19 October 2007

ఆనాటి మధుర వసంతం

ఆనాటి మధుర వసంతం ఈనాడు విధురహేమంతం
ఆనాటి తీయని సుఖం ఈనాడు కాలకూట విషం ..
కాలకూట విషం
కాలమే విధి రూపము మానవాళికి దీపము
శోకమైనా .. సౌఖ్యమైనా …కాలమే ప్రమాణము …
కాలమే విధి రూపము..

కలసివచ్చిన కాలమైతే మనిషి తానే దైవము
కలసివచ్చిన కాలమైతే మనిషి తానే దైవము
మంచిరోజులు మారిపోతే పరుల కంటికి హీనము …
పరుల కంటికి హీనము
కాలమే విధి రూపము.. మానవాళికి దీపము

కలల వెన్నెల కరిగిపోగా కారుచీకటి నిండెనా ..
కలల వెన్నెల కరిగిపోగా కారుచీకటి నిండెనా
పరుల పంచను బ్రతుక వలసిన వ్రాతయే మీదాయెనా ..
వ్రాతయే మీదాయెనా …
కాలమే విధి రూపము.. మానవాళికి దీపము

ఒకని భాగ్యము తూగుటూయల ఒకని శాపము శోకము
కాలమెవరికి మేలు చేయునో కాలమెవరికి కీడు చేయునో
మానవునికే తెలియరానిది విధివిలాసము చోద్యము
విధివిలాసము చోద్యము
కాలమే విధి రూపము.. మానవాళికి దీపము
శోకమైనా .. సౌఖ్యమైనా …కాలమే ప్రమాణము …
కాలమే విధి రూపము..

No comments: