ఈ ఉదయం నా హృదయం
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది
ఈ ఉదయం ఊ ఊ ఊ ఊ
పడుచు పిల్ల పయ్యెదలా పలుచని వెలుగు పరచినది
పడుచు పిల్ల పయ్యెదలా పలుచని వెలుగు పరచినది
కొండల కోనల మలుపుల్లో కొత్త వంపులు చూపినది
ఈ ఉదయం ఊ ఊ ఊ ఊ
చిగురాకులతో చిరుగాలీ సరసాలాడి వచ్చినది
చక్కలిగింతలు పెట్టినదీ వేసవికే చలి వేసినదీ
ఓ ఓ ఓహో ఓ ఓ ఓహో
ఈ ఉదయం ఊ ఊ ఊ ఊ
సరస్సున జలకాలాడేదెవరో తేటిని వెంట తిప్పేదెవరో
సరస్సున జలకాలాడేదెవరో తేటిని వెంట తిప్పేదెవరో
రేయికి సింగారించే కలువో పగలే వగలు రగిలే కమలమో
ఈ ఉదయం నా హృదయం
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది
ఈ ఉదయం ఊ ఊ ఊ ఊ
No comments:
Post a Comment