02 October 2007

రావోయి చందమామ

రావోయి చందమామ మా వింత గాధ వినుమా
రావోయి చందమామ మా వింత గాధ వినుమా
సామంతము గలసతికీ ధీమంతుడనగు పతినోయ్
సామంతము గలసతికీ ధీమంతుడనగు పతినోయ్
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే రావోయి ....
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా

రావోయి ....

తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్
మనమూ మనదను మాటే అననీ ఎదుటా అనదోయ్

రావోయి ....

నాతో తగవులు పడుటే అతనికి ముచ్చ్హటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చ్హటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా

రావోయి ....

No comments: