తలబడి కలబడి నిలబడు… పోరాడే యోధుడు జడవడు
సంకల్పం నీకుంటే ఓటమికైనా ఒణుకేరా..
బుడి బుడి అడుగులు తడబడి.. అడుగడుగున నీవే నిలబడి..
ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడీ..
వెలుగంటూ రాదు అంటే సూరీడైనా లోకువరా..
నిశిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయెను రా..
నీశక్తేదో తెలిసిందంటే నీకింకా తిరుగేదీ..
ప్రకాశంలో సూరీడల్లే.. ప్రశాంతంగా చంద్రుడి మల్లే
వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి..
పిడికిలినే బిగించి చూడూ.. అవకాశం నీకున్న తోడు..
అసాధ్యమే తలొంచుకుంటూ.. క్షమించూ అనేయ్ దా..
రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి
గిరా గిరా తిరిగేస్తుందీ క్రమంగా మహా స్థిరంగా..
ప్రతీకలా నిజమౌతుందీ.. ప్రయత్నమే ఉంటే..
ప్రతీకవే నువ్వవుతావు ప్రవర్తనే ఉంటే..
||ప్రకాశంలో||
జీవితమే ఓ చిన్న మజిలీ వెళిపోమా లోకాన్ని వదిలి
మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్నీ ఈ కీర్తినీ..
గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం..
ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకీ ప్రతిమలుపుకీ..
ప్రతిరోజూ ఉగాది కాదా ఉషస్సు నీవైతే..
ప్రభంజనం సృష్టిస్తావూ ప్రతిభే చూపిస్తే..
||ప్రకాశంలో||
No comments:
Post a Comment