19 October 2007

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం
మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం
మరల మరల ప్రతిఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం
వేలవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభవేళలో
వేలవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభవేళలో
వీచె మలయమారుతాలు పుడమి పలికె స్వాగతాలు
మాలికలై తారకలే మలిచే కాంతి తోరణాలు
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం
వలపులోన పులకరించు కన్నులతో చెలిని చేరి పలుకరించు మగవారు
మనసులోన పరిమళించు వెన్నెలతో ప్రియుని చూచి పరవశించె ప్రియురాలు
జీవితమై స్నేహమయం … ఈ జగమే ప్రేమమయం
ప్రేమంటే ఒక భోగం .. కాదు కాదు అది త్యాగం
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం
ఉదయరాగం హృదయగానం

తూలీ సోలెను తూరుపు గాలి

తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే
నన్నే నడిపే దేవత నీవే …
తూలీ సోలెను తూరుపు గాలి
గాలివిసరి నీ కురులే చేదరీ నీలి మబ్బులే గంతులు వేసే
బెదరు పెదవుల నవ్వులు చూసి – బెదరు పెదవుల నవ్వులు చూసి
చిరు కెరటాలే చిందులు వేసే – చిరు కెరటాలే చిందులు వేసే
తూలీ సోలెను తూరుపు గాలి
చెలి కన్నులలో చీకటి చూచీ జాలి జాలిగా కదలెను నావ
చీకటి ముసరిన జీవితమల్లే – చీకటి ముసరిన జీవితమల్లే
నీ కన్నులతో వెదకెద త్రోవ – నీ కన్నులతో వెదకెద త్రోవ
తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ
నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే
నన్నే నడిపే దేవత నీవే …
తూలీ సోలెను తూరుపు గాలి
హైలేసా హైలేసా హైలే హైలేసా – హైలేసా హైలేసా హైలే హైలేసా

చందురునిమించు అందమొలికించు

చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే
చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే
అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా .. నాటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కధ పాడనా .. కన్నీటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కధ పాడనా
కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే .. చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే .. మిగిలెనీ శోకమే
విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే
చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే
నిన్ను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే
మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింటి మనువునే కోరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా
పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా .. మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు .. భువిలో మానవులు ధూళిలో కలసినా
అన్నచెల్లెళ్ళ జన్మబంధాలె నిత్యమై నిల్చులే
లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో
లాలి పాపాయి జో జో…

లేని బాట వెతుకుతున్న పేద వానికి ….

లేని బాట వెతుకుతున్న పేద వానికి ….
రాని పాట పాడుకున్న పిచ్చివానికి …..
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు
దోబూచులాడుతుంది విధి మనతో
దొంగాటలాడుతుంది మనసులతో
దోబూచులాడుతుంది విధి మనతో
దొంగాటలాడుతుంది మనసులతో
కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు
అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు
మాటలతో చిక్కుబడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతి గుండే బాధతో నిండినది
ఒలికే ప్రతి కన్నీటి చుక్క వెచ్చగా ఉంటుంది
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు
చీకటిలో వెలుగును చూడ నేర్చుకో
చమటలో స్వర్గాన్ని సృష్ఠి చేసుకో
విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే
పదిమందితోటి పంచుకునే రోజు వచ్చుటే
ఆ రోజు వచ్చులే …..
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు

నన్ను ఎవరో తాకిరి ..

నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో
ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో
సిగ్గులన్ని దోచుకుంటే తొలివలపే ఎంతో హాయి
ఆ మగసిరి అల్లరి అంతా నాకోసం దాచినదేమో
ఆ మగసిరి అల్లరి అంతా నాకోసం దాచినదేమో
అందగాడు ఆశపెట్టే సయ్యాటలు ఎంతో హాయి
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో
ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో
మల్లెలాగ నేను కూడా జడలోనే ఉంటే హాయి
ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో
ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో
కాంతిలాగ నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి

రాననుకున్నావేమో ..

రాననుకున్నావేమో .. ఇక రాననుకున్నావేమో
ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో .. ఏమో
ఏమనుకున్నారేమో … తమరేమనుకున్నారేమో
మీ చేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో .. ఏమో
చక్కని కన్నెవు ముక్కున కోపం నీకేలా .. నీకేలా ..
చల్లగాలిలో ఆటలాడగా రావేలా .. రావేలా ..
పిలిచిన వెంటనే పరుగున చెంతనే చేరాలా .. చేరాలా ..
వలచివచ్చి నే చులకనైతిగా ఈవేళా .. ఈవేళా ..
ఏమనుకున్నారేమో … తమరేమనుకున్నారేమో
మీ చేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో .. ఏమో
దొరగారేదో తొందర పనిలో మునిగారా .. మునిగారా ..
అందుచేతనే అయినివారినే మరిచారా .. మరిచారా ..
నిజమే తెలియక నిందలు వేయకు నా మీదా .. నా మీదా ..
మాట విసురులూ మూతి విరిపులూ మర్యాదా .. మర్యాదా ..
రాననుకున్నావేమో .. ఇక రాననుకున్నావేమో
ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో .. ఏమో
క్షణమే యుగమై మనసే శిలయై నిలిచానే .. నిలిచానే ..
నిన్ను చూడకా క్షణమె యుగముగా గడచేనే .. గడచేనే ..
ఎడబాటన్నది ఇకపై లేదని అందామా .. ఆందామా ..
ఈడు జోడుగా తోడు నీడగా ఉందామా .. ఉందామా

ఒకసారి కలలోకి రావయ్యా

గొల్ల గోపన్న …. ఒకసారి కలలోకి రావయ్యా
ఒకసారి కలలోకి రావయ్యా
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా …
ఒకసారి రాగానే ఏమౌనులే ..
నీ హృదయాన శయనించి ఉంటానులే ..
ఏలుకుంటానులే …
ఒకసారి రాగానే ఏమౌనులే
పగడాల నా మోవి చిగురించెరా ..
మోము చెమరించెరా .. మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా
సొగసు వేణువు చేసి పలికించరా
కెమ్మోవి పై తేనె ఒలికించనా …
కెమ్మోవి పై తేనె ఒలికించనా
తనివి కలిగించనా .. మనసు కరిగించనా
కేరింతలాడించి సోలించనా … కేరింతలాడించి సోలించనా
ఒకసారి కలలోకి రావయ్యా
ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే … మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే ..
మరపులో మధుకీల రగిలించవే
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా ..
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
మొగ్గ తొడిగిందిరా .. మురిసి విరిసిందిరా
పదును తేలిన వలపు పండించరా
పదును తేలిన వలపు పండించరా
ఒకసారి కలలోకి రావయ్యా
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా …
ఒకసారి రాగానే ఏమౌనులే ..

అడగక ఇచ్చిన మనసే ముద్దు ..

అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు
నడకలలో నాట్యం చేసే నడుము జూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే నడుము జూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే జడను జూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే జడను జూస్తే చలాకి ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను జూస్తే ఏదో ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను జూస్తే ఏదో ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు
పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ఊహుహు.హూహు
చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ముద్దుకు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో ….
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …
సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా
సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా
అడుగడుగున హంసలు ఒయ్యారము లొలుకగా
వెతికే పెదవులతో ..తొణికే మధువులతో
వెతికే పెదవులతో ..తొణికే మధువులతో
పొందుగోరి చెంతజేరి మురిపించే నా చెలీ …
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …
కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో
కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో
ముల్లునైన మల్లియగా మలచే కనుదోయితో
నడిచే తీగియవై పలికే దీపికవై
నడిచే తీగియవై పలికే దీపికవై
అవతరించి ఆవరించి అలరించే నా చెలీ ..
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …

చందమామ రమ్మంది చూడు

చందమామ రమ్మంది చూడు చల్లగాలి రమ్మంది నేడు
ఆ పైన ఇంక ఆ పైన నువ్వు నా కళ్ళలో తొంగి చూడు
చందమామ బాగుంది నేడు చల్లగాలి బాగుంది నేడు
ఏముంది ఇంక ఏముంది అది అంతే కదా ఏ నాడు
చందమామ బాగుంది నేడు
పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు
తెలుసుకోలేవు నీవు పలకగాలేను నేను
చందమామ రమ్మంది చూడు
పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు
నీది నా దారి కాదు నాది నీ దారి కాదు
చందమామ బాగుంది నేడు
చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా వింత నాకేమి లేదు
అడవి మనిషివి నీవు
ఆమాటె తగదన్నాను
చందమామ రమ్మంది చూడు చల్లగాలి రమ్మంది నేడు
ఆ పైన ఇంక ఆ పైన నువ్వు నా కళ్ళలో తొంగి చూడు
చందమామ రమ్మంది చూడు

చూచి వలచి చెంతకు పిలచి

చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతి
చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతి
చూచి వలచి చెంతకు చేరి నా సొగసులు కానుక చేసి
నీ మగసిరి బానిసనైతి
చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి
నీ మగసిరి బానిసనైతి
అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి
అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి
సందిట బందీ చేసి … సందిట బందీ చేసి
నా బందీ వశమై పోతి
చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి
నీ మగసిరి బానిసనైతి
నూతన వధువై నిలచి వరుని వలపుల వధువై మారి
నూతన వధువై నిలచి వరుని వలపుల వధువై మారి
సఖుని ఒడిలో తురిగి .. సఖుని ఒడిలో తురిగి
కోటి సుఖముల శిఖరమునైతి
చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతి
వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదుర జగము మరచీ
వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదుర జగము మరచీ
నీవే జగమై .. నీలో సగమై .. నేటికి నిండుగ పండితి ..
చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి
నీ సొంపుల ఏలికనైతి
చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి
నీ మగసిరి బానిసనైతి

విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా

విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా
విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే …
విన్నానులే ప్రియా
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే
ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే
ఒదిగి ఉన్నావులే
విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే …
విన్నానులే ప్రియా
వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము
వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము
కలకల నవ్వే నీ కళ్ళు … కాముడు దాగిన పొదరిళ్ళు
ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే
నిండి ఉన్నావులే
విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే …
విన్నానులే ప్రియా
చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల
చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు
ఆ పసిడి పందిళ్ళలో మనకె పరిణయమౌనులే..
పరిణయమౌనులే
విన్నానులే ప్రియా .. కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే …
విన్నానులే ప్రియా

సాగేను జీవిత నావ ..

సాగేను జీవిత నావ .. తెరచాప లేక ఈ త్రోవ
దరిజేర్చు దైవము నీవే .. నా ఆశ దీర్చ రావే ..
సాగేను జీవిత నావ
మనసంత నీకు మందిరముగా మమతలే పూమాలగా
మనసంత నీకు మందిరముగా మమతలే పూమాలగా
కానుకగా అర్పించలేనా … కానుకగా అర్పించలేనా
కలకాలం పూజించనా …
సాగేను జీవిత నావ .. తెరచాప లేక ఈ త్రోవ
దరిజేర్చు దైవము నీవే .. నా ఆశ దీర్చ రావే ..
సాగేను జీవిత నావ
కనులార నిన్ను గాంచినంత కలలన్ని సత్యమౌనులే ..
కనులార నిన్ను గాంచినంత కలలన్ని సత్యమౌనులే ..
కనికరమే నా పైన రాదా .. కనికరమే నా పైన రాదా
నా తపసే ఫలించదా …
సాగేను జీవిత నావ .. తెరచాప లేక ఈ త్రోవ
దరిజేర్చు దైవము నీవే .. నా ఆశ దీర్చ రావే ..
సాగేను జీవిత నావ

పువ్వు పువ్వు … ఏఁ పువ్వు …

పువ్వు పువ్వు … ఏఁ పువ్వు … పగలే వెలిగే జాబిలి పువ్వు
జాబిలి జాబిలి … ఏఁ జాబిల్లి …నవ్వుల పువ్వుల నువ్వే జాబిల్లి
నవ్వు నవ్వు … ఏఁ నవ్వు … నాలో నువ్వై వెలిగే నవ్వు
నవ్వు నవ్వు … ఏఁ నవ్వు … నాలో నువ్వై వెలిగే నవ్వు
వెలుగు వెలుగు … ఏఁ వెలుగు … కలసిన కన్నుల కమ్మని వెలుగు
పువ్వు పువ్వు … ఏఁ పువ్వు … పగలే వెలిగే జాబిలి పువ్వు
వలపు వలపు … ఏఁ వలపు … మనసులు రెండూ పెనచిన వలపు
వలపు వలపు … ఏఁ వలపు … మనసులు రెండూ పెనచిన వలపు
రెండు రెండు .. ఏ రెండు … ఒకటై పోయే లేవిక రెండు
పువ్వు పువ్వు … ఏఁ పువ్వు … పగలే వెలిగే జాబిలి పువ్వు
జాబిలి జాబిలి … ఏఁ జాబిల్లి …నవ్వుల పువ్వుల నువ్వే జాబిల్లి
ఒకరిని ఒకరు మెచ్చుకొని … ఒకరిలొ ఒకరిని చూచుకొని
ఒకరిని ఒకరు మెచ్చుకొని …ఒకరిలొ ఒకరిని చూచుకొని
ఒకరికి ఒకరు ఉన్నామనుకుని … ఉంటే స్వర్గం ఎందుకని

నీ లేత గులాబి …..

నీ లేత గులాబి ….. పెదవులతో …..
కమ్మని మధువును తాకాలి
లేత గులాబి పెదవులతో కమ్మని మధువును తాకాలి
విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి
లేత గులాబి పెదవులతో కమ్మని మధువును తాకాలి
మధురమైన ఈ మంచి రేయిని వృధా చేయకే … సిగ్గులతో
మధురమైన ఈ మంచి రేయిని వృధా చేయకే సిగ్గులతో
చంద్రుని ముందర తారవలే … చంద్రుని ముందర తారవలే
నా సందిట నీవే ఉండాలి ….
ఈ మధువంతా నీ కోసం .. పెదవుల మధువు నాకోసం
మధువు పుట్టింది నా కోసం .. నేను పుట్టింది నీ కోసం ..
మధువు పుట్టింది నా కోసం .. నేను పుట్టింది నీ కోసం
కన్నుల కాటుక కరగక ముందే … కన్నుల కాటుక కరగక ముందే
సిగలో పువ్వులు వాడక ముందే .. సిగలో పువ్వులు వాడక ముందే
పానీయముతో పరవశమై పానీయముతో పరవశమై
నీ కౌగిట నన్నే బంధించుకో .
లేత గులాబి పెదవులతో కమ్మని మధువును తాకాలి

పూవులు పూయును పదివేలు…

పూవులు పూయును పదివేలు…భగవానుని మెడలో ఎది వ్రాలు
పూవులు పూయును పదివేలు…భగవానుని మెడలో ఎది వ్రాలు
ప్రాణములున్నవి అందరికీ … ప్రణయము తెలిసే దెందరికి
పూవులు పూయును పదివేలు…భగవానుని మెడలో ఎది వ్రాలు
అరుదైన వరం మన జీవితము …ఆనందానికే అది అంకితము
అరుదైన వరం మన జీవితము …ఆనందానికే అది అంకితము
అఱ చేతనె ఉన్నది స్వర్గమురా ….. అఱ చేతనె ఉన్నది స్వర్గమురా
అది ఎఱుగని వారిదే నరకమురా ..
పూవులు పూయును పదివేలు…భగవానుని మెడలో ఎది వ్రాలు
చేజారినదీ నిన్నటి దినము .. జనియించనిదీ రేపటి దినము
చేజారినదీ నిన్నటి దినము .. జనియించనిదీ రేపటి దినము
అవి అందనివీ మన కెందుకురా .. అవి అందనివీ మన కెందుకురా
ఈ దినమే మనదనుకుందామురా ..
పూవులు పూయును పదివేలు…భగవానుని మెడలో ఎది వ్రాలు
ప్రాణములున్నవి అందరికీ … ప్రణయము తెలిసే దెందరికి
పూవులు పూయును పదివేలు…భగవానుని మెడలో ఎది వ్రాలు

పూవువలే విరబూయవలే …

పూవువలే విరబూయవలే … పూవువలే విరబూయవలే
నీ నవ్వువలే వెలుగీయవలే
తావివలే మురిపించవలే .. తావివలే మురిపించవలే
మనమెవ్వరమో మరిపించవలే…..
మమతల నెలవై మాయని కలవై
మనుగడ మధురం చేయవలే
పున్నెముల ఫలమై ఎన్నుకున్న వరమై
నా ఇహపరమై ఏలవలే
పున్నెముల ఫలమై ఎన్నుకున్న వరమై
నా ఇహపరమై ఏలవలే
మనమే నిజమై .. మనసే ఋజువై
మనమే నిజమై .. మనసే ఋజువై
మనమే జగమై జగమేలవలే
మనమే జగమై జగమేలవలే
పూవువలే విరబూయవలే .. నీ నవ్వువలే వెలుగీయవలే
చిట్టి పాప నేనై తల్లిఒడి నీవై నీ హృదిలోనే దాగవలె
చిట్టి పాప నేనై తల్లిఒడి నీవై నీ హృదిలోనే దాగవలె
చిత్తమున నిన్ను హత్తుకుని నేను జీవితమంతా సాగవలె
నిన్నే తలచి నన్నే మరచి అన్నీ తెలిసీ అలరించవలే
తావివలే మురిపించవలే మనమెవ్వరమో మరపించవలే

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా …. రావమ్మా…
గురివింద పొదకింద గొరవంక పలికె
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె
గురివింద పొదకింద గొరవంక పలికె
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె
తెల్లారి పోయింది పల్లె లేచింది
తెల్లారి పోయింది పల్లె లేచింది
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా …. రావమ్మా…
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా … రావమ్మా… కృష్ణార్పణం ….
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం ..
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం ..
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం …కలకాలం సౌఖ్యం
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా …. రావమ్మా… కృష్ణార్పణం …

పగడాల జాబిలి చూడు

పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
వేయి అందాల నా రాజు అందిన ఈ రోజు ఎందుకులే నెలరేడు
పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు
మనసు మనసు గుసగుసలాడెను.. పెదవి పెదవి కువకువ లాడెను
మనసు మనసు గుసగుసలాడెను.. పెదవి పెదవి కువకువ లాడెను
ఆకాశ దీపాలు శయినించెను .. నా కళ్ళు నీకళ్ళు పయనించెను
ఆకాశ దీపాలు శయినించెను .. నా కళ్ళు నీకళ్ళు పయనించెను
పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు
బంగరు మమతలు పొంగులు వారెను..కొంగులు రెండూ ముడివడిపోయెను
బంగరు మమతలు పొంగులు వారెను..కొంగులు రెండూ ముడివడిపోయెను
గుడిలోని దేవుడు దీవించెను నా జడలోని పూవులు తిలకించెను
గుడిలోని దేవుడు దీవించెను నా జడలోని పూవులు తిలకించెను
పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు

ఎవరన్నారివి కన్నులని ..

ఎవరన్నారివి కన్నులని .. ఎవరన్నారివి కన్నులని
అరెరే మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని .. ఎవరన్నారివి బుగ్గలని
హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి
ఎవరన్నారివి కనులని
నడుమిది ఏమంటున్నది .. ఈ నడుమిది ఏమంటున్నది
నా పిడికిట ఇమిడెదనన్నది
నల్లని జడ ఏమన్నది … నా నల్లని జడ ఏమన్నది
అది నను బంధించెద నన్నది .. నను బంధించెద నన్నది
ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి
సిగ్గులు దోసిట దూయకు .. నా సిగ్గులు దోసిట దూయకు
నీ చేతుల బందీ చేయకు .. నీ చేతుల బందీ చేయకు
మెల్లగ లోలో నవ్వకు .. మెలమెల్లగ లోలో నవ్వకు
చలచల్లగ పిడుగులు రువ్వకు .. చల్లగ పిడుగులు రువ్వకు
ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి
అడుగున అడుగిడుటెందుకు .. నా అడుగున అడుగిడుటెందుకు
నువు తడబడి పోతున్నందుకు
మరిమరి చూచెదవెందుకు .. నను మరిమరి చూచెదవెందుకు
నువు మైకంలో ఉన్నందుకు .. మైకంలో ఉన్నందుకు
ఎవరన్నారివి కన్నులని ..అరెరే మధువొలికే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని ..హోయ్. ఎఱ్ఱని రోజా మొగ్గలవి

భారత మాతకు జేజేలు

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు …
విప్లవ వీరులు వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

సన్నని వెన్నెల జలతారువలే

సన్నని వెన్నెల జలతారువలే
కన్నుల కమ్మెను కన్నీటి చెల
ఆ తెరలో …, ఈ రాతిరిలో ….
నిన్ను నేను చూస్తున్నా ….. నిన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా
ఇద్దరిలో జగతిలోన ప్రేమ కొరకు వేగిపోవు
వేలవేల హృదయాలే చూస్తున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
కదలీ కదలక కదలే నీ కదలికలో
కదలీ కదలక కదలే నీ కదలికలో
చిరుగాలికి ఊగాడే వరి మడినే చూస్తున్నా
ఆ వరి మడిలో … ఆ ఒరవడిలో …
వంగి వంగి కలుపుతీయు కాపు కన్నె వంపులన్ని చూస్తున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
విరిసీ విరియని విరివంటి పరువంలో
కెరటాల గోదారి ఉరకలనే కంటున్నా
ఆ ఉరకలలో …. ఆ నుఱుగులలో
ఆ ఉరకలలో నుఱుగులలో జడవేస్తూ పడవ నడుపు
పల్లెపడుచు పకపకలే వింటున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
చిదుమని చెక్కిలి చిందే సిగ్గుల్లో
సందెవేళ అలముకునే ఎఱ్ఱజీర చూస్తున్నా
ఆ ఎఱ్ఱదనంలో .. ఆ కుర్రతనంలో …
ఆ ఎఱ్ఱదనంలో .. ఆ కుర్రతనంలో
వెనకజన్మలెన్నెన్నో పెనవేసిన వెచ్చదనం కంటున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా

ఏ తోడు లేదు … ఏ తోడు లేదు

ఏ తోడు లేదు … ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ ఇలలోని అందాలు నే చూడలేను
చల్లగాలి ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ ఇలలోని అందాలు నే చూడలేను
చల్లగాలి ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
మల్లెపూలు తెలుపనీ అంటారు
బంతిపూలు పసుపనీ ఆంటారు
కుంకుమ ఎఱుపనీ అంటారు
కాటుక నలుపనీ అంటారు
ఇన్ని వన్నెలున్నా ….
ఇన్ని వన్నెలున్నా నాకున్నదేమిటీ
ఈ కన్నులలో పగలురేయి కటిక చీకటి
చల్లగాలీ ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ ఇలలోని అందాలు నే చూడలేను
చల్లగాలీ ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
వసంతాలు ప్రతి ఏటా వస్తాయి
ప్రభాతాలు ప్రతి రోజూ వస్తాయి
తారకలు ప్రతిరేయీ వస్తాయి
తరంగాలు ప్రతిక్షణం వస్తాయి
ఇన్ని మారుతున్నా …
ఇన్ని మారుతున్నా ఈ బ్రతుకు మారునా
నా కన్నులలో కాంతి గంగ వెల్లివిరియదా
చల్లగాలీ ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ ఇలలోని అందాలు నే చూడలేను
చల్లగాలీ ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..

గున్నమామిడి కొమ్మమీద

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

అప్పుచేసి పప్పుకూడు తినరా

అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా

దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పుచేసి మీసం మెలిదిప్పరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా

ఉన్నవారు లేనివారు రెండేరెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా

వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకెళితె ఐ.పి. బాంబుందిరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా

రూపాయే దైవమురా రూపాయే లోకమురా
రూక లేనివాడు భువిని కాసుకు కొఱగాడురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా

అంతగా నను చూడకు …

అంతగా నను చూడకు … ష్… మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను..
చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను
తలుపులే కవ్వించెను ..వలవుల వీణలు తేలించెను
అంతగా నను చూడకు … ష్… మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను
జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను … పదునౌ చూపులు బాధించెను
హోయ్ అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు
వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ ..
వాలుగ నిన్నే చూడనీ .. కలకాలము నీలో దాగనీ
నవ్వులే పండించనీ .. పువ్వుల సంకెల బిగించనీ ..
హోయ్ అంతగా నను చూడకు .. ష్ .. మాటాడకు
అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు
హోయ్ అంతగా నను చూడకు

ఆనాటి మధుర వసంతం

ఆనాటి మధుర వసంతం ఈనాడు విధురహేమంతం
ఆనాటి తీయని సుఖం ఈనాడు కాలకూట విషం ..
కాలకూట విషం
కాలమే విధి రూపము మానవాళికి దీపము
శోకమైనా .. సౌఖ్యమైనా …కాలమే ప్రమాణము …
కాలమే విధి రూపము..

కలసివచ్చిన కాలమైతే మనిషి తానే దైవము
కలసివచ్చిన కాలమైతే మనిషి తానే దైవము
మంచిరోజులు మారిపోతే పరుల కంటికి హీనము …
పరుల కంటికి హీనము
కాలమే విధి రూపము.. మానవాళికి దీపము

కలల వెన్నెల కరిగిపోగా కారుచీకటి నిండెనా ..
కలల వెన్నెల కరిగిపోగా కారుచీకటి నిండెనా
పరుల పంచను బ్రతుక వలసిన వ్రాతయే మీదాయెనా ..
వ్రాతయే మీదాయెనా …
కాలమే విధి రూపము.. మానవాళికి దీపము

ఒకని భాగ్యము తూగుటూయల ఒకని శాపము శోకము
కాలమెవరికి మేలు చేయునో కాలమెవరికి కీడు చేయునో
మానవునికే తెలియరానిది విధివిలాసము చోద్యము
విధివిలాసము చోద్యము
కాలమే విధి రూపము.. మానవాళికి దీపము
శోకమైనా .. సౌఖ్యమైనా …కాలమే ప్రమాణము …
కాలమే విధి రూపము..

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు

అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతుఉంటారెందుకు
ఇంకొక్క రాతికి చేతులెత్తుకుని మొక్కుతుఉంటారెందుకు
అది వీధిలోన పడి ఉన్నందుకు .. అది వీధిలోన పడి ఉన్నందుకు
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ …
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు
ఊరుమీద పడి చందాలెందుకు
లోకులు చూచి తరించుటకు … లోకులు చూచి తరించుటకు
పలుగాకుల బొజ్జల పెంచుటకు… పలుగాకుల బొజ్జల పెంచుటకు
మహమ్మదీయులు పిలిచే దేవుడు
క్రైస్తవులంతా కొలిచే దేవుడు
ఏడుకొండల వేంకటేశ్వరుడు గోవిందా .. గోవిందా
శ్రీశైలంలో మల్లికార్జునుడు
వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా
శ్రీశైలంలో మల్లికార్జునుడు
వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా
సర్వవ్యాపి నారాయణుడు ….
సర్వవ్యాపి నారాయణుడు ఎక్కడ జూచిన ఉంటాడు
ఆ స్వామి కొరకె నే శోధిస్తున్నా .. తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా
ఆఁ అట్టా రండి దారికి …
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
మీరొక్క దెబ్బతో తేల్చారు ..
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
మీరొక్క దెబ్బతో తేల్చారు
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు
ఏ రాతికి మొక్కను వచ్చారు
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం

దివినుండి భువికి దిగివచ్చే

దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు
అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు
అందిన జాబిలి పొందులో అందాలు … అందిన జాబిలి పొందాలో అందాలు
పొందాను ఈనాడు ఈనాడు …. పొందాను ఈనాడు ఈనాడు
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
కనరాని దేవుని కనులా జూడాలని కలగంటి నొకనాడు ఆనాడు
కనరాని దేవుని కనులా జూడాలని కలగంటి నొకనాడు ఆనాడు
కల నిజము చేసి కౌగిలిలో జేర్చి .. కల నిజము చేసి కౌగిలిలో జేర్చి
కరిగించే ఈనాడు ఈనాడు … కరిగించే ఈనాడు ఈనాడు
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
కడలిలో పుట్టావు అలలపై తేలావు నుఱగవై వచ్చావు ఎందుకో …
కడలిలో పుట్టావు అలలపై తేలావు నుఱగవై వచ్చావు ఎందుకో
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో ..
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో
ఒరిగీ కరగాలని ఆశతో ….
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై
అ …. గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై
దివినుండి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై

ఊయల లూగినదోయి మనసే …

ఊయల లూగినదోయి మనసే …
తీయని ఊహల తీవెలపైన …
ఊయల లూగినదోయి మనసే …
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయీ

వెన్నెల పూవులు విరిసే వేళ
సన్నని గాలులు సాగే వేళ
వలపులు ఏవో పలికెను నాలో ….
వలపులు ఏవో పలికెను నాలో
తెలుపగ రానిది ఈ హాయి
ఊయల లూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయీ

కమ్మని రాతిరి రమ్మని పిలిచే
మల్లెల పానుపు మనకై నిలిచే
ప్రాయము నీవై పరువము నేనై ….
ప్రాయము నీవై పరువము నేనై
పరిమళించగా రావోయి…
ఊయల లూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయీ

ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు

ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఊఁ ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము
ఆలాగంటే ఏలాగండి అయినవాళ్ళని అడిగాము
అంతేలెండి అంతకు మించి ఏదో ఏదో ఉందని అన్నానా
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

నడవకు నడవకు అమ్మయ్యో నడిచావంటే అమ్మయ్యో
నడుమే నలిగిపోతుంది నీ నడుమే నలిగిపోతుంది
పొగడకు పొగడకు అయ్యయ్యో పొగిడారంటే అయ్యయ్యో
మనిషే వెగటైపోతారు మనిషే వెగటైపోతారు
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

చూడకు అలా చూడకు ..
చూసావంటే ఏదో ఏదో ఔతోంది .. ఎదలో ప్రేమే పుడుతోంది
ఏదో ఏదో ఔతోంది .. ఎదలో ప్రేమే పుడుతోంది
పుట్టనీ పాపం పుట్టనీ ప్రేమే పుడితే
పెంచేదాన్నీ నేనున్నాలాలించేదాన్నీ నేనున్నా
జోజోజో… జోజోజో…
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను
ఏవఁమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు
ఏదోలెండి మీ దయవల్ల ఈలా ఉన్నాను

వెన్నెలకేలా నాపై కోపం

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది
కన్నులకేలా నాపై కోపం కణకణలాడినవి
నీ చూపులకేనా నాపై కోపం తూపులు దూసినవి
వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది
బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…
బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…
నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగ మారినదో
పీటలపైన పెళ్ళిదినాన మాటలు కరువైనా
నన్ను ఓరచూపుల కోరికలూరా చూడవా నీవైనా..
వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది
మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా..
ఓ..ఓ..ఓ.. మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా..
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా ..
నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా ..
వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ
ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది

ఓ నిండు చందమామ …

ఓ నిండు చందమామ … నిగనిగల భామ
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామ

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
ఏలుకునే ప్రియుడను కానా నాలించగ సరసకు రానా
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామ … నిగనిగల భామ
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామ

దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడతాయే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడతాయే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నేటినుంచి నేనులు రెండూ నెరజాణా ఒకటాయే..
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామ … నిగనిగల భామ
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామ

అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా

అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు లేని అత్త గుణవంతురాలు
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ..
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు లేని అత్త గుణవంతురాలు
కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా
పచ్చిపాలమీద మీగడేదమ్మా .. ఆ వేడిపాలమీద వెన్న ఏదమ్మా
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ
అత్తమ్మ నీ చేత ఆరడే గానీ ఓలేమ్మా
పచ్చిపాలమీద మీగడుంటుందా .. ఆ వేడిపాలమీద వెన్న ఉంటుందా
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు లేని అత్త గుణవంతురాలు
వంట ఇంటిలోన ఉట్టిమీదుంచిన సున్నుండలేమాయే కోడలా
మినప సున్నుండలేమాయే కోడలా …
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ
ఇంటికి పెద్దైన గండు పిల్లుండగా ఇంకెవరు వస్తారె అత్తమ్మా
వేరే ఇంకెవరు తింటారే అత్తమ్మా …
ఛీ పో… నీ జిమ్మడా…. ఉండు నీ పని చెబుతా…
కొరివితో అత్తమ్మ గుమ్మానికంతా వచ్చిందీ
పొమ్మని కాలంతా కుట్టిందీ తేలు
అయ్యో.. అబ్బా … అమ్మా … అయ్యో
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆహ.. ఊహూ
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడలు లేని అత్త గుణవంతురాలు
ఆహ.. ఊహూ .. అహ …

నగుమోము చూపించవా గోపాలా

నగుమోము చూపించవా గోపాలా
నగుమోము చూపించవా గోపాలా
మగువల మనసుల నుడికింతువేలా
నగుమోము చూపించవా గోపాలా …..
ఎదుట … ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట
ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట ….
ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట
ఇక సైపలేను నీవే నా ముద్దుల జంట
నగుమోము చూపించవా గోపాలా…..
వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ
వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ
మగనాలిపై ఇంత బిగువు చూపెదవేల
నగుమోము చూపించవా గోపాలా ….
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
నెలవంకలిది నన్ను అలరించవేమయ్య
నగుమోము చూపించవా గోపాలా ….

సుందరాంగా అందుకోరా

సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేరరాద
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేరరాద
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు తాపాన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై చవులూరించు క్రొందేనె జూఱ్ఱాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై చవులూరించు క్రొందేనె జూఱ్ఱాడుదాం
తేలాడుదాం ఓలాడుదాం ముదమార తనిదీర ఈదాడుదాం
ముదమార తనిదీర ఈదాడుదాం
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
సుందరాంగా అందుకోరా … సుందరాంగా అందుకోరా ..
సుందరాంగా అందుకోరా … సుందరాంగా అందుకోరా..
సుందరాంగా అందుకోరా .. సుందరాంగా అందుకోరా
సుందరాంగా … సుందరాంగా … సుందరాంగా …
ఓం నమశ్శివాయ … ఓం నమశ్శివాయ .. ఓం నమశ్శివాయ

నీ పేరు తలచినా చాలు

కృష్ణా …………….
నీ పేరు తలచినా చాలు … నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
ఏమి మురళి అది ఏమి రవళిరా … ఆఆఆఆఆఆఆఆ
ఏమి మురళి అది ఏమి రవళిరా
పాట వినగ ప్రాణాలు కదలురా
ఏమి మురళి అది ఏమీ రవళిరా
పాట వినగ ప్రాణాలు కదలురా
మురళీధరా నీ స్వరలహరులలో మరణమైనా మధురమురా
నీ పేరు తలచినా చాలు
వెదురు పొదలలో తిరిగి తిరిగి
నీ పదపల్లవములు కందిపోయెనా
వెదురు పొదలలో తిరిగీ తిరిగి
నీ పదపల్లవములు కందిపోయెనా
ఎదపానుపుపై పవళించరా
నా పొదిగిన కౌగిట పులకించరా
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు
గోపాలా ……. నందబాలా నవమంజుల మురళీలోలా
మృదు సమీర సంచిత మనోజ్ఞ కుంతల నమాల పల్లవ జాలా
కృష్ణా .. నీ పేరు తలచినా చాలు
ఏమి పిలుపు అది ఏమి పిలుపు
బృందానికుంజముల పూలు పూచి
శరబిందుచంద్రికల చేయిచాచి
తరుణాంతరంగమున దాగిదాగి
చెలి అందెలందు చెలరేగి రేగి
నను తొందరించెరా………తొలకరించెరా
తొందరించెరా తొలకరించెరా
వలపు జల్లుగా పలుకరించెరా
చల్లని రమణి చల్లని ఉల్లము
అల్లన ఝల్లన పరవశించెరా ….
కృష్ణా …. నీ పేరు తలచినా చాలు…

అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను

అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
నుదుట బాసికము నూతల కాంతుల మెరిసే
మదిలో కోరిక మంగళగీతం పాడే
వేచిన కనులే వేయి వలపులై పూచే
పూచిన వలపుల పులకరించెనే మేను
ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
బుగ్గను పెట్టిన నల్లచుక్క తానవ్వే …
సిగ్గుబరువుతో కన్నెవలపు తలవంచే …
జడలో కుట్టిన మొగలిపువ్వు దీవించే
జన్మజన్మకు అతడే నా మగడమ్మా
ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాము
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది

ఈవీణ పలికించు ఎన్ని రాగాలో

ఈవీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో

మనసులో రాగాలు స్వరములై పలికాయి
కనులలో రాగాలు కళలుగా వెలిసాయి
మనసులో రాగాలు స్వరములై పలికాయి
కన్నులలో రాగాలు కళలుగా వెలిసాయి
కన్నెగుండియలోన గమకాలు తెలిసాయి
ఆ….. కన్నెగుండియలోన గమకాలు తెలిసాయి
సన్న సన్నగ వలపు సంగతులు వేసాయి

ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో

మోహనా ఆలాపించ మోహమే ఆపినది
కళ్యాణి లోలోన కదలాడుతున్నది
మోహనా ఆలాపించ మోహమే ఆపింది
కళ్యాణి లోలోన కదలాడుతున్నది
శృతి కలిపి జత కలిసి సొక్కులెరిగిన వాడు తోడైన నాడే నే తోడు పాడేది

ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
ఇన్ని రాగాలు ఈ యెదలోన దాచినది
ఏ మధుర మూర్తికో ఏ మమత పంటకో
ఇన్ని రాగాలు ఈ యెదలోన దాచినది

ఏ మధుర మూర్తికో ఏ మమత పంటకో
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై
రాగమాలికలల్లి రానున్న ప్రభువుకై
వేచి ఉన్నది వీణ కాచుకున్నది కాన …

ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో
నాలోన పులకించు ఎన్ని భావాలో
ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో

ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ

ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ
గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప
ఏ కానుకలను అందించగలనో చెలీ
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప
జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా ….
శరదిందు చంద్రికా,.,,
నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి
నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి
విరులెందుకు సిరులెందుకు
మనసు లేక మరులెందుకు
తలపెందుకు తనువెందుకు
నీవు లేక నేనెందుకు … నీవు లేక నేనెందుకు

17 October 2007

ప్రనయమ మరు మల్లే పూల తోటలో

ఆ ఆ ఆ ఆఆ
ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
ప్రనయమ మరు మల్లే పూల తోటలో
గుమ్మ గు
మ్మపరువమ్మ సరసాల వీన పాటలో సరిగమ
మోయలేని భావమ్మ
రాయలేని కవ్యమ్మ
నండురి వారి గయమ్మ
ప్రనయమ మరు మల్లే పూల తోటలో
గుమ్మ గుమ్మ
పరువమ్మ సరసాల వీన పాటలో సరిగమ
మోయలేని భావమ్మ
రాయలేని కవ్యమ్మ
నండురి వారి గయమ్మ
ప్రనయమ మ్మ్ మరు మ్మ్ మల్లే మ్మ్ పూల మ్మ్ తోటలో గుమ్మ గుమ్మపరువమ్మ నన సరసాల న వీన న పాటలో సరిగమ
ఔననక్క కాధన్నక్క మనసే వినకామురిపిస్త వేల నాయమ న న నరేయన్నక్క పగలన్నక్క తప్పనల వేనకతరిమిస్త వేల న్యయమ లా ల లానిన్న లేని చోడ్యమనిన్న ఆప సధ్యమనిన్న లేని చోడ్యమనిన్న ఆప సధ్యమఆఅగుండే చాటు గానమగోంతు ధాటు మౌనమయేదలోన ఇంద్ర జానమా ఆ
ప్రనయమ||
తింక్తతతన్ తింక్తతరన్ తింక్తతరరంతతన్ తింక్తతతన్ తింక్తతరతిరితరన్ థరతరరరన్పూలన్నక్క ముల్లన్నక్క వల చినుక్షనమేవిహరిష్త వేల హ్రుదయమరేపన్నక్క మాపన్నక్క అ మరు క్షనమేవిసిగిస్త వేల విరహమ లొవెల్య్ఇంత వింత సత్యమయేంత కైన సిధమఅంతులేని ఆత్రమోఅందులోన అంధమ్మఆఅకోటి కల్లల నేత్రమకోంటే వల్లపు గోత్రమష్రుంగార సుప్రబాతమా ఆ
ప్రనయమ||

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ
ఆ సంగీతం నీ తొడై సాగవే గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి ఓహో... ఓహో....

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లే కష్టమొస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండ
లేని పోని సేవ చెయ్యకు
మినుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకదా
ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయదా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి
ఓహో... ఓహో....

ఆశలు రేపిన అడియాశలు చూపిన
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
అశలు రేపిన అడియాశలు చూపిన
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడ కళ నేడు తలుసుకుంటునిద్ద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటులేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిల కిలతో తరిమేయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి
ఓహో... ఓహో....

16 October 2007

రామా కనవేమిరారామా కనవేమిరా

రామా కనవేమిరారామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరారామా కనవేమిరా
రమణీ లలామ
నవ లావణ్య సీమ ధరాపుత్రి
సుమ గాతృఇధరాపుత్రి

సుమ గాతృఇ నడయాడి రాగా
రామా కనవేమిరా

సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో

ప్రవేసించే జానకినిసభాసదులందరు పదే పదే చూడగా

శ్రీ రామ చంద్ర మూర్తికన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట
తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

ముసిముసి నగవుల రసిక సిఖామణులు

ఒసపరి చూపుల అసదుష విక్రములు
సగరిద మని ద మ ని నిముసిముసి నగవుల రసిక సిఖామణులు

థ థకిట థక జణుతఒసపరి చూపుల అసదుష విక్రములు

థకజణు థకధిమి థకమీసం మీతే రోష పరాయణులు నీ ద మ ప మ స రి గమా సరి ఎవరను మత్త గుణొల్వణులూ ఆహక్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమైతరుణి వంక సివ ధనువు వంకతమ తనువు మనసు కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరుడుతొడగొట్టి ధనువు చెయ్పట్టి బాబులని గుండెలు జారిన విభులుగుండెలు జారిన విభులువిల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరకుండవులుతమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గెసిన పురుషత్ఘణులుఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరాఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరాఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరాఅహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరాఅహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరాతకద్ తైయ్యకు తా దిమి తా..

మనసా తుళ్ళి పడకే

మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభ ఘడియా వచ్చేనొ రాదో
తొందర పడితే అలుసే మనసా తెలుసా

ఏమంత అందాలు కలవనీ వస్తాడు నిన్ను వలచీ
ఏమంత సిరి వుంది నీకని మురిసేను నిన్ను తలచీ
చదువా పదవా ఏముంది నీకు
తళుకూ కులుకూ ఏదమ్మ నీకు
శౄతి మించకే నీవు మనసా

ఏనోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలము
ఏ దేవుడిస్తాడు నీకని అరుదైన అంత వరమూ
మనసా నిన్నే మహ అందగాడు
తనుగ జతగా మనకంది రాడు
కలలాపవే కన్నె మనసా

14 October 2007

ఎదలో గానం

ఎదలో గానం పెదవే మౌనం
సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో
మెరిసేనిలా శ్రీ రంగ కావేరి సారంగ వర్ణాలలో అలజడిలో

కట్టు కధలా ఈ మమతే కలవరింతా
కాలమొకటే కలలకైన పులకరింతా
శిల కూడ చిగురించే విధి రామయణం
విధికైన విధి మార్చే కధ ప్రేమాయణం
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కధా
మరువకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెలో మనసు కధా

శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
శ్రీ గౌరీ చిగురించే సిగ్గులెన్నో
పూచే సొగసులో ఎగసిన వూసులు
మూగే మనుసులో అవి మూగవై
తడి తడి వయ్యరాలెన్నో
ప్రియ ప్రియ అన్న వేళలోన శ్రీ గౌరీ

అ అంటే అమలాపురం

హేయ్
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

హేయ్
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
ఉ అంటే ఉంగపురం
ఊ అంటే ఊగె జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలం ఏస్తె వాలుతారు కుర్రా కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో
యనాము చేరిన ఈనాము మారున friendship పిడేలు ఆగున
హై ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యరి కయాలి దేవుడో
గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు

హేయ్ గాజువాక చేరినక మోజు పడ్డ కుర్ర మూక
నన్ను అడ్డకాగి చంపినారురో
కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపి లోకి దింపకుంటరా అహ్
రాజనిమ్మా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో

హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటం అందుకో
రేనిగుంట రాణి మంట
బిట్రగుట్ట దేవి మంట
నువ్వు signal ఇచ్చి రైలు నాపుకో
ఒంటి లోన సెట్టు పుట్టెరో చిన్నడో
ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడధన్ని రో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో

feel my love

feel my love feel my love
నా ప్రేమను కోపం గానోనా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను సాపం గానో చెలియా feel my love
నా ప్రేమను భారం గానో
నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో సఖియా feel my love
నా ప్రేమను మౌనాము గానో
నా ప్రేమను హీనాం గానో
నా ప్రేమను శూన్యం గానో కాదో లెదో ఏదో గానో
feel my love feel my love
feel my love feel my love

నేనిచ్చే లేఖలన్ని చించేస్తూ feel my love
నే పంపే పువ్వులనే విసిరేస్తూ feel my love
నే చెప్పే కవితలన్ని చీ కొడుతు feel my love
నా చిలిపి చేష్టలకే విస్గొస్తే feel my love
నా ఉలుకే నచ్చదంటూ నా ఊహే రాదని
నేనాంతే గిట్టదు అంటూ నా మాటే చేదని
నా జంటే చేరనంటు అంటూ అంటూ అనుకుంటునేfeel my love

ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా feel my love
ఏదోటి తిడుతూనే నోరారా feel my love
విదిలించి కొడుతూనే చెయ్యారా feel my love
వదిలెసి వెళుతూనే అడుగారా feel my love

అడుగులకే అలసటోస్తే చేతికి శ్రమపెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైనా ఒక్క సారి హృదయం అంటు నీకొకటుంటే feel my love

feel my love...feel my love
feel my love...feel my love

ఏదో ప్రియరాగం వింటున్నా

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైన
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే

నువ్వుంటె నిజమేగా స్వప్నం
నువ్వుంటె ప్రతి మాట సత్యం
నువ్వుంటె మనసంతా ఏదొ తీయని సంగీతం
నువ్వుంటె ప్రతి అడుగు అందం
నువ్వుంటె ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటె ఇక జీవితమంతా ఏదో సంతోషం

పాట పాడద మౌనం పురి విప్పి ఆడద ప్రాణం
అడవినైన పూదోట చేయద ప్రేమబాటలొ పయనం
దారిచూపద శూన్యం అరచేత వాలద స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కద వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లొ కలకాలం

నువ్వుంటె ప్రతి ఆశ సొంతం
నువ్వుంటె చిరుగాలె గంధం
నువ్వుంటె ఎండైన కాద చల్లని సాయంత్రం
నువ్వుంటె ప్రతి మాట వేదం
నువ్వుంటె ప్రతి పలుకు రాగం
నువ్వుంటె చిరునవ్వులతోనె నిండెను ఈ లోకం

ఉన్నచోట ఉన్నాన ఆకశమందుకున్నాన
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేన
మునిగి తేలుతున్నాన ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లె నన్నల్లె ఈ రంగులు నీ వల్లె
సిరిమల్లెల వాగల్లె ఈ వెన్నెల నీవల్లె
ప్రేమా ఓ ప్రేమా ఇది శాస్వతమనుకోన

నువ్వుంటె దిగులంటూ రాదె
నువ్వుంటె వెలుగంటూ పోదె
నువ్వుంటె మరి మాటలు కూడ పాటైపోతాయె
నువ్వుంటె ఎదురంటూ లేదె
నువ్వుంటె అలుపంటూ రాదె
నువ్వుంటె ఏ కష్టాలైన ఎంతో ఇష్టాలె

ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె

ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా

advance warning ఇవ్వకుండనే
date time మనకు చెప్పకుండానే
గుండెల్లొ చోటుందోలేదో చూడకుండనే
atleast మన అనుమతైన అడగకుండనే
పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా
పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా

we don't know when we fall I love
we don't know why we fall in love
we don't know how we fall in love
but its just great to fall in love

luck ఉంటే గాని love దక్కదంట
వలేసిన అది చిక్కదంట
ప్రేమించడం గొప్ప art అంట
ప్రేమించబదటం gift అంట
love గెలిస్తే జన్మ ధన్యమంట
ఎటుచూసిన గాని స్వర్గమంట
fail ఐతే చాల కష్టమంట
లైటేసిన life చీకటంట

మనసు తోటి మనసునే ముదేసే మంత్రమే ప్రేమ
కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ
తీయ్యనైనా పాటలేవో పాడే రాగమే ప్రేమ
కరిగిపోని కలలతోటి గుండెను నింపెనే ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపె మైకమే ప్రేమ

ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం
ప్రేమే కద శాశ్వతం ప్రేమించడమె జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం

13 October 2007

పొద్దులెగలీ స్నానంచెయ్యాలి

పొద్దులెగలీ స్నానంచెయ్యాలి
bus ఎక్కాలి college కెల్లాలి ...
ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్ ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్
ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్ ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్

bathroomలో పాటలు
breakfastలొ మాటలు
అమ్మ ముందు wonder
నాన్న ముందు blunderలు
pocket moneyకి tenderలు
ఇక busలకై waiting foot boardలొ fightingu
canteenలో meetinguu..
ఇక busలకై waiting foot boardలొ fightingu
canteenలో meetinguu..

జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ

teachersతో classలు
classలొ maasలు
SMSటో మాటలు
MMSతో పాటలు
last bench seatingu
cellphoneతో gaminguu
intervalకే waitinguu
last bench seatinguu
magazines readinguu
intervalకే waitinguu ....yeah yeah yeah ....

జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ

పొద్దులెగలి స్నానంచేయాలీ ...
I-Maxలో సినెమాలు
morningu matineelu
harry lo bowling
food court lo datinguu...

hey పిల్ల what man
నీ stylente ఇల్ల
నీ confirmation nillaa ...
hey పిల్ల hey పిల్ల
పిల్ల పిల్ల hey పిల్ల hey పిల్ల ....hey hey

జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ
జిల్ జిల్ జిగ

ఇక busలకీ waitingu
busstop lo chattingu
waitingu waitinguu...

ఇక busలకి waitingu
waitinguuu waitinguuu...
footboard lo fightinguuu