01 November 2011

క్షేమమా ప్రియతమా సౌఖ్యమా నా ప్రాణమా

ఏహే ఏహే లాలలాలలా
ఆహా ఆహా లాలలాలలా

క్షేమమా ప్రియతమా సౌఖ్యమా నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా (2)

నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక పదిలమా

నీలోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు క్షేమమా (నీలి కురుల)

చలి గాలి గిలిగింత సౌఖ్యమా చెలి మీద వలపంతా సౌఖ్యమా
నీ క్షేమమే నా లాభము నీ లాభమే నా మోక్షము ||క్షేమమా||

కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు పదిలమా

నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా (కాలమల్లె)

తహతహలు తాపాలు సౌఖ్యమా బిడియాలు బింకాలు సౌఖ్యమా
నీ సౌఖ్యమే నా సర్వమూ ఆ సర్వమూ నా సొంతమూ ||క్షేమమా||

No comments: