మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం

పచ్చదనాల పానుపుపైన అమ్మై నేల జో కొడుతుంటే

పున్నమి నదిలో విహరించాలి…పువ్వుల ఒళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి .. తొలకరి జల్లై దిగి రావాలి
తారల పొదరింట రాతిరి మజిలీ … వేకువ వెనువెంట నేలకు తరలీ
కొత్త స్వేచ్ఛనందించాలి …. నా హృదయాంజలి
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
నువ్వే …. వాగుగా నేస్తం చెలరేగె వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగి పంతమే ఎపుడూ నా సొంతం
వాగుగా నేస్తం చెలరేగె వేగమే ఇష్టం మనలాగే

ఊహకు నీవే ఊపిరి పోసి … చూపవే దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకెల వేసి కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి
పేద గరిక పూలకు ఇస్తా …నా హృదయాంజలి
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
పచ్చదనాల పానుపుపైన అమ్మై నేల జో కొడుతుంటే
పచ్చదనాల పానుపుపైన అమ్మై నేల జో కొడుతుంటే
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
నువ్వే …. వాగుగా నేస్తం చెలరేగె వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగి పంతమే ఎపుడూ నా సొంతం
వాగుగా నేస్తం చెలరేగె వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగి పంతమే ఎపుడూ నా సొంతం
20 October 2007
వేయి దీపాలు నాలోన వెలిగితే
వేయి దీపాలు నాలోన వెలిగితే అది ఏ రూపం నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే అది ఏ రాగం ఆ అనురాగం
ఈ చీకటి కన్నుల వాకిలిలో వెలుగుల ముగ్గులు వేసేదెపుడో
ఆ వెలుగుల మంగళ వేదికపై నా వేణులోలుని చూసేదెపుడో
చూడలేని నీ కన్నులకు ఎదురు చూపైనా ఉందొకటి
చూడగలిగే నా కన్నులకు చుట్టూ ఉన్నది పెనుచీకటి
వేయి దీపాలు నాలోన వెలిగితే ఏ రూపం నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే ఏ రాగం ఆ అనురాగం
సుడి పడి పోయే జీవితనౌక కడలి తీరం చేరేదెపుడో
కలలా తోచే ఆశా రేఖ నిజమై ఎదురై నిలిచేదెపుడో
వేచి ఉన్న నీ హృదయంలో రేపటి ఉదయం మెరిసింది
వేగిపోయే నా గుండెలో గతమే స్మృతిగా మిగిలింది

Labels:
Letter - "వ",
Lyrics - Veturi,
Movie - Jeevita Nouka
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టీ నే కట్టే పాటను చుట్టీ
ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
తెల్ల చీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా
నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా
ఎఱ్ఱచీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా
పచ్చచీర కట్టుకుంటే పంటచేను సిరివమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
నేరేడు పళ్ళరంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు
వంగపండు రంగులోన పొంగుతాయి సొగస్సుల్లూ
వన్నె వన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లు

సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
యచ్చనైన ఊసులెన్నొ రెచ్చకొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దుపొడిపేలేని సీకటే ఉండిపోనీ
మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రావఁచిలకా సద్దుకుపోయే సీకటెనకా …
నమ్మకు నమ్మకు ఈ రేయినీ ..
కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
నమ్మకు నమ్మకు ఈ రేయినీ ..
అరె ..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను
నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
వెన్నెలలోని మసకలలోనె మసలును లోకం అనుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్నీ
నమ్మకు నమ్మకు .. అరె నమ్మకు నమ్మకు
ఊ ఊ నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు యేనాటికీ ..
పక్కవారి గుండెలనిండా .. చిక్కనైన వేదన నిండ

ఏ హాయి రాదోయి నీవైపు మరువకు అది ..
నమ్మకు నమ్మకు
అరె.. నమ్మకు నమ్మకు
ఆహా .. నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అరె కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..
శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలై ….నా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక
ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత గీతాలు పలుకును కద
నమ్మకు నమ్మకు .. అరె నమ్మకు నమ్మకు
ఆహా … నమ్మకు నమ్మకు ఈ రేయినీ
అహ ..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లలో
నమ్మకు నమ్మకు ఈ రేయినీ ..
అరె ..కమ్ముకు వచ్చిన ఈ మాయనీ ..

పెదవే పలికిన మాటల్లోనే
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ … కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ … కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మదురిమ

మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలిగుణమే అమ్మా
నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

పొత్తిళ్ళో ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే బాబు
ఇరువురికీ నేను అమ్మ అవనా….
నా కొంగు పట్టేవాడు నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్ననీ వాడి నాన్ననీ
నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా …
ఎదిగీ ఎదగని ఆ పసికూన ముద్దులకన్నా జోజో
బంగరుతండ్రీ జోజో బజ్జో లాలీ జో
పలికే పదమే వినక కనులారా నిదురపో
తనలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగీ ఎదగని ఆ పసికూన ముద్దులకన్నా జోజో
బంగరుతండ్రీ జోజో .. బజ్జో లాలీ జో .. బజ్జో లాలి జో..
బజ్జో లాలి జో .. బజ్జో లాలి జో…

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన
ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదను ఉంది నడిరేయన్నది ఈ సంధ్యాసమయం

సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కళ కోసం
కళ్ళు మూసుకుని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనం లో మసి ఐనా
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం ఆలయాన

మరల తెలుపనా ప్రియా
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని మరల
విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని
విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసుపడే తడబాటుని మరల
నిన్నలేని భావమేదో కనులు తెరచి కలయజూచి
నిన్నలేని భావమేదో కనులు తెరచి కలయజూచి
మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి
మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి
ఒక క్షణమే ఆవేదన మరుక్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసు పడే మధురబాధ మరల

వేణువై వచ్చాను భువనానికి …
వేణువై వచ్చాను భువనానికి … గాలినై పోతాను గగనానికి

మమతలన్నీ మౌనగానం … వాంఛలన్నీ వాయులీనం

మాతృదేవోభవ .. మాతృదేవోభవ
పితృదేవోభవ .. పితృదేవోభవ
ఆచార్యదేవోభవ … ఆచార్యదేవోభవ
ఏడుకొండలకైన బండతానొక్కటే .. ఏడు జన్మలతీపి ఈ బంధమే

నీ కంటిలో నలక లో వెలుగునీ కనక నేను నేననుకుంటె ఎద చీకటీ
హరీ ……. హరీ ……. హరీ …..ఈఈఈఈఈఈఈఈ
రాయినై ఉన్నాను ఈనాటికీ .. రామపాదము రాక ఏనాటికీ …

నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె నిప్పు నిప్పుగ మారే నా గుండెలో

ఆ నింగిలో కలిసి ఈ శూన్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టిప్రాణాలు
హరీ ……. హరీ ………………. అల్లాహు అక్బరల్లాహు అక్బర్ …
హరీ …….
తేజస్వినావధీనమస్తుమావిద్విషామహై ఓం శాంతి శాంతి శాంతిః
రెప్పనై ఉన్నాను మీ కంటికీ … పాపనై వస్తాను మీ ఇంటికీ
వేణువై వచ్చాను భువనానికి … గాలినై పోయాను గగనానికి
గాలినై పోయాను గగనానికీ ………………………………

ప్రేయసి నవ్వే ఆశీస్సు
సు ….. సు …
ప్రేయసి నవ్వే ఆశీస్సు సు ….. సు …
ప్రేమకు పోసే ఆయుష్షు సు ….. సు …
ప్రేయసి నవ్వే ఆశీస్సు ప్రేమకు పోసే ఆయుష్షు
ఉగాదిలా సాగే వయస్సూ ఊఊఊఊఊఊఊ
ఉషారుగా ఊగే మనస్సు
తనువుకు పెరిగే తేజస్సు సు ….. సు …
పెదవులు పలికే ఛందస్సు సు ….. సు …
తనువుకు పెరిగే తేజస్సు పెదవులు పలికే ఛందస్సు
మరింతగా వచ్చే ఉషస్సూ ఊఊఊఊఊఊఊ
వరాలలో ముంచే తపస్సు
ఆదీ అంతం ఏమో గానీ అమృతహస్తం ప్రేమకు తెలుసు సు … సు…
ఉలుకూ పలుకూ ఉండదు గానీ అలకా కులుకూ ప్రేమకు తెలుసు సు … సు…
మణిదీపం తానై వెలుగుతుంది ప్రేమంటే శుభరాగం తోటే సాగిపోవు పాటే
తనదాకా వస్తే తెలుస్తుంది ప్రేమంటే తగు తోడే ఉంటే మొగలిపూల పంటే
శిశిరాన్నైనా చిగురించేలా మార్చును ఈ ప్రేమా …
ప్రేయసి నవ్వే ఆశీస్సు సు ….. సు …
తనువుకు పెరిగే తేజస్సు సు ….. సు …
ప్రేయసి నవ్వే ఆశీస్సు పెదవులు పలికే ఛందస్సు
ఉగాదిలా సాగే వయస్సూ ఊఊఊఊఊఊఊ
ఉషారుగా ఊగే మనస్సు
అల్లరి ఊహల ఎల్లలు దాటే పుష్పక యానం ప్రేమకు తెలుసు సు … సు…
తారలు ఇంటికి తోరణమయ్యే తారకమంత్రం ప్రేమకు తెలుసు సు … సు …
శతమానంభవతి జపిస్తుంది ప్రేమంటే మృదుభావాలెన్నో దాచుకున్న మాటే
విధిరాతను సైతం జయిస్తుంది ప్రేమంటే అరవిందాలెన్నో పరచుకున్న బాటే
పదమే ఒకటి వందలు వేల విధములు ఈ ప్రేమ
ప్రేయసి నవ్వే ఆశీస్సు సు ….. సు …
ప్రేమకు పోసే ఆయుష్షు సు ….. సు …
ఓఓ ..తనువుకు పెరిగే తేజస్సు పెదవులు పలికే ఛందస్సు

Letter - "స",
Lyrics - Chandrabose,
Movie - ugadhi
ఎక్కడో దూరాన కూర్చున్నావు …
ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు … తమాష చూస్తున్నావు … సామీ …

ఎక్కడో దూరాన కూర్చున్నావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు ,,, మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు

అంతా మా సొంతమని అనిపిస్తావు ..
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా …..చేసేస్తావు … సామీ …

పెరుగుతుంది వయసనీ అనుకుంటాము … కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము

కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా
మా కళ్ళముందు మాయతెరలు … కప్పేస్తావు … సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు … ఎక్కడో దూరాన కూర్చున్నావు …
ఎక్కడో దూరాన కూర్చున్నావు … సామీ …. ఎక్కడో దూరాన కూర్చున్నావు …

Letter - "ఎ",
Lyrics - Rajasri,
Movie - Devudamma
మల్లెల కన్నా జాబిల్లి కన్నా ..
మల్లెల కన్నా జాబిల్లి కన్నా .. మల్లెల కన్నా జాబిల్లి కన్నా
చల్లని పాపాయిలా లేదో.. చల్లని పాపాయిలా లేదో
లోకాలు నిదురుంచు వేళాయెరా కలలందు విహరించ రావేలరా

తారలతో ఆడుకోవాలిరా … మేఘాలలో తేలిపోవాలిరా

అందాలు చిందించు నీ మోమున కస్తూరి తిలకమ్ము తీర్చేనురా

నీ మీద ఏ నీడ పడబోదురా ఏ గాలి ఏ ధూళి రాబోదురా

చల్లని పాపాయి రావోయి.. చల్లని పాపాయి రావోయి
నీ వారు లేరన్న భయమేలరా నేనుండగా నీకు లోటేమిరా

కన్నులలో దాచుకుంటానురా కనుపాపలా చూచుకుంటానురా

చల్లని పాపాయి రావోయి .. చల్లని పాపాయి రావోయి

మంటలు రేపే నెలరాజా ..
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా …

వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి

ఆకాశానికి అంతుంది .. నా ఆవేదనకూ అంతేది
ఆకాశానికి అంతుంది .. నా ఆవేదనకూ అంతేది
మేఘములోన మెరుపుంది నా జీవితమందునా వెలుగేదీ ..
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా
తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా

ఇసుక ఎడారిని ఎపుడైనా ఒక చిన్న గులాబి విరిసేనా

మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు

సుఖము శాంతి ఆనందం నా వొసటను రాయుట మరిచాడు

Letter - "మ",
Lyrics - Dhasaradi,
Movie - Ramu
మమతలు లేని మనుజుల లోన
మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు ఎవరో
మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో
ఏ కులమైనా .. నెలవెది ఐనా
మదిలో కూరిమి జాలుకొన
పిలిచి లాలించి కొడుకు చందాన
పిలిచి లాలించి కొడుకు చందాన
చూచి గాచే దాతే నాయన కాదా
మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు
ఎవరో …. ఎవరికి ఎవరో
మాటలు నమ్మి మనసు నీరై
దరికి తీసిన తండ్రులను
మాటలు నమ్మి మనసు నీరై
దరికి తీసిన తండ్రులను
దేవుని చందాన తలచి పూజించి
దేవుని చందాన తలచి పూజించి
కొలువు చేసే వాడే కొడుకౌగాదా
మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు
ఎవరో …. ఎవరికి ఎవరో
ఆ… ఆ…. ఆ…. ఆఆఆఆఆ., ఊ…ఊ.. ఊఊఊ…….
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు ఎవరో
మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో
ఏ కులమైనా .. నెలవెది ఐనా
మదిలో కూరిమి జాలుకొన
పిలిచి లాలించి కొడుకు చందాన
పిలిచి లాలించి కొడుకు చందాన
చూచి గాచే దాతే నాయన కాదా
మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు
ఎవరో …. ఎవరికి ఎవరో
మాటలు నమ్మి మనసు నీరై
దరికి తీసిన తండ్రులను
మాటలు నమ్మి మనసు నీరై
దరికి తీసిన తండ్రులను
దేవుని చందాన తలచి పూజించి
దేవుని చందాన తలచి పూజించి
కొలువు చేసే వాడే కొడుకౌగాదా
మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు
ఎవరో …. ఎవరికి ఎవరో
ఆ… ఆ…. ఆ…. ఆఆఆఆఆ., ఊ…ఊ.. ఊఊఊ…….
సొగసు కీల్జెడలదానా ….
సొగసు కీల్జెడలదానా …. సో…..గ కన్నులదాన
వజ్రాలవంటి పల్వరుసదాన.
బంగారు జిగిదాన సింగారములదాన
లయవైన వయ్యారి నడలదాన
తోరంపు కటి దాన తొణకు సిగ్గులదాన
పిడుకిట నణగు నెన్నడుము దానా.. ఆ. ఆ..ఆ…
మురిపించే అందాలే.. అవి నన్నే చెందాలే
మురిపించే అందాలే.. అవి నన్నే చెందాలే
నా దానవు నీవేలే నీ వాడను నేనేలే
ఆ… ఆ… ఆ… ఆ…. ఆఆఆఆఆఆఆ…
దరిచేర రావే సఖి… నా సఖీ..
ప్రేయసి… సిగ్గేల
మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
నిదురించే భావాలా కదిలించే ఈ వేళా
ఆ… ఆ… ఆ… ఆ…. ఆఆఆఆఆఆఆ
అదే హాయి కాదా. సఖా … నా సఖా
మురిపించే అందాలే.. అవి నన్నే చెందాలే
చెలి తొలి చూపే మంత్రించెనే ప్రియ సఖురూపే మదినేలెనే

ఇది ఎడపాటు కనలేని ప్రేమా ఇల మనకింక సురలోక సీమ

ఇదే హాయి కాదా సఖా … నా సఖా …
మురిపించే అందాలే.. అవి నన్నే చెందాలే
అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో
అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో
మధు మాధుర్యమే నిండిపోయే హృదయానందమే పొంగిపోయే

దరి చేర రావే సఖీ …. నా సఖీ ….

రానిక నీకోసం సఖీ రాదిక
రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం
రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం
రాలిన సుమాలు ఏరుకొని జాలిగ గుండెల దాచుకోని
ఈ దూరపు సీమలు చేరుకొని
రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం
వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరిమరీ చూడకు .. చూడకు
వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరిమరీ చూడకు
ప్రతి గాలి సడికి తడబడకు పదధ్వనులని పొరబడకు
కోయిలా కోయలే… గూడు గుబులై పోయేలే….
రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం
పగలంతా నా మదిలో మమతలు సెగలై లో లో రగులునులే
నిద్రరాని నిశినైనా నాకు నిష్టుర వేదన తప్పదులే
పోనీలే… ఇంతేలే.. గూడు గుబులై పోయేలే ..
రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం…రాదిక వసంత మాసం

తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు ….
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా

కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా

తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
తరుణులందరు నది చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా
దైవరాయ నిదురలేరా
నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా

నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా

వెన్న తిందువుగాని రారా

కలగా కమ్మని కలగా మన జీవితాలు మనవలెగా
కలగా కమ్మని కలగా మన జీవితాలు మనవలెగా
కలగా కమ్మని కలగా
అనురాగమె జీవనతీరముగా ఆనందమె మనకందముగా
కలగా కమ్మని కలగా
రాగవశమున మేఘమాలిక మలయపవనుని కలిసి చేరగా
రాగవశమున మేఘమాలిక మలయపవనుని కలిసి చేరగా
ఆ……. కొండను తగిలి గుండియ కరిగి నీరై ఏరై పారునుగా
కలగా కమ్మని కలగా మన జీవితాలు ఒక కలగా
కలగా కమ్మని కలగా
వెలుగు చీకటుల కలబోసిన ఈ కాలము చేతులో కీలుబొమ్మలం
భావన లోనే జీవనమున్నది మమతే జగతిని నడుపునది
మమతే జగతిని నడుపునది
కలగా కమ్మని కలగా
తేటి కోసమై తేనియ దాచే విరికన్నియగా సంబరమేమో
వేరొక విరిని చేరిన ప్రియుని కాంచినప్పుడా కలత ఏమిటో
ప్రేమకు శోకమె ఫలమేమో రాగము త్యాగము జత ఏమో
కలగా కమ్మని కలగా.

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు
ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావా .. ఏడ తానున్నాడో బావా
జాడ తెలిసిన పోయి రావా …. అందాల ఓ మేఘమాలా
అందాల ఓ మేఘమాలా
గగన సీమల తేలు ఓ మేఘమాలా …
మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా
నీలాల ఓ మేఘమాలా … రాగాల ఓ మేఘమాలా
మమతలెరిగిన మేఘమాలా … మమతలెరిగిన మేఘమాలా
నా …. మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూసెనే బావకై ఎదని కాయలు కాసెనే
నీలాల ఓ మేఘమాలా … రాగాల ఓ మేఘమాలా …
మనసు తెలిసిన మేఘమాలా … మరువలేనని చెప్పలేవా
మల్లితో … మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గానీ
కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గానీ
మల్లి రూపే నిలిచెనే నా చెంత మల్లి మాటే పిలిచెనే
జాలిగుండెల మేఘమాలా … బావ లేనిది బ్రతుక జాలా

కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
వానజల్లుగ కురిసిపోవా … కన్నీరు పాలవాలుగ బావ గ్రోల …..

అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
అదిగో నవలోకం … వెలసే మనకోసం
నీలి నీలి మేఘాల లీనమై ..
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలి నీలి మేఘాల లీనమై ..
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో ఎచట సుధ కలదో
అచటె మనముందామా …………
అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరిచినాడు చెఱకు వింటి వేలుపు
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరిచినాడు చెఱకు వింటి వేలుపు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవుసుమా హద్దులు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవుసుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో …..
అచటె మనముందామా …
అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
అదిగో నవలోకం … వెలసే మనకోసం
నీలి నీలి మేఘాల లీనమై ..
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలి నీలి మేఘాల లీనమై ..
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో ఎచట సుధ కలదో
అచటె మనముందామా …………
అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరిచినాడు చెఱకు వింటి వేలుపు
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరిచినాడు చెఱకు వింటి వేలుపు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవుసుమా హద్దులు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవుసుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో …..
అచటె మనముందామా …
అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
అదిగో నవలోకం … వెలసే మనకోసం ….
మల్లియలారా మాలికలారా
మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కధయే విన్నారా

జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెల లోనే చీకటి మూగే

పలుకగ లేక పదములు రాక
పలుకగా లేక పదములే రాక …బ్రతుకే తానే బరువై సాగే

చెదరిన వీణ రవళించేనా జీవన రాగం చివురించేనా

కలతలు పోయి వలపులు పొంగి …
కలతలే పోయి వలపులే పొంగి మనసే లో లో పులకించేనా ….

మనసే వెన్నెలగా మారెను
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళా

మనసే వెన్నెలగా మారెను లోలోన
విరిసే ఊహలలో పరువము నీవేలే …
విరిసే ఊహలలో పరువము నీవేలే …
మదనుని కన్నులలో మగసిరి నీదేలే …
మదనుని కన్నులలో మగసిరి నీదేలే …
సైగలతో కవ్వించే జవ్వని నీవే

తలపుల పందిరిలో కలలే కందామా …
తలపుల పందిరిలో కలలే కందామా …
తరగని కౌగిలిలో కాపురముందామా …
తరగని కౌగిలిలో కాపురముందామా …
కనరాని తీరాలే కనుగొందామా …

మనోహరముగా మధుర మధురముగ
మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే
మమతలు వెలసేనులే ….
మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే
మమతలు వెలసేనులే ….
ఇది చంద్రుని మహిమేలే … అదంతేలే …సరేలే.. మనకిది మంచిదిలే …

మంచిది ఐనా కొంచెమైనా .. వంచన నీదేలే ఐనా మంచిదిలే ..
మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే
మమతలు వెలసేనులే ….
ఇది మోహన మంత్రమెలే … అదంతేలే… సరేలే .. మనకిది మేలేలే

మేలి ఐనా మాలిమైనా జాలము నీవేలే .. ఐనా మేలేలే

మేడంటే మేడా కాదు
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
నేనైతే ఆకూ కొమ్మా …. తానైతే వెన్నెల వెల్ల

పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది

కోవెల్లో వెలిగే దీపం దేవీ మా తల్లీ
కోవెల్లో తిరిగే పాటల గువ్వా నా చెల్లీ
గువ్వంటే గువ్వాకాదు గొరవంక గానీ
వంకంటే వంకా కాదు నెలవంకా గానీ

గోరింకా పెళ్ళైపోతే … ఏ వంకో వెళ్ళిపోతే
గోరింకా పెళ్ళైపోతే … ఏ వంకో వెళ్ళిపోతే
గూడంతా గుబులైపోదా గుండెల్లో దిగులైపోదా

తెల్లవారనీకు ఈ రేయిని ..
తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ

తెల్లవారనీకు ఈ రేయిని
నీ కన్నులలో మధువులన్ని జుర్రుకుని … ఆ కైపులో లోకాలే మరువని
మనసులో మనసునై మసలనీ . మనసులో మనసునై మసలనీ
నీ మనిషినై మమతనై మురిసిపోనీ

నీ కురులే చీకటులై కప్పివేయనీ .. ఆ చీకటిలో పగలు రేయి ఓకటైపోనీ
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ .. నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ
తడి ఆరని మదిలో నను మొలకలెత్తనీ

మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ … అల్లరి పడుచుదనం కొల్లబోనీ
కొల్లగొన్న మనసే నా ఇల్లనీ … కొల్లగొన్న మనసే నా ఇల్లనీ
చల్లగా కాపురమూ ఉండిపోనీ ..

Letter - "త",
Lyrics - Aatreya,
Movie - Aatma Balam
మంచిని మరచి వంచన నేర్చి
మంచిని మరచి వంచన నేర్చి
మంచిని మరచి వంచన నేర్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు …. వానరుడైనాడు
మంచిని మరచి వంచన నేర్చి
మంచిని మరచి వంచన నేర్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు …. వానరుడైనాడు
చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు

నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాళానికి జారాడు
మెదడే పెరిగి హృదయం తరిగి
నరుడే ఈనాడు వానరుడైనాడు ….. వానరుడైనాడు
అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు
అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు
పంపకమంటూ వచ్చేసరికి అంతా తనదే అన్నాడు
ధనమే హెచ్చి గుణమే చచ్చి

తెలుగు జాతి మనది ….
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ …..
వచ్చిండన్నా …. వచ్చాడన్నా పరాల తెలుగు ఒకటేనన్నా …

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం పుట్టింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా

పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జంచాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం .. వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు

నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు

తెలంగాణ మనది … రాయలసీమ మనది … సర్కారు మనది … నెల్లూరు మనది ..

ఆవేశం రావాలి ఆవేదన కావాలి
ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
గుండెలోని గాయాలు మండించే గేయాలు
గుండెలోని గాయాలు మండించే గేయాలు
వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు …. రగలాలి విప్లవాలు
ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
నరజాతిని భవితవ్యానికి నడిపేదే ఆవేశం
పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన
వేగంతో వేడిమితో సాగేదే జీవితం … సాగేదే జీవితం
ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలి
సమవాదం నవనాదం ప్రతి ఇంటా పలకాలి
ప్రతి మనిషీ క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలి … రుద్రమూర్తి కావాలి
ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
తరతరాల దోపిడీల ఉరితాళ్ళను తెగతెంచి
నరనరాల అగ్నిధార ఉప్పెనలా ఉరికించి
మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలీ …
నిదురించిన నా కవితను కదలించిన ఆవేశం
మరుగు పడిన నా మమతకు తెర విప్పిన ఆవేదన
కన్నుగప్పి వెళ్ళింది నన్ను మరచిపోయింది … నన్ను మరచిపోయింది ..

అందాల సీమ సుధా నిలయం
అందాల సీమ సుధా నిలయం ఈ లోకమె దివ్య ప్రేమ మయం

వలపేమొ తెలియక తెలవారు బ్రతుకేలా
తొలినాటి ప్రేమలు ఫలమైన కలఐనా
మాయని గాయమై మిగిలిన అభినయం

అందాల వెలుగులో అలరారు ఆనందం
అలరించు సొగసుల ఆనందమున తేలే
తీయని అనుభవం దేవుని పరిచయం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మాకన్నతల్లికి మంగళారతులు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు నాతల్లి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
గలగలా గోదారి కదలి పోతుంటేను
గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరువులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అమరావతి గుహల అపురూప శిల్పాలు
అమరావతి గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య గళములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసుని యుక్తి కృష్ణరాయని కీర్తి
వాద్యములరింపుమని మారుమోగేదాక
మీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ … జై తెలుగుతల్లీ
మాకన్నతల్లికి మంగళారతులు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు నాతల్లి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
గలగలా గోదారి కదలి పోతుంటేను
గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరువులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అమరావతి గుహల అపురూప శిల్పాలు
అమరావతి గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య గళములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసుని యుక్తి కృష్ణరాయని కీర్తి
వాద్యములరింపుమని మారుమోగేదాక
మీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ … జై తెలుగుతల్లీ
కొండగాలి తిరిగింది ..
కొండగాలి తిరిగింది .. కొండగాలి తిరిగింది
గుండె ఊసులాడింది గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది
కొండగాలి తిరిగింది .. గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది
పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది
పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది

ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా
ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా
సొంతవారు ఐనవారు అంతరాల ఉందురోయ్ .. అంతరాల ఉందురోయ్
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము
పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము
గాయపడిన హృదయాలను జ్ఞాపకాలే అతుకనోయ్… జ్ఞాపకాలే అతుకనోయ్
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే
కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే
తనకు తనవారికి ఎడబాటే లేదులే .. ఎడబాటే లేదులే
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఎక్కడికీ పోదు … ఎక్కడికీ పోదు

ఎందున్నావో.. ఓ . చెలీ..
ఎందున్నావో …… ఓ …….. చెలీ…..
అందుకో ….. నా…. కౌగిలి …
ఎందున్నావో ఓ చెలీ .. అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలీ .. అందుకో నా కౌగిలి
ఎందున్నావో ఓ చెలీ ..
నిలువలేను నిముషమైన నీవు లేనిదే
తిరిగిపోను వలపుతీపి తెలుసుకోనిదే
నిలువలేను నిముషమైన నీవు లేనిదే
తిరిగిపోను వలపుతీపి తెలుసుకోనిదే
ఇన్ని నాళ్ళ వెతలు సైచి నీకై నీకై ఉన్నాను

కొంగులోన నిన్నుదాచి పొంగిపోదునా
కురులలోన తురిమి తురిమి పరవశించనా
కొంగులోన నిన్నుదాచి పొంగిపోదునా
కురులలోన తురిమి తురిమి పరవశించనా
నీడవోలె యుగయుగాలు నీతో నీతో ఉంటాను
నీడవోలె యుగయుగాలు నీతో నీతో ఉంటాను
ఎందున్నావో సుందరా .. నా ముందు నిలువవేలరా
ఎందున్నావో సుందరా ..
ఇందున్నానే ఓ చెలీ .. అందుకో నా కౌగిలి
ఇందున్నానే ఓ చెలీ ..

చల్లని వెన్నెలలో ….
చల్లని వెన్నెలలో …. చల్లని వెన్నెలలో… ఓ…. ఓ… ఓ..
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో. …
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే
చల్లని వెన్నెలలో
తెలిమబ్బుల కౌగిలిలో జాబిలి తేలి ఆడెనే ముద్దులలో

గాలి పెదవులే మెల్లగ సోకిన …గాలి పెదవులే మెల్లగ సోకిన
పూలు నవ్వెనే నిద్దురలో …ఓ…ఓ.. చల్లని వెన్నెలలో…
చక్కని కన్నె సమీపములో … అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే …. చల్లని వెన్నెలలో
కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో ఓ…. ఓఓ… ఓఓఓ…ఓఓ…
కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో
కలకాలం నీ కమ్మని రూపము .. కలకాలమం నీ కమ్మని రూపము
కలవరించునలే నా మదిలో … ఓ.. ఓ.. చల్లని వెన్నెలలో ..
చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయెనే
ఆనందమే నా గానమాయెనే చల్లని వెన్నెలలో

ఈ మూగ చూపేలా బావా
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడవదే బొమ్మా నీ దరి నే చేరి మాటాడనా
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది
ఓ.. హో.. హో… హో … ఓఓఓఓ

ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే … ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే
చెయ్యి చేయీ చేరా విడిపోవులే
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
ఆ.హా.. హా…హా… ఆఆఆఆ

నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే ..
నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే
నా మనసే అదోలాగ జిల్లంటదే…
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా
జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మోజులూ …
ఓ.. హో.. హో… హో … ఓఓఓఓ
జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మోజులూ
చాటే నీ ఎలుగెత్తి ఈ గాజులే చాటే నీ ఎలుగెత్తి ఈ గాజులే
ఈ వేళా మరేవేళా మన రోజులే ….
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదీ బొమ్మా

ఎవరికి వారౌ స్వార్ధంలో
ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో

నాకై వచ్చిన నెచ్చెలివి అమృతం తెచ్చిన జాబిలివే ..
నాకమృతం తెచ్చిన జాబిలివే …
ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావే
నా అనువారే లేరని నేను కన్నీరొలికే కాలంలో
ఉన్నానని నా కన్నతల్లివలే ఒడిని చేర్చి నన్నోదార్చావే

ప్రేమ కొరకు ప్రేమించేవారే కానరాక గాలించాను
గుండెను తెరచి ఉంచాను గుడిలో దేవుని అడిగాను
గంటలు గణగణ మ్రోగాయి నా కంటిపాపను అన్నాయి

ఈ అనురాగం ఈ ఆనందం ….ఎవ్వరెరుగనీ ఈ అనుబంధం
ఈ అనురాగం ఈ ఆనందం … ఎవ్వరెరుగనీ ఈ అనుబంధం
ఊడలూ పాకి నీడలు పరచి ఉండాలి వెయ్యేళ్ళు
చల్లగ ఉండాలి వెయ్యేళ్ళు తియ్యగ పండాలి మన కలలు

నాకై వచ్చిన నెచ్చిలివి అమృతం తెచ్చిన జాబిలివే ..

జగమే మారినది మధురముగా
జగమే మారినది మధురముగా ఈ వేళ
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలు కోరికలు తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
మనసాడెనే మయూరమై పావురములు పాడే
ఎల పావురములు పాడే
ఇదే చేరేను గోరువంక రామచిలుక చెంత
అవి అందాల జంట
నెనరు కూరిమి ఈనాడే పండెను
నెనరు కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింత
జగమే మారినది మధురముగా ఈ వేళ
విరజాజుల సువాసన స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుకా … ఆ… ఆ,,, ఆఆఆఆఆఆ ఆ….
విరజాజుల సువాసన స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుకా
తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి
అనురాగాల తేలి
కమ్మని భావమే కన్నీరై చిందెను
కమ్మని భావమే కన్నీరై చిందెను
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలు కోరికలు తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలు కోరికలు తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
మనసాడెనే మయూరమై పావురములు పాడే
ఎల పావురములు పాడే
ఇదే చేరేను గోరువంక రామచిలుక చెంత
అవి అందాల జంట
నెనరు కూరిమి ఈనాడే పండెను
నెనరు కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింత
జగమే మారినది మధురముగా ఈ వేళ
విరజాజుల సువాసన స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుకా … ఆ… ఆ,,, ఆఆఆఆఆఆ ఆ….
విరజాజుల సువాసన స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుకా
తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి
అనురాగాల తేలి
కమ్మని భావమే కన్నీరై చిందెను
కమ్మని భావమే కన్నీరై చిందెను
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి
జగమే మారినది మధురముగా ఈ వేళ
కలలు కోరికలు తీరినవి మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళ
Labels:
Letter - "జ",
Lyrics - Aarudra,
Movie - Desadrohulu
19 October 2007
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడు వానికి ఏనాటికి ఓటమి లేదని
నీతికి నిలబడు వానికి ఏనాటికి ఓటమి లేదని
నే చదివిన జీవితపాఠం నీకే నేర్పాలని వస్తే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
కత్తులు విసిరే వానిని ఆ కత్తితోనే గెలవాలని
హు.. నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే

కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ - గుండెల్లో గుసగుసలు వినిపించనీ

నీ చూపుతో నన్ను ముడివేయకు – ఈ పూలు వింటాయి సడి చేయకు
నీ చూపుతో నన్ను ముడివేయకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది - నా పైట చెంగు లాగి కవ్వించకు

అనువైన వేళ అందాలు దాచకు … అనువైన వేళ అందాలు దాచకు
అణువణువు నిన్నే కోరే మురిపించకు.. ఇకనైన నునుసిగ్గు తెర వేయకు

ఎటుచూసినా నువ్వే వినిపించే నీ నవ్వే – మోహాలతో నన్ను మంత్రించకు

మనలోని ప్రేమ మారాకు వేయనీ … మనలోని ప్రేమ మారాకు వేయనీ
మనసారా ఒడిలో నన్ను నిదురించనీ …నీ నీలి ముంగురులు సవరించనీ

కన్నుల్లో మిసమిసలు కనిపించనీ – గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ …..

జయమ్ము నిశ్చయమ్మురా
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా
ఏనాటికైన స్వార్ధము నశించి తీరును
ఏనాటికైన స్వార్ధము నశించి తీరును
ఏరోజుకైన సత్యమే జయించి తీరును.. జయించి తీరును
కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును

విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి .
విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి
విశాల దృష్టి తప్పకుండ బోధించాలి .. బోధించాలి
పెద్దలను గౌరవించి పూజించాలి .. పూజించాలి

కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును .. సుఖాలు దక్కును
ఈ లోకమందు సోమరులై ఉండకూడదు .. ఉండకూడదు
పవిత్రమైన ఆశయాన మరువకూడదు .. మరువకూడదు

గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా .. బ్రోవుము దేవా
కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దైవా .. నడుపుము దేవా
బీదసాదలాదరించు బుద్ది నొసగుమా .. శక్తి నొసగుమా

గాఢాంధకారమలముకున్న భీతిచెందకు
సందేహపడక వెల్గు చూపి సాగుముందుకు .. సాగుముందుకు
నిరాశలోన జీవితాన్ని క్రుంగదీయకు … క్రుంగదీయకు

పరాభవమ్ము గల్గునంత పారిపోకుమోయ్…
జయమ్ము నిమ్మరించుదాక పోరి గెల్వవోయ్.. పోరి గెల్వవోయ్
స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్ .. నిల్వబెట్టవోయ్

జయమ్ము నిశ్చయమ్మురా … జయమ్ము నిశ్చయమ్మురా… జయమ్ము నిశ్చయమ్మురా…

చల్లని సామివి నీవైతే
చల్లని సామివి నీవైతే అల్లన ఆగుము జాబిల్లి
ఎదలో కరుణే నీకుంటే ఉదయం కానీకోయీ

ముక్కున ముక్కెర అందం కాని ముచ్చటకది ప్రతిబంధం

మన ఆనందానికి అడ్డయ్యే ఏ అందమైనా ఎందులకు
అందమైనా ఎందులకు .. ఊ ..
రసమయ హృదయం నీదైతే రతిరాజా కను మూయకుము
మా ప్రణయము పచ్చగ ఉండే వరకు రణభేరి మ్రోగకుము

గాజులు చేతికి సొంపు ప్రణయానికి అవి సడలింపు

మన అనుబంధానికి అడ్డయ్యే ఈ ఆభరణాలు ఎందులకు
ఆభరణాలు ఎందులకు
తీరని కోరిక నీదైతే తారా ,,, చంద్రుని తరుమకుము
ఈ తీయని వెన్నెల దోచుకుపోయే దినరాజును రానీయకుము

పదములకందము అందియలు అవి పలుమరు చేయును సందడులు

తలపులు పండే తరుణంలో ఈ సవ్వడులన్నే ఎందులకు
సవ్వడులన్నీ ఎందులకు …

చల్లని సామివి నీవైతే అల్లన ఆగుము ……… జా….బిల్లి

దేశమ్ము మారిందోయ్ ..
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
కష్టాలు తీరేనోయ్ .. సుఖాలు నీవేనోయ్
కష్టాలు తీరేనోయ్ .. సుఖాలు నీవేనోయ్
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
కొండలు కొట్టి .. కొట్టి
డ్యాములు కట్టీ .. కట్టి
నీళ్ళను మలిపి .. మలిపి
చేలను తడిపి .. తడిపి
కురిసే చక్కని రోజు మనకు వస్తుందోయ్ … వస్తుంది
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
కండల్ని కరగదీయి .. బండల్ని విసరివెయ్యి .. నీదేలె పైచేయి

భాగ్యాలు పండునోయి .. వాకళ్ళు నిండునోయి
సిరులు చిందునోయి .. ఆశలు అందునోయి
సిరులు చిందునోయి .. ఆశలు అందునోయి
చేయి చేయి కలపాలి రావయా బావయ్యా
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
గ్రామాల బాగుచెయ్యి .. దీపాల వెలుగునియ్యి .. జేజేలు నీకోయి …

చిట్టి చీమలన్ని పెద్ద పుట్ట పెట్టు హలా హల
ఎందరో తమ రక్తాన్ని చిందించిరి హలా హల
ఆక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే
త్యాగమంటె ఇదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే
ఐకమత్యమిదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే
అనుభవమ్ము నీదేనోయి ఆనందం నీదేనోయి
అనుభవమ్ము నీదేనోయి ఆనందం నీదేనోయి
నిజమౌ శ్రమజీవివంటే నీవెనోయ్ నీవోనోయ్
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. దేశమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. దేశమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్… దేశమ్ము మారిందోయ్

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి .. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన
కష్టసుఖాలలో తోడునీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ

మగువేగా మగవానికి మదుర భావన ….

సేవలతో ఆత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా

తనయుని వీరునిగ పెంచే తల్లిగా సతియే గృహసీమను గాచే దేవతగా

సృష్టించెను ఆ దేవుడు తనకు మారూగా ….

కనులకు దోచి చేతికందని
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని

భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని

మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
తలపులున్నవి కొన్ని
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే

వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం

అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనకములాయం
బదలు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం

ఎవరికోసం ఈ మందహాసం ..
ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
సొగసరీ … ఒక పరి వివరించవే
చెలిమికోసం చెలి మందహాసం .. ఏమని వివరింతును
గడుసరీ … ఏమని వివరింతును
ఆ..ఆ… ఆ, వలపులు చినికే వగలాడి చూపు
పిలువక పిలిచి విరహాలు రేపు
ఆ..ఆ…ఆ.. ఎదలో మెదలే చెలికాని రూపు
ఏవో తెలియని భావాల రేపు
ఈ నయగారం ప్రేమసరాగం … ఈ నయగారం ప్రేమసరాగం
అందించు అందరాని సంబరాలే … ఏ…ఏ….
ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
సొగసరీ … ఒక పరి వివరించవే
ఆ..ఆ… ఆ, పరుగులు తీసే జవరాలి వయసు
మెరుపై మెరసి మరపించు మనసు
ఆ..ఆ… ఆ, ప్రణయం చిందే సరసాల గంధం
ఇరువురినొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం … ఈ వయ్యారం ఈ సింగారం
చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో … ఓ…ఓ…
ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
సొగసరీ … ఒక పరి వివరించవే
ఆ…ఆ… ఆ…చెలిమికోసం చెలి మందహాసం .. ఏమని వివరింతును

Lyrics - Sri Sri,
Movie - Narthanasala
వెన్నెలలోనే వేడి ఏలనో ..
వెన్నెలలోనే వేడి ఏలనో .. వేడిమిలోనే చల్లనేలనో
ఈ మాయ ఏమో జాబిలీ … ఈ మాయ ఏమో జాబిలి
వెన్నెలలోనే విరహమేలనో .. విరహములోనే హాయి ఏలనో
ఈ మాయ ఏమో జాబిలీ … ఈ మాయ ఏమో జాబిలి
మొన్నటికన్నా నిన్న వింతగా .. నిన్నటి కన్నా నేడు వింతగా …
మొన్నటికన్నా నిన్న వింతగా .. నిన్నటి కన్నా నేడు వింతగా
నీ సొగసూ నీ వగలూ హాయిహాయిగా వెలసేనే …

రూపము కన్నా చూపు కొల్లగా ..చూపుల కన్నా చెలిమి కొల్లగా

నీ కళలూ నీ హొయలూ చల్లచల్లగా విరిసేనే …
వెన్నెలలోనే హాయి ఏలనో .. వెన్నెలలోనే విరహమేలనో

ఏమివ్వను నీకేమివ్వను నా మనసే
ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను

నన్నే వలచి నా మేలు తలచి
నన్నే వలచి నా మేలు తలచి
లేని కళంకం మోసిన ఓ చెలీ… మచ్చలేని జాబిలి

తారకలే కోరికలై మెరియగా కనులు విరియగా
వెన్నెలలే వేణువులై పలుకగా మధువు లొలుకగా
యుగయుగాలు నిన్నే వరియించనా
నా సగము మేన నిన్నే ధరియించనా

ఏమడుగను ఇంకేమడుగను నీ మనసే నాదైతే ఏమడుగను
నీ కన్నుల వెలుగులే తారకలై నయన తారకలై
నీ నవ్వుల జిలుగులే చంద్రికలై కార్తీక చంద్రికలై
జగమంతా నీవే అగుపించగా
నీ సగము మేన నేనే నివసించగా

నిన్నే వలచి నీ మేలు తలచి
నిన్నే వలచి నీ మేలు తలచి
బ్రతుకే నీవై పరవశించు చెలినీ …. నీ జాబిలినీ

ఆహాహా … ఆహాహా … ఆహాహహా ……

వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
మెరపువలే తళుకుమని మెరసిపోయేటందుకా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
తడబడు నడకల నడచినపుడు నీ తత్తరబాటును చూడాలి
తలుపు మూయగనే దారులు వెదకే బిత్తరచూపులు చూడాలి

అని తలచి తలచి ఈ తరుణం కోసం తపసు చేసినది ఇందులకా
వలపువలే తీయగా వచ్చినావు నిండుగా
మురిపెములొలికే ముద్దు మోమును కురుల మబ్బులో దాచుటకా
మిసమిసలాడే నొసట కుంకుమ చిరు చెమటలలో కరగుటకా

ఎదను తెరచి నేనిన్నినాళ్ళుగా ఎదురుచూచినది ఇందులకా

Movie - Sumangali
ఎవరికి తెలుసు చితికిన మనసు
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని
ఎవరికి తెలుసు ..

ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసు ..
మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ..
మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ
చీకటి మూగిన వాకిట తోడుగ నీడైనా దరి నిలవదని
జగతికి హృదయం లేదని ..ఈ జగతికి హృదయం లేదని
నా జన్మకు ఉదయం లేనే లేదని
ఆ… ఆ…. ఆ…. ఆ….. ఎవరికి తెలుసు ..

ఎవరికి తెలుసు
గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం

నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూర్పులే సంగీతం

ప్రేమకు మరణం లేదని .. నా ప్రేమకు మరణం లేదని
నా తోటకు మల్లిక లేనే లేదని

ఎవరికి తెలుసు …..

అందమైన తీగకు పందిరుంటే చాలును
అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా

గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి
తప్పటడుగులే ముందు ముందు నడకలౌతాయు
ఆశ ఉంటే మోడు కూడా చిగురు వేస్తుంది
అందమునకానందమపుడే తోడు వస్తుంది

పాదులోని తీగవంటిది పడుచు చిన్నది
పరువమొస్తె చిగురువేసి వగలు పోతుంది
మొగ్గతొడిగి మురిసిపోతూ సిగ్గు పడుతుంది
తగ్గ జతకై కళ్ళతోటే వెతుకుతుంటుంది

కళ్ళు కళ్ళు కలిసినపుడు కలలు వస్తాయి
కన్నెపిల్ల కలలకెపుడో కాళ్ళు వస్తాయి
అడుగులోన అడుగువేస్తూ అందమొస్తుంది
నడవలేని నడకలే ఒక నాట్యమౌతుంది

ఈ కోవెల నీకై వెలిసింది…
ఈ కోవెల నీకై వెలిసింది… ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా … నా దేవి తరలిరా ….

రా స్వామీ తరలి రా … నా స్వామి తరలిరా
దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను

తిరునాళ్ళేపుడో రాక తప్పదని తేరును సిద్ధం చేసాను
దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను

రేపటి కోసం చీకటి మూసిన తూరుపులాగా ఉన్నాను
తూరుపులాగా ఉన్నాను

నీరు వచ్చే ఏరు వచ్చే .. ఏరు దాటే ఓడ వచ్చే

ఓడ నడిపే తోడు దొరికే ఒడ్డు చేరే రోజు వచ్చే
ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే
ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే
రేవులోకి చేరేలోగా దేవుడేదో అడ్డువేసే
ఆ .. దేవుడేదో అడ్డువేసే

రా దేవి తరలిరా … నా స్వామీ తరలిరా …
రా దేవి తరలిరా … నా స్వామీ తరలిరా

Subscribe to:
Posts (Atom)