులుగుంటుంది
వరసైనవాడవంటు సరసాలే చిలికి చిలికి
మాటిస్తే మనసేనమ్మో హా మనసిస్తే మనువేనమ్మో ఓ ఓ
మొగ్గా పిందాల నాడే హోయ్ బుగ్గా గిల్లేసినాడే
హాయ్ హోయ్ హోయ్ మొగ్గా పిందాల నాడే హోయ్ బుగ్గా గిల్లేసినాదే
వాటారే పొద్దుకాడా హోయ్ దాటాలా దాని గడప
లేకుంటే తెల్లవారదు హబ్బ నా కంట నిద్దరుండదు
కొత్తిమేర చేనుకాడ పొలిమేర మరచిపోతే
వాడంత గగ్గోలమ్మో హోయ్ ఊరంతా అగ్గేనమ్మో
తెల్లారే పొద్దుకాడా హోయ్ పిల్లాడు ముద్దులాడి
పోకుంటే సోకు నిలవదు వాడు రాకుంటే వయసు బతకదు
చెక్కిళ్ళ నునుపు మీద చెయ్యేస్తే ఎరుపు మిగిలి
పక్కిళ్లు నవ్వేనమ్మో ఈ నొక్కుళ్లు ఏం చేసేనమ్మో
హోయ్ మొగ్గా పిందాల నాడే అహ బుగ్గా గిల్లేసినాదే లాలాలలా ల లా ల
No comments:
Post a Comment