14 March 2010

శేషశైలావాస శ్రీ వెంకటేశ

శేషశైలావాస శ్రీ వెంకటేశ
శయనించు మా అయ్యా శ్రీ చిద్విలాసా
శేషశైలావాస శ్రీ వెంకటేశ

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుకరానియ్యకు
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుకరానియ్యకు

ముద్దు సతులిద్దరిని ఇరువైపులా జేర్చి
ముద్దు సతులిద్దరిని ఇరువైపులా జేర్చి
మురిపించి లాలించి ముచ్చటలు తీర్చి
శేషశైలావాస శ్రీ వెంకటేశ

పట్టుపానుపుపైన పవ్వలించారా స్వామీ
పట్టుపానుపుపైన పవ్వలించారా స్వామీ
భక్తులందరు నిన్ను ప్రస్తుతించిపాడ
చిరునగవులోలుకుచూ నిదురించు నీ మోము
చిరునగవులోలుకుచూ నిదురించు నీ మోము
కరువుతీరా గాంచి తరియింతుము మేము

శేషశైలావాస శ్రీ వెంకటేశ
శయనించు మా అయ్యా శ్రీ చిద్విలాసా
శేషశైలావాస శ్రీ వెంకటేశ

No comments: