నిన్ను మరిచిపోవాలనీ అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా ఆ మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా

నువ్వు విడిచి వెళ్ళినా నీ రూపు చెరిగిపోలేదూ ఊ
నువ్వు మరలి రాకున్నా నీ చోటెవ్వరికి ఇవ్వలేదూ

తలుపు తెరిచి ఉంచుకొనీ తలవాకిట నిలిచున్నా ఆ
వలపు నెమరేసుకుంటూ నీ తలపులలో బ్రతికున్నా ఆ
నిన్ను మరిచిపోవాలనీ అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా ఆ మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా
ఎందుకిలా చేశావో ఓ నీకైనా తెలుసా
నేనెందుకింకా ఉన్నానో నాకేమో తెలియదూ ఊ
ఎందుకిలా చేశావో ఓ నీకైనా తెలుసా
నేనెందుకింకా ఉన్నానో నాకేమో తెలియదూ ఊ
నేను చచ్చిపోయినా ఆ నా ఆశ చచ్చిపోదులే
నిన్ను చేరు వరకు నా కళ్ళు మూతపడవులే
నిన్ను మరిచిపోవాలనీ అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా ఆ మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా
గుండెలోన చేశావూ ఊ ఆరిపోని గాయాన్నీ ఈ
మందుగా ఇచ్చావు మన వలపు పంట పసివాణ్ణీ
గుండెలోన చేశావూ ఊ ఆరిపోని గాయాన్నీ ఈ
మందుగా ఇచ్చావు మన వలపు పంట పసివాణ్ణీ
ఆ లేత మనసు తల్లికోసం తల్లడిల్లుతున్నదీ
నీ తల్లి మనసు తెలియకనే దగ్గరవుతూ వున్నదీ
నిన్ను మరిచిపోవాలనీ అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా ఆ మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా
No comments:
Post a Comment