19 October 2007

ఏ తోడు లేదు … ఏ తోడు లేదు

ఏ తోడు లేదు … ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ ఇలలోని అందాలు నే చూడలేను
చల్లగాలి ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ ఇలలోని అందాలు నే చూడలేను
చల్లగాలి ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
మల్లెపూలు తెలుపనీ అంటారు
బంతిపూలు పసుపనీ ఆంటారు
కుంకుమ ఎఱుపనీ అంటారు
కాటుక నలుపనీ అంటారు
ఇన్ని వన్నెలున్నా ….
ఇన్ని వన్నెలున్నా నాకున్నదేమిటీ
ఈ కన్నులలో పగలురేయి కటిక చీకటి
చల్లగాలీ ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ ఇలలోని అందాలు నే చూడలేను
చల్లగాలీ ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
వసంతాలు ప్రతి ఏటా వస్తాయి
ప్రభాతాలు ప్రతి రోజూ వస్తాయి
తారకలు ప్రతిరేయీ వస్తాయి
తరంగాలు ప్రతిక్షణం వస్తాయి
ఇన్ని మారుతున్నా …
ఇన్ని మారుతున్నా ఈ బ్రతుకు మారునా
నా కన్నులలో కాంతి గంగ వెల్లివిరియదా
చల్లగాలీ ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..
ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు
ఈ ఇలలోని అందాలు నే చూడలేను
చల్లగాలీ ఆగిపోవే … పిల్లగాలీ…. తోడురావే..

No comments: