పలికినది పిలిచినది
పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది
పరవశమై నవమోహన రాగం
పలికినది పిలిచినది
గగనాంగనాలింగనోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై
గగనాంగనాలింగనోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై
మమతలు అల్లిన పెళ్ళిపందిరై
మమతలు అల్లిన పెళ్ళిపందిరై మనసులు వీసిన ప్రేమ గంధమై
పలికినది పిలిచినది పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది
గంగా తరంగాల సంగీతమై కమణీయ రమణీయ యువగీతమై
గంగా తరంగాల సంగీతమై కమణీయ రమణీయ యువగీతమై
కలిమికి లేమికి తొలి వివాహమై
కలిమికి లేమికి తొలి వివాహమై యువతకు నవతకు రసప్రవాహమై
పలికినది పిలిచినది పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది
మలయాద్రి పవనాల అలాపనై మధుమాస యామిని ఉద్ధీపనై
మలయాద్రి పవనాల అలాపనై మధుమాస యామిని ఉద్ధీపనై
అనురాగానికి ఆది తాళమై
అనురాగానికి ఆది తాళమై ఆనందానికి అమర నాదమై
పలికినది పిలిచినది పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది
No comments:
Post a Comment