02 March 2010

మందారం ముద్దు మందారం

మందారం ముద్దు మందారం
మందారం ముద్ద మందారం
ముద్దుకే ముద్దొచ్చే... మువ్వకే నవ్వొచ్చే

ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది శింగారం
ముద్ద మందారం ముగ్ధ శ్రింగారం
ముద్ద మందారం ముగ్ధ శ్రింగారం

||ముద్దుకే||

అడుగులా అష్టపదులా నడకలా జీవ నదులా ||2||
పరువాల పరవళ్ళు పరికిణీ కుచిళ్ళు
విరి వాలు జడ కుచ్చుల సందళ్ళు
కన్నె పిల్లా కాదు కళల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి

||ముద్దుకే||

పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకల ||2||
మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్ళు
మల్లెపువ్వా కాదు మరుల మారాణి
బంతి పువ్వా పసుపు తాను పారాణి

||ముద్దుకే||

No comments: