01 November 2011

మదనా సుందర నాదొరా

మదనా సుందర నాదొరా
ఓ మదనా సుందర నాదొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర
ఓ మదనా సుందర నాదొరా

చిన్న దానను నేను వన్నె కాడవు నీవు
చిన్న దానను నేను వన్నె కాడవు నీవు
నాకూ నీకూ జోడు నాకూ నీకూ జోడు
రాకా చంద్రుల తోడు
మదనా సుందర నాదొరా

మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెలపైన
మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెలపైన
రసకేళి తేలి రసకేళి తేలి
పరవశామౌద మీవేళ
మదనా సుందర నాదొరా

గిలిగింత లిడ ఇంత పులకింత లేదేమి
గిలిగింత లిడ ఇంత పులకింత లేదేమి
వుడికించ కింకా వుడికించ కింక
చూడొకమారు నా వంక
మదనా సుందర నాదొరా

మరులు సైపగ లేను విరహామోపగ లేను
మరులు సైపగ లేను విరహామోపగ లేను
మగరాయడా రా రా మగరాయడా రా రా
బిగి కౌగిలీ తేర మదనా సుందర నాదొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర
ఓ మదన సుందర నాదొరా

No comments: