03 November 2011

అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనే..

అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనే..
అయ్యయ్యో జోబులు ఖాళీ ఆయెనే..
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే..
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే..
ఉన్నది కాస్తా ఊడింది, సర్వమంగళం పాడింది..
మేటరు కోటరుకొచ్చిందీ..పరువును వీధికి తెచ్చింది..
పీజ్జా బర్గర్ తినే జీవికీ పచ్చడి టచ్చింగ్ ఇచ్చిందీ…”

||అయ్యయ్యో||

ఆ జమీందారుకే ఏలిన్నాటి శని షరతులు పెట్టిందే..
విధి వీడ్నుతికారేసిందే.. చేతికి చీపురు ఇచ్చిందే..
ఫోజుకు బూజే దులిపిందే..
ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగ మార్చే.. గాడిద చాకిరి చేయించే..
అయ్యయ్యో రాజభోగం పోయెనే.. రాజన్న జొరమే వచ్చెనే..

షవర్ బాత్ లు స్విమ్మింగ్ పూలూ ఎండమావులాయే.. అయ్యని ఎండగట్టినాయే.. గోయిందా.. గోయిందా..
ప్యాలెస్ నుండీ పాయిఖానాకు బాబే దిగివచ్చే.. దెబ్బకు దేవుడు కనిపించే.. అబ్బాయ్ నబ్బా అనిపించే..
ఏసీ బారు లో ఓసీ బతుకుకు షేకే వచ్చిందీ.. షేక్ కి షాకే ఇచ్చిందీ..

అయ్యయ్యో డాబుసరి సిరి దూరమే.. అయ్యయ్యో బాబు పని ఇక ఘోరమే..

జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాహా అయ్యాయీ..
కష్టాల్ కవాతు చేశాయీ.. గర్వపు కీళ్ళే విరిచాయీ.. కాళ్ళకు పుళ్ళే అయ్యాయీ..
నిష్ట దరిద్రపు లాటరీ వీడ్ని లాగి కొట్టిందీ.. కొడితే.. చిప్ప చేతికొచ్చే.. కూటికి తిప్పలెన్నో తెచ్చే..

అయ్యయ్యో మేళ్ళు మిద్దెలు మాయమే.. అయ్యయ్యో పేళ్ళొ బతుకైపాయెనే..

No comments: