వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే
అన్నీ వున్న దానివే
ఎన్నీ వున్న జోడులేక లేని దానివే
ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే
తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా
కళ్ళెంపట్టీ కళ్ళెంపట్టి కళ్ళనుకట్టి
నడిపే మొనగాడుండాలీ
అందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్ని
అందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్ని
తూకంవేసీ తూకంవేసి పాకంచూసి
డెందం ఒకరికె ఇవ్వాలి
అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపే
అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపే
అతగాడొకడు జతయైనపుడు అన్నీ ఉన్నవనుకోవాలి
No comments:
Post a Comment