12 March 2010

నా పేరు బికారి నా దారి ఎడారి

నా పేరు బికారి నా దారి ఎడారి
మనసైన చోట మజిలీ
కాదన్న చాలు బదిలీ
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి


తోటకు తోబుట్టువునూ ఏటికి నే బిడ్డనూ
పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు
అసలు నా మరో పేరు ఆనంద విహారీ

నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి

మేలుకొని కలలుగని మేఘాల మేడ పై
మేలుకొని కలలుగని మేఘాల మేడ పై
మెరుపు తీగలాంటి నా ప్రేయసి నుహించుకొని
ఇంద్రధనస్సు పల్లకి ఎక్కి కలుసుకోవాలని
ఆకశా వీధిలొ పయనించు బాటాసారి

నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి

కూటికి నే పేదనూ గుణములలో పెద్దనూ
సంకల్పము నాకు ధనము
సాహసమే నాకు బలము
ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
అంతవరకు నేనొక నిరంతర సంచారీ

No comments: