అది ఒక ఇదిలే అతనికే తగులే
సరి కొత్త సరసాలు సరదాలు చవిచూసెలే
అహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
లా లా లా లా ||2||
మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చానూ
అహ నచ్చాను అన్నావా ఏమైన ఇస్తాను
అని పలికిందిరా చెలి కులికింది రా
ఎద రగిలిందిరా మతి చెదిరింది రా చెదిరింది రా
అది ఒక ఇదిలే ఆమెకే తగులే
అరి కొత్త సరసాలు సరదాలు చవిచూపెలే
అహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు
సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడూ
అహ మొగ్గల్లె ఉన్నావు విరబూయమన్నాడు
మది పులకించెను మరులొలికించెనూ
నను మరిపించెను తగుననిపించెను
నడకేది అన్నాను నడిచింది ఒకసారి
అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి
నా వద్దున్నదే తన ముద్దన్నదీ
చే కొమ్మంది నీ సొమ్మన్నదీ సొమ్మన్నదీ
ఎండల్లే వచ్చాడు మంచల్లే కరిగానూ
అహా వెన్నెల్లు కురిశాడు వేడెక్కిపోయానూ
ఇది బాధందునా ఇది హాయందునా
ఏది ఏమయిననూ నేను తనదాననూ తనదాననూ
No comments:
Post a Comment