14 March 2010

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు

ఎక్కడున్నాగాని దిక్కువారేకదా
చిక్కులను విడదీసి దరిజేర్చలేరా
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు

ఆలి ఎడబాటెపుడు అనుభవించెడువాడు
అలమేలుమంగపతి అవనిలో ఒకడే
ఏడుకొండలవాడు ఎల్లవేల్లలయండు
దోగాడు బాలునికి తోడునీడౌతాడు

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు

నెల్లూరి సీమలో చల్లంగ శయనించు
శ్రీ రంగ నాయకా ఆనందదాయకా
తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు
దయచేయుమా నీవు క్షణము ఎడబాయకా

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు

ఎల్లలోకాలకు తల్లివయి నీవుండ
పిల్లవానికి ఇంక తల్లి ప్రేమ కొరతా
బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు
కరుణించి కాపాడు మా కనకదుర్గా

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు

గోపన్నవలె వగచు ఆపన్నులను గాచి
బాధలను తీర్చేటి భద్రాద్రివాసా
నిన్ను నమ్మిన కోర్కె నెరవేరునయ్యా
చిన్నారి బాలునకు శ్రీ రామ రక్ష

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు

బాల ప్రహ్లాదుని లాలించి బ్రోచిన
నారసింహుని కన్నా వేరు దైవము లేడు
అంతు తెలియగారాని ఆవేదనలు గలిగి
చింతలను తొలగించు సింహాచలేశ

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు

No comments: