17 March 2010

కోతి బావకు పెళ్ళంట!కోవెల తోట విడిదంట

కోతి బావకు పెళ్ళంట!కోవెల తోట విడిదంట!
మల్లె మాలతి వస్తారా?
మాలికలల్లి తెస్త్రారా?
బంతి జాజి చేమంతి ..బంతులు కట్టి తెస్తారా?
పెళ్ళికి మీరు వస్తారా?
పేరంటానికి..వస్త్రారా?
పందిరి వేస్తాము!ముందర ముగ్గులు పెడతాము!
పందిరి కింద పెళ్ళివారికి..విందులు చేస్తాము!
బాకా..బాజా..డోలు ..సన్నాయి..
మేళాలెడతారు! తప్పెట తాళాలెడతారు!
అందాల మా బావగారికి..గంధాలు పూసి..
గారాల మా బావ మెడలో ..హారాలు వేసి..
కుళ్ళాయెడతాము!కుచ్చుల తురాయి పెడతాము!
హారాలేసి..గంధం పూసి..కుళ్ళాయెట్టి..
తురాయి..పెడతాము!!
పల్లకి ఎక్కి..కోతి బావ పళ్ళికిలిస్తాడు!
మా కోతి బావ పళ్ళికిలిస్తాడు!!

No comments: