28 June 2010

సౌందర్యా..సౌందర్యా.. చిరునవ్వుకి రూపం సౌందర్య..

సౌందర్యా..సౌందర్యా.. చిరునవ్వుకి రూపం సౌందర్య..
కలలో నిజమల్లే.. కలిసావే సౌందర్య..(2)


సౌందర్య..సౌందర్య.. నా పాటకు ప్రాణం సౌందర్య..
ఎదలో ప్రియరాగం పలికావె సౌందర్య..
ఓహ్..తెలుగుతనమంటే సౌందర్య..
చిలిపితనమంటే సౌందర్య..
నిన్నలా చూస్తూ చూస్తూ ప్రేమ లోతు దిగిపొయా..

సాథియా సాథియా తూ మేరీ సాథియా..
ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా?..(2)


మల్లెలననా.. జాజులననా.., ఓ చెలీ నీ పెదవి పై మెరుపును?..
వెన్నెలననా.. వేకువననా.., గుండెనే కోస్తున్న ఆ తళుకును?.. ఓఓ..
మాటగా నిన్ను పొల్చగా సరిపోదులె ఏ పొలిక..
కుంచెలే తల దించవా నీ బొమ్మ గీయలేక..

సాథియా సాథియా తూ మేరీ సాథియా..
ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా?..(2)


నమ్మకంగా.. నమ్ముతున్నా.., ఎక్కడో నా కొరకు పుట్టావని..
స్వాగతంగా.. ఆ ఆ..వేచివున్నా హ హ, ఎప్పుడో నా వైపు వస్తావని .. హోహోఓ..
ఉందిగా లోలోపలే, దాచేదెలా ఆలాపనా?..
అందుకో చిరుగాలితో ఈ కబురు పంపుతున్నా...

సాథియా సాథియా తూ మేరీ సాథియా..
ఊహకే ఊపిరై నను చేరగా రావా ప్రియా?..(2)

No comments: