27 February 2010

ఓ బంగరు రంగుల చిలకా పలకవే

ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ

పంజరాన్ని దాటుకునీ
బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే

సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారునిలో

లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
తల్లి దీవెన తాతయ కరుణ
వెన్నుకాయగా వెరువగనేలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తల్లి దీవెన తాతయ కరుణ
వెన్నుకాయగా వెరువగనేలా
భయమును విడువమురా
లేరు కుశలవుల సాటి

బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
పరువము మాసిరిగా
పరువము మాసిరిగా
లేరు కుశలవుల సాటి

పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచ్తిమేమి
పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచ్తిమేమి
యశమిక మాదేగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
యశమిక మాదేగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
యశమిక మాదే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి

మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు

మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు (౨)

శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు

మానవుడే మహనీయుడు

మంచిని తలపెట్టినచో మనిశి కడ్డు లేదులే

ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే

(మానవుడే)



దివిజగంగ భువిదించిన భగీరధుడు మానవుడే

సుస్ధిర తారగ మారిన ధ్రువుడు కూడ మానవుడే

సృశ్టికిప్రతిసృశ్టిచేయువిశ్వామిత్రుడు నరుడె

జీవకోటి సర్వములొ శ్రెసటతముడు మానవుడే

(మానవుడే)



గ్రహారాశులనధిగమించి ఘన తారల పధమునుంచి (౨)

గగనాంతర రోధసిలో గంధర్వగోళగతుల దాటి (౨)

చెంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగిరాగలిగే

మానవుడే మహనీయుడు

మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు

శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు

మానవుడే మహనీయుడు

26 February 2010

కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో

కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో
కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో
కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో..
కో కాసుకో...
కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో


కోటేరు పట్టినోడికో.. పూట కూడు దక్కదెందుకో
నారు నీరు పోసినోడుకో.. శేరు గింజలుండవెందుకో
అన్నం ఉండదొకడికి తిన్నదరగదొకడికి
ఆశ చావదొకడికి ఆకలారదొకడికీ

కో కాసుకో...
కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో

మేడిపండు మేలిమెందుకో.. పొట్ట ఇప్పి గుట్టు తెలుసుకో
చీమలల్లే కూడబెట్టుకో.. పాములొస్తే కర్రపట్టుకో కో..
పాములొస్తే కర్రపట్టుకో కో..ఒ..ఒ..
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
వేమన్న వేదాలు చెపుతా రాసుకో.. రాసుకో... కో కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకో కో అంటె కోడిపుంజు కొక్కరకో

తూరుపింటి ఆంకాళమ్మ కో... కో ...
పడమటింటి పోలేరమ్మ కొక్కో...
దక్షిణాన గంగానమ్మ కో.. కో ..
ఉత్తరాన నూకాలమ్మ కొక్కరకో
కో.. అంటే కోటిమంది అమ్మతల్లులున్నా
పంట చేను కాపలాకు నేను ఎందుకో .. కో... కాసుకో ...
కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటె కోడిపుంజు కొక్కరకో
కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో..

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్ధూ ముచ్చట కాదన్టాన
సరదా పడితే వద్ధన్తానా హయ్య…- 2

(నీ కోసమే మరు-మల్లెలా పూచిన్ధి నా సొగసూ…
నీ పూజకీ కర్పూరమై వెలిగిన్ధి నా మనసూ…) - 2
దాచినడంత నీ కొరకే… - 2
నీ కోరిక తీర్చే మది-స్పందన చేసే
నా వొళ్ళంతా ఊపేస్తూ ఉంటే…
నాలో ఏదో అవుతోంది ||నువ్వడిగింధీ ఏనాడైనా


నీ మగతనం… నా యవ్వనం… శృంగారమే చిలికె
యీ అనుభవం… యీ పరవసమ్… సంగీతమై పలికే
పరుగులు తేసే నా పరువూ… - 2
నీ కధలే వింధీ… నువు కావాలన్ధీ
నా పాటేమీ వినకున్డ ఉంది
నీకు నాకె జొడన్ది…

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్ధూ ముచ్చట కాదన్టాన
సరదా పడితే వద్ధన్తానా హయ్య

15 February 2010

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం ప్రణవ మూల నాదం
ప్రథమలోకపాదం ప్రణతులే చేయలేని ఈ తరమేల ఈ కరమేల
ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం

మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ...
భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపదం
ఆత్మలింగ సయంపూర్ణ ఆత్మలింగ స్వంపూర్ణుడే సాక్షాత్కరించినా
చేయూతవీడినా అయ్యో అందని అనాధనైతి మంజునాధా
ఈ పాదం పుణ్యపదం ధరనేలే ధర్మపదం
ప్రణయమూల పాదం ప్రళయ నాట్యపాదం
ప్రణతులే చేయలేని ఈ శిరమేల ఈ బ్రతుకేల

భక్త శిరియాళు నేలిన హేమపాదం
బ్రహ్మ విష్ణులే భుజించే ఆదిపాదం అనాదిపాదం
అన్నదాత విశ్వదాత లీలా వినోదిగా
నన్నేలగా దిగిరాగా అయ్యో చీ
పొమ్మంటి నే పాసినై తినే ఈ పాదం పుణ్యపాదం ఈపాదం
ధర్మపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్ష పాదం
తెలుసుకోలేని నా ఈ తెలివేల ఈ తనువేల

13 February 2010

హైలో హైలేసా - హంసకదా నా పడవ

హైలో హైలేసా - హంసకదా నా పడవ
ఉయ్యాల లూగినది - ఊగీస లాడినది
హైలో హైలేసా హంసకదా నా పడవ


ఓహోహై - ఓ హోహై,
నదిలో నా రూపు నవనవ లాడినది,
మెరిసే అందములు మిలమిల లాడినవి
వయసూ వయారమా - పాడినవి పదేపదే 1 హైలో 1


ఎవరో మారాజా -
ఎదుట నిలిచాడుఎవో చూపులతో
సరసకు చేరాడుమనసే చలించునే
మాయదారి మగాళ్ళకి 1 హైలో 1

ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట

ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు? ఏదీ కాని వేళ

పసివాని చూచుట కీ తొందరా?
మైమరచి ముద్దాడి లాలింతురా?
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా

అబ్బాయి పోలిక ఈ తండ్రిదా?
అపురూపమైన ఆ తల్లిదా?
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ధి రానీకు భగవంతుడా..

ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కాపురం చేయండి కలకాలము

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగల లాడ //ముత్యాల//

తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె //ముత్యాల//

ఒప్పులకుప్ప - వయ్యారి భామా
సన్నబియ్యం - చాయపప్పు
చిన్నమువ్వ - సన్నగాజు
కొబ్బరికోరు - బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ - నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు - నీ మొగుడెవడు

ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె //ముత్యాల//

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. క్రిష్ణయ్యా..

నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. క్రిష్ణయ్యా..
నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా.. క్రిష్ణయ్యా..

వేణువు విందామని.. నీతో వుందామని..
నీ రాధ వేచేనయ్యా రావయ్యా..
ఓ..ఓ..ఓ..గిరిధర.. మురహర..
రాధా మనోహరా..ఆఆ..ఆఆ..ఆఆ.

||నువ్వు||

నీవూ వచ్చే చోటా... నీవు నడిచే బాటా..
మమతల దీపాలు వెలిగించాను ||2||
కుశలము అడగాలని.. పదములు కడగాలని..
కన్నీటి కెరటాలు తరలించాను..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
గిరిధర.. మురహర.. నా హృదయేశ్వరా
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చ రా ||2||
కృష్ణయ్యా..ఓ..కృష్ణయ్యా..||2||


నీ పద రేణువునైనా.. పెదవుల వేణువునైనా..
బ్రతుకే ధన్యమని భావించాను.. ||2||
నిన్నే చేరాలని.. నీలో కరగాలని..
నా మనసే హారతి గా వెలిగించాను..
గోవింద.. గోవింద..గోవింద.. గోపాలా

వేదంలా ఘోషించె గోదావరి

వేదంలా ఘోషించె గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించె గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం

||వేదంలా||

రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరు

||వేదంలా||

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తితి మావహంచ విహితాం స్త్రీ పుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రి పురుషా సంపూజితా వస్సురై ర్భూయాసుహు
పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే

ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనమూ

||వేదంలా||

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగ మొకడు మిగిలెను చాలూ

||వేదంలా||

సరికొత్త చీర ఊహించాను సరదాల సరిగంచు నేయించినాను

సరికొత్త చీర ఊహించాను సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమతా పడుగు పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశి కి సిరి జోతా

ముచ్చట గొలిపే మోగాలి పొత్తుకు ముల్లు వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు అలకా కులుకు ఒక అందం
ఈ అందాలన్ని కల బోస్తా నీ కొంగుకు చెంగునా ముడి వేస్తా
ఇది ఎన్నో కలల కాలానేత నా వన్నెల రాశి కి సిరి జోతా
నేయా వన్నెల రాశి కి సిరి జోతా

చుర చుర చూపులు ఒక మారు ని చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారు నువ్వు ముద్దుకి సిద్దం ఒక మారు
నువ్వు ఏ కాలనున్న మహా బాగే ఈ చీర విశేషం అలాగే
నువ్వు ఏ కాలనున్న మహా బాగే ఈ చీర విశేషం అలాగే

సరికొత్త చీర ఊహించాను సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమతా పడుగు పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశి కి సిరి జోతా

నా వన్నెల రాశి కి సిరి జోతా .........

టాటా వీడుకోలు… గుడ్ బై ఇంకా సెలవు

టాటా వీడుకోలు… గుడ్ బై ఇంకా సెలవు
తొలినాటి స్నేహితులారా… చెలరేగే కోరికలారా…
టాటా వీడుకోలు… గుడ్ బై ఇంకా సెలవు…
టాటా వీడుకోలు…

ప్రియురాలి వలపులకన్నా నునువెcచనిదెది లేదని…
నిన్ననే నాకు తెలిసింది… ఒక చిన్నది నాకు తెలిపింది…
ఆ… ప్రేమ నగరుకే పోతాను… పోతాను… పోతాను…
ఈ… కామ నగరుకు రాను… ఇక రాను…

టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు…

ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్ఛటను లేనే లేదనీ…
లేటుగా తెలుసుకున్నాను… నా లోటును దిద్దుకున్నాను
ఆ స్నేహ నగరుకే పోతాను… పోతాను… పోతాను…
ఈ మోహా నగరుకు రాను… ఇక రాను…

టాటా వీడుకూలు గుడ్ బై ఇంకా సెలవు
టాటా వీడుకోలు…

మధుపాత్ర కెదలొ ఇంక ఏమాత్రం చోటు లేదనీ… -
మనసైన పిల్లె చెప్పింది… -
నా మనసంతా తానై నిండింది
నే… రాగ నగరుకే పోతాను…
అనురాగ నగరుకే పోతాను… పోతాను…

వేదంలా ఘోషించే గోదావరి అమరధామమ్ లా శోభించే రాజమహేంద్రీ

వేదంలా ఘోషించే గోదావరి అమరధామమ్ లా శోభించే రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం

రాజ రాజ నరేంద్రుడు కాకతీయులూ తేజమున్న మేటి దొర లు రెడ్డి రాజులు
గజపతులు నరపతులూ ఏలీనా వూరు
ఆ కధలన్నీ నినదించే గౌతమి హోరు

1|| ఆది కవిత నన్నయ్యా వ్రాసేనిచట
శ్రీనాధ కవి నివాసము పెద్ద ముచ్చటా
కవి సార్వ భౌములకిది ఆలవాలము
నవకవితలు వికసించే నందన వనము

2|| దిట్ట మైన శిల్పాల దెవళాలు
కట్టు కధల చిత్రాంగి కనక మే డలు
కొట్టు కొని పోయే కొన్ని కోటి లింగాలు
వీరెసలిన్గమొకడు మిగిలేను చాలు

కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు

కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు
వినిపించిన మాయకోసం వెతికి వెతికి పోయేదొకరు
కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు

తపన ఆగిపోగానే వలపు వీగిపోయేను
తపన ఆగిపోగానే వలపు వీగిపోయేను
పోనీ వెతికి పోని వలపే బ్రతికి పోనీ

కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు
వినిపించిన మాయకోసం వెతికి వెతికి పోయేదొకరు
కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
అహ సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది అహహహ
మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది
దొరికింది గుర్రపు నాడం దొరుకుతుందనుకుంటి గుర్రం
ఊరంత గాలించినాను గాడిదై పోయాను నేను
నేనలసిపోయి సొలసిపోయి మరచిపోయి నిలిచిపోతే మెరుపల్లే వచ్చావు శంభో
నా నిదురపోయి అదిరిపోయి మూగపోయి ఆగిపోతె గిలిగింత పెట్టావు శంభో

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది

నీ కళ్ళు నా కళ్ళు కలిసి నీ కోర్కె నా కోర్కె తెలిసి
నీ సొగసు పువ్వల్లే విరిసి నా వయసు గువ్వల్లే ఎగసి
నేనదును చూసి తెగువ చేసి చెయ్యి వేసి చుట్టుకుంటె మంచల్లే కరిగావే శంభో
నీ సిగ్గు చూసి ఆకలేసి చెమట పోసి దాహమేసి అల్లాడిపోతున్న శంభో

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీసరి ఎవరమ్మ

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీసరి ఎవరమ్మ
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

ఒకే రోజు దినము దినము ఒక గమకం ఒక మధురం
ఒకే రోజు దినము దినము ఒక గమకం ఒక మధురం
ఒక మేఘం క్షణ క్షణము ఒక రూపం ఒక శిల్పం
ఆ సరిగమలు ఆ మధురిమలు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు
ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు
ఒక కౌగిలి ప్రతి రేయి ఒక స్వర్గం ఒక దుర్గం
ఆ జివజివలు ఆ మెలుకువలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
మనసుంటే మనకోసం ప్రతి మాసం మధుమాసం
ఋతువుల సొగసు చిగురుల వయసు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇళ్ళు
వలపుల జల్లులు పలుపలు వన్నెలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము

హల్లో నేస్తం బాగున్నావా

హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా

ఊగే అలపై సాగే పడవ ఒడ్డు పొడ్డు చేర్చింది
ముచ్చటలన్ని మోసే గాలి దిక్కుదిక్కులను కలిపింది
కలకల పోయే చిలుకల గుంపు వరసా వావి నేర్పింది
నేల పీటగా నింగి పందిరిగా జగతికి పెళ్ళి జరిగింది
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా
హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా

ఏ కళ్ళైనా కలిసాయంటే కలిగేదొకటే అనురాగం
ఏ మనసైనా తెరిసాయంటే తెలిపేదొకటే ఆనందం
సరిగమలైనా డొరనిపలైనా స్వరములు ఏడే గానంలో
పడమటనైనా తూరుపునైనా స్పందన ఓకటే హృదయంలో
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా
హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా
చైనా ఆట మలయా మాట హిందూ పాట ఒకటేను
నీ నా అన్నది మానాలన్నది నేటి నినాదం కావాలోయ్
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా

హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు

శంభో శివ శంభో శివ శంభో శివ శంభో

శంభో శివ శంభో శివ శంభో శివ శంభో
వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో
వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో

అందాన్ని కాదన్న ఆనందం లేదన్న
బంధాలు వలదన్న బ్రతుకంతా చేదన్న
సిరులున్నా లేకున్నా చెలితోడు నీకున్నా
అడవిలో నువ్వున్నా అది నీకు నగరంరా

వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో


ఈ తేటిదీ పువ్వు అని అన్నదెవరన్న
ఏ తేనె తాగిన తీపొకటేకదరన్న
నీదన్న నాదన్న వాదాలు వలదన్న
ఏదైనా మనదన్న వేదాన్నే చదువన్న
ఊరోళ్ళ సొమ్ముతో గుడికట్టి గోపన్న
శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న
భక్తైనా రక్తైనా భగవంతుడేనన్న
ఈనాడు సుఖమన్న ఎవడబ్బ సొమ్మన్న

వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో

పడవ వచ్చిందే పిల్లా పండుగ వచ్చిందే

పడవ వచ్చిందే పిల్లా పండుగ వచ్చిందే

పండుగ వచ్చిందోయ్ మావా పండూ

వెన్నెలవచ్చింది ..పండూ వెన్నెల పడుచుదనంతో పందెం వెసింది (పడవ)



నీలిసంద్రం పొంగి పొంగి నింగిని రమ్మంది

నీలాకాశం వంగీ వంగీ నాకో ముద్దందీ

చిలిపి గాలీ గోలచెసింది చిన్నదానికి

సిగ్గూ కమ్మింది బుగ్గా కందింది-హాయ్ బుగ్గా కందింది (పడవ)



చిన్నతనంలో కట్టామిక్కడ ఎన్నో పిచ్చుక గూళ్ళ్లు

పరువంలో అదె ఫలించె పిల్లా వెచ్చని కౌగిళ్ళ్లూ ..ఈ వెచ్చని కౌగిళ్ళ్లూ

అద్రుశ్ట దేవత తెరిచెను కళ్ళ్లూ

అందరికిద్దాం భాగాలూ

ఈ కలిమి నిచ్చినా దేవుని కాళ్ళ్ల కు రోజూ

పెడదాం దండాలు- ప్రతి రోజూ పెడదాం దండాలు

పచ్చగ వుందామూ ముద్దూ ముచ్చట గూందాము (పడవ)

పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం

ఆ . . .

పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం

పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం

అహం అలా కాదు, . . . జీవనజీవం గానం

పాటకు పల్లవి ప్రాణం, నా జీవనజీవం గానం

పాటకు పల్లవి ప్రాణం

సా

రీ

గా

మా

పా దా నీ సా

సరిగమపదని సప్తస్వరాలూ నా సిరులూ చెలులూ దివ్యవరాలూ

పాటకు పల్లవి ప్రాణం . .



ఞవ్వని మువ్వల ఘలఘలలూ (2)

జలపాతాల జలజలలూ

గువ్వలజంటల కువకువలూ సంగీతానికి శృతులూ లయలూ

పాటకు పల్లవి ప్రాణం . .



(నేలా నింగీ లాలనలో మావీ మలతి మేళనలో) (2)

నీవే నేనను భావనలో

అనురాగాలే మన రాగాలు

మన రాగాలే మన రాజ్యాలు

(పాటకు పల్లవి ప్రాణం)

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ (చిటా..)

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన (తళా..)



వచ్చే వచ్చే వానఞల్లు ఞల్లు కాదది

పొంగివచ్చు పడుచుదనం వరదలే అది

వరద కాదది ఆగలేని చిలిపితనం వాగులే అది నీ వేగమే అది (చిటా..)



నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి

చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి

ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది

మెరిసి మెరిసి రెండు కళ్లు వాకిళ్లు కావవి

వలపు తేనెలూరే రసగుళ్లులే అవి సెలయేళ్లులే అవి (తళా..)

శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన

శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన

శ్రీవారేమనుకున్నా శ్రీమతి తానతందనాన

చెట్టా పట్టగ కాలంగీలం నెట్టుకునేరానా

చెట్టూ తీగలవలెనే నిన్నూ చుట్టుకొనేపోనా

గిలిలేని కౌగిలిలోన చలికి చెలికి చెర వేయనా

కలలూరే కన్నుల్లో న తొలి చూపుతో బందీ చేయనా

పొద్దేతెలియని ముద్దూముచ్చట నీలో వింటున్నా

హాద్దేచూడని ఆవేశాలు నీ లో కంటున్నా

వేగంఉన్నది నాలోనా బిగువులు ఉన్నవి నీలోనా

ఒదిగి ఒదిగి నీ ఎదలోనా నేనోడి పోదు నీ ఒడిలోన

పోంగే పొంగుకు కట్టలు వేసి నీ కై చూస్తున్నా

మనసు కుదురుగా ఉంటున్నా సొగసూరించెను పంతానా

పంతాలెందుకు మనలోనా నీ సొంతం కానని అన్ననా

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా

ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా (2)

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రా



దోరవయసు అలవి కాని భారమయింది

ఆ బరువు మోయలేక నడుము పలచబడింది (2)

నడుములేని నడకే ఒక నాట్యమయింది (2)

చూచి చూచి బావ మనసు సొంమసిల్లింది.. సొంమసిల్లింది (మిడిసి)



అత్తకూతురంటేనే హక్కు ఉందిలే

అల్లరెంత చేసినా చెల్లుతుందిలేమ్ (2)

ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో (2)

ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే కొత్త పెళ్ళి కూతురే (మిడిసి)

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా

పల్లవి:

ప్చ్ చ్ చ్ ప్చ్ చ్ చ్
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య

అమ్మ నన్ను కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబోయ్

ఊరుకో మా నాన్నా నిన్నూఋఅడించనేనున్నా


చరణం:
నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోకా
తల్లి మనసు తానెంత తల్లడిల్లి పోయిందో
వెన్నకై దొంగలా వెళ్ళితివేమో
మన్ను తిని చాటుగా దాగితివేమో

అమ్మా మన్ను తినంగ నే శిశువునో ఆకొంటినో వెర్రినో చూడు నోరు ఆ

వెర్రిది అమ్మేరా వెర్రిదీ అమ్మేరా పిచ్చిదాని కోపం-రా
పచ్చి కొట్టి వెళ్దామా బూచికిచ్చి పోదామా

ఏడుపొత్తోంది నాకేడుపొత్తోంది
పచ్చికొట్టిపోయామా పాలెవరు ఇత్తారు
బూచాడికి ఇచ్చామా బువ్వెవరు పెడ్తారు చెప్పూ

అమ్మతోనే ఉంటాము అమ్మనొదిలి పోలేమూ
అన్నమైన తింటాము తన్నులైన తింటాము

కొట్టమ్మ కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టూ కొట్టూ

||చిన్నారి పొన్నారి||

చరణం:
చిన్నవాడవైతేనూ చెయ్యెత్తి కొట్టేనూ
పెద్దవాడవైతేనూ బుద్ధిమతి నేర్పేను
యశోదనూ కానురా నిన్ను దండించ
సత్యనూ కానురా నిన్ను శాసించ
ఎవ్వరు నువ్వనీ... ఎవ్వరు నువ్వనీ నన్నూ అడగకు
ఎవరూ కాననీ విడిచీ వెళ్ళకూ
నన్నూ విడిచీ వెళ్ళకూ

ఆ వెళ్ళమూ వెళ్ళము లేమ్మా
||చిన్నారి పొన్నారి||

నేల మీది జాబిలి

నేల మీది జాబిలి
నింగి లోని సిరి మల్లి
నా చెలి నెచ్చెలి
చేరుకొరావా నా కౌగిలి

పిలిచెను కౌగిలింత రమ్మనీ.. ఊరుకొమ్మని
తెలిపెను పులకరింత ఇమ్మనీ.. దోచి ఇమ్మని

మనసుకు వయసు వచ్చు తీయని రేయిని
వయసుకు మతిపొయి పొందని హాయిని

తొలి ముద్దు ఇవ్వనీ మరు ముద్దు కొసరని
మలి ముద్దు ఏదని మైమరచి అడుగనీ || నేల మిది||

వెన్నల తెల్లబొయి తగ్గనీ .. తనకు సిగ్గనీ
కన్నులు సిగ్గు మాని మొగ్గనీ .. కలలు నెగ్గనీ

పరచిన మల్లె పూలు ఫక్కుమని నవ్వనీ
పగటికి చోటివ్వక ఉండనీ రత్రినీ

దీపలు మలగనీ తాపాలు పెరగనీ
రేపన్నదానిని ఈ పూటే చూడనీ || నేల మిది||

చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు

చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు
చూడబోతే వాడేంతో మంచివాడూ
వాడికన్న వీడుమరీ కొంటేవాడూ..

మల్లెపూల పడవలో..ఆ..ఆ
మంచుతెరల మాటులో..ఆ..ఆ
ఏటి నీటి పోటులా..మాట వినని వయసులో
మల్లెపూల పడవలో..
మంచుతెరల మాటులో..
ఏటి నీటి పోటులా..మాట వినని వయసులో
నీవే నా మురళివని పెదవి చేర్చినాడూ
నీవే నా మురళివని పెదవి చేర్చినాడూ
ఆ పెదవిమీద తనపేరు రాసి చూసుకొన్నాడు
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు

మబ్బుచీర కట్టిందీ ఆకాశం
మెరపు చూపు విరిసిందీ నీ కోసం
మబ్బుచీర కట్టిందీ ఆకాశం
మెరపు చూపు విరిసిందీ నీ కోసం
తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం
తళుకులే చినుకులుగా చిలుకుతుంది వర్షం
తడిసిపోయి యవ్వనం వెతుకుతుంది వెచ్చదనం
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు

పొన్నచెట్టు నీడలో..ఓ..ఓ..
ఎన్ని ఎన్ని ఊసులో..ఆ..ఆ..ఆ..
వెన్నముద్దబుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో
పొన్నచెట్టు నీడలో..
ఎన్ని ఎన్ని ఊసులో..
వెన్నముద్దబుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో
నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో
నీవే నా రాధవు ఆ నాటి రాసక్రీడలో
నీవే నా రాగము ఈనాటి ప్రణయగీతిలో
చీరలెత్తుకెల్లాడ చిన్ని క్రిష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపిక్రిష్ణుడు
చూడబోతే వాడేంతో మంచివాడూ
వాడికన్న వీడుమరీ కొంటేవాడూ..

కొమ్మ మీద కొకిలమ్మ

కొమ్మ మీద కొకిలమ్మ
కుహు అన్నది
కుహుకుహు అన్నది
అది కూన విన్నది..ఒహో అన్నది


ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమవునో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానే శ్రుతి చేసి లయ కూర్చునో
అని తల్లి అన్నది
అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నది..కలలు కన్నది

ఈ లేత హ్రుదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నది
అది ఎవరు విన్నది
ఈ జిగురు చెవులకే గుర్తు ఉన్నది

పువ్వులో గువ్వలో వాగులో తీగలో

పల్లవి; పువ్వులో గువ్వలో వాగులో తీగలో
అంతట నీవే నమ్మ అన్నిట నీవే నమ్మ
నీ వొడిలో నన్ను దాచుకోవమ్మ
నీ పాపగా నన్ను చుసుకోవమ్మ అమ్మ
కొమ్మ కొమ్మ ఫై కుసుమంలో
కమ్మని తేనెవు నీవే నీవే
జాలి గుండెతో జల జల పారే సెలయేరువు నీవే
నింగిలో నేలలో రంగు రంగుల హరి విల్లులో (అంతట నీవే )


చరణం1; సీత కోక చిలుకలతో చేరి వసంత లాడేను
బంగారు వన్నెల జింకలతో
చెంగు చెంగున ఎగిరెను
కొండలో కొనలో తోటలో బాటలో (అంతట నీవే )


చరణం2; నీ చల్లని నీడే నా ఇల్లు
ఈ మూగ జీవులే నా వాళ్ళు
అంతు లేని ఈ అందాల లోకం అంట నాదే నమ్మ
మనసులో మమతలో కనులలో నా కలలలో (అంతట నీవే )

ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో

పల్లవి ; ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి అనురాగం పండాలి (ఈ చల్లని )


చరణం1; ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో మీ వాకిలి కళకళ లాడాలి (ఈ చల్లని )


చరణం2; పిల్లల పాపల అల్లరితో ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా ఈ పచ్చని ముంగిట కురవాలి (ఈ చల్లని )


చరణం3; శుభముల నొసగే ఈ మందిరము శాంతికి నిలయం కావాలి
లక్ష్మి,సరస్వతి ఒద్దికగా ఈ ఇంటను కాపురం వుండాలి (ఈ చల్లని )

వీణ లోన తీగ లోన ఎక్కడున్నది నాదము

పల్లవి ; వీణ లోన తీగ లోన ఎక్కడున్నది నాదము
అది ఎలా గయి నది రాగము (వీణ లోన )

చరణం1; మాట లోన మనసులోన ఎక్కడున్నది భావము
అది ఎప్పుడవును గానము
నాదమునకు స్వరమే రాగము మనసులోని మాటె భావము
రాగ భావము లేక మైనవి రమ్య మైన రాగము (వీణ లోన )

చరణం2; గత జన్మ శృతి చేసుకున్నది అది ఈ జన్మ సంగీత మైనది
స రి గ మ ప ద ని సా ని ద ప మ గ రి స
రాగాల ఆరోహ ణవరోహ నయినది
అనురాగ హృదయాల అందించ నయినది (వీణ లోన )

చరణం3; గుండె లోన గొంతులోన ఎక్కడున్నది ఆవేదన
అది ఎలా గవును సాధన
గీతమునకు గళమే వేదన రాగమునకు మెరుగే సాధన
గుండె గొంతుక లేక మైనవి నిండు రాగాలాపన (వీణ లోన )

నా మాటే నీ మాటై చదవాలి

నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి
అఅ ఈ ఈ ఉఉ ఎఎ

మట్టిలో రాసిన రాతలు గాలికి కొట్టుకుపోతే ఎట్టాగ
మనసులో రాసి మననం చేస్తే జీవితం అంతా ఉంటాయి.. నిలుచుంటాయి..

ఆ మాటే నిజమైతే నేర్పమ్మా .. మనసంతా రాస్తా కోకమ్మ

నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి

పడవ..గడవ
చిలక..పలక

కొండలు కొనలు ఎం చదివాయి
కో అంటే అవి కో అంటాయి

హృదయలుండి కదిలయంటే.. చదువులు చదవకే వస్తాయి.. బదులిస్తాయి
ఆ చదువే నేనింకా చదవాలి.. ఆ బదులే నీ నుంచి రావాలి

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా
మాయనీ.. తీయనీ .. మధుర గీతి పాడుమా

అందమై.. మకరందమై
మందబంధ మలయానిత గంధమై
మదనుని విరివిల్లున అరవిందమై
ఎలతేటి ఎద మీటు ఆనందమై.. ఎలతేటి ఎద మీటు ఆనందమై..
పులకరించు కుసుమమా.. పులకరించు కుసుమమా

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా

ఆటవై.. సయ్యాటవై..
చిలిపి వలపులాడే చెలగాటమై
తలపుల తత్తరల తచ్చాటవై..
పరువాల సరదాల బూచాటవై..పరువాల సరదాల బూచాటవై..
కరిగిపోవు స్వప్నమా.. కరిగిపోవు స్వప్నమా..

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా
మాయనీ.. తీయనీ .. మధుర గీతి పాడుమా

వాణివి.. వర వీణవై
బృందావన సమ్మోహన వేణువై
పదకవిత మృదుబాషల బాణివై
అనురాగ రాగాల నెరజాణవై.. అనురాగ రాగాల నెరజాణవై..
గానమై మౌనమా.. గానమై మౌనమా..

గాలివై.. చిరుగాలివై
సిరిమల్లెల చిరుజల్లుల వేళవై
కనుసన్నల తెలివెన్నెల జాలువై
జోజోల ఉయ్యాల జంపాలవై .. జోజోల ఉయ్యాల జంపాలవై ..
సేదదీర్చు నేస్తమా.. సేదదీర్చు నేస్తమా..

నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా
మాయనీ.. తీయనీ .. మధుర గీతి పాడుమా

పాడాలనే ఉన్నది.. విని మెచ్చి.. మనసిచ్చే మనిషుంటే

పాడాలనే ఉన్నది.. విని మెచ్చి.. మనసిచ్చే మనిషుంటే (2)
పాడాలనే ఉన్నది..

పాడాలంటే హృదయం ఉండాలి (2)

హృదయానికి ఏదో ఒక కదలిక రావాలి

భావం పొంగలి.. రాగం పలకాలి.. దానికి జీవం పోయాలి (2)

పాడాలనే ఉన్నది.. విని మెచ్చి.. మనసిచ్చే మనిషుంటే
పాడాలనే ఉన్నది..

పాడానంటే రాళ్ళే కరగాలిఆ.. రాళ్ళకు నోళ్ళొచ్చి కధలే చెప్పాలి..(2)

ముసుగులు తొలగాలి.. మసకలు పోవాలి.. గదిలో దేవత కను తెరవాలి

పాడాలని ఉన్నది..

గాలికదుపు లేదు.. కడలికంతులేదు

ఆఆ అ .. ఆఆ అ.. ఆఆఆ అ.. ఆ ఆ ఆ ఆ.. అ అ అ.. అ అ అ
అ అ అ.. అ అ అ

గాలికదుపు లేదు.. కడలికంతులేదు
గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా..
ఉరికే మనసుకు గిరిగీస్తే ఆగేదేనా

గాలికదుపు||

సనిస స.. సరి సరి సరి రిస సని.. సనిస స.. సరి సరి సరి రిస సని (౨)

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నేమలినై ఆడనా ఆటలు ఎన్నో..
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేడి కేది కట్టుబాటు
మళ్ళి మళ్ళి వసంతంమొస్తే మల్లె కేల ఆకుచాటు

గాలికదుపు||

ఓ తెమ్మెరా.. ఊపవే ఊహల ఊయల నన్ను..
ఓ మల్లికా.. ఇవ్వవే నవ్వుల మాలిక నాకు..
తల్లి మళ్ళి తరుణయ్యింది.. పువ్వు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది

గాలికదుపు||

అ అ ఆ ఆ అ అ
అ అ ఆ ఆ అ అ

చినుకు చినుకు పడుతూ వుంటే .. తడిసి తడిసి ముద్దవుతుంటే

చినుకు చినుకు పడుతూ వుంటే .. తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ.. ఒకరికొకరు చలిమంటైతే..
అయితే!
జోహారు జోహారు ఈ వానకు.. ఈ హాయి లేదోయి ఏ జంటకూ..

చినుకు||

ఆహా హా హహ.. హ హ హ .. హ హ హ..

చేయి నడుము చుట్టేస్తుంటే ..చంప చంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కం వేయగా
చేయి నడుము చుట్టేస్తుంటే ..చంప చంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కం వేయగా
ఆఆ.. ఆఆ..ఆఆ..
ఊపిరాడలేదని నువ్వు .. ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంటే
జేజేలు జేజేలు ఈ రోజుకు .. ప్రతి రోజు ఈ రోజు అయ్యేందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే.. ఆ .. ఆఆ
తడిసి తడిసి ముద్దవుతుంటే.. ఆ .. ఆఆ
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ.. ఒకరికొకరు చలిమంటైతే..
జోహారు జోహారు ఈ వానకు.. ఈ హాయి లేదోయి ఏ జంటకూ..

సొంపులన్నీ దాచే మేర .. ఒంటినంటి ఉన్నది చీర
తొలగిపోతే రట్టవుతుందిరా..
సొంపులన్నీ దాచే మేర .. ఒంటినంటి ఉన్నది చీర
తొలగిపోతే రట్టవుతుందిరా..
ఆఆ.. ఆఆ..ఆఆ..
గుట్టుగున్న నిను చూస్తుంటే .. కోటే కోర్కె నాకొస్తుంటే
పదునైన పరువాన్ని ఆపేందుకు .. పగ్గాలు లేవింక జంకెందుకు

చినుకు చినుకు పడుతూ వుంటే.. ఆ .. హా
తడిసి తడిసి ముద్దవుతుంటే.. ఆ .. హా
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ..ష్.. ఆ.. హా
ఒకరికొకరు చలిమంటైతే..
జోహారు జోహారు ఈ వానకు.. ఈ హాయి లేదోయి ఏ జంటకూ..

దాసోహం దాసోహం దాసోహం

దాసోహం దాసోహం దాసోహం (2)
మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు .. చలువలోని చెలిమికి .. దాసోహం (2)

దాసోహం దాసోహం దాసోహం (2)
వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు .. దుడుకులోని ప్రేమకు .. దాసోహం (2)

దాసోహం దాసోహం దాసోహం (2)

నేల పరిచింది పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వగతాలు నీ రాకకు
నేల పరిచింది పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వగతాలు నీ రాకకు

ఎదురు వచ్చింది నీ చూపు నా తోడుకు (2)
కలిసి నడిచింది .. కబురులాడింది .. కడకు చేర్చింది నీ నీడకు

మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు .. చలువలోని చెలిమికి .. దాసోహం (2)
వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు .. దుడుకులోని ప్రేమకు .. దాసోహం (2)
దాసోహం దాసోహం దాసోహం (2)

నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి
నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి

తలుపు తెరిచింది నీ రూపే నా మనసుకి (2)

అడుగు పెట్టింది .. దీపమెట్టింది .. దేవతయ్యింది నా ఇంటికి

వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు .. దుడుకులోని ప్రేమకు .. దాసోహం (2)
మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు .. చలువలోని చెలిమికి .. దాసోహం (2)
దాసోహం దాసోహం దాసోహం (2)

అందమయిన లోకమని రంగురంగులుంటాయని

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామ ..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా ..
చెల్లెమ్మా .. అందమైంది కానేకాదు చెల్లెమ్మా..

ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ..(2)

ఆకలికి అందముందా రామ రామా ..
ఆశలకి అంతముందా చెప్పమ్మా .. చెల్లెమ్మా
ఆశలకి అంతముందా చెప్పమ్మా ..

అందమయిన లోకమని ||

గడ్డిమేసి ఆవు పాలిస్తుంది..పాలు తాగి మనిషి విశమౌతాడు..(2)

అది గడ్డి గొప్ప తనమా..ఇది పాల దోశ గుణమా..(2)

మనిషి చాల దొడ్డాడంమా చేలేమ్మ..
చెల్లెమ్మా.. తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నమ్మా..

అందమయిన లోకమని ||

ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి..మొగలిపువ్వులోన నాగుంటాది..(2)

ఒక మెరుపు వెంట పిడుగు .. ఒక మంచిలోన చెడుగు
లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా .. లోతుకెళ్తే కధే వేరు పిచ్చమ్మా ..

అందమయిన లోకమని ||

డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా .. పేదవాడు నాడే పుట్టాడమ్మా (2)

ఆ ఉన్నవాడు తినడు .. ఈ పేదను తిననివ్వడు
కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా ..
ఈ లోకం కుళ్ళు నీవు చూడలేవు చెల్లెమ్మా

అందమయిన లోకమని ||

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు

తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ (2)
రాలేరు ఎవరూ నాతో చేరీ
నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్నీ (2)
జరిగిన నాడే తెలియును కొన్నీ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ !

కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా

కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా |2|
కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా

కన్నెబుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తే కైపులెక్కెను (2)
కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం
కలలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువ రేడా

కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా |2|
కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా

కంటికింపౌ జంటలంటే వెంట పడతావంట నువ్వు (2)
తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట (2)
మత్తు తెలిసిన చందురూడా మసక వెలుగే చాలులేరా

కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా

అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది (2)
చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట (2)
తీపిమబ్బుల చందురూడా కాపువై నువ్వుండిపోరా

కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాము దాకా తోడురారా చందురూడా

శేషశైలావాస శ్రీ వే౦కటేశా

శేషశైలావాస శ్రీ వే౦కటేశా!
శయని౦చు మా అయ్య శ్రీ చిద్విలాసా! |2|

శ్రీదేవి వ౦కకు చిలిపిగా చూడకు
అలమేలు మ౦గకు అలుక రానీయకు
ముద్దు సతులిద్దరిని ఇరువైపులా జేర్చి
మురిపి౦చి లాలి౦చి ముచ్చటల తేల్చి
శేషశైలావాస శ్రీ వే౦కటేశ!

పట్టుపానుపు పైన పవళి౦చర స్వామి!
భక్తుల౦దరు నిన్ను ప్రస్తుతి౦చి పాడ!
చిరు నగవులొలుకుచు నిదురి౦చు నీ మోము
కరువు తీరా కా౦చి తరియి౦తుము మేము
శేషశైలావాస శ్రీ వే౦కటేశ !
శయని౦చు మా అయ్య శ్రీ చిద్విలాసా!

తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము

తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము
మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము

తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము ||2||
తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసు కోసము
మనసులోని చల్లని మమత కోసము

దాచుకున్న మమతలన్ని ఎవరికోసము
దాపరిక౦ ఎరుగని మనిషి కోసము ||2||
దాగని యవ్వన౦ ఎవరి కోసము
దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము

పొద్ద౦తా కలవరి౦త ఎవరికోసము
నిద్దురైన రానీ నీ కోసము ||2||


ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ
నీవు నన్ను చేరదీసిన౦దుకోసము ||2||
నేల మీద ఒక్కరై సాగిపోదము
ని౦గిలోన చుక్కలై నిలిచిపోదమూ

చె౦గావి ర౦గు చీర కట్టుకున్న చిన్నదీ

చె౦గావి ర౦గు చీర కట్టుకున్న చిన్నదీ
దాని జిమ్మ దీయా దాని జిమ్మ దీయా
అ౦దమ౦తా చీరలోనే ఉన్నది
చె౦గావి ర౦గు చీర కట్టుకున్న చిన్నదీ
దాని జిమ్మ దీయా దాని జిమ్మదీయా
కొ౦గుపొ౦గు కలిపి చూడమన్నదీ

మెరుపల్లే వచ్చి౦ది నా ఇ౦టికీ
నన్ను మెల్ల౦గా ది౦చి౦ది ముగ్గులోనికీ
తలదాచుకొమ్మనీ తావిస్తివి
తలదాచుకొమ్మనీ తావిస్తివి
పిల్ల దొరికి౦ది చాలనీ ఇల్లాల్ని చేస్తివి

ప్రేమ౦టే నేర్పి౦ది పిచ్చివాడికి
దా౦తో ఎర్రెత్తిపోయి౦ది కుర్రవాడికి
పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు
పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు
పిల్లదాని పెదవి మీద కాటు వేసినావు

సరస౦లో పడ్డాడు ఇన్నాళ్ళకి
అబ్బో స౦గీత౦ వచ్చి౦ది బుచ్చిబాబుకీ
తెరచాటు తొలిగి౦ది పరువానికి
తెరచాటు తొలిగి౦ది పరువానికి
అది పరవళ్ళు తొక్కుతూ పాడి౦ది నేటికి

లా..లా...హె.హె..లా..

లా..లా...హె.హె..లా..


తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంతా తెలుసుమాకు చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేంచేశావు చందమామా
వావి వరస చూశావ చందమామా
నీ వయసునాపుకున్నావ చందమామా
అంత మచ్చ పెట్టుకొని చందమామా
నీకెందుకింత మశ్చరం చందమామా


వెన్నెల్లో వేడుకుంది కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
ఇద్దర్లో వేగముంది వద్దన్న ఆగకుంది పైడిబొమ్మా
పూలబాణాలు వేసుకుందమా ప్రేమగాయాలు చేసుకుందమా
పూలబాణాలు వేసుకుందమా ప్రేమగాయాలు చేసుకుందమా
కలిసే ఉందామా కరిగే పోదామా
హొయ్ చుప్పనాతి చుక్కల్ని దాటుదామ
అరె చూడలేని చంద్రున్ని తరుముదామా


గుండెల్లో తాళముంది గొంతుల్లో రాగముంది కలుపుదామా
పొద్దెంతో హాయి ఉంది ఎంతెంతో పొద్దు ఉంది గడుపుదామా
ముద్దు మురిపెంలో మునిగిపోదమా తీపి తాపాలలో తేలిపోదమా
ముద్దు మురిపెంలో మునిగిపోదమా తీపి తాపాలలో తేలిపోదమా
స్వర్గం చూద్దామా సొంతం చేద్దామా
ఆ మశ్చరాలు మాననీ మచ్చమామా
దండమెట్టి ఇద్దరం కొలుచుకోమా


తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంతా తెలుసుమాకు చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేంచేశావు చందమామా
వావి వరస చూశావ చందమామా
నీ వయసునాపుకున్నావ చందమామా
అంత మచ్చ పెట్టుకొని చందమామా
నీకెందుకింత మశ్చరం చందమామా

చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా

ఆ..ఆ..ఆ..ఆ...

చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా..

వికసించే పూలు ముళ్ళూ విధిరాతకు ఆనవాళ్ళు
వికసించే పూలు ముళ్ళూ విధిరాతకు ఆనవాళ్ళు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు
ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు
ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు
ఎండమావి నీరు తాగి గుండెమంటలార్చుకోకు
ఆశ పెంచుకోకు నేస్తం అది నిరాశ స్వాగత హస్తం


కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద
కాలమనే నదిలో కదిలే ఖర్మమనే నావమీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి
సాగుతున్న బాటసారి ఆగిచూడు ఒక్కసారి
కలుసుకోని ఇరు తీరాలు కనిపించని సుడిగుండాలు

చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా రగిలేను నీలో వేదన
చూసుకో పదిలంగా

ఏనాటికైనా ఏజన్మనైనా నీతోడు నీడగా నీచేయి వీడకా...

ఏనాటికైనా ఏజన్మనైనా నీతోడు నీడగా నీచేయి వీడకా...

నీ అడుగుజాడలే అనుసరిస్తాను

కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి

కవితే నీవై ఉరకాలీ కావ్యం నేనై నిలవాలి

మనసు నేనై వుండాలి మమత నీవై నిండాలి

కడలి నేనై పొంగాలీ నదివి నీవై చేరాలి

తొలకరి నీవై చిలకాలి మొలకను నేనై మొలవాలి

దైవం నీవై నడపాలీ ధర్మం నేనై నడవాలి

శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి

చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి

కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి.......కలలే

కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి.......కలలే

నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి..........మరులే

మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి........మనువు ఊ

మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి........సంసారం

అల్లరి ఏదో చేసితిని చల్లగ ఎదనే దోచితివి

ఏమీ లేని పేదననీ నాపై మోపకు నేరాన్ని

లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్నూ ఇల్లరికం

నింగీ నేలకు కడు దూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియ బూసి
వెల్లువల్లే ఉరకలేసే

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకు
కోటి దండాలు శతకోటి దండాలు

నాతో కలిసి నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకూ
కోటి దండాలు శతకోటి దండాలు

భ్రమలో లేపిన తొలి జాములకు
సమయం కుదిరిన సందె వెళలకు
నిన్నూ నన్ను కన్న వాళ్ళకు
నిన్నూ నన్ను కన్న వాళ్ళకు
మనకై వేచే ముందు నాళ్ళకు
కోటి దండాలు శతకోటి దండాలు

భలె భలె మగాడివోయ్

భలె భలె మగాడివోయ్
బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్
నీ ఆన నీ దాననోయ్
I don't know what you say
తెలియంది మానేసేయ్
నీకు తెలిసింది ఆడేసేయ్
తీయంది ఒక బాటే
That's love shall blush I say
I don't know what you say to me
But I have so much to say
I wanna fly with you up the sky
and dance all the night
I can't help darling falling in love
With you and only with you
Come darling let's play the game
Come darling let's sing and sway

నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే
Let's be merry my dove
Hey Let's be merry my love
ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో
ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో
One fine day you will be mine
It will be full of sunshine
One fine day you will be mine
It will be full of sunshine
నాతోటి నీవుండ నాకు ఇంకేల నీరెండ
నాతోటి నీవుండ నాకు ఇంకేల నీరెండ
Come baby let's have some fun
Down here there is no one
భలె భలె మగాడివోయ్
బంగారు నా సామివోయ్
I wanna fly with you up the sky
and dance the whole night

నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకోనీ
No need to feel shy my girl
No need to hold back my doll
నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ
Hand in hand let's say my dear
Come near don't fear dear
సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని
Let's start the game of our live And you'll be my dear wife

ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నను కోరీ

ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నను కోరీ
ఆశే రేపింది నాలో..అందం తొణికింది నీలో.. స్వర్గం వెలిసింది భువిలో

ఈ ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నిను కోరీ
ఆశే రేపింది నీలో..అందం తొణికింది నాలో.. స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినదీ..

లతనై..నీ జతనై..నిన్నే పెనవేయనా
కతనై..నీ కలనై..నిన్నే మురిపించనా
నేనిక నీకే సొంతమూ
న న న న నా .. నీకెందుకు ఈ అనుబంధమూ
న న న న న న న న నా..

ఈ ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నను కోరీ
ఆశే రేపింది నీలో..అందం తొణికింది నాలో.. స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినదీ..

పెదవినీ..ఈ మధువునూ..నేడే చవిచూడనా
నవ్వనీ..ఇక లేదనీ..నీకూ అందివ్వనా
వయసుని వయసే దోచేదీ
న న న న నా .. అది మనసుని నేడే జరిగేదీ
న న న న న న న న నా..

ఈ ఎర్రగులాబీ విరిసినదీ..తొలిసారీ నిను కోరీ
ఆశే రేపింది నాలో..అందం తొణికింది నీలో.. స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినదీ..