02 March 2010

నెమలికి నేర్పిన నడకలివీ

నెమలికి నేర్పిన నడకలివీ
మురళికి అందని పరుగులివీ
శృంగార సంగీత నృత్యాభినయ వేళ
చూడాలి నా నాట్య లీల |నే

1|| కలహమ్సల కిచ్చిన పద గతులు
ఎలా కొయిల మెచ్చిన స్వరజతులు ||క||
ఎన్నెనో వన్నెల వెన్నెలలూ
ఏవేవో కన్నుల కిన్నెరలు ||ఏ||
కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా మల్ప శిల్ప
మణిలెఖలను శకుంతలను

2|| చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరి మువ్వలు అభినయ దీపికలు
నీలాల కన్నుల్లో తారకలు

తారడె చూపుల్లో చంద్రికలు
పురులు విరిసి మరులు కురిసి మురిసిన రవి వర్మ చిత్ర లేఖనా లేఖ్య
సరస సౌందర్య రేఖను శశి రేఖను

No comments: