ఆ ఆ పెళ్ళంటే పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసీ నూరేళ్ళు ఆ ఆ ఆ ఆ
పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసీ నూరేళ్ళు
పెళ్ళైతే పెళ్ళైతె ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలూ
ముద్దూ ముచ్చట్లు మురిసే లోగుట్లు చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు ఆ ఆ ఆ ఆ
పెళ్ళైతె ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలూ మ్మ్ మ్మ్ మ్మ్
గోదారి ఒడ్డున గోగుల్లు పూచిన వెన్నెలలో
కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో
ఆ ఆ గోదారి ఒడ్డున గోగుల్లు పూచిన వెన్నెలలో
కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో
మమతానురాగాల మరుమల్లెలల్లిన పానుపులూ
హృదయాలు పెదవుల్లో ఎరుపెక్కు ఏకాంత వేళల్లో
వలపు పులకింతలో వయసు గిలిగింతలో
వింతైన సొగసుల వేడుకలో ఆ ఆ ఆ ఆ
పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసీ నూరేళ్ళు ఆ ఆ ఆ ఆ
పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూ ఆ
కలలన్ని కలబోసి వెలసిన ఈ పంచవటిలో
ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో
ఆ కలలన్ని కలబోసి వెలసిన ఈ పంచవటిలో
ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో
సిరిమువ్వ రవళుల మరిపించు నీ నవ్వు సవ్వడిలో
కులమన్నదే లేని అలనాటి వేదాల ఒరవడిలో
సామగానాలము సరసరాగాలము
ప్రేమికులమన్న కులమున్న లోకంలో ఆ ఆ ఆ ఆ
పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూ
మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసీ నూరేళ్ళు ఆ ఆ ఆ ఆ
పెళ్ళంటె పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలూ ఆ ఆ ఆ
No comments:
Post a Comment