12 February 2010

సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...

||పల్లవి||
సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు...
నీవు నమ్మని వాడు నిజము చెబుతున్నాడు..
వాడు నీ వాడూ...నేడు రేపు ఏనాడూ... || సూర్యుడు ||

||చరణం||
నిన్ను ఎలా నమ్మను? ఎలా నమ్మించను..?
ఆ ఆ..ప్రేమకు పునాది నమ్మకము..
అది నదీ ..సాగర సంగమము...
ఆ ఆ.. కడలికి ఎన్నో నదుల బంధము
మనిషికి ఒకటే హృదయము...
అది వెలిగించని ప్రమిదలాంటిది ...
వలచినప్పుడే వెలిగేది ...
వెలిగిందా మరి? వలచావా మరి..?
యెదలో ఏదో మెదిలింది..అది ప్రేమని నేడే తెలిసింది... || సూర్యుడు ||
||చరణం||
యేః వింటున్నావా? ఏమి వినమంటావ్..?
ఆ..ఆ.. మనసుకు భాషే లేదన్నావు..మరి ఎవరి మాటలని వినమంటావు?
ఆ..ఆ..మనసు మూగదా వినపడుతోంది..?
అది విన్నవాల్లకే బాషవుతుంది ...
అది పలికించని వీణ వంటిది...మీటి నప్పుడే పాటవుతుంది...
మిటేదెవరని...పాడేదేమని...
మాటా..మనసు ఒక్కటని..
అది మాయని చెరగని సత్యమని... || సూర్యుడు||

No comments: