22 June 2010

మాటల్తో స్వరాలే షికారుకెళ్తె గీతం

||పల్లవి||
మాటల్తో స్వరాలే షికారుకెళ్తె గీతం....
అందంగా నిశబ్దం తలొంచుకుంటె సంగీతం....
సంగీతం తో చేస్తే స్నేహం.....
పలికిందల్లా గీతం ||మాటల్తో||

||చరణం 1||
కాగితాలలో నిదురపోయే కమ్మని మాటే
కాస్తలెమ్మని ఇళయరాజా ట్యూను కడుతుంటే
పాటల్లె ఎగిరిరాదా......
నీ గుండె గూడైపొదా....
సంగీతం తో చేస్తే స్నేహం.....
హృదయం లయలే గీతం ||మాటల్తో||

||చరణం 1||
గోరుముద్దలో కలిపిపెట్టే గారమొకపాట
పాఠశాలలో మొదటనేర్పే పాఠమొక పాట
ఊయలని ఊపునుపాటే.....
దేవుడిని చూపునుపాటే....
సంగీతం తో చేస్తే స్నేహం.....
బ్రతుకే ఓ గీతం ||మాటల్తో||

No comments: