నా మదీ.. నేడు నీదైనదీ
నాకిదీ.. కొత్తగా ఉన్నదీ
ఎవరినీ.. చూసినా.. నీవనే.. భావనా
ఈ మైమరపు తొలిప్రేమకసలైన ౠజువని
నా మదీ.. నేడు నీదైనదీ
నాకిదీ.. కొత్తగా ఉన్నదీ
పెదవికేవైందో ఈ రోజునా..పలకరిస్తుంది నీ పేరునే
అడుగుకేమైందో అలవాటుగా..కదలివస్తుంది నీ వైపుకే
కనులనే మూయడం .. కలలలో బ్రతకడం
ఈ తెరచాటు తడబాటు తొలిప్రేమ వరమని
నా మదీ.. నేడు నీదైనదీ
నాకిదీ.. కొత్తగా ఉన్నదీ
నిన్ను చూసాక ఏమైనదో..గుర్తుకొస్తుంది నీ రూపమే
గుండెలో ఇంత గుబులేవిటో..ఎప్పుడూ చూడు నీ ధ్యానమే
ఊహలే ఊపిరై..
ఆశలే వేణువై..
ప్రియగానాలే సాగాలి మనమింక ఒకటని
నా మదీ.. నేడు నీదైనదీ
నాకిదీ.. కొత్తగా ఉన్నదీ
ఎవరినీ.. చూసినా.. నీవనే.. భావనా
ఈ మైమరపు తొలిప్రేమకసలైన ౠజువని
No comments:
Post a Comment