27 November 2011

రే రే లెగరా రగిలే సెగలా

రే రే లెగరా రగిలే సెగలా
రే రే పదరా నిషలే చెదరా
రాలు షోకాలు భయ బీత హృదయాలు
పీకరా ఇక చిచ్చర పిడుగై
శాంతికి క్రాంతికి వేసిన అడుగై

రే రే లెగరా రగిలే సెగలా
వీధి వీధినా వికృత సమరాలు
వాడ వాడలా వికత దేహాలు
రౌడీ యుజమే ఒక క్రీడ రా
ప్రతి ఊరు ఓ బెజవాడ రా
ఊరుకుంటే వదలదు ఈ పీడ

రే రే లెగరా రగిలే సెగలా
నీడ చూసి నువు వనికి పోతుంటే
తాడు పాములా బుసలు కొడుతుంది
సమరానికి సయ్యని సాగితే
బరి లోనికి కసిగా దూకితే
చావు కూడా శరణమంటుంది

రే రే లెగరా రగిలే సెగలా
రే రే పదరా నిషలే చెదరా

బెజ బెజ బెజ బెజ బెజవాడా గజ గజ గజ గజ గజలాడా

బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ
బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ
బెజ బెజ బెజ బెజ బెజవాడా గజ గజ గజ గజ గజలాడా
కమ్మనైన నవ్వునవ్వి కత్తిపెడితే కాపుకాసి గొంతుకోసి కాలరాయరా
దద్దరిల్లి గుండెలన్నీ అదరంగా ముందరున్న వాడిదమ్ము చెదరంగా
సంఘనీతి పాపభీతి వలదేవీ కత్తికన్న గొప్పవేమి కాదేవీ
కోరుకుంటే కొమ్ముకాసి కాకపోతే కాలరాసి
పొంచిఉన్న పంజాచూసి గేలమేసి వేటువేసి
కుత్తుకలో కత్తిదూసి అగ్గిరాసి బుగ్గిచేసి
కలుపులన్ని పెరికేసి కుళ్ళునంత కడిగేసి
బెజ బెజ బెజ బెజ బెజవాడా గజ గజ గజ గజ గజలాడా
కమ్మనైన నవ్వునవ్వి కత్తిపెడితే కాపుకాసి గొంతుకోసి కాలరాయరా

నీదమ్మునే నమ్ము పొగలాగ నువ్వు కమ్మూ
పగబట్టిలేకుమ్ము గెలుపు నీదే లేరా
నువ్వేలే ఈరోజు నువ్వేలే రారాజు
నువ్వేలే ఆరోజు ముందరుందిలేరా

అదురువద్దురా బెదురువద్దురా
కుదురువద్దురా నిదురవద్దురా
శ్వాసనిండుగా ఆశనింపరా
పట్టుపట్టరా గద్దెనెక్కరా
పదవె ముద్దురా పైడిముద్దరా
బంధువొద్దురా బంధమొద్దురా
యుద్దమప్పుడే కృష్ణుడెప్పుడో గీతపాడెరా నిజము చెప్పెరా
ఇంద్రకీలమే ఇక నీకు తోడురా
అడుగై పిడుగై పడగై కాటేయ్ రా

బెజ బెజ బెజ బెజ బెజవాడా గజ గజ గజ గజ గజలాడా
కమ్మనైన నవ్వునవ్వి కత్తిపెడితే కాపుకాసి గొంతుకోసి కాలరాయరా
దద్దరిల్లి గుండెలన్నీ అదరంగా ముందరున్న వాడిదమ్ము చెదరంగా
సంఘనీతి పాపభీతి వలదేవీ కత్తికన్న గొప్పవేమి కాదేవీ
బెజ బెజ బెజ బెజ బెజవాడా గజ గజ గజ గజ గజలాడా
కమ్మనైన నవ్వునవ్వి కత్తిపెడితే కాపుకాసి గొంతుకోసి కాలరాయరా
బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ
బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ

కొంటె చూపులాపి ఉన్న సంగతేంటో చెప్పవే

చుక్కలన్నీ ఒక్కచోట చేరుతుంటే ఏ ఏ
చందమామ చెంత కొచ్చి ఆడుతుంటే
కొంటె చూపులాపి ఉన్న సంగతేంటో చెప్పవే
కన్నెపిల్ల కంటి భాష తెలియదంటే తప్పులే
మీరేపూట ఎట్టాగ ఉంటారో చెప్పేదెట్టా
మగువంటే అంతేనంట మనసిచ్చి గెలవాలంట

మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే

అందినట్టే అందుతారే అంతలోనే అలుగుతారే
అందమంటు పొగుడుతారే చేరువైతే బెదురుతారే
తీగ నడుమే ఎరగా వేసి మనసునే లాగేస్తారే
సరదాలు సరసాలు మా హక్కు అంటారే

మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే

చెలిమి కోరే చిలిపి ప్రాయం బదులు ఇమ్మందీ
తనువు లోతే తపన నీదే మనసు ఊగిందే
హే తెలుసుకోమందే

సిగ్గుతోటే ముగ్గులేసి ముగ్గులోకే దించుతారే
ముందు కాళ్ళ బంధమేసి ముద్దులోనే ముంచుతారే
వాలుజడనే మెడకే విసిరి ఊపిరే ఆపేస్తారే
జగడాలు ఆడాల్లు అని నిందలే వేస్తారే

మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామ మాయాబజారే

నిన్ను చూసిన క్షణమున నేను ఊం ఉం

నిన్ను చూసిన క్షణమున నేను ఊం ఉం
నీతో మాటలు కలిపిన నిముషం ఊం ఉం
నిన్ను తాకిన సమయమె నాలో ఊం ఉం
చేతిలో చేయిని వేసిన తరుణం ఊం ఉం
నీ ఇంటి పేరు నాకీయవా
నీ ఒంటి పేరు సగమీయవా
నను నీలోన కలిపేసె వరమీయవా

నిన్ను చూసిన క్షణమున నేను ఊం ఉం
నీతో మాటలు కలిపిన నిముషం ఊం ఉం
నిన్ను తాకిన సమయమే నాలో ఊం ఉం
చేతిలో చేయిని వేసిన తరుణం ఊం ఉం
నీకంటి వెలుగు నాకీయవా
నిన్నంటి ఎపుడూ నేనుండనా
నను నీలోన కలిపేసె వరమీయవా

నిన్ను చూసిన క్షణమున నేను ఊం ఉం
నీతో మాటలు కలిపిన నిముషం ఊం ఉం

కనురెప్ప మూత పడనన్నది తెరిచి కలగన్నదీ
పెదవంచు దాటని మాటున్నది భాషకు అందనిదదీ
అలసిన సొలసిన తనువుకు తెలియదు
గడిచిన సమయము వయసుకు తెలియదు
గడిచిన దూరం అడుగుకు తెలియదు
నా ఉనికేదో నాకే తెలియదు
నా ప్రాణాలు నీ ప్రాణాలు ఒకటై ఉండాలికా

నిన్ను చూసిన క్షణమున నేను ఊం ఉం
నీతో మాటలు కలిపిన నిముషం ఊం ఉం
నిన్ను తాకిన సమయమె నాలో ఊం ఉం
చేతిలో చేయిని వేసిన తరుణం ఊం ఉం

నా ఊపిరంత నువ్వే కదా
నేను నువ్వే కదా
ఆ ఏడు జన్మల బంధం ఇదీ
ఇదిగో తొలి జన్మిదీ
ఒకరికి ఒకరని మనసుకు తెలిసిక దూరం తగదని దానికి సెలవిక
ప్రతి ఒక పుట్టుకలో నీకే నేనిక నిజముగ రుజువుగ నువ్వే నాకికా
నిన్ను నన్ను కలిపేయాలి ఆ మూడుముల్లే ఇకా

నిన్ను చూసిన క్షణమున నేను ఊం ఉం
నీతో మాటలు కలిపిన నిముషం ఊం ఉం
నిన్ను తాకిన సమయమె నాలో ఊం ఉం
చేతిలో చేయిని వేసిన తరుణం ఊం ఉం
నీకంటి వెలుగు నాకీయవా
నిన్నంటి ఎపుడు నేనుండనా
నను నీలోన కలిపేసె వరమీయవా

నిన్ను చూసిన క్షణమున నేను ఊం ఉం
నీతో మాటలు కలిపిన నిముషం ఊం ఉం

అడగకు నన్నేమి అడిగితే సిగ్గుపడి చెప్పను నేనేమి

నా నన నన ననన అడగకు నన్నేమి అడిగితే సిగ్గుపడి చెప్పను నేనేమి
సిగ్గుదేనికి చెప్పడానికి ఇష్టమింత నీకు ఉందని
మౌనం నువ్వు మానవేమో నా ప్రియురాలా
నా నన నన ననన అడగను నిన్నేమి
మౌనమనే నీ భాష ఇలా తెలిపెను నీ ఎదని

ఒంటరై ఇన్నాల్లలా నేనిలా ఉన్నా
తుంటరీ నీ చేష్టలే రెచ్చగొడుతున్నా
కౌగిలింట కాపురం కానుకివ్వవా
జీవితాంతమీ సుఖం పంచి ఇవ్వవా
లాలల లాలాల లాల లాలల లాలాల లాల లాలల లాలాల లాల ల

ప్రేమనే పదానికీ అర్ధమే నువ్వు
కల్లకే అందని అద్భుతం నువ్వు
నేను నేను కానులే నీవయ్యానులే
చెరిసగం ఒక్కటై పూర్తిగా ఇలా
లల్లల్ల లల్లల్ల లాల లల్లల్ల లల్లల్ల లాల లల్లల్ల లల్లల్ల లాల ల
నా నన నన ననన అడగకు నన్నేమి అడిగితే సిగ్గుపడి చెప్పను నేనేమి
సిగ్గుదేనికి చెప్పడానికి ఇష్టమింత నీకు ఉందని
మౌనం నువ్వు మానవేమో నా ప్రియురాలా
లల్లల్ల లల్లల్ల లాల లల్లల్ల లల్లల్ల లాల లల్లల్ల లల్లల్ల లాల ల

దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ

దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ
ఓఓ దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ
దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ
పవరైనా పొగరైనా రెండు కలిసిన బెజవాడ
ఈ పేరు చెబితే తెలియని వాడు లేడే
దీని తీరు తెలిసి బెదరని వాడు లేడే
దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ
దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ

ప్రేమను పంచే నైజం ఉన్నది ఈ చోట
పరువు నిలిపే పంతముంది ఇదే చోట
హే చరితకెక్కిన పొటుగాల్లది ఈ గడ్డ ఆ ఆ
చేయందించే చేవ ఉన్నోల్లదీ అడ్డ
మొక్కే వాల్లుంటే దిక్కైతానుండి
అంకితమయిపోతే అడుగై నడిపిస్తుంది
నమ్మితే మీ కోసం ప్రాణాలయిన ఇస్తుంది
ఈ ఊరికి సాటింకేది

దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ
దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ
దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ

బీసంటు రోడ్డు బెంజ్ సర్కిల్ లీలా మహల్
ఏ సెంటర్ ఐనా దేనికదే తగ్గదు హల్ చల్
సైలెంట్ గా ఉన్నంత వరకు నో ప్రోబ్లం
వయొలెంట్ గా మారిందంటే ఇక జగ జగడం
ఏదైన చేసే మొండి ధైర్యాన్ని ఇస్తుంది
ఏమైపోతామో అన్న భయము ఇస్తుంది
భయాన్ని ఓడించే బలము ఇస్తుంది
ఈ ఊరికి సాటింకేది

దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ
దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ
దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ

ఈ పేరు చెబితే తెలియని వాడు లేడే
దీని తీరు తెలిసి బెదరని వాడు లేడే
దుర్గమ్మ క్రిష్ణమ్మ ఒకటై కాచిన బెజవాడ

03 November 2011

తలబడి కలబడి నిలబడు… పోరాడే యోధుడు జడవడు

తలబడి కలబడి నిలబడు… పోరాడే యోధుడు జడవడు
సంకల్పం నీకుంటే ఓటమికైనా ఒణుకేరా..
బుడి బుడి అడుగులు తడబడి.. అడుగడుగున నీవే నిలబడి..
ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడీ..
వెలుగంటూ రాదు అంటే సూరీడైనా లోకువరా..
నిశిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయెను రా..
నీశక్తేదో తెలిసిందంటే నీకింకా తిరుగేదీ..

ప్రకాశంలో సూరీడల్లే.. ప్రశాంతంగా చంద్రుడి మల్లే
వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి..

పిడికిలినే బిగించి చూడూ.. అవకాశం నీకున్న తోడు..
అసాధ్యమే తలొంచుకుంటూ.. క్షమించూ అనేయ్ దా..
రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి
గిరా గిరా తిరిగేస్తుందీ క్రమంగా మహా స్థిరంగా..
ప్రతీకలా నిజమౌతుందీ.. ప్రయత్నమే ఉంటే..
ప్రతీకవే నువ్వవుతావు ప్రవర్తనే ఉంటే..

||ప్రకాశంలో||

జీవితమే ఓ చిన్న మజిలీ వెళిపోమా లోకాన్ని వదిలి
మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్నీ ఈ కీర్తినీ..
గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం..
ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకీ ప్రతిమలుపుకీ..
ప్రతిరోజూ ఉగాది కాదా ఉషస్సు నీవైతే..
ప్రభంజనం సృష్టిస్తావూ ప్రతిభే చూపిస్తే..

||ప్రకాశంలో||

అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనే..

అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనే..
అయ్యయ్యో జోబులు ఖాళీ ఆయెనే..
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే..
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే..
ఉన్నది కాస్తా ఊడింది, సర్వమంగళం పాడింది..
మేటరు కోటరుకొచ్చిందీ..పరువును వీధికి తెచ్చింది..
పీజ్జా బర్గర్ తినే జీవికీ పచ్చడి టచ్చింగ్ ఇచ్చిందీ…”

||అయ్యయ్యో||

ఆ జమీందారుకే ఏలిన్నాటి శని షరతులు పెట్టిందే..
విధి వీడ్నుతికారేసిందే.. చేతికి చీపురు ఇచ్చిందే..
ఫోజుకు బూజే దులిపిందే..
ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగ మార్చే.. గాడిద చాకిరి చేయించే..
అయ్యయ్యో రాజభోగం పోయెనే.. రాజన్న జొరమే వచ్చెనే..

షవర్ బాత్ లు స్విమ్మింగ్ పూలూ ఎండమావులాయే.. అయ్యని ఎండగట్టినాయే.. గోయిందా.. గోయిందా..
ప్యాలెస్ నుండీ పాయిఖానాకు బాబే దిగివచ్చే.. దెబ్బకు దేవుడు కనిపించే.. అబ్బాయ్ నబ్బా అనిపించే..
ఏసీ బారు లో ఓసీ బతుకుకు షేకే వచ్చిందీ.. షేక్ కి షాకే ఇచ్చిందీ..

అయ్యయ్యో డాబుసరి సిరి దూరమే.. అయ్యయ్యో బాబు పని ఇక ఘోరమే..

జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాహా అయ్యాయీ..
కష్టాల్ కవాతు చేశాయీ.. గర్వపు కీళ్ళే విరిచాయీ.. కాళ్ళకు పుళ్ళే అయ్యాయీ..
నిష్ట దరిద్రపు లాటరీ వీడ్ని లాగి కొట్టిందీ.. కొడితే.. చిప్ప చేతికొచ్చే.. కూటికి తిప్పలెన్నో తెచ్చే..

అయ్యయ్యో మేళ్ళు మిద్దెలు మాయమే.. అయ్యయ్యో పేళ్ళొ బతుకైపాయెనే..

01 November 2011

దంచవే మేనత్త కూతురా

దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా (2)
దంచు దంచు బాగా దంచు
అరె దంచు దంచు బాగా దంచు
దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా
ఆగకుండ ఆపకుండ
అందకుండ కందకుండ ॥దంచవే॥

పోటు మీద పోటు వెయ్యి
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు
కుడి చేత కుదిపి కొట్టు ॥పోటు॥
ఏ చెయ్యి ఎత్తితేమి
మరి ఏ చెయ్యి దించితేమి (2)
అహహహహ
కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే
హా దంచుతా మంగమ్మ మనవడా
ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ
హా హా హాహాహాహా
దంచుతా మంగమ్మ మనవడా హోయ్
నేను దంచితే నీ గుండె దడ దడ

కోరమీసం దువ్వబోకు
కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు
ఇరుగు చూస్తే టముకు టముకు ॥కోరమీసం॥
ఏ కంట పడితేమి
ఎవ్వరేమంటే మనకేమి (2)
నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే
నిన్ను కట్టుకునే హక్కున్న
పట్టాదారుణ్ణి నేను
దంచవే మేనత్త కూతురోయ్
వడ్లు దంచవే నీ గుండెలదరదరదర
హా దంచుతా మంగమ్మ మనవడా
నేను దంచితే నీ గుండె దడ దడ ॥దంచుతా॥

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
అరె సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
అరె సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం

ముద్దులివ్వకుంటే ముల్లు గుచ్చుకుంటదీ
కాదు కూడదంటే కాలి కస్సుమంటదీ
ఒప్పుకోవమ్మా తప్పుకోకమ్మా

పైట లాగకుంటే పల్లె ఎత్తుకుంటదీ హా హా హహా
గుట్టు తాపుకుంటే గుండె కొట్టుకుంటదీ హొయ్ హొయ్ హొయ్ హొయ్
అల్లుకోవయ్యా అరె ఆదుకోవయ్యా

చీకటి పిచ్చి ముదిరిందంటే
వెన్నెల పెళ్ళి కుదిరిందంటే
కొత్తలవాటు కొంపకు చేటూ ఊ
అయినా తప్పదు ఆటుపోటూ

ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
అరె దూరి దూరి పోయావంటే పాములుంటాయ్

గాజు చిట్లకుండా మోజు తగ్గనంటదీ
ఇద్దరున్న కాడా హద్దులెందుకంటదీ
బెట్టు చాలయ్యా నన్నంటుకోవయ్యా

తప్పు చెయ్యకుంటే నిప్పు అంటుకుంటదీ హా హా హహా
అందమైన ఈడు అప్పుపెట్టమంటదీ హొయ్ హొయ్ హొయ్ హొయ్
పెట్టిపోవమ్మో అరువెట్టిపోవమ్మో
రెప్పలగంట కొట్టిందంటే
జంటకు గంట గడవాలంటే
వాముల పాటు పాముల కాటూ
వయసుల వాటు ప్రేమల కాటూ

ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం

సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం

నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ

లలలలలలా లలలలలలా
నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఊపను ఉయ్యాల ఎంతని ఊపను ఉయ్యాల
ఏమని పాడను ముద్దుల జోలా

జోజోజోజో లాలీ జోజో ఓ ఓ
జోజోజోజో లాలీ జోజో ఓ ఓ

నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఓపను నీ గోల ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను వెచ్చని జోలా

జోజోజోజో లాలీ జోజో ఓ ఓ
జోజోజోజో లాలీ జోజో ఓ ఓ

మసకైనా పడనీవూ మల్లె విచ్చుకోనీవూ
హవ్వ హవ్వ హవ్వా
మాటు మణిగిపోనీవూ చాటు చూసుకోనీవూ
హవ్వ హవ్వ హవ్వా
వేళాపాళా లేదాయే పాలకి ఒకటే గోలాయే
చెపితేనేమో వినవాయే చెప్పకపోతే గొడవాయే
బజ్జోమంటే తంటాలా ఎప్పుడు పడితే అపుడేనా

జోజోజోజో లాలీ జోజో ఓ ఓ
జోజోజోజో లాలీ జోజో ఓ ఓ

నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ

మనసైనా పడనీవూ మాట చెప్పుకోనీవూ
హవ్వ హవ్వ హవ్వా
లాల పోసుకోనీవూ పూలు ముడుచుకోనీవూ
హవ్వ హవ్వ హవ్వా
వెండీ గిన్నె తేవాయే వెన్నెలబువ్వే కరువాయే
చలిగాలేస్తే సలుపాయే వెచ్చని గాలికి వలపాయే
తాకంగానే తాపాలా ఆనక అంటే అల్లరేనా

జోజోజోజో లాలీ జోజో ఓ ఓ
జోజోజోజో లాలీ జోజో ఓ ఓ

నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ

ఎంతని ఊపను ఉయ్యాల ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను ముద్దుల జోలా

జోజోజోజో లాలీ జోజో ఓ ఓ
జోజోజోజో లాలీ జోజో ఓ ఓ

కట్టు జారి పోతా ఉందీ

కట్టు జారి పోతా ఉందీ
చీర కట్టు జారి పోతా ఉందీ హోయ్
బొట్టు కారి పోతా ఉంది
చుక్క బొట్టు కారి పోతా ఉందీ హోయ్
ఒట్టమ్మో ఒళ్లంతా ఉలికి ఉలికి పడతా ఉందీ
ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ

అరే కట్టు జారి పోతా ఉందా హోయ్
చీర కట్టు జారి పోతా ఉందా హా
బొట్టు కారి పోతా ఉందా హోయ్
చుక్క బొట్టు కారి పొతా ఉందా హా
ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా హా
ఏందమ్మో సింగారం ఎలిగి ఎలిగి పోతా ఉందా

కట్టు జారి పోతా ఉందీ
చీర కట్టు జారి పోతా ఉందీ

మొగ్గమ్మ చూసింది పువ్వమ్మ నవ్వింది
మొగ్గమ్మ చూసింది పువ్వమ్మ నవ్వింది
గోరంతా ఈ గొడవ ఊరంతా చెప్పిందమ్మ
పరువంతా తీసిందమ్మా

సోకమ్మ తాకింది కోకమ్మ తరిగింది
సోకమ్మ తాకింది కోకమ్మ తరిగింది
కాకమ్మ ఆ కబురు కథలాగా చెప్పిందమ్మా ఆ ఆ
కలలెన్నో రేపిందమ్మా

చీరకట్టలేని చిన్నదానికింక సారె పెట్టనేల చిన్నోడు
పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు
పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు

బొట్టు కారి పోతా ఉంది
చుక్క బొట్టు కారి పోతా ఉందీ

పిట్టమ్మ చూసిందీ చెట్టెక్కి కూసిందీ
పిట్టమ్మ చూసిందీ చెట్టెక్కి కూసిందీ
బిడియాల కడకొంగు ముడి పెట్టుకోమందమ్మా
ముద్దెట్టుకోమందమ్మా

సిగ్గమ్మ వచ్చింది శెలవంటు వెళ్ళింది
సిగ్గమ్మ వచ్చింది శెలవంటు వెళ్ళింది
ఒక నాటి చెలికాడి ఒడి చేరుకోమందమ్మా ఒదిగొదిగి పొమ్మందమ్మా

పుట్టగానే చెయ్యి పట్టుకున్న ప్రేమ పూతకొచ్చెనమ్మ ఈనాడు
చిన్నవాడి కళ్ళు చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు
చిన్నవాడి కళ్ళు చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు

అరే కట్టు జారి పోతా ఉందా హోయ్
చీర కట్టు జారి పోతా ఉందా హ హా
బొట్టు కారి పోతా ఉందీ
చుక్క బొట్టు కారి పోతా ఉందీ
ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా హ హ హ హ హా
ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ

కట్టు జారి పోతా ఉందీ
చీర కట్టు జారి పోతా ఉందీ

మదనా సుందర నాదొరా

మదనా సుందర నాదొరా
ఓ మదనా సుందర నాదొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర
ఓ మదనా సుందర నాదొరా

చిన్న దానను నేను వన్నె కాడవు నీవు
చిన్న దానను నేను వన్నె కాడవు నీవు
నాకూ నీకూ జోడు నాకూ నీకూ జోడు
రాకా చంద్రుల తోడు
మదనా సుందర నాదొరా

మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెలపైన
మిసిమి వెన్నెలలోన పసిడి తిన్నెలపైన
రసకేళి తేలి రసకేళి తేలి
పరవశామౌద మీవేళ
మదనా సుందర నాదొరా

గిలిగింత లిడ ఇంత పులకింత లేదేమి
గిలిగింత లిడ ఇంత పులకింత లేదేమి
వుడికించ కింకా వుడికించ కింక
చూడొకమారు నా వంక
మదనా సుందర నాదొరా

మరులు సైపగ లేను విరహామోపగ లేను
మరులు సైపగ లేను విరహామోపగ లేను
మగరాయడా రా రా మగరాయడా రా రా
బిగి కౌగిలీ తేర మదనా సుందర నాదొరా
నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె దొర
ఓ మదన సుందర నాదొరా

కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై

కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై
ఎగసి పోదునో చెలియా నీవే ఇక నేనై
కలల అలల పై

జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు
జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు
తడిసి తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు
తడిసి తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు

చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
చూపుతోనే హృదయ వీణ ఝుమ్మనిపించేవెందుకు
విరిసీ విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు
విరిసీ విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు
కలల అలల పై

సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది
జవరాలిని చెలికాణిని జంట గూడి రమ్మన్నది
జవరాలిని చెలికాణిని జంట గూడి రమ్మన్నది

విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది
అగుపించని ఆనందము బిగికౌగిట కలదన్నది
అగుపించని ఆనందము బిగికౌగిట కలదన్నది

కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై
ఎగసి పోదునో చెలియా నీవే ఇక నేనై
కలల అలల పై

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో
శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో
తెల్లావారకముందే ఇల్లంతా పరుగుల్లు ఆ
చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లు
ఏమి వయ్యారమో ఓ ఓ ఓ
ఏంత విడ్డూరమో హు ఏంత విడ్డూరమో

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో
చిట్టిమనవడి రాక చెవిలోన పడగానే
ముసిముసి చీకట్లో ముసలమ్మ రాగాలు
ఏమి జాగారమో ఓ
ఎంత సంబరమో ఎంత సంబరమో

సరి అంచు పైట సవరించుకున్నా
మరి మరి జారుతుంది
ఓసోసి మనవరాల ఏం జరిగింది
ఓసోసి మనవరాల ఏం జరిగింది

తాతయ్యను నువ్వు తలచిన తొలినాడు
నీకేమి జరిగిందో అమ్మమ్మ
తాతయ్యను నువ్వు తలచిన తొలినాడు
నీకేమి జరిగిందో అమ్మమ్మ
నాకంతే జరిగింది అమ్మమ్మ

అమ్మదొంగా రంగ రంగ
అమ్మదొంగా రంగ రంగ

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో

కోడిని కొడితే సూర్యుణ్ణి లేపితే తెల్లరిపోతుందా
ఓ పిల్ల పెళ్ళిగడియ వస్తుందా
ఓ పిల్ల పెళ్ళిగడియ వస్తుందా

దిగివచ్చి బావను క్షణమైన ఆపితే దేవున్ని నిలదీయనా
ఓయమ్మో కాలాన్ని తిప్పేయనా
నా పిచ్చితల్లి ఓ బుజ్జిమల్లి నీ మనసే బంగారం
నూరేళ్ళు నిలవాలి ఈ మురిపం
నూరేళ్ళు నిలవాలి ఈ మురిపం
అమ్మమ్మ మాట ముత్యాల మూట
ఆ విలువ నేనెరుగనా ఏనాడు అది నాకు తొలిదీవెన

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో
శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో

గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు

గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు
ఝల్లంటే ఝల్లే కాదూ ఊ ఊ ఊ
చిత్తకార్తె చినుకు జల్లూ ఊ చిత్తకార్తే చినుకుజల్లు
జల్లూ జల్లూ జల్లూ జల్లూ జల్లు జల్లూ జల్లు జల్లూ
గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె జల్లు ఆ హా ఓయీ హోయీ

బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ
జిల్లంటే జిల్లే కాదు ఊ ఊ ఊ
మాఘ మాసం మంచు జిల్లూ మాఘమాసం మంచు జిల్లూ
జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ
బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ
ఆ హా అహా హా

బుంగమూతి బుజ్జి మల్లీ ఈ ఈ ఈ
ముడుచుకొన్న మొగ్గమల్లీ ఈ ఈ ఈ ఈ ||2||

ఇంతలోనే వింతగానే అరె ఇంతలోనే వింతగానే
విచ్చుకున్నావే ఏ ఏ ఏ చెంగు విసురుతున్నావే ఏ ఏ
విచ్చుకున్నావే ఏ ఏ ఏ చెంగు విసురుతున్నావే ఏ ఏ

నీ చేతి మెరుపు ఓ రేపింది వలపు
నీ చేతి మెరుపు ఓ రేపింది వలపు
అంతే మరి సరాసరి వయసు విచ్చిందీ ఈ నీ వరస మెచ్చింది
వయసు విచ్చిందీ ఈ నీ వరస మెచ్చింది

అరె హోయీ హోయి ఆ ఆఅ హా ||గుమ్మ చూపు ||

మురిపెమంటే ఎరగనోడివే ఏ ఏ ఏ
ఈ ముద్దుమాటలాడనొడివే ఏ ఏ ఏ ఏ
అయ్యో మురిపెమంటే ఎరగనోడివే ఏ ఏ ఏ
ఈ ముద్దుమాటలాడనొడివే ఏ ఏ ఏ ఏ

కొమ్ములొచ్చినా అరె కోడగిత్తలా ||2||
కుమ్ముతున్నావే ఏ ఏ ఏ నన్నే కమ్ముకున్నావే ఏ ఏ ||2||
నీ మాట విసురూ ఊ రేపింది పొగరూ ||2||
రోషం పుట్టి మీసం తట్టి కాలుదువ్వానే సరసాలు రువ్వానే అరె ||2||
హోయీ హోయి హోయిహోయి హోయీ హోయీ

బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ
గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు
జిల్లంటే జిల్లే కాదు ఊ ఊ ఊ
మాఘ మాసం మంచు జిల్లూ మాఘమాసం మంచు జిల్లూ
గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు
బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ
అరె హోయీ హోయి ఆ ఆఅ హా ||గుమ్మ చూపు ||

స్వాతి చినుకు సందెవేళలో హొయ్

స్వాతి చినుకు సందెవేళలో హొయ్
లేలేత వణుకు అందగత్తెలో హొయ్
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా

స్వాతి చినుకు సందెవేళలో హొయ్
లేలేత వలపు అందగాడిలో హొయ్
ఈడే ఉరుముతుంటే నేడే తరుముతుంటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
పదా అంది పడుచు పూపొదా హోయ్
ఇదే కదా చిలిపి ఆపదా

ఈ గాలిలో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక నా వీణలే అల్లాడగా
నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా
వరాలిచ్చి పోరా వరించాను లేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళా కురిసిన

స్వాతి చినుకు సందెవేళలో హొయ్
లేలేత వణుకు అందగత్తెలో హొయ్
మబ్బే కన్ను గీటే మతే పైట దాటే

సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా

భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా

యా యా యా యా యా యా
ఈవానలా కధేమిటో నా ఒంటిలో సొదెందుకో
నీకంటిలో కసేమిటో నాకంటినీ తడెందుకో
తొలివానలా గిలిగింతలో పెనవేసినా కవ్వింతలో
ఎదే మాట రాకా పెదాలందు ఆడా
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళా మెరిసిన

స్వాతి చినుకు సందెవేళలో హొయ్
లేలేత వలపు అందగాడిలో హొయ్
ఈడే ఉరుముతుంటే నేడే తరుముతుంటే

చలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా

పదా అంది పడుచు పూపొదా హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా

తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో

తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అహ తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో

రప్పప్పా పప్పా పప్పా పప్పా
వైశాఖం తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా
ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతలో వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమే
నీతోడు కావాలి నే తోడుకోవాలి నీ నీడలో ఉన్న శృంగారమే
జాబిల్లీ సూరీడూ ఆకాశంలో నిండిన సొగసుల

తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో

కార్తీకం అహ్ కలిసి వస్తే నీ పరువం అడుగుతున్నా
హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా
ఆకాశ దేశాన ఆ మేఘరాగాలు పలికాయి నా స్వప్నసంగీతమే
ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు వెలిగాయి నీ కంట నాకోసమే
గిలిగింతే గీతాలై సింగారానికి సిగ్గులు కలిపిన

తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో

అబ్బ దీని సోకు సంపంగి రేకు

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు

దోర అందాలు చూశాక నేను దోచుకోకుంటె ఆగేదెలా
కొమ్మ వంగాక కొంగొత్త పండు దాచినా నేను దాగేదెలా
సందెపొద్దింక సన్నగిల్లాక చిన్నగా గిల్లుకోనా
చిమ్మచీకట్లే సిగ్గుపడ్డాక నిన్ను నేనల్లుకోనా
ఒడ్డులేని ఏరు ఒడేల భామా అడ్డులేని ప్రేమా ఇదేనులే
ముద్దుపెట్టగానె ముళ్ళుజారిపోయే
వెల్లువంటి ఈడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి చాటు చూసి దాటుతుంటే తంటా

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు

ఎన్ని బాణాలు వేస్తావు నీవు తీపిగాయలతో చెప్పనా
ఎన్ని కోణాలు ఉన్నాయి నీలో కంటికే నోరు మూసెయ్యనా
ఎంత తుళ్ళింత లేత ఒళ్ళంతా కౌగిలే కప్పుకోనా
మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా
తెడ్డులేని నావా చలాకి ప్రేమా సందు చూసి పాడే సరాగమే
బొట్టు పెట్టగానే గట్టు జారిపోయే
వెన్నెలంటి సోకులన్ని ఈలవేసి ఇవ్వబోతే ముందుగానె దోపిడైతె టాటా

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు
లే గులాబి మొగ్గలాటి ఎర్రబుగ్గలంటుకున్న ముద్దులన్ని మోతపుట్టే
సిగ్గు పడ్డ పెదవి మీద మొగ్గ విచ్చుకున్న పూలు మోజులన్ని మాలలల్లే

అబ్బ దీని సోకు సంపంగి రేకు
అంటుకుంటె షాకు నన్నంటుకోకు
అమ్మ దీని చూపు మరుమల్లె తూపు
అమ్మ రాకు రాకు నేనున్నవైపు

కన్నులైనా తెరవని ఓ చిన్ని పాపా స్వాగతం

కన్నులైనా తెరవని ఓ చిన్ని పాపా స్వాగతం
ఊహలింకా తెలియని నా చిట్టీ పాపా స్వాగతం
ఈ జగానికి స్వాగతం స్వాగతం

లోకమంతా శాంతి చిందిన లే గులాబి లేదులే
మానవతకై ప్రాణమిచ్చిన బోసినవ్వే లేదులే
లోకమంతా శాంతి చిందిన లే గులాబి లేదులే
మానవతకై ప్రాణమిచ్చిన బోసినవ్వే లేదులే

పూల మాదిరి మెరిసి పోయే ముళ్ళ బాటలే మిగిలెనే
నవ్వు చాటున బుసలు కొట్టే నాగు పాములే మిగిలెనే
నేటి లోకం అసలు రూపం నీవు చూసేదెప్పుడో
నీకు తెలిసేదెన్నడో

కన్నులైనా తెరవని ఓ చిన్ని పాపా స్వాగతం
ఊహలింకా తెలియని నా చిట్టీ పాపా స్వాగతం
ఈ జగానికి స్వాగతం స్వాగతం

జాతి కోసం బలైపోయిన నేత నేడిక లేడులే
జగతిలో మన కీర్తీ పెంచిన విశ్వకవి లేడాయెనే
జాతి కోసం బలైపోయిన నేత నేడిక లేడులే
జగతిలో మన కీర్తీ పెంచిన విశ్వకవి లేడాయెనే

సొంత లాభం కోరకు దేశం గోంతు నులిమే ధీరులు
మంచి చెసిన వారి ముంచే మనుషులెందరో కలరులే
నేటి లోకం అసలు రూపం నీవు చూసేదెప్పుడో
నీకు తెలిసేదెన్నడో

కన్నులైనా తెరవని ఓ చిన్ని పాపా స్వాగతం
ఊహలింకా తెలియని ఓ చిట్టీ పాపా స్వాగతం
ఈ జగానికి స్వాగతం స్వాగతం స్వాగతం

బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు

బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు
బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు
సయ్యనవే ఏ నా సరసకు రావే ఏ
సయ్యనవే ఏ నా సరసకు రావే ఏ
చక్కెర తునుక కిక్కురమనక పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డూ నా లడ్డు ఊ ఊ
గాడిద గుడ్డు ఆ బంగారు బాతు గుడ్డు బందారు తొక్కుడు లడ్డు

తీగ నడుములో రాగమున్నది పాల సొగసులో ఓ మీగడున్నదీ ఈ
వయసు వరదలా పొంగుతున్నదీ మనసు మరదల అంటూ వున్నది
తుంటరి గుంట హ్హా హ్హా హ్హా వంటరిగుంటే హ హ
తుంటరి గుంట వంటరిగుంటే వంటికిమంచిది కాదీ పొద్దు లడ్డు నా లడ్డు
గాడిద గుడ్డు ముహ్హూ ఊ

అబ్బాయి వళ్ళు ఎలా వున్నది అమ్మాయి వాటం తెలియకున్నదీ
అబ్బాయి వళ్ళు ఎలా వున్నది అమ్మాయి వాటం తెలియకున్నదీ
చేయి తగిలినా చెంప పగిలినా తడిమి చూసుకొని పడతావయ్యో రోడ్డు ఓరి జిడ్డూ
గాడిదె గుడ్డు ఉహ్హూ ఆ బంగారు బాతు గుడ్డు షటాప్
బందారు తొక్కుడు లడ్డు ఛా పో

కస్సు మన్నదీ ఈ ఈ గడసు చిన్నదీ
కిస్సు కిస్సనీ అడుగుతున్నదీ
పగటి చుక్కలా ఆ ఆ వెలుగుతున్నదీ ఈ
పడుచు దిక్కునా ఎదుటే వున్నదీ
లకుముకి పిట్ట త్ప్రూ హూ తికమకపెడితే ఆహా
లకుముకి పిట్ట తికమకపెడితే ఆహా
చెకుముకి దెబ్బ తినిపిస్తానే లడ్డు నా లడ్డూ
గాడిద గుడ్డు ముహ్హూ

హల్లో మిస్టర్ అడవిరాముడు హో హో హో హో
అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు పోయీ పోయ్ పపబ్బాయి
హల్లో మిస్టర్ అడవిరాముడు అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు
తాత తుపాకి పాతగిరాకీ పిల్లచలాకీ చూపిస్తాలే చూడు ఓరి జిడ్డూ
గాడిద గుడ్డు ముహ్హూ బంగారు బాతు గుడ్డు షటాప్
బందారు తొక్కుడు లడ్డు ఛా పో సయ్యనవే ముహ్హూ
నా సరసకు రావే వ్వే వ్వే వ్వే సయ్యనవే అ నా సరసకు రావే ఏ
చక్కెర తునుక కిక్కురమనక పక్కకు వస్తే చేస్రుస్తానే ఒడ్డూ
డూ డూ డూ గాడిద గుడ్డు ముహ్హూ ఊ

కొయిలాలో ఓ ఓ ఓహో కోహ కోహిలీ కోత మీద లాహిరీ

కొయిలాలో ఓ ఓ ఓ ఓ ఓ హో ఓ
కోహ కోహిలీ కోత మీద లాహిరీ కోహ కోహిలీ కోత మీద లాహిరీ
కొయిలాలో ఓ ఓ ఓ ఓ ఓ హో ఓ

కొండమీన సందమామా ఆ ఆ ఆ
కొనలోన కోయభామ ఆ ఆ
కొండమీన సందమామా ఆ ఆ ఆ
కొనలోన కోయభామ ఆ ఆ

పకపకలాడింది నా పట్టు తప్పింది
పకపకలాడింది నా పట్టు తప్పింది
దీని ముక్కుకు తాడెయ్యా బలె సక్కిలిగిలిదీనందం
సుక్కులు మొక్కయ్యా ఈ సక్కని చుక్కే నా సొంతం

కొండమీన సందమామా ఆ ఆ ఆ
కొనలోన కోయమామ ఆ ఆ
కొండమీన సందమామా ఆ ఆ ఆ
కొనలోన కోయమామ ఆ ఆ

తొంగి చూశాడూ నా కొంగు లాగాడు
తొంగి చూశాడూ నా కొంగు లాగాడు
ఓయ్ ఈడిముక్కుకు తాడెయ్య బలె సక్కిలిగిలిదీనందం
సుక్కలు పక్కేయ్యా ఈ పక్కిట సిక్కే నా సొంతం

కొండమీన సందమామా ఆ ఆ ఆ
కొనలోన కోయమామ ఆ ఆ

ఎండల్లో వానలాగే యెంట వస్తాను కొండల్లో కోన లాగే జంటగుంటాను
ఆ మూడు ముల్లేసి ఈ ముద్దు చెల్లిస్తా
ఆ మూడు ముల్లేసి ఈ ముద్దు చెల్లిస్తా

ఐదు ప్రాణాల అందం ఆరతీస్తాను
ఏడూ జన్మాల బంధం హారమేస్తానూ
ఐదు ప్రాణాల అందం ఆరతీస్తాను
ఏడూ జన్మాల బంధం హారమేస్తానూ

ఈ ముద్దు చెల్లిస్తే ఆ హద్దు చెరిపేస్తా
ఈ ముద్దు చెల్లిస్తే ఆ హద్దు చెరిపేస్తా

దీని ముక్కుకు తాడెయ్య బలె సక్కిలిగిలిదీనందం
సుక్కులు మొక్కయ్యా ఈ సక్కని చుక్కే నా సొంతం

కొండమీన సందమామా ఆ ఆ ఆ
కొనలోన కోయమామ ఆ ఆ
కొండమీన సందమామా ఆ ఆ ఆ
కొనలోన కోయభామ ఆ ఆ

ఏరంటి నిన్ను చూసి ఎల్లువవుతాను
వరదల్లె పొంగుతుంటే వంతెనేస్తాను
ఎన్నెట్లో గోదారి కౌగిట్లో పొంగిస్తా
ఎన్నెట్లో గోదారి కౌగిట్లో పొంగిస్తా

ఆకాశమయితే నువ్వు చుక్కనవుతాను
అందాల జాబిలయితే పక్కనుంటాను
ఆకాశమయితే నువ్వు చుక్కనవుతాను
అందాల జాబిలయితే పక్కనుంటాను
మల్లెల్లో ఇల్లేసీ మనసంతా ఇచ్చేస్తా
మల్లెల్లో ఇల్లేసీ మనసంతా ఇచ్చేస్తా

దీని ముక్కుకు తాడెయ్య బలె సక్కిలిగిలిదీనందం
సుక్కులు మొక్కయ్యా ఈ సక్కని చుక్కే నా సొంతం
కొండమీన సందమామా ఆ ఆ ఆ
కొనలోన కోయభామ ఆ ఆ

పకపకలాడింది నా పట్టు తప్పింది
తొంగి చూశాడూ నా కొంగు లాగాడు
ఓయ్ ఈడిముక్కుకు తాడెయ్య బలె సక్కిలిగిలిదీనందం
సుక్కలు పక్కేయ్యా ఈ పక్కిట సిక్కే నా సొంతం

కొండమీన సందమామా ఆ ఆ ఆ
కొనలోన కోయభామ ఆ ఆ

కొండమీన సందమామా ఆ ఆ ఆ
కొనలోన కోయమామ ఆ ఆ

కోహ కోహిలీ కోత మీద లాహిరీ కోహ కోహిలీ కోత మీద లాహిరీ
కొయిలాలో ఓ ఓ

ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట

ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట
ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట
పగిలిన నాగుండెలలో పగిలిన నాగుండెలలో
రగులుతున్న రాగం ఈ పాటా ఆ ఆ ఆ ఆ
ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట ఆ ఆ ఆ

పువ్వులకే నవ్వులు నేర్పిన ప్రేమతోట ఇది ఒక నాడు
చిగురించన మోడులకు నిదురించని గుండెలలో
చితిపేర్చిన వల్లకాడు ఈ నాడు ఊ

కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం
కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం
ఇక్కడే ఏ ఏ ఏ ఏ ఏ ఏ కదులుతూంది వ్యధతో ఒక ప్రాణం

శీలానికి కాలం మూడి కాలానికి ఖర్మం కాలీ
న్యాయానికి గాయం తగిలీ గాయంలో గేయం రగిలి
నెత్తురిలో దీపం వెలిగే వెలుతురుకే శాపం తగిలే

ఇది మాతృహృదయమే మృత్య నిలయమయి ఎగసిన విలయ తరంగం ఊ
మది రుద్రవీణ నిర్విద్రగానమున పలికే మరణమృదంగం

అందుకే ఏ ఏ ఏ ఏ
పలుకుతుంది శ్లోకం నా శోకం మూ ఊ ఊ
ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట ఆ ఆ ఆ

చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి

ఊ ఊ ఊ ఊ ఊ ఊహూ
లాల లార రరా రా రా రా రా ఊహూ

చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి
చెరిసగమయినామందుకో ఓ ఓ ఓ తెలిసి తెలిసి తెలిసి
కలవని తీరాల నడుమ కలకల సాగక యమునా
వెనుకకు తిరిగి పోయిందా మనవు గంగతో మానిందా ఆ
ఊ ఊహూ ఊహూ
చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి
చెరిసగమయినామందుకే ఏ ఏ ఏ తెలిసి తెలిసి తెలిసి

జరిగిన కథలో బ్రతుకు తెరువులో దారికి అడ్డం తగిలావూ ఊ ఊ
ముగిసిన కథలో మూగ బ్రతుకులో ఓ నా దారివి నీవయి మిగిలావూ ఊ

పూచి పూయని పున్నమలో ఎద దోచి తోడువై పిలిచావు
గుండెలు రగిలే ఎండలలో నా నీడవు నీవై నిలిచావు ఆ ఆ ఆఅ ఆఅ ఆఅ
చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి
చెరిసగమయినామందుకే ఏ ఏ ఏ తెలిసి తెలిసి తెలిసి

తూరుపు కొండల తొలి తొలి సంధ్యల వేకువ పువ్వు వికసిస్తుందీ ఈ ఈ ఈ
విరిసిన పువ్వూ ఊ ఊ కురిసిన తావి
విరిసిన పువ్వూ కురిసిన తావి
మన హృదయాలను వెలిగిస్తుంది ఈ ఈ ఈ
చీకటి తెరలు తొలిగిస్తుంది
ఊహు ఊహూ అహ అహా ఆహ ఆహా ఆ ఆ

గోవిందా గోవిందా జారిందా జారిందా

గోవిందా గోవిందా జారిందా జారిందా
కాలు జారిందా నేల జారిందా
హారి కన్నెపిల్ల పైట జారిందా
పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా


గోవిందా గోవిందా జారిందా జారిందా
కాలు జారిందా నేల జారిందా
హారి కన్నెపిల్ల పైట జారిందా
పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా
పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా
గోవిందా గోవిందా

కోక తడిసిపోయిందా కొత్త మెరుపు తీరిందా
బుర్రు బుర్రు మంటుందా కొరుక్కు తిందామని వుందా
అహ అహ అహ
కోక తడిసిపోయిందా కొత్త మెరుపు తీరిందా
బుర్రు బుర్రు మంటుందా కొరుక్కు తిందామని వుందా

కొంగునట్టా గుంజుకోకూ కుర్రవాణ్ణి నంజుకోకు
కొంగునట్టా గుంజుకోకూ కుర్రవాణ్ణి నంజుకోకు

గోవిందా గోవిందా జారిందా జారిందా
కాలు జారిందా నేల జారిందా
హారి కన్నెపిల్ల పైట జారిందా
పైటతోటి పడుచువాడి గుండె జారిందా
పైటతోటి పడుచువాడి గుండె జారిందా
గోవిందా గోవిందా


కొంగు గాలి తగిలిందా కోర్కె కాస్త తీరిందా
తీట నీకు వచ్చిందా లోటుపాటు తెలిసిందా
అహ అహ అహ
కొంగు గాలి తగిలిందా కోర్కె కాస్త తీరిందా
తీట నీకు వచ్చిందా లోటుపాటు తెలిసిందా

ఆశలింకా పెంచుకోకు అలసిపోయి సోలిపోకు
హాయ్ హాయ్ హాయ్ ఆశలింకా పెంచుకోకూ అలసిపోయి సోలిపోకు

గోవిందా గోవిందా జారిందా జారిందా
కాలు జారిందా నేల జారిందా
హారి కన్నెపిల్ల పైట జారిందా
పైటతోటి పడుచువాడి గుండె జారిందా

పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా
పైటతోటి పడుచువాడి గుండె జారిందా
గోవిందా గోవిందా

క్షేమమా ప్రియతమా సౌఖ్యమా నా ప్రాణమా

ఏహే ఏహే లాలలాలలా
ఆహా ఆహా లాలలాలలా

క్షేమమా ప్రియతమా సౌఖ్యమా నా ప్రాణమా
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా (2)

నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక పదిలమా

నీలోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు క్షేమమా (నీలి కురుల)

చలి గాలి గిలిగింత సౌఖ్యమా చెలి మీద వలపంతా సౌఖ్యమా
నీ క్షేమమే నా లాభము నీ లాభమే నా మోక్షము ||క్షేమమా||

కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు పదిలమా

నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా (కాలమల్లె)

తహతహలు తాపాలు సౌఖ్యమా బిడియాలు బింకాలు సౌఖ్యమా
నీ సౌఖ్యమే నా సర్వమూ ఆ సర్వమూ నా సొంతమూ ||క్షేమమా||

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను
ఏనాడో నేను నీదాన్నీ నీ హృదయానికి అనువాదాన్ని హూ హూ హూ
కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

ఇంత మంచి తరుణం ఇంకెందుకూ కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత మంచి తరుణం ఇంకెందుకూ కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత పొంగు పరువం నీకెందుకు ఇంత పొంగు పరువం నీకెందుకు
కౌగిలింతలో కమ్మేసేటందుకు ఊ ఊ

ఆరడుగుల వాడివే ఆరిపోని వేడివే
మంచులా మౌనిలా మాటాడకున్నావేం
మంచులా మౌనిలా మాటాడకున్నావేం

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తలపు రేకు విప్పింది ఇప్పుడే తలపు రేకు విప్పింది ఇప్పుడే
మరి వలపు పంట పండాలా అప్పుడే ఊ ఊ

ఆకు మాటు పిందెవే అరుగు దిగని పాపవే
చింతలు వంతలు నీకేమి తెలుసునులే
చింతలు వంతలు నీకేమి తెలుసునులే

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను
కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను
ఏనాడో నేను నీవాణ్ణి నీ హృదయానికి అనువాదాన్ని హూ హూ

కోరుకున్నాను హ హ హ
నిన్నే చేరుకున్నాను హ హ హ
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను ఆ రోజు రానీ అని ఊరుకున్నాను

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారని వాళ్లను మీ తరమైనా మార్చాలి

మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మెప్పుల కోసం చెప్పేవాళ్లను మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి

అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు
అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు
అందరి దేవుడు ఒకడే ఐతే
అందరి దేవుడు ఒకడే ఐతే ఎందుకు కోటి రూపాలు

అందరి రక్తం ఒకటే కాదా ఎందుకు కులమత భేదాలు
అందరి రక్తం ఒకటే అయితే
అందరి రక్తం ఒకటే అయితే ఎందుకు రంగుల తేడాలు
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

తెలిసి తెలిసి బురద నీటిలో ఎవరైనా దిగుతారా
ఆ బురదలోనే అందాల కమలము పుడుతుందని మరిచేరా

కమలం కోసం బురదలోనే కాపురముండేదెవరు
మనసులోని బురద కడుగుకొని మనుషుల్లా బతికేవారు
సమధర్మం చాటేవారు సమధర్మం చాటేవారు
వారిదే ఈనాటి తరం వారిదే రానున్న యుగం
వారిదే ఈనాటి తరం వారిదే రానున్న యుగం
కాదనే వారు ఇంకా కళ్లు తెరవనివారు
మేలుకోక తప్పదులే మేలుకోక తప్పదులే
మారిపోక తప్పదులే తప్పదులే

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారనివాళ్లను మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో

విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో
శృతిని మించి రాగమేదో పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో ఓ
విరహ వీణ నిదుర రాక వేగే వేళలో
ఆ ఆ వేగే వేళలో

జడలో విరులే జాలిగ రాలి జావళి పాడేనురా
సా పదసరిగ గా దపదసరి గాదపాగ
గాపరీగ సరిగరి సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా ఆ

జడలో విరులే జాలిగ రాలి జావళి పాడేనురా
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా
లేలేత వలపు సన్నాయి పిలుపు రావాలి సందిళ్ళ దాకా
మన పెళ్ళిపందిళ్ళ దాకా ఆ ఆ
విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో ఆ వేగే వేళలో

ఎదలో కదిలే ఏవో కథలు ఏమని తెలిపేదిరా
చీకటిపగలు వెన్నెల సెగలు నీ నీడ కోరేనురా
ఈ నాటకాలు మన జాతకానా రాశాయిలే ప్రేమలేఖా
ఈ దూరమెన్నాళ్ళ దాకా ఆ ఆ

విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో
శృతిని మించి రాగమేదో పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో ఓ
విరహ వీణ నిదుర రాక వేగే వేళలో వేగే వేళలో

కలిసే కళ్ళలోనా కురిసే పూలవానా

కలిసే కళ్ళలోనా కురిసే పూలవానా
విరిసెను ప్రేమలు హృదయానా

పెరిగీ తరిగేను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజూ ||2||
ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే

ఎదురుగా చెలికాణ్ణి చూశాను ఎంతో పులకించి పోయాను ||2||
ఈపొందు కలకాలం నే కోరేను

కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ ||2||
మనలోని పరువాలు పెనవేయాలనీ |కలిసే ||
లాల లాలా లల లాలా

చిన్న మాట ఒక చిన్న మాట

చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట
చిన్న మాట ఒక చిన్న మాట
సందె గాలి వీచి సన్నజాజి పూసీ
సందె గాలి వీచి సన్నజాజి పూసీ
జలధరించే చల్లని వేళ
చిన్న మాట ఒక చిన్న మాట
ఆ చిన్న మాట ఒక చిన్న మాట

రాక రాక నీవు రాగ వలపు యేరువాక
నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
రాక రాక నీవు రాగ వలపు యేరువాక
నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా

నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్విలిస్తే పూజ చేస్తా
వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట మాట
చిన్న మాట ఒక చిన్న మాట
ఆ చిన్న మాట ఒక చిన్న మాట

కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె
నీ పాటలోనే నే మాటనైతే నా మేను నీ వేణువాయే
అందమంతా ఆరబోసి మల్లె పూల పానుపేసి
వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట మాట

ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది

ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది

సఖియా ఆ ఆ నీవెంతటి వంచన చేసావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం

ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది

తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే ఏ
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే

ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది ఓ ప్రియా

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు
తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు
తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు

ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో
ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆటాడు కొన్నాయో
ఎన్నడు నీ చేతులు నా చేతులతో మాటాడు కొన్నాయో

పొదలో ప్రతిపూవ్వూ పొంచి పొంచి చూసినదీ
గూటిలో ప్రతిగువ్వా గుసగుసలాడినదీ
కలసిన కౌగిలిలో కాలమే ఆగినదీ
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు

చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా
ఆహా చల్లగ చలచల్లగ చిరుజల్లుగ నీ గుండెల్లో కురిసేనా
మెల్లగ మెలమెల్లగ సిరిమల్లెగ నీ ఊహల్లో విరిసేనా

ఆ కొంటెగా నిన్నేదో కోరాలనివుంది
ఆ తనువే నీదైతే దాచేదేముంది
మనసులవీణియపై బ్రతుకే మ్రోగిందీ

ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు
తొలినాటి ప్రేమదీపం కలనైన ఆరిపోదు
ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరి పోదు

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను
మదినిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

ఎన్నడు అందని పున్నమి జాబిలి
ఎన్నడూ అందని పున్నమి జాబిలీ
కన్నుల ముందే కవ్విస్తుంటే

కలగా తోచి వలపులు పూచీ
కలగా తోచి వలపులు పూచీ
తనువే మరచి తడబడుతుంటే

గుడిలో వెలసిన దేవుడు ఎదురై
గుడిలో వెలసిన దేవుడు ఎదురై
కోరని వరాలే అందిస్తుంటే

ఆ భావనలో ఆరాధనలో
ఆ భావనలో ఆరాధనలో
అంతట నీవే అగపడుతుంటే

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి
ఎన్నో వరాల మాలలు గుచ్చి
నా మెడ నిండా వేశావు
నన్నో మనిషిని చేశావు
ఎలాగా తీరాలి నీ ఋణమెలాగ తీరాలి

తీరాలంటే దారులు లేవా
కడలి కూడా తీరం లేదా
అడిగినవన్నీ ఇవ్వాలీ
అడిగినప్పుడే ఇవ్వాలీ
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలి

అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశంలో దేవతలు
అడగముందే అన్నీ ఇచ్చే నిన్నే పేరున పిలవాలీ
నిన్నే తీరున కొలవాలీ

అసలు పేరుతో నను పిలవద్దు
అసలు కన్నా వడ్డీ ముద్దు
ముద్దు ముద్దుగా ముచ్చట తీర
పిలవాలీ నను కొలవాలీ
అలాగ తీరాలీ నా ఋణమలాగ తీరాలీ

కన్నులకెన్నడూ కనగరానిది
కానుకగా నేనడిగేదీ
అరుదైనది నీవడిగేది
అది నిరుపేదకెలా దొరికేది
ఈ నిరుపేదకెలా దొరికేది
నీలో ఉన్నది నీకే తెలియదు
నీ మనసే నే కోరుకున్నది
అది నీకెపుడో ఇచ్చేశానే
నీ మదిలో అది చేరుకున్నదీ ఇంకేం
ఇలాగ తీరిందీ మన ఋణమిలాగ తీరింది
ఇలాగ తీరిందీ మన ఋణమిలాగ తీరింది

ఎలా ఎలా దాచావు

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

పిలిచి పిలిచినా పలుకరించినా పులకించదు కదా నీ ఎదా
ఉసురొసుమనినా గుసగుసమనినా ఊగదేమది నీ మది
నిదుర రాని నిశిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో
నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా
తెరిచి ఉందనీ వాకిటి తలుపు చొరబడతారా ఎవరైనా
దొరవో మరి దొంగవో దొరవో మరి దొంగవో
దొరికావు ఈనాటికీ
దొంగను కానూ దొరనూ కానూ
దొంగను కానూ దొరనూ కానూ నంగనాచినసలే కానూ
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ

చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ
చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి
చెప్పనా చెప్పనా చెప్పనా

అడగనా నోరు తెరిచి అడగరానివి ఈ
అడకుంటే నీకు నీవే ఇవ్వలేనివీ ఈ
అడగనా అడగనా అడగనా
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి

చెప్పమనీ చెప్పకుంటే ఒప్పననీ
చెప్పి చెప్పి నా చేత చెప్పించుకున్నవి చెప్పనా
అడగమనీ అడగకుంటే జగడమనీ
అడిగి అడిగి నా చేత అడిగించుకున్నవి అడగనా
అడుగు మరి చెప్పు మరి
అడుగు మరి చెప్పు మరి

చెప్పితే అల్లరి అడిగితే తుంటరి
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి

నిన్న రాత్రి వచ్చి సన్న దీప మార్పి
పక్క చేరి నిదురపోవు సోయగాన్ని
వీపుతట్టి రెచ్చగొట్టి కలలాగ వెళ్లిపోతే
పిల్ల గతి కన్నెపిల్ల గతి ఏమిటో చెప్పనా

పగటి వేళ వచ్చి పరాచకలాడి
ఊరుకొన్న పడుచువాణ్ణి ఉసిగొలిపి
పెదవి చాపి పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే
ఇవ్వమనీ ఇచ్చి చూడమని ముద్దులే అడగనా
వద్దని హద్దు దాట వద్దనీ
అన్న కొద్ది ముద్దు చేసి కొసరి తీసుకున్నవి చెప్పనా

నేననీ వేరనేది లేదనీ అనీ అనీ ఆగమని
ఆపుతున్నదెందుకని అడగనా
అడుగు మరి చెప్పు మరి
అడుగు మరి చెప్పు మరి
చెప్పితే అల్లరి అడిగితే తుంటరి
అడగనా అడగనా అడగనా
చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి
అడగనా నోరు తెరిచి అడగరానివి

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది

పదునారు కళలందు ఏ చిత్ర కళవో
ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివో
పదునారు కళలందు ఏ చిత్ర కళవో
ఏ శిల్పి కలలందు నెలకొన్న చెలివో
ఏ జన్మ పుణ్యాన నను చేరినావో

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది

నా గుండె గుడిలోన నీ రూపు వెలసే
నిను చెరగా గొంతు రాగాలు పలికే
నా గుండె గుడిలోన నీ రూపు వెలసే
నిను చెరగా గొంతు రాగాలు పలికే
వేచేను వెయ్యేళ్లు నీ తోడు కొరకే

ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది
లా లా ల లా లా లా ల
లా లా లా ల లా లా లా ల లా

వగలరాణివి నీవె సొగసు కాడను నేనె

ఓహోహో ఓ ఓ ఓహోహో ఓ ఓ
ఓహోహోహో ఓ ఓ

వగలరాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవే

పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం

వగల రాణివి నీవె ఓహోహో ఓ
ఒహోహో ఓ ఒహోహో ఓ ఓ

ఓహోహొ ఓఓఓ ఓహోహొ ఓఓఓ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన
వగల రాణివి నీవె

కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె
వగలరాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను తోడుగా రావే
వగల రాణివి నీవె ఓహోహో ఓ
ఓహోహో ఓ ఓహోహో ఓఓఓ

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప

ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకు
ఆ చల్లని జాబిలి వెలుగు ఆ చక్కని చుక్కల తళుకు
నీ మనుగడలో నిండాలమ్మా
నీ మనుగడలో నిండాలమ్మా నా కలలన్ని పండాలమ్మా

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప

మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
తోడై నీడై లాలించునులే
తోడై నీడై లాలించునులే మనకే లోటు రానీయదులే

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే నీకన్నా నాకెవరే
అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
ల ల లాలి ల ల లాలి ల ల లాలి ల ల లాలి

నందామయా గురుడ నందామయా

ఊ ఉహు ఉ ఆ అహ హా
లల లలలా లలల లా లల లా
నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా

మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు
మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు

ఆ కుళ్ళు లేని చోటు ఇక్కడే
కుళ్ళు లేని చోటు ఇక్కడే అనుభవించు రాజా ఇప్పుడే
ఆనంద సారం ఇంతేనయా ఆనంద సారం ఇంతేనయా
ఆనంద సారం ఇంతేనయా ఆనంద సారం ఇంతేనయా

నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా

పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు
పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు
నడుమ బట్ట కడితే నగుబాటు
నడుమ బట్ట కడితే నగుబాటు నాగరీకం ముదిరితే పొరబాటు
వేదాంత సారం ఇంతేనయా వేదాంత సారం ఇంతేనయా
వేదాంత సారం ఇంతేనయా వేదాంత సారం ఇంతేనయా

నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
తెలుసుకుందామయా తెలుసుకుందామయా
తెలుసుకుందామయా తెలుసుకుందామయా

మొగ్గా పిందాల నాడే బుగ్గా గిల్లేసినాడే

మొగ్గా పిందాల నాడే బుగ్గా గిల్లేసినాడే
హాయ్ మొగ్గా పిందాల నాడే హాయ్ బుగ్గా గిల్లేసినాడే
కోనేటి గట్టుకాడ కొంగు పట్టి ముద్దు పెట్టి
చెంపలోని కెంపులన్నీ దోచినాడే

హోయ్ మొగ్గా పిందాల నాడే బుగ్గా గిల్లేసినాదే
అహ మొగ్గా పిందాల నాడె హాయ్ బుగ్గా గిల్లేసినాదే
గుండెల్లో వాలిపోయి గూడు కట్టి జోడుకట్టి
పాలుగారు అందమంత పంచినాదే

అబ్బోసి వాడి వగలు ఊ లగ్గోసి పట్టపగలు ఊ
గుమ్మెక్కి గుబులుగుంటది అబ్బ దిమ్మెక్కి దిగులుగుంటది
వల్లంకి పిట్టవంటు వళ్లంత నిమిరి నిమిరి వాటేస్తే అంతేనమ్మో
హాయ్ వయసొస్తే ఇంతేనమ్మో

అయ్యారే తేనే చిలుకు హోయ్ వయ్యారి జాణ కులుకు
ఎన్నెల్లో పగలుగుంటది అబ్బా
మల్లెల్లో రగులుగుంటుంది
వరసైనవాడవంటు సరసాలే చిలికి చిలికి
మాటిస్తే మనసేనమ్మో హా మనసిస్తే మనువేనమ్మో ఓ ఓ

మొగ్గా పిందాల నాడే హోయ్ బుగ్గా గిల్లేసినాడే
హాయ్ హోయ్ హోయ్ మొగ్గా పిందాల నాడే హోయ్ బుగ్గా గిల్లేసినాదే

వాటారే పొద్దుకాడా హోయ్ దాటాలా దాని గడప
లేకుంటే తెల్లవారదు హబ్బ నా కంట నిద్దరుండదు
కొత్తిమేర చేనుకాడ పొలిమేర మరచిపోతే
వాడంత గగ్గోలమ్మో హోయ్ ఊరంతా అగ్గేనమ్మో

తెల్లారే పొద్దుకాడా హోయ్ పిల్లాడు ముద్దులాడి
పోకుంటే సోకు నిలవదు వాడు రాకుంటే వయసు బతకదు
చెక్కిళ్ళ నునుపు మీద చెయ్యేస్తే ఎరుపు మిగిలి
పక్కిళ్లు నవ్వేనమ్మో ఈ నొక్కుళ్లు ఏం చేసేనమ్మో

హోయ్ మొగ్గా పిందాల నాడే అహ బుగ్గా గిల్లేసినాదే లాలాలలా ల లా ల

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసు
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు

పసిడి పసుపు మేని రంగు సందె ఎరుపు బుగ్గ రంగు
నీలి రంగుల కంటి పాపల కొసలలో నారింజ సొగసులు
ఆకు పచ్చని పదారేళ్ళకు ఆశలెన్నో రంగులు
ఆ ఆశలన్ని ఆకాశానికి
ఎగసి వెలెసెను ఇంద్రధనుసై ఇంద్రధనుసై ఇంద్రధనుసై

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు

ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు
ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు
ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు

వాడి కోసం వాన చినుకై నిలిచి ఉంటా నింగిలోనా
వాడి వెలుగే ఏడురంగుల ఇంద్రధనుసై నాలో
ఇంద్రధనుసై నాలో
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు
ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు
మల్లె రంగు నా మనసు

విన్నానులే పొంచి విన్నానులే ఏమని

విన్నానులే ఊహుహు
పొంచి విన్నానులే ఏమని
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ
విన్నానులే పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ
ఉహూహూ హూ హూ అహాహా ఆ ఆ ఆ ఆ

సుకుమారివి నువ్వు పువ్వులాంటి నువ్వు
పండులాంటి పాపాయిని ఇవ్వు
ఊ ఊ ఆ ఆ
అలసిపోనివ్వను పనులు చేయనివ్వను
అడుగుతీసి అడుగు వేయనివ్వను
ఓహో ఇంటి పనులు వంట పనులు తమరే చేస్తే
అయ్యగారి ఉద్యోగం ఊహుహుహుహు
హహహహ విన్నానులే పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

పాపాయే గారాల తోట
మన చిన్నారే నా ముద్దుల మూటా ఆ ఆ
పాపాయే గారాల తోట
మన చిన్నారే నా ముద్దుల మూటా
అయ్యగారివైపు పడదు నీ చూపు
ఇక ముద్దులన్ని పాపకేన రేపు

అరే అంతలోనే వచ్చిందా తమకు అసూయా
అబ్బాయి తమ పోలిక ఆ ముద్దులు మీకే

విన్నానులే పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

తొలి చూలి భాగ్యం ఎంతో ఆనందం
విడిపోని అనురాగబంధం ఆ ఆ ఆ ఆ
నిజమైన స్వప్నం దిగి వచ్చిన స్వర్గం
పాపాయే మన ఆరోప్రాణం
నవ్వులతో వెలుగులతో నిండును ఇల్లు
పాపాయి మురిపాలే తొలకరి జల్లు

విన్నావులే ఊహుహు
పొంచి విన్నావులే ఏమని
ఈ అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

నీ అందం నీ పరువం నాలో దాచుకో

నీ అందం నీ పరువం నాలో దాచుకో
కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో ఓ
ఈ అందం ఈ పరువం నీకే అంకితం
రేయి పగలు వెన్నెలా కాదా నీతో జీవితం

వీచే గాలి పూచే పూలు గుసగుసలాడాయి
కోరికలన్నీ తీరేదెపుడని రెపరెపలాడాయి ||వీచే గాలి||
ఆ తొందర చూసి ఎగిరే గువ్వలు కిలకిల నవ్వాయి ||నీ అందం||

వలచిన నింగి ప్రేయసి కోసం వానై కురిసిందీ
ఆ వానకు తడిసిన భూమి గుండెలో ఆవిరి ఎగిసిందీ ||వలచిన||
ఆ కలియికలోనే నింగి నేల జతగా మురిసేదీ ||నీ అందం||

ఈనాటి విడరాని బంధం

ఈనాటి విడరాని బంధం మ్మ్ మ్మ్
మనకేనాడో వేశాడు దైవం
ఈనాటి విడరాని బంధం
నేను ఏనాడో చేసిన పుణ్యం మ్మ్ మ్మ్
అ హ హ అహ ఆ ఆ ఆ హా ఆహ ఆహ ఆ

నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే ఏ ఏ
నీలాలు మెరిసే నీ కళ్ళలోనా నిలిచింది నా రూపమే
నాలోని ప్రేమ నీ పాద సీమా విరిసింది సిరిమల్లెగా
ఈనాటి విడరాని బంధం
నేను ఏనాడో చేసిన పుణ్యం

సొగసెంతొ కలిగి సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే ఏ
సొగసెంతొ కలిగి సుగుణాల వెలిగే సతి తోడు కుదిరిందిలే
మదిలోన దాచి మనసార వలిచి పతి నీడ దొరికిందిలే ఏ

ఈనాటి విడరాని బంధం నేను ఏనాడో చేసిన పుణ్యం

ఈ రోజు మంచి రోజు

ఆ ఆ ఆ ఆ ఆ ఈ రోజు మంచి రోజు
మరపురానిది మధురమైనది
మంచితనం ఉదయించినరోజు

ఆ ఆ ఆ ఆ ఈ రోజు మంచి రోజు
మరపురానిది మధురమైనది
ప్రేమ సుమం వికసించినరోజు

తొలిసారి ధృవతార దీపించెను
ఆ కిరణాలే లోకాన వ్యాపించెను
ఆ ఆ ఆ ఆ తొలి ప్రేమ హృదయాన పులకించెను
అది ఆనంద దీపాలు వెలిగించెను

చెలికాంతులలో సుఖశాంతులతో
జీవనమే పావనమీనాడు
ఈ రోజు మంచి రోజు
మధురమైనది మరపురానిది
ప్రేమ సుమం వికసించినరోజు

రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము
రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము

మనసు మనసు లొకరికొకరు తెలిపే రోజు
తీరని కోరికలన్నీ తీరే రోజు
అనురాగాలు అభినందనలు
అందించే శుభసమయం నేడు

ఈ రోజు మంచి రోజు
మధురమైనది మరపురానిది
మంచితనం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనమం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు

జో లాలి ఓ లాలి

జో లాలి ఓ లాలి
నైనా ఒకటాయె రెండాయె ఉయ్యాల
రెండు మూడు మాసాలాయె ఉయ్యాల
జో లాలి ఓ లాలి
నైనా మూడో మాసములోన ఉయ్యాల
ముడికట్ట్లు బిగువాయె ఉయ్యాల


జో లాలి ఓ లాలి
నైనా మూడాయె నాలుగాయె ఉయ్యాల
నాలుగు అయిదు మాసములాయె ఉయ్యాల
జో లాలి ఓ లాలి
నైనా అయిదాయె ఆరాయె ఉయ్యాల
ఆరు ఏడు మాసాములాయె ఉయ్యాల
జో లాలి ఓ లాలి
ఏడో మాసములోన ఉయ్యాల
నైనా వేగుళ్ళు బయలెళ్ళె ఉయ్యాల

జో లాలి ఓ లాలి
నైనా ఏడాయె ఎనిమిదాయె ఉయ్యాల
ఎనిమిది తొమ్మిది మాసములాయె ఉయ్యాల
జో లాలి ఓ లాలి
నైనా తొమ్మిది మాసములోన ఉయ్యాల
నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల
నైనా శ్రీకృష్ణ జన్మమురా ఉయ్యాల

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా

హే హే రపరపపర రపరపపర పా
హే హే రపరపపర రపరపపర పా
రపరపా రపరపా రప్పప్పా
రపరపా రపరపా రప్పప్పా

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట నా పేరే రాజు
ఎన్ పేర్దా రాజు మేరా నాం రాజు మై నేం ఈజ్ రాజూ
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా

భాయియో ఔర్ బెహ్నో
ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి కన్ను కుట్టిన శత్రు రాజు ధూమ కేతు
తన సైన్యంతో దండెత్తి వచ్చాడు హా
అప్పుడు మన రాజసింహుడు తెలివిగా
ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో
శత్రుసైన్యం మీదికి మెరుపు దాడి చేశాడు

విజయుడై వచ్చినాడురా తన ప్రజలంతా మెచ్చినారురా
దుర్గమునే ఏలినాడురా ఆ స్వర్గమునే దించినాడురా
అక్షితలే చల్లినారు రమణులంతా
అహ హారతులే భక్తిమీర పట్టినారురా
సింహాసమెక్కి తాను విష్ణుమూర్తిలా
అహ సిరులెన్నో చెలువు మీద చెలికినాడురా

ఏ రాజు ఎవరైనా మా రాజువింక నువ్వంటా
నీ మనసే మా కోట మీ మాట మాకు పూబాటా
రాజాది రాజా మార్తాండ తేజ
నా పేరే రాజు మై నేం ఈజ్ రాజూ

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట నా పేరే రాజు
ఎన్ పేర్దా రాజు మేరా నాం రాజు
మై నేం ఈజ్ రాజూ

అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు
పెద్ద రాణి నాట్యంలో మయూరి
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం
చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట
పద పద సాస సరి గరి సాపద
పద పద సాస సగరిగ సరి గస పద
దరి రిగ గస సప గరిస దప గారిస

కళలే పోషించినాడురా తను కావ్యాలే రాసినాడురా
శిలలే తెప్పించినాడురా ఘన శిల్పాలే మలచినాడురా
చెరువులెన్నో తవ్వించి కరువుమాపి
అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా
కులమతాల రక్కసిని రూపుమాపి
అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా
నీలాంటి రాజుంటే ఆ దేవుడింక ఎందుకంట
చల్లనైన నీ చూపే మాకున్న పండు ఎన్నెలంట
రాజాధి రాజా మార్తాండ తేజా
నా పేరే రాజు మేరా నాం రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట మమ నామ రాజు
ఎన్ పేర్దా రాజు ఎండ వేరే రాజు
నన్న హెసరే రాజు నా పేరే రాజు

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా ఢమక్కురో

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా ఢమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో

కసక్కు లయలు హొయలు చూశా
కసెక్కి వలపు వలలే వేశా
గుబుక్కు ఎదలో కథలే దాచా
గుటుక్కు మనక గుబులే దోచా
మజా చేస్తే మరోటంట మరోటిస్తే మగాణ్ణంట
సరే అంటే అతుక్కుంటా సరాగంలో ఇరుక్కుంటా
చుంబురుణ్ణై నారదుణ్ణై
చుంబ మీద పంబ రేపి పాడుతుంటే మీరు గోవిందే
గోవిందా గోవింద come on come on పాడండయ్యా
పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పప్పా
పబం పం పాబం పపం పం పాబం పబం పం పాబా పాబా బాబాబం

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో

వయస్సు ఒడిలో చొడినే చూశా
వరించి సుడిలో పడవే వేశా
నటించే నరుడా ఘనుడా మెచ్చా
నమస్తే నడుమే నటిగా ఇచ్చా
ఉడాయిస్తే ఉడుక్కుంటా లడాయొస్తే హోయ్ ఉతుక్కుంటా
సఖి అంటే సరే అంటా చెలి అంటే గురు అంటా
బ్రేకు డ్యాన్సు షేకు డ్యాన్సు
mix చేసి steps వేసి tricks చేస్తే మీరు గోవింద
come on come on dance I say ఆడండ్రా
ధినక్కుతా ధినక్కుతా ధినక్కుతా ధినక్కుతా
ధినక్కు తార ధినక్కు తార ధినక్కు తారా తారా తారారా

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురోయ్

జై చిరంజీవా జగదేక వీరా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జై చిరంజీవా జగదేక వీరా
జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా
జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా
దీవించ రావయ్య వాయు సంచారా
రక్షించవేలయ్య శ్రీరామ దూత జై చిరంజీవా

వీరాంజనేయా శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా
జై చిరంజీవా ఆరోగ్యదాతా అభయ ప్రదాతా ఆ
ఆరోగ్యదాతా అభయ ప్రదాతా ఉన్మాద భయ జాడ్య పీడా నివారా
సంజీవి గిరివాహా సానీరిసాహ
సంజీవి గిరివాహ సానీరిసాహొ జై చిరంజీవా జగదేక వీరా

జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా
జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా

మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు

మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
అందుకుంటే జుట్టుపట్టి అందకుంటే కాళ్లుకట్టు కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు దిగి రాముందు
మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
అందుకుంటే జుట్టుపట్టి అందకుంటే కాళ్లుకట్టు కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు దిగి రాముందు

బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ బుచ్చబ్బాయ్ పని కావాలోయ్
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్

ఆడపిల్ల మాటమీద ఉద్యోగాలు ఊడగొట్టు ఆకతాయి కామందు
మీసకట్టు తీసివేసి కాశపోసికోకచుట్టి గాజులేసికొమ్మందు ॥2॥
డొక్కచీరివేస్తాము డోలుకట్టి తెస్తాము డోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం
డొక్కచీరివేస్తాము డోలుకట్టి తెస్తాము డోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం


బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ బుచ్చబ్బాయ్ పని కావాలోయ్
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్

రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా
రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా

రేపటి వేళకు నీ పని మీదని దారికి రాకుంటే
మాపటి వేళకు మీ పని నేపడతానోయ్ బుచ్చబ్బాయ్
మిన్ను విరిగి మీదపడ్డ మన్ను మిన్ను ఏకమైనా
నిన్ను గెలిచే వరకు మేము ఆడితీరుతామ్
మిన్ను విరిగి మీదపడ్డ మన్ను మిన్ను ఏకమైనా
నిన్ను గెలిచే వరకు మేము ఆడితీరుతామ్ పోరాడితీరుతామ్

మేడమీద మేడగట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు
అందుకుంటే జుట్టుపట్టి అందకుంటే కాళ్లుకట్టు కామందు
హలో హలో కమాన్ కమౌట్ రాముందు దిగి రాముందు
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ బుచ్చబ్బాయ్ పని కావాలోయ్
బుచ్చబ్బాయ్ పని కావాలోయ్ బుచ్చబ్బాయ్ పని కావాలోయ్

అందాలన్ని అందాలన్ని నీలోనే దాగున్నాయి

అందాలన్ని అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా అదిగో పొదా ప్రియసుధ ప్రియసుధ జయసుధా హా

అందాలన్ని అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా ఇదిగో సుధా ప్రియసుధ ప్రియసుధ జయసుధా ఆ

నా కళ్ళు ఇన్నాళ్ళు నీ చుట్టే తిరిగేవి
నా కళ్ళు ఇన్నాళ్ళు నీ చుట్టే తిరిగేవి
మదిలోన కోరికల జడి వాన కురిసేది జడివాన కురిసేది
చేప్పాలంటే పెదవులు ఆగేవి తడబడి
ఎప్పుడు చూడూ నాలో ఉప్పెనలాంటి అలజడి
పద పదా అదిగో పొదా ప్రియసుధ ప్రియసుధ జయసుధా హా

అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి

ఎదురెదురు నువ్వుంటే ఏ మెరుపో మెరిసేది
ఎదురెదురు నువ్వుంటే ఏ మెరుపో మెరిసేది
చిరు సిగ్గు తెరలోన అది కాస్త అణిగేది అది కాస్త అణిగేది
ఎవరేమన్నా మనది ఎదురులేని పరవడి
ఇద్దరి జంటా వలచే పడుచు వాళ్ళకు ఒరవడి
పద పదా ఇదిగో సుధా ప్రియసుధ ప్రియసుధ జయసుధా ఆ

అందాలన్ని అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా అదిగో పొదా ప్రియసుధ ప్రియసుధ జయసుధా హా

అందాలన్ని అందాలన్ని నీలోనే దాగున్నాయి
అవి సందడి చేస్తూ నన్నే రా రమ్మనాయి
బిత్తర చూపులు మానెయ్యి మెత్తని చెయ్యి అందియ్యి
పద పదా ఇదిగో సుధా ప్రియసుధ ప్రియసుధ జయసుధా ఆ

మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా

మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా
ఆ సిగ్గుపడే ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా ఓహో
మనసైన ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా
ఆ సిగ్గుపడే ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా

ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా

నా గుండెలోన అందమైన గూడు ఉన్నది ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది ఆహ
నా గుండెలోన అందమైన గూడు ఉన్నది ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది
ఆ చోట ఉంటావా ఆ నా మాట వింటావా ఊహూ ఆ చోట ఉంటావా ఆ
నా మాట వింటావా ఆ ఆ నా మాట వింటావా గుణపాఠం తీర్చుకుంటావా

మనసైన ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా
ఆ సిగ్గుపడే ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా
ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా


మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది
మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది
ఆ పానుపు అడిగింది ఊఁ
నీ రాణి ఎవరంది ఓహో
ఆ పానుపు అడిగింది నీ రాణి ఎవరంది
మన కోసం చూస్తూ ఉంది

మనసైన ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా
ఆ సిగ్గుపడే ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా
ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా
ఒడిలెహీ ఒడిలెహీ ఒడిలెహీ అహహహహా

నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి ఊ
నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి
కొంచెం చూడనిస్తావా నో నో పోని తాకనిస్తావా ఆహ
కొంచెం చూడనిస్తావా ఆ ఆ పోని తాకనిస్తావా
నను నీతో చేర్చుకుంటావా ఆ

మనసైన ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా
ఆ సిగ్గుపడే ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా

చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే

చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే
ఎవరో ఓ తెలుసా గారాల బావ తెలుసా
చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే


ఆ ఆ ఆ ఆ ఆ అత్తకొడుకని విన్నానే అయిన వాడనుకున్నానే
ఓహో ఓహో ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ
వల్లమాలిన సిగ్గేసి తలుపు చాటున చూసానే
ఏమి అందం ఏమి చందం
ఏమి అందం ఏమి చందం గుండెల్లో రేగెను గుబగుబలేవో గుసగుసలేవో

చక్కాని చిన్నవాడే హహహా చుక్కల్లో చందురూడే హహహా
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే
ఎవరో ఓ తెలుసా గారాల బావ తెలుసా

హ హ హ హ ఊఁహుహూహు
ఆ ఆ ఆ ఆ ఆహహా ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఆహాహాహా ఆహాహాహా ఆహాహాహా ఆ హా ఆ హా
లల్లాలలా లల్లాలలా లల్లాలలా లాలలా
మెల్లగా హాయ్ మెల మెల్లగా హాయ్ హాయ్ హాయ్ హాయ్
మెల్లగా నను చూసాడే కళ్ళతో నవ్వేసాడే
మెత్తగా నను తాకాడే కొత్త కోరికలు లేపాడే
ఏమి వింత ఈ గిలిగింత
ఏమి వింత ఈ గిలిగింత రెపరెపలాడే నా ఒళ్ళంతా ఏదో పులకింత

చక్కాని చిన్నవాడే హహహా చుక్కల్లో చందురూడే హహహా
మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే
ఎవరో ఓ తెలుసా గారాల బావ తెలుసా

గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే

గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా
హాయ్ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి
నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి ఆహా
తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి
నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి
అదను చూసి నా చేయి పట్టుకుంటివి
ఆనాటి నుంచి నా మదిలో అల్లరి పెడుతుంటివి

గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా
ఆ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

నీ కందీరగ నడుమేమో కదులుతున్నది
దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది
నీ కందీరగ నడుమేమో కదులుతున్నది
దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది
నీ ఉంగారాల జుట్టేమో ఊగుతున్నది
దాన్ని ఒక్కసారి నిమరాలని ఉబలాటం ఉన్నది

హోయ్ గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా
హా చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా

పైర గాలి నా చెవిలో ఊగుతూ ఉన్నది
పైర గాలి నా చెవిలో ఊగుతున్నది
నీ పడుచుదనం రుచి ఎంతో చూడమన్నది
లగ్గమాడే రోజు దగ్గెరున్నది
మనం లగ్గమాడే రోజు దగ్గెరున్నదీ ఈ ఈ ఈ
అందాకా ఈ తొందర ఎందుకులే అన్నది

హాయ్ గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే
గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా
గుబులు గుబులు గున్నాదే రంగమ్మా
హా చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే
చెంగు నిలవకున్నాదే బావయ్యా
సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా హా

అందానికి అందానివై ఏనాటికి నా దానవై

అందానికి అందానివై ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా ఆ నా దానా
అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా ఆ నా రాజా

వలపించావు వల వేశావు నను నీలోనే దాచేసావు
వలపించావు వల వేశావు నను నీలోనే దాచేసావు
మనసు సొగసు దోచావు
మనసు సొగసు దోచావు మదిలో నన్నే నిలిపావు నిలిపావు

అందానికి అందానివై ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా ఆ నా దానా
అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా ఆ నా రాజా

నీలాకాశం నీడలలోన నిర్మల ప్రేమ వెలగాలి
నీలాకాశం నీడలలోన నిర్మల ప్రేమ వెలగాలి
వలపే విజయం పొందాలి
వలపే విజయం పొందాలి మమతల మధువే కురవాలి కురవాలి

అందానికి అందానివై ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా ఆ నా దానా
అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా ఆ నా రాజా

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే లయలే చూసి లాలించుకో

వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో జతులాడాలి జతచేరుకో ఓ

వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో వద్దు లేదు నా బాషలో
మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరి తాకితే - ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే హోయ్ సోకితే - కోరికన్నదే రేగదా?
వడగట్టేసి బిడియాలనే ఒడి చేరాను వాటేసుకో

అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా చీరకట్టు తానాగునా
పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా జారుపైట తానాగునా
క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తలదాచుకో

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది ఎట్టాగమ్మ
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట ఆ ఆ


ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో వచ్చి వాటేసుకో
కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో మంచు ముద్దు ఇచ్చుకో
పల్లె అందంలో పైటే జారితే పడుచు గంధంలో పాటే పుట్టదా
వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో ముద్దు మురిపం ముచ్చటగా పంచుకో
పాశం యమపాశం చలిమాసం చెలి కోసం
ఇది అదో ఇదో ఎదో ఎదో వేదాంతం

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట

ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో నీడగా ఉండవా
పండు చిలకమ్మ పసి గట్టే వేళలో పైటగా ఉండవా
బ్యుటి తోడూంటే ఊటి దండగ స్వీటి కౌగిట్లో పూటా పండగ
నీ కల్లలో చెస్తాలే కాపురం కటేస్తాలే నా ప్రేమ గొపురం
పాశం యమపాశం చలిమాసం చెలి కోసం
ఇది కింద మీద ఉందా లేదా యవ్వారం

కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది ఎట్టాగమ్మ
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట ఆ ఆహ

అందం హిందోళం అధరం తాంబూలం

సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వయసే వెచ్చని వెన్నెల వంతెన వేసిన వేళా
అందనిదీ అందాలనేది అందగనే సందేళకది
నా మది కోరెను నీ జత చేరెనులే హో

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా

అందం హిందోళం అధరం తాంబూలం
అసలే చలికాలం తగిలే సుమ బాణం

చలిలో దుప్పటి కప్పిన ముద్దుల పంటలలో
చలిగా ముచ్చటలాడిన చక్కిలిగింతలలో
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మెళ్ళెకాయగా
పల్లమ్మె మానుకుంది పరువాలే కాయగా
ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా
ఓడివలపై మొగమెరుపై జతకలిపే హా
చేయనది సడిచేయనది
నాకన్నే కైపెక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హోయ్

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అ ఆహ
అధరం తాంబూలం అ ఆహ
అసలే చలికాలం త త్తర
తగిలే సుమ బాణం త త్తర
కువవకువవా కువవకువవా
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్
సుప్రీమ్ హీరో హూ హూ హూ హూ స్వీట్ హార్ట్


వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణమీద మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయిమీద నిదరంత మాయగా
తొలి ఉడుకే ఒడిదుడుకై చలిచినుకై హా
పెనవేసి పెదవడిగే ప్రేమలకూ హై
ఇచ్చినదీ తను నచ్చినదీ
రేపంటే నను గిచ్చినదీ
అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే

కుకువాకుకువావా కుకువాకుకువావా
కుకువాకుకువావా కుకువాకుకువా
అందం హిందోళం అ ఆహ
అధరం తాంబూలం అ ఆహ
అసలే చలికాలం ఎ ఎహే
తగిలే సుమ బాణం అ ఆహా

సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
వయసే వెచ్చని వెన్నెల వంతెన వేసిన వేళా
అందనిదీ అందాలనేది అందగనే సందేళకది
నా మది కోరెను నీ జత చేరెనులే హో