01 November 2011

బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు

బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు
బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు
సయ్యనవే ఏ నా సరసకు రావే ఏ
సయ్యనవే ఏ నా సరసకు రావే ఏ
చక్కెర తునుక కిక్కురమనక పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డూ నా లడ్డు ఊ ఊ
గాడిద గుడ్డు ఆ బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు

తీగ నడుములో రాగమున్నది పాల సొగసులో ఓ మీగడున్నదీ ఈ
వయసు వరదలా పొంగుతున్నదీ మనసు మరదల అంటూ వున్నది
తుంటరి గుంట హ్హా హ్హా హ్హా వంటరిగుంటే హ హ
తుంటరి గుంట వంటరిగుంటే వంటికిమంచిది కాదీ పొద్దు లడ్డు నా లడ్డు
గాడిద గుడ్డు ముహ్హూ ఊ

అబ్బాయి వళ్ళు ఎలా వున్నది అమ్మాయి వాటం తెలియకున్నదీ
అబ్బాయి వళ్ళు ఎలా వున్నది అమ్మాయి వాటం తెలియకున్నదీ
చేయి తగిలినా చెంప పగిలినా తడిమి చూసుకొని పడతావయ్యో రోడ్డు ఓరి జిడ్డూ
గాడిదె గుడ్డు ఉహ్హూ ఆ బంగారు బాతు గుడ్డు షటాప్
బందారు తొక్కుడు లడ్డు ఛా పో

కస్సు మన్నదీ ఈ ఈ గడసు చిన్నదీ
కిస్సు కిస్సనీ అడుగుతున్నదీ
పగటి చుక్కలా ఆ ఆ వెలుగుతున్నదీ ఈ
పడుచు దిక్కునా ఎదుటే వున్నదీ
లకుముకి పిట్ట త్ప్రూ హూ తికమకపెడితే ఆహా
లకుముకి పిట్ట తికమకపెడితే ఆహా
చెకుముకి దెబ్బ తినిపిస్తానే లడ్డు నా లడ్డూ
గాడిద గుడ్డు ముహ్హూ

హల్లో మిస్టర్ అడవిరాముడు హో హో హో హో
అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు పోయీ పోయ్ పపబ్బాయి
హల్లో మిస్టర్ అడవిరాముడు అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు
తాత తుపాకి పాతగిరాకీ పిల్లచలాకీ చూపిస్తాలే చూడు ఓరి జిడ్డూ
గాడిద గుడ్డు ముహ్హూ బంగారు బాతు గుడ్డు షటాప్
బందారు తొక్కుడు లడ్డు ఛా పో సయ్యనవే ముహ్హూ
నా సరసకు రావే వ్వే వ్వే వ్వే సయ్యనవే అ నా సరసకు రావే ఏ
చక్కెర తునుక కిక్కురమనక పక్కకు వస్తే చేస్రుస్తానే ఒడ్డూ
డూ డూ డూ గాడిద గుడ్డు ముహ్హూ ఊ

No comments: