ఓ ప్రియతమా..నా ప్రాణమా..ఏ పేరుతో నిను పిలవనూ
నా గుండెలో..అనుభూతినీ..ఏ భాషలో నే రాయనూ
ఏ జన్మ వరమో నీ పరిచయం ..నా హృదయమే నీ దేవాలయం
ఇది కలయో మరి నిజమో..ఒక తెలిసీ తెలియని తీయని అనుభవమో
తొలివలపే నాలో రేపిన కలవరమో !
ఓ ప్రియతమా..నా ప్రాణమా..ఏ పేరుతో నిను పిలవనూ
ఉప్పెనై వచ్చావూ..నా చెంతకీ
ఊపిరిని పోసావూ.. నా ఊహకీ
అల్లరే నేర్పావూ..నా ఆశకీ
పల్లవిని మార్చావూ..నాపాటకీ
చేదు ఎంత తీపో తెలిపావు ఓ చెలీ
మండుటెండలోన దాగుంది ఏదో చలీ
నిన్ను నిన్నుగానె వలచాను కోమలీ
స్వీకరించలేవా అనురాగాల ప్రేమాంజలి
ఇది వశమో..పరవశమో..కలగనడం నాకే నేర్పిన నెరజాణా
అణువణువూ నీదే కనవే నాలోనా !
ఓ ప్రియతమా..నా ప్రాణమా..ఏ పేరుతో నిను పిలవనూ
జాబిలిని ప్రేమించా..నీ మోమనీ
మెరుపులను ప్రేమించా..నీ కులుకనీ
చీకటిని బంధించా..నీ కురులనీ
కలువలను చుంబించా..నీ కనులనీ
వేకువంటె ప్రేమ..నిను చూడవచ్చనీ
రేయి పైన ప్రేమ నీ స్వప్నాలు రావచ్చనీ
నీవు లేక నేను మరి లేనె లేననీ
గుండె గొంతు చేసి ఈ లోకానికే చెప్పనీ
తొలి ప్రణయం .. ఒక ప్రళయం .. మదిగదిలో రేగే అల్లరి ఆరాటం
నిను గెలిచే వరకూ ఆగని పోరాటం
ఓ ప్రియతమా..నా ప్రాణమా..ఏ పేరుతో నిను పిలవనూ
నా గుండెలో..అనుభూతినీ..ఏ భాషలో నే రాయనూ
ఏ జన్మ వరమో నీ పరిచయం ..నా హృదయమే నీ దేవాలయం
ఇది కలయో మరి నిజమో..ఒక తెలిసీ తెలియని తీయని అనుభవమో
తొలివలపే నాలో రేపిన కలవరమో !
అదిగిదిగిదిగో..గో..గో..
అదిగిదిగిదిగో..గో..గో..
ఇదిగిదిగిదిగో లయోలా కాలేజ్ స్టూడెంట్లు..లెట్స్ గో
Louis Phillipe టాపులు..Levis Polo జీన్సులు
No comments:
Post a Comment