19 October 2007

సన్నని వెన్నెల జలతారువలే

సన్నని వెన్నెల జలతారువలే
కన్నుల కమ్మెను కన్నీటి చెల
ఆ తెరలో …, ఈ రాతిరిలో ….
నిన్ను నేను చూస్తున్నా ….. నిన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా
ఇద్దరిలో జగతిలోన ప్రేమ కొరకు వేగిపోవు
వేలవేల హృదయాలే చూస్తున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
కదలీ కదలక కదలే నీ కదలికలో
కదలీ కదలక కదలే నీ కదలికలో
చిరుగాలికి ఊగాడే వరి మడినే చూస్తున్నా
ఆ వరి మడిలో … ఆ ఒరవడిలో …
వంగి వంగి కలుపుతీయు కాపు కన్నె వంపులన్ని చూస్తున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
విరిసీ విరియని విరివంటి పరువంలో
కెరటాల గోదారి ఉరకలనే కంటున్నా
ఆ ఉరకలలో …. ఆ నుఱుగులలో
ఆ ఉరకలలో నుఱుగులలో జడవేస్తూ పడవ నడుపు
పల్లెపడుచు పకపకలే వింటున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
చిదుమని చెక్కిలి చిందే సిగ్గుల్లో
సందెవేళ అలముకునే ఎఱ్ఱజీర చూస్తున్నా
ఆ ఎఱ్ఱదనంలో .. ఆ కుర్రతనంలో …
ఆ ఎఱ్ఱదనంలో .. ఆ కుర్రతనంలో
వెనకజన్మలెన్నెన్నో పెనవేసిన వెచ్చదనం కంటున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా

No comments: